నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. తొలి టెస్టులో అశ్విన్ మరో ఏడు వికెట్లు సాధిస్తే.. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం హర్భజన్ సింగ్(95) అశ్విన్ అధిగిమిస్తాడు.
ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 18 టెస్టులు ఆడిన అశ్విన్ 89 వికెట్లు సాధించాడు. కాగా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 111 వికెట్లతో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉన్నాడు.
ఇక మూడో స్థానంలో అశ్విన్ కొనసాగుతుండగా.. కపిల్‌దేవ్(79), రవీంద్ర జడేజా(63) వికెట్లతో వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో అశ్విన్ మరో 23 వికెట్లు పడగొడితే.. అనిల్ కుంబ్లే రికార్డును కూడా బ్రేక్‌చేసే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్
టెస్టు సిరీస్ షెడ్యూల్..
ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్‌పూర్
ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ
మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల
మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్
చదవండి: BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే
Comments
Please login to add a commentAdd a comment