Mumbai Test
-
BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. ఆ టెక్నాలజీ మాత్రం వాడదు!
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. ముంబై.. వాంఖడే మైదానం.. రిషభ్ పంత్ ఇంకాసేపు క్రీజులో నిలబడితే చాలు.. టీమిండియా గెలవడం ఖాయం.. అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో పంత్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడం అందరికీ షాకిచ్చింది.నిజానికి ఫీల్డ్ అంపైర్ పంత్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. అజాజ్ వేసిన బంతి పంత్ బ్యాట్‌ను కాకుండా ప్యాడ్లను తాకిందనే ఉద్దేశంతో.. అజాజ్ అప్పీలు చేసినా అంపైర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. పంత్ సైతం అదే ధీమాతో క్రీజులో నిలబడి చిరునవ్వులు చిందించాడు.అయితే, కివీస్ మాత్రం రివ్యూకు వెళ్లింది. అందులో బంతి బ్యాట్ అంచును తాకినట్లుగా కనిపించింది. అయితే, అదే సమయంలో బ్యాట్ ప్యాడ్లను తాకిన తాకిందని పంత్ అనుమానం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ బంతి బ్యాట్‌ను తాకినప్పుడే స్పైక్స్ వచ్చాయంటూ థర్డ్ అంపైర్ పంత్‌ను అవుట్‌గా ప్రకటించాడు.కానీ పంత్ మాత్రం మైదానాన్ని వీడేందుకు ఇష్టపడక కాసేపు ఫీల్డ్ అంపైర్లతో వాదించి.. ఇక లాభం లేదనుకుని పెవిలియన్ చేరాడు. పంత్ నిష్క్రమణ తర్వాత భారత్ ఓటమి ఖారారై.. కివీస్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో పంత్ అవుటైన తీరు విస్తృతంగా చర్చకు వచ్చింది.ఈ క్రమంలోనే చాలా మంది హాట్‌స్పాట్ టెక్నాలజీ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)లో ఈ సాంకేతికతను కూడా బీసీసీఐ చేర్చుకుని ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.హాట్‌స్పాట్ టెక్నాలజీ అంటే ఏమిటి?ఫ్రెంచ్ శాస్త్రవేత్త నికోలస్ బియాన్ హాట్‌స్పాట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. రక్షణ దళాలు విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు వీలుగా ఈ సాంకేతికతను రూపొందించారు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. చీకట్లో, పొగ కమ్ముకున్న సమయంలో యుద్ధ ట్యాంకులు, విమానాల కదలికలను పసిగట్టడం కోసం దీనిని వాడతారు.క్రికెట్లో హాట్స్పాట్ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య 2006-07 నాటి యాషెస్ సిరీస్ సందర్భంగా క్రికెట్లో హాట్‌స్పాట్ టెక్నాలజీని తొలిసారిగా ఉపయోగించారు. ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా బంతి బ్యాటర్‌కు శరీరానికి తగిలిందో లేదో పరిశీలించే వీలు కలుగుతుంది. డీఆర్ఎస్ను మరింత సరళతరంగా, కచ్చితంగా మార్చేందుకు ఈ సాంకేతికతను వాడారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, యూఏఈలలో కూడా ఈ హాట్‌స్పాట్ టెక్నాలజీని ఉపయోగించారు.ఇది ఎలా పనిచేస్తుందంటే?బౌలర్ సైడ్ రెండు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను అమరుస్తారు. బంతిని బ్యాటర్ శరీరాన్ని లేదంటే ప్యాడ్‌ను తాకినపుడు వెలువడ్డ ఉష్ణోగ్రత ఆధారంగా నెగటివ్ ఇమేజ్ ద్వారా ఏ పాయింట్లో బంతి తాకిందో గుర్తిస్తారు. బంతి బ్యాట్ అంచును తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా అనేది దీని ద్వారా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.కచ్చితత్వం ఎంత?హాట్‌స్పాట్ చుట్టూ కూడా వివాదాలు ఉన్నాయి. 2011లో భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినపుడు ఈ టెక్నాలజీ వాడగా.. ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. వీవీఎస్ లక్ష్మణ్ అవుట్ కాకుండా లైఫ్ పొందిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఈ సాంకేతికతను తప్పుబట్టాడు. ఇక టూల్ ఇన్వెంటర్ వారెన్ బ్రెనాన్ సైతం పూత ఉండే బ్యాట్ల విషయంలో ఈ టెక్నాలజీ సరిగ్గా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఇండియాలో ఎందుకు వాడటం లేదు?హాట్‌స్పాట్ టెక్నాలజీ ఖరీదైనదని బీసీసీఐ, బ్రాడ్కాస్ట్ వర్గాలు అంటున్నాయి. ఒక్క కిట్ కోసం రోజుకు పది వేల అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. ఇంతచేసినా కచ్చితమైన ఫలితాలు పొందలేమని పేర్కొంటున్నాయి. అందుకే ఈ టెక్నాలజీని ఇండియాలో వాడటం లేదని.. స్కై స్పోర్ట్స్, సూపర్‌స్పోర్ట్స్ కూడా వీటి వినియోగాన్ని ఆపేశాయని తెలిపాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం హాట్‌స్పాట్ టెక్నాలజీని ఇంత వరకు ఒక్కసారి కూడా ఉపయోగించకపోవడం విశేషం.చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ కూడా అతడే! అంతేకాదు.. మాతృదేశంలో.. విదేశీ జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన రికార్డునూ అజాజ్ పటేల్ సొంతం చేసుకున్నాడు.కాగా ముంబైలో జన్మించాడు అజాజ్ పటేల్. ఆ తర్వాత అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు మకాం మార్చింది. అయితే, బాల్యం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అజాజ్ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌తో ఒక్కసారిగా అతడు భారత్‌లో ఫేమస్ అయ్యాడు.నాడు 10 వికెట్ల హాల్ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాడు టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు. జన్మనిచ్చిన గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు అజాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.ఈసారి ఐదేసిన అజాజ్ఇక తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)తో పాటు శుబ్‌మన్ గిల్(90), మహ్మద్ సిరాజ్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవిచంద్రన్ అశ్విన్(6)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత్ ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్ల జాబితాలో అజాజ్ పటేల్ చోటు సంపాదించాడు. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు అజాజ్ 19 వికెట్లు(10+4+5) పడగొట్టాడు.భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లుఇయాన్ బోతమ్(ఇంగ్లండ్)- వాంఖడేలో 22 వికెట్లుఅజాజ్ పటేల్(న్యూజిలాండ్)- వాంఖడేలో 19 వికెట్లురిచీ బెనాడ్(ఆస్ట్రేలియా)- ఈడెన్ గార్డెన్స్‌లో 18 వికెట్లుకర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్)- వాంఖడేలో 17 వికెట్లు.భారత్ 263 ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఇరుజట్ల బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత్ 235 పరుగులకు తొలిరోజే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు -
విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. కాగా రోహిత్ సేన స్వదేశంలో కివీస్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబై వేదికగా మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. వాంఖడే మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది.పాత కథను పునరావృతం చేస్తూతొలిరోజే బౌలర్లు రాణించడంతో కివీస్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పాత కథను పునరావృతం చేస్తూ బ్యాటింగ్‌లో మళ్లీ విఫలమైంది. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆరంభం నుంచి నైట్వాచ్మెన్లు శుబ్‌మన్ గిల్, రిషభ పంత్ దూకుడుగా ఆడారు.యశస్వి జైస్వాల్ రికార్డు బద్దలు గిల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కివీస్‌పై తక్కువ బంతుల్లోనే అర్ధ శతకం చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.కాగా కివీస్‌తో తాజా సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన రెండో టెస్టులో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అయితే, పంత్ ఇప్పుడు ఆ రికార్డును సవరించి.. జైస్వాల్‌ను వెనక్కినెట్టి నంబర్ వన్‌గా అవతరించాడు. గిల్ సెంచరీ మిస్ ఇదిలా ఉంటే.. ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. రోహిత్ శర్మ(18), మహ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరిచారు. అయితే, రెండో రోజు గిల్, పంత్ అర్ధ శతకాల వల్ల టీమిండియా ఆధిక్యంలోకి రాగలిగింది.దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ(90) మిస్ కాగా.. పంత్ 59 బంతుల్లో 60 పరుగులు రాబట్టాడు. రవీంద్ర జడేజా 14 పరుగులకే నిష్క్రమించగా.. సర్ఫరాజ్ ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 38 నాటౌట్) నిలకడగా ఆడినా.. ఆకాశ్ దీప్ రనౌట్ కావడంతో భారత తొలి 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ కంటే కేవలం 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు' -
పంత్ అవుట్.. గిల్ సెంచరీ మిస్.. భారత్ స్కోరెంతంటే?
