Ind Vs Nz 2nd Test: Ashwin Record Most 50 Plus Test Wickets In Calendar Year: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్ చేసి కివీస్‌ను తిప్పలుపెట్టిన మన బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ చుక్కలు చూపిస్తున్నారు. ఇక ముంబై టెస్టు సందర్భంగా ఇప్పటికే పలు రికార్డులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం అశ్విన్ మరో ఘనతను సాధించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌తో పాటు.. రాస్ టేలర్ వికెట్‌ను పడగొట్టాడు. తద్వారా టెస్టుల్లో క్యాలెండర్ ఇయర్‌లో 50 కంటే ఎక్కువ వికెట్లు.. ఎక్కువసార్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ మొత్తంగా నాలుగుసార్లు (2015, 2016, 2017, 2021) ఈ ఫీట్ సాధించాడు.
అంతకు ముందు అనిల్ కుంబ్లే 3 సార్లు(1999, 2004, 2006), హర్భజన్ సింగ్ 3 సార్లు(2001, 2002, 2008), కపిల్‌దేవ్ 2 సార్లు(1979, 1983) ఈ ఘనత సాధించారు. ఇక రెండో టెస్టు విషయానికొస్తే... తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా కాన్పూర్ టెస్టులో 6 వికెట్లు పడగొట్టి హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించాడు.
Ashwin gets his third as Ross Taylor departs after scoring 6 runs.
— BCCI (@BCCI) December 5, 2021
Live - https://t.co/CmrJV47AeP #INDvNZ @Paytm pic.twitter.com/VExwF4Qg67
Comments
Please login to add a commentAdd a comment