ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితో మ్యాజిక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ సాధించలేకపోయిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సత్తాచాటాడు.
తన క్యారమ్ బంతులతో కివీస్ బ్యాటర్లను అశ్విన్‌ను బోల్తా కొట్టించాడు. రచిన్ రవీంద్ర, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 16 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 63 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.
ప్రతీకారం తీర్చుకున్న అశ్విన్..
ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్‌ను అశ్విన్ ఔట్ చేసిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన అశ్విన్‌ను ఫిలిప్స్ టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో తొలి మూడు బంతుల్లో ఫిలిప్స్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో అశూపై పైచేయి సాధించినట్లు ఫిలిప్స్ థీమాగా కన్పించాడు. కానీ అశ్విన్ మాత్రం దెబ్బతిన్న సింహంలా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
ఓ సంచలన బంతితో ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్‌కు సదరు కివీ బ్యాటర్ దగ్గర సమాధానమే లేకుండాపోయింది. అతడిని బౌల్డ్ చేసిన వెంటనే అశ్విన్ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా అన్నట్లు ఫిలిప్స్ వైపు చూస్తూ అశ్విన్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
పట్టు బిగించిన భారత్..
ఇక ముంబై టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాడు విల్ యంగ్(51) సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు.
చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
A special effort to dismiss Glenn Phillips 🔥
Ashwin takes Phillips as New Zealand loses their 6th wicket.
Lead is 103 now. #INDvNZ #ashwin #IndiaVsNewZealand #3rdtest #Mumbai #bcci pic.twitter.com/BbNWJ2ylBR— Abhinandan Bhattacharjee (@Abhi11590) November 2, 2024
Comments
Please login to add a commentAdd a comment