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల వద్ద నిలిచింది. కాగా కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన ఇప్పటికే 0-2తో చేజార్చుకుంది.ఈ క్రమంలో ముంబై వేదికగా శుక్రవారం మొదలైన మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలన్నా.. కివీస్ చేతిలో వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలన్నా భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.తొలిరోజు కివీస్ 235 పరుగులకు ఆలౌట్ ఇక వాంఖడే వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయగలిగింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు తొలి రోజే.. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.రోహిత్, కోహ్లి ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(18) మరోసారి విఫలమయ్యాడు. ఇక జైస్వాల్ వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లి(4) రనౌట్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు.గిల్‌కు టెస్టుల్లో ఏడో ఫిఫ్టీగిల్ 66 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఇష్ సోధి బౌలింగ్‌లో పంత్(60) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 𝐒𝐡𝐚𝐚𝐧𝐝𝐚𝐫 𝐉𝐚𝐛𝐚𝐫𝐝𝐚𝐬𝐭 𝐙𝐢𝐧𝐝𝐚𝐛𝐚𝐝 🙌 #INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #ShubmanGill pic.twitter.com/SujiHXhlOw— JioCinema (@JioCinema) November 2, 2024 ఇక శనివారం భోజన విరామ సమయానికి టీమిండియా 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే టీమిండియా ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది. గిల్ సెంచరీ మిస్‌అయితే, లంచ్ తర్వాత గిల్ 90 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుయ్యాడు. అంతకంటే ముందు రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్ ఖాన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది. 53.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 227 పరుగులు చేసింది.టీమిండియా-న్యూజిలాండ్ మూడో టెస్టుప్లేయింగ్ ఎలెవన్ టీమిండియారోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు? -
Ind vs NZ: గిల్ ఫిఫ్టీ.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ.. దూకుడుగా భారత్
టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా మూడో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 86/4తో శనివారం ఆట మొదలుపెట్టిన భారత్ పటిష్ట స్థితిలో నిలవాలంటే కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం తప్పనిసరి. ఈ క్రమంలో రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.గేర్ మార్చిన గిల్, పంత్శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసిన పంత్.. 31 పరుగులతో ఉన్న గిల్ శనివారం గేర్ మార్చారు. కివీస్ బౌలింగ్‌పై ఆది నుంచే అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గిల్ 66 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే గిల్ 46 పరుగుల వద్ద ఉండగా.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫిలిప్స్ వేసిన బంతిని గిల్ లాంగాన్ మీదుగా తరలించగా.. ఫీల్డర్ చాప్మన్ క్యాచ్ పట్టేందుకు వచ్చి విఫలమయ్యాడు. దీంతో గిల్‌కు లైఫ్ లభించింది. పంత్ మెరుపు హాఫ్ సెంచరీఇక రిషభ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే యాభై పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ క్రమంలో 31 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 74 పరుగులు వెనుకబడి ఉంది.ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియాకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ మూడూ గెలవడం ఖాయమని.. రోహిత్ సేన సులువుగానే ఫైనల్‌కు చేరుతుందని సిరీస్ ఆరంభంలో అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.బెంగళూరు, పుణెలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రెండింటిలో ఓటమి తప్పలేదు. ఫలితంగా పన్నెండేళ్ల తర్వాత భారత్ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.తొలిరోజు ఆటలో రాణించిన జడ్డూ, వాషీ..కానీ.. ఇక్కడా టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. తొలిరోజు బౌలర్లు శుభారంభం అందించినా.. బ్యాటర్లు దానిని నిలబెట్టలేకపోయారు. కాగా వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుత రీతిలో రాణించి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు.జడ్డూ ఐదు, వాషీ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్(ఒక వికెట్) కూడా తన వంతు సహకారం అందించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.ఆ ఆనందం కాసేపట్లోనే ఆవిరిభారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే కెప్టెన్, రోహిత్ శర్మ(18 బంతుల్లో 18)పెవిలియన్ చేరాడు. ఆది నుంచే దూకుడుకనబరిచిన అతడు.. కివీస్ ఫీల్డర్ల తప్పిదాల వల్ల రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ అగ్రెసివ్‌గా ఆడి పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ జైస్వాల్(30)ను బౌల్డ్ చేసి.. ఈ జోడీని విడదీశాడు. అయితే, ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ఓ ప్రయోగం చేసింది. నాలుగో నంబర్లో నైట్‌వాచ్‌మన్‌గా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పంపించింది.ఆఖరి 15 నిమిషాల్లో అంతా తలకిందులుజైస్వాల్ స్థానంలో సిరాజ్ క్రీజులోకి వచ్చీ రాగానే.. అజాజ్ పటేల్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి(4).. రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. ఫలితంగా టీమిండియా 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కంటే 149 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ ఒకటి, శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిజానికి శుక్రవారం 4. 45 నిమిషాల వరకు టీమిండియాదే పైచేయి. కానీ పదిహేను నిమిషాల్లోనే అంతా తారుమారైంది. జైస్వాల్, సిరాజ్, కోహ్లి అవుటైన తర్వాత కివీస్ పటిష్ట స్థితికి చేరుకుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉కివీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్👉తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 86/4 (19)తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమిInd vs NZ: చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి! -
చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి!
