Ind vs Aus 1st ODI: వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్దమైంది. కంగారూ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను శుక్రవారం ఆరంభించనుంది. పంజాబ్‌లోని మొహాలీలో గల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమైంది.
ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర తర్వాత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో ఆసీస్‌తో ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అయితే, తుది జట్టులో అశూకు స్థానం ఉంటుందా? లేదంటే వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌తో తొలి వన్డేలో సుందర్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు.
భజ్జీ అంచనా తలకిందులు
‘‘బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదంటే రవిచంద్రన్ అశ్విన్ ఆడతారు. అయితే ఇద్దరిలో ఎవరికి ఆ ఛాన్స్ వస్తుందనేదే ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్‌కే అవకాశం వస్తుంది.
ఎందుకంటే.. ఆసియా కప్ ఫైనల్ ఆడేందుకు అతడిని పిలిపించారు. కానీ అక్కడ అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. కాబట్టి ఈసారి పరీక్షించే అవకాశం ఉంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
కాగా అక్షర్ పటేల్ గాయం నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు చోటు దక్కే అవకాశాలున్న నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, భజ్జీ అంచనా తలకిందులైంది. తుది జట్టులో అశ్విన్‌కు స్థానం దక్కగా.. వాషింగ్టన్ సుందర్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక సెప్టెంబరు 24, 27 తేదీల్లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మలి రెండు వన్డేలు జరుగనున్నాయి.
తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభం కానుంది.
ఆసీస్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు
శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
Comments
Please login to add a commentAdd a comment