ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆధిపత్యం కొనసాగించిన కివీస్ దూకుడుకు భారత జట్టు కళ్లెం వేసింది. ముంబై టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
పర్యాటక జట్టు ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జడేజా ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 కీలక వికెట్లు సాధించారు.
అశ్విన్ అరుదైన రికార్డు..
ఇక 3 వికెట్లతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో 6 టెస్టులు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు.
ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. వాంఖడేలో 7 టెస్టులు ఆడిన కుంబ్లే 38 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును అశూ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత స్ధానాల్లో కపిల్ దేవ్(28) ఉన్నారు.
చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్?
Comments
Please login to add a commentAdd a comment