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేశానికి లోనయ్యాడు. అంపైర్లతో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. అయితే, సర్ఫరాజ్‌ను సమర్థించే క్రమంలో ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించిన రోహిత్.. తర్వాత చల్లబడ్డాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరు, పుణెలలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పర్యాటక కివీస్ జట్టు రోహిత్ సేనకు ఊహించని షాకిచ్చింది. రెండింటిలోనూ ఘన విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియాకు టెస్టు సిరీస్‌లో ఓటమిని రుచిచూపించింది.ఆరంభం బాగున్నాఫలితంగా అవమానభారంతో కుంగిపోయిన టీమిండియా ముంబైలో జరుగుతున్న మూడో టెస్టులో గెలుపొంది.. పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. Washington bowls a jaffa to castle Latham 🤌 Don't miss LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/BY5BeQRJ08— JioCinema (@JioCinema) November 1, 2024 ఆరంభంలోనే పేసర్ ఆకాశ్ దీప్ డెవాన్ కాన్వే(4) వికెట్ తీసి బ్రేక్ ఇవ్వగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(28), స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5)ను పెవిలియన్‌కు పంపాడు.సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ సూపర్ హాఫ్ సెంచరీలతో రాణించి.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగుల మెరుగైన స్కోరు సాధించేలా చేశారు. అయితే, ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చిన వేళ సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్‌కు ముందు బౌలర్ బంతిని రిలీజ్ చేసే సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్.. బ్యాటర్‌కు మరీ దగ్గరగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. అప్పుడు క్రీజులో ఉన్న డారిల్ మిచెల్ సర్ఫరాజ్ వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటుందని ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు కనిపించింది.రోహిత్‌కు వార్నింగ్ఈ క్రమంలో అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ సర్ఫరాజ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పిలిచి.. మాటలు తగ్గించాలని సూచించాడు. దీంతో అసహనానికి లోనైన రోహిత్ అంపైర్‌తో కాసేపు వాదించాడు. ఆ తర్వాత మిచెల్ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు. దీంతో మిచెల్ సైతం రోహిత్ వ్యాఖ్యలతో అంగీకరించినట్లుగా తిరిగి తన బ్యాటింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ కంటే ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్ ఫైర్pic.twitter.com/H0G7GazjgE— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 1, 2024 -
నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ సైతం కోహ్లి తీరును విమర్శిస్తున్నారు. ‘‘నీలాంటి దిగ్గజ ఆటగాడు కూడా ఇలా చేస్తే.. జట్టుకు నీతో ఏం ఉపయోగం?’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో పునరాగమనం చేసిన కోహ్లి.. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 17, 47, 29(నాటౌట్) పరుగులు స్కోరు చేశాడు. బలహీన ప్రత్యర్థిపై కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. ఈ సిరీస్‌లో భారత్ గెలిచింది కాబట్టి కోహ్లి విఫలమైనా పెద్దగా నష్టం జరుగలేదు.ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపుఅయితే, న్యూజిలాండ్‌తో టెస్టుల్లోనూ కోహ్లి ఆట తీరు మారలేదు. బెంగళూరులో తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్ 70 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపు.. పుణెలో జరిగిన రెండో టెస్టులో మళ్లీ ఫెయిల్ అయ్యాడు.ఆ మ్యాచ్‌లో కోహ్లి సాధించిన స్కోర్లు 1, 17. ఇక ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమిపాలై.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో భారత్- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నాటి మూడో టెస్టు మొదలైంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పర్యాటక కివీస్ జట్టు.ఆది నుంచే ఎదురుదెబ్బలుభారత బౌలర్ల విజృంభణ కారణంగా 235 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి.ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(18) దూకుడుగా ఆడి తొలి వికెట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. జైస్వాల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. భారత్ ఒక్క బంతి వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.హెన్రీ డైరెక్ట్ త్రో.. కోహ్లికి షాక్ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఆడాల్సిన కోహ్లి ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు. భారత ఇన్నింగ్స్ పందొమ్మిదవ ఓవర్లో రచిన్ రవీంద్ర వేసిన మూడో బంతిని షాట్ ఆడిన కోహ్లి.. సింగిల్ కోసం గిల్‌ను పిలిచాడు. ఇద్దరూ క్రీజును వీడిన సమయంలో.. బంతిని అందుకున్న ఫీల్డర్ మ్యాట్ హెన్రీ కోహ్లి వస్తున్న నాన్ స్ట్రైకర్ ఎండ్ వికెట్ల వైపు బాల్ త్రో చేశాడు. నేరుగా అది వికెట్లను గిరాటేయడంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికి కోహ్లి డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. కేవలం నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి అవుట్ కాగా టీమిండియా కష్టాల్లో పడింది.ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 86 రన్స్ స్కోరు చేసింది. గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..!There was never a run but Virat Kohli thinks he is the fittest and he should take a risk.Run-out in test cricket is the worst thing, he could have avoided that single.There was a whole day left to score runs.pic.twitter.com/QRyi86oG35— Sujeet Suman (@sujeetsuman1991) November 1, 2024 -
ఆసక్తికరంగా భారత-న్యూజిలాండ్‌ల మూడో టెస్టు.. పడగొట్టి... ఆపై తడబడి!
వాంఖెడే మైదానంలో తొలి రోజు 84.4 ఓవర్లు పడ్డాయి. 82.5 ఓవర్ల వరకు భారత్‌దే పైచేయి... కానీ తర్వాతి 8 బంతుల వ్యవధిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీమిండియా అనూహ్యంగా 3 వికెట్లు చేజార్చుకొని వెనుకంజ వేసింది. అప్పటి వరకు చక్కగా ఆడిన యశస్వి జైస్వాల్‌తో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి రనౌట్ ఇందులో ఉండగా, ఒక కీలక రివ్యూ కూడా కోల్పోవడంతో భారత్ నిరాశగా ఆటను ముగించింది. అంతకుముందు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ధాటికి 235 పరుగులకే పరిమితమై నిరాశ చెందిన న్యూజిలాండ్ ఆ తర్వాత 4 వికెట్లు కూడా పడగొట్టి పైచేయి సాధించింది. రెండో రోజు మన బ్యాటర్లు ఎంత వరకు స్కోరును తీసుకెళ్లి ఆధిక్యం అందించగలరనే అంశంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. బౌలర్లు తొలి రోజు నేలకూల్చిన 14 వికెట్లు మ్యాచ్‌లో తర్వాతి రోజులు ఎలా సాగనున్నాయనే దానికి సంకేతంగా నిలిచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. డరైల్ మిచెల్ (129 బంతుల్లో 82; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ యంగ్ (138 బంతుల్లో 71; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (5/65) ఐదు వికెట్లతో సత్తా చాటగా... వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ మరో 149 పరుగులు వెనుకబడి ఉంది. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్‌ను ఆడించగా... న్యూజిలాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్ హీరో సాంట్నర్ పక్కటెముకల గాయంతో టెస్టుకు దూరం కాగా... అతని స్థానంలో సోధి వచ్చాడు. పేసర్ టీమ్ సౌతీకి బదులుగా హెన్రీని కివీస్ ఎంచుకుంది. భారీ భాగస్వామ్యం... కివీస్ ఇన్నింగ్స్ మూడు భిన్న దశలుగా సాగింది. ఫామ్‌లో ఉన్న కాన్వే (4) ఆరంభంలోనే వెనుదిరగ్గా... కెపె్టన్ టామ్ లాథమ్ (44 బంతుల్లో 28; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే లాథమ్‌తో పాటు రచిన్ రవీంద్ర (5)లను సుందర్ క్లీన్»ౌల్డ్ చేయడంతో 72/3 వద్ద కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్, మిచెల్ భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వీరిద్దరు తర్వాతి 25 ఓవర్ల పాటు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 87 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యంతో స్కోరును 159/3 వరకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే ఆట మళ్లీ మలుపు తిరిగింది. జడేజా వేసిన ఈ ఓవర్లో యంగ్, బ్లన్‌డెల్ (0) వెనుదిరిగారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు వికెట్లు కూడా అతని ఖాతాలోనే చేరాయి. సుందర్ మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్ చొప్పున బాది జోరు ప్రదర్శించిన మిచెల్ ఎట్టకేలకు సుందర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరగా... మరో మూడు బంతుల తర్వాత కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి రనౌట్... రోహిత్ శర్మ (18) ఎప్పటిలాగే ధాటిగా మొదలు పెట్టినా, మరోసారి అతను తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 30; 4 ఫోర్లు), గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. 6 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ బ్లన్‌డెల్ అందుకోలేకపోయాడు. వీరిద్దరి భాగస్వామ్యం 53 పరుగులకు చేరింది. మరో రెండు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో అంతా మారిపోయింది. ఎజాజ్ బౌలింగ్‌లో అనవసరపు రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి జైస్వాల్ బౌల్డ్ కాగా... నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన సిరాజ్ (0) తర్వాతి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. అయితే దీనికి కూడా అతని ‘రివ్యూ’ తీసుకొని దానిని వృథా చేశాడు! భారత్‌కు మరో షాక్ చివరి ఓవర్లో తగిలింది. డిఫెన్స్ ఆడి రోజును ముగించాల్సిన సమయంలో కోహ్లి (4) సాహసం చేశాడు. రచిన్ బౌలింగ్‌లో మిడాన్ దిశగా ఆడిన అతను అతి విశ్వాసంతో సింగిల్‌కు ప్రయత్నించాడు. హెన్రీ డైరెక్ట్ త్రో వికెట్లను పడగొట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి) సుందర్ 28; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 4; యంగ్ (సి) రోహిత్ (బి) జడేజా 71; రచిన్ (బి) సుందర్ 5; మిచెల్ (సి) రోహిత్ (బి) సుందర్ 82; బ్లన్‌డెల్ (బి) జడేజా 0; ఫిలిప్స్ (బి) జడేజా 17; సోధి (ఎల్బీ) (బి) జడేజా 7; హెన్రీ (బి) జడేజా 0; ఎజాజ్ (ఎల్బీ) (బి) సుందర్ 7; రూర్కే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (65.4 ఓవర్లలో ఆలౌట్) 235. వికెట్ల పతనం: 1–15, 2–59, 3–72, 4–159, 5–159, 6–187, 7–210, 8–210, 9–228, 10–235. బౌలింగ్: సిరాజ్ 6–0–16–0, ఆకాశ్‌దీప్ 5–0–22–1, అశ్విన్ 14–0–47–0, వాషింగ్టన్ సుందర్ 18.4–2– 81–4, జడేజా 22–1–65–5. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (బ్యాటింగ్) 31; సిరాజ్ (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; కోహ్లి (రనౌట్) 4; పంత్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 86. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84. బౌలింగ్: హెన్రీ 5–1–15–1, రూర్కే 2–1–5–0, ఎజాజ్ 7–1–33–2, ఫిలిప్స్ 4–0–25–0, రచిన్ 1–0–8–0. -
చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను జడ్డూ అధిగమించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.ముంబై వేదికగా మూడో టెస్టు ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెంగళూరు, పుణె వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ముంబై వేదికగా శుక్రవారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇప్పటికే భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్ బృందం విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆకాశ్ దీప్ శుభారంభం.. అదరగొట్టిన వాషీస్పిన్కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ప్రభావం చూపుతున్నారు. ఆట తొలిరోజు భోజన విరామ సమయానికి ముందు వాషీ.. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. మరోవైపు.. పేసర్ ఆకాశ్ దీప్ డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు.లంచ్ తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టిన జడ్డూఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అయితే, భోజన విరామం తర్వాత జడ్డూ తన బౌలింగ్ పదునుపెంచాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న విల్ యంగ్(71)ను తొలుత పెవిలియన్‌కు పంపిన జడేజా.. అనంతరం టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ను అవుట్ చేశాడు. తద్వారా జడ్డూ టెస్టుల్లో 312 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.టీ బ్రేక్ సమయానికి కివీస్స్కోరు ఎంతంటే?ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను జడ్డూ అధిగమించాడు. వీరిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ టాప్-5లో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు1. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- 619 వికెట్లు2. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- 533 వికెట్లు3. కపిల్ దేవ్(పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్)- 434 వికెట్లు4. హర్భజన్ సింగ్(స్పిన్నర్)- 417 వికెట్లు5. రవీంద్ర జడేజా(స్పిన్నర్)- 312 వికెట్లు.చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..! -
అతడిని జట్టులోకి తీసుకున్నారా?.. టీమిండియా కోచ్ క్లారిటీ
న్యూజిలాండ్‌తో మూడో టెస్టుకు భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పష్టం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ గురించి తాము ఆలోచించడం లేదని.. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ముంబై మ్యాచ్‌పైనే ఉందని తెలిపాడు. అదే విధంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల విషయంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని సూచించాడు. రోహిత్ సేనకు ఊహించని షాకులుగొప్ప ఆటగాళ్లందరూ ఏదో ఒక సందర్భంలో ఫామ్‌లేమితో సతమతమయ్యారన్న అభిషేక్ నాయర్.. రోహిత్- కోహ్లి తిరిగి పుంజుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో రోహిత్ సేనకు ఊహించని షాక్ తగిలింది.బెంగళూరులో కివీస్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన భారత్.. పుణెలో 113 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 0-2తో సిరీస్ కోల్పోయింది. ఫలితంగా స్వదేశంలో టీమిండియా పన్నెండేళ్ల టెస్టు సిరీస్ జైత్రయాత్రకు తెరపడింది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబై వేదికగా జరుగనున్న మూడో టెస్టు భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే గెలిచి తీరాలి లేదంటే కనీసం డ్రా అయినా చేసుకోవాలి.జట్టులో మార్పులేమీ లేవుఈ నేపథ్యంలో యువ పేసర్ హర్షిత్ రాణాను మూడో టెస్టులో బరిలోకి దించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వీటిని ఖండించాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జట్టులో మార్పులేమీ లేవు. ఎవరినీ కొత్తగా చేర్చడం లేదు. ప్రతీ వారం.. ప్రతీ రోజు మాకు కీలకమే. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఇప్పుడు మా దృష్టి మొత్తం ఈ మ్యాచ్ మీదే ఉంది’’ అని అభిషేక్ నాయర్ తెలిపాడు.ఫామ్‌లోకి వస్తారనే నమ్మకం ఉందిఅదే విధంగా.. కివీస్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రోహిత్- కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘ప్రస్తుతం వాళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఓపికపట్టాలి కూడా! గొప్ప గొప్ప ఆటగాళ్ల కెరీర్లో ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ల టైమ్ బాగా లేకపోవచ్చు. అయితే, త్వరలోనే తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉంది’’ అని అభిషేక్ నాయర్ విరాహిత్ ద్వయాన్ని సమర్థించాడు. కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతుంది. ఇందుకు సంబంధించిన జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
టీమిండియా ఓపెనర్‌కు నిరాశ.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న న్యూజిలాండ్ స్పిన్నర్
Ajaz Patel: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో మాయంక్ అగర్వాల్, అజాజ్ పటేల్‌లతో పాటు ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. అజాజ్‌నే అవార్డు వరించింది. గతేడాది డిసెంబర్లో ముంబై వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల పడగొట్టిన అజాజ్.. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్‌లో మొత్తం 14 వికెట్లు తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. తన జన్మస్థలమైన ముంబైలో అరుదైన ఫీట్‌ను సాధించాడు. కాగా, అవార్డు ప్రకటన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ కమిటీ మెంబర్ జేపీ డుమిని మాట్లాడుతూ.. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే 10 వికెట్ల ఫీట్‌ను అందుకున్న అజాజ్‌కు ఐసీసీ జ్యూరీతో పాటు అభిమానులు భారీ ఎత్తున ఓటింగ్ చేశారని, మరి ముఖ్యంగా భారత అభిమానులు అజాజ్ పటేల్‌కు భారీ ఎత్తున మద్దతు తెలిపారని పేర్కొన్నాడు. అజాజ్ సాధించిన ఫీట్ చాలా ప్రత్యేకమైందని, చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోతుందని డుమిని అన్నాడు. చదవండి: NZ Vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు -
Virat Kohli: రహానే ఫామ్.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా
Ind vs Nz Test Series: Virat Kohli On Criticism Of Ajinkya Rahane Can Not Judge: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో తొలి టెస్టుకు సారథిగా వ్యవహరించిన రహానే.. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 39(35, 4) పరుగులు మాత్రమే చేశాడు. కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డాడు. ఈ క్రమంలో రహానేపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ అయినందు వల్లే ఇంకా జట్టులో కొనసాగుతున్నాడని.. లేదంటే అతడికి అవకాశం దక్కేది కాదంటూ ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో రెండో టెస్టుకు కోహ్లి అందుబాటులోకి రావడం.. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో తొలి టెస్టులో తన మార్కు చూపించడం తదితర పరిణామాల నేపథ్యంలో రహానే జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక రెండో టెస్టులో అదరగొట్టిన కోహ్లి సేన అద్భుత విజయం సాధించి సిరీస్‌ను గెలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడుతూ రహానే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రహానే ఫామ్ గురించి జడ్జ్ చేయలేను. నేనే కాదు ఎవరూ ఆ పని చేయలేరు. తమ లోపాలేమిటి? వాటిని ఎలా అధిగమించాలన్న అంశంపై సదరు ఆటగాడు దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే, కీలక మ్యాచ్‌లలో తమదైన అద్భుత ప్రదర్శనతో ప్రభావం చూపగలరో అలాంటి ఆటగాళ్లకు కష్టకాలంలో మద్దతుగా నిలబడాల్సి ఉంటుంది’’ అని రహానేకు అండగా నిలిచాడు. అదే విధంగా.. ‘‘ఒక వ్యక్తిపై ఒత్తిడి ఉన్నపుడు... పదే పదే అతడి ఫామ్ గురించి మాట్లాడుతూ... తర్వాత ఏంటి? అంటూ గుచ్చిగుచ్చి మాట్లాడేవాళ్లను ఒక జట్టుగా మేము అస్సలు సహించబోము. బయట కొంతమంది తమకు ఇష్టమైన ఆటగాళ్లకు ఇప్పుడు మద్దతు పలికి.. ఆ తర్వాత వాళ్లను కూడా జట్టులో తీసేయాలంటూ మాట్లాడతారు. అలాంటి వాళ్ల విమర్శలపై మేము అస్సలు స్పందించము. ఆటను ఆటలాగే చూస్తాం. అజింక్య రహానే.. లేదంటే ఇంకో ఆటగాడు.. ఎవరికైనా సరే మా మద్దతు ఇలాగే ఉంటుంది. బయట ఉన్న పరిస్థితుల ప్రభావం ఆధారంగా జట్టులో ఓ సభ్యుడిని కొనసాగించాలా.. పక్కకు పెట్టాలా అన్న నిర్ణయం తీసుకోము’’ అని కోహ్లి ట్రోల్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. 🗣️ 🗣️ The mindset is to take Indian cricket forward and stay at the top: #TeamIndia Captain @imVkohli #INDvNZ @Paytm pic.twitter.com/NWrxTih29K — BCCI (@BCCI) December 6, 2021 CHAMPIONS 👏👏 This is #TeamIndia's 14th consecutive Test series win at home.#INDvNZ @Paytm pic.twitter.com/FtKIKVCzt8 — BCCI (@BCCI) December 6, 2021 చదవండి: Ravichandran Ashwin: టెస్టుల్లో అశ్విన్ అరుదైన రికార్డు.. కుంబ్లేను దాటేశాడుగా.. -
Ind Vs Nz: టీమిండియా అరుదైన రికార్డు.. న్యూజిలాండ్‌కు ఘోర పరాభవం!
Ind Vs Nz 2nd Test: India Biggest Victory New Zealand Biggest Defeat By Runs: స్వదేశంలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసినా.. మలి టెస్టులో ఏకంగా 372 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో భారత జట్టు ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టుపై టీమిండియా సాధించిన గెలుపు ఇదే కావడం విశేషం. అంతకుముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై కూడా భారత్ ఇదే తరహాలో భారీ తేడాతో (పరుగుల పరంగా) విజయం సాధించినప్పటికీ.. వాటికంటే ఇదే బిగ్గెస్ట్ విక్టరీ. అదే సమయంలో న్యూజిలాండ్ మాత్రం ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియా అతిపెద్ద విజయాలు(పరుగుల పరంగా) ►372-న్యూజిలాండ్‌పై- ముంబై- 2021 ►337- దక్షిణాఫ్రికాపై-ఢిల్లీ-2015 ►321- న్యూజిలాండ్‌పై- ఇండోర్- 2016 ►320-ఆస్ట్రేలియాపై-మొహాలీ- 2008. టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో ఓటమిపాలైన కివీస్ ఓ చెత్త రికార్డు నమోదు చేసింది. భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి చెందిన సందర్భాలు(పరుగుల పరంగా) ►372 పరుగులు- ఇండియా చేతిలో- ముంబై- 2021 ►358 పరుగులు- దక్షిణాఫ్రికా- జొహెన్నస్‌బర్గ్- 2007 ►321 పరుగులు- ఇండియా-ఇండోర్- 2016 ►299 పరుగులు- పాకిస్తాన్- ఆక్లాండ్-2001 చదవండి: Ind Vs Nz: అక్షర్.. పటేల్.. రవీంద్ర.. జడేజా.. ఫొటో అదిరింది! ఇదేదో సర్ఫ్ యాడ్‌లా ఉందే! Ravichandran Ashwin: టెస్టుల్లో అశ్విన్ అరుదైన రికార్డు.. కుంబ్లేను దాటేశాడుగా.. -
Ind Vs NZ 2nd Test: విజయం వాకిట్లో టీమిండియా
ఫాలోఆన్ ఇవ్వని భారత్ పాచిక పారింది. మూడో రోజు కోహ్లి బృందం చకచకా పరుగులు సాధించింది. కొండంత లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. ప్రత్యర్థి బరిలోకి దిగగానే స్పిన్ ఉచ్చు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసిన మయాంక్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించి భారత్‌ను శాసించే స్థితిలో నిలిపాడు. అనంతరం అశ్విన్ న్యూజిలాండ్‌ను తిప్పేసే పనిలో పడ్డాడు. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో మరో ఐదు వికెట్లు తీస్తే భారత్ విజయం ఖరారు అవుతుంది. న్యూజిలాండ్ నెగ్గాలంటే ఆ జట్టు మరో 400 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ముంబై: టెస్టు సిరీస్ విజయానికి భారత్ చేరువైంది. నాలుగోరోజే ఒకట్రెండు సెషన్లలో ఆట ముగించేందుకు సిద్ధమైంది. టి20 సిరీస్ లాగే టెస్టు సిరీస్‌నూ అప్పగించేందుకు న్యూజిలాండ్‌కు సమయం వచ్చింది. మూడో రోజు భారత ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్‌లో మరో 207 పరుగులు చేసిన కోహ్లి సేన... బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టులోని సగం వికెట్లను కూల్చేసింది. కరిగించలేనంత లక్ష్యం... ‘డ్రా’ కోసం నిలబడలేనంత కష్టం కివీస్‌ను కమ్మేసింది. ఆదివారం భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 70 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (62; 9 ఫోర్లు, 1 సిక్స్), పుజారా (47; 6 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (47; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన కివీస్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ (4/106) రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. మరో స్పిన్నర్ రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 263 పరుగులతో కలిపి న్యూజిలాండ్ ముందు భారత్ 540 పరుగుల భారీలక్ష్యం నిర్దేశించింది. న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (60; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అశ్విన్ (3/27) కివీస్ పతనానికి బాట వేశాడు. మయాంక్ ఫిఫ్టీ... ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు జతచేసింది. మయాంక్ 90 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తయ్యింది. తొలి వికెట్‌కు 107 పరుగులు జతచేసిన మయాంక్, పుజారా జోడీకి ఎజాజ్ కళ్లెం వేశాడు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరిని ఔట్ చేశాడు. తర్వాత శుబ్‌మన్, కెప్టెన్ కోహ్లి స్కోరు పెంచారు. మూడో వికెట్‌కు 82 పరుగులు జతచేశాక గిల్ ఆటను రచిన్ రవీంద్ర ముగించాడు. జట్టు స్కోరు 200 పరుగులు దాటిన తర్వాత శ్రేయస్ (14)ను ఎజాజ్ బోల్తా కొట్టించగా, కోహ్లి (36; 1 ఫోర్, 1 సిక్స్)ని రచిన్ బౌల్డ్ చేశాడు. సాహా (13) విఫలమైనా... అక్షర్ పటేల్ (26 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టి20 ఇన్నింగ్స్ ఆడేశాడు. ఆఖరి సెషన్‌కు ముందే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను అశ్విన్ మరింత కష్టాల్లో పడేశాడు. ఆరంభంలోనే ఓపెనర్ లాథమ్ (6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్ ఆ తర్వాత యంగ్, రాస్ టేలర్‌లను పెవిలియన్‌కు పంపించాడు. ప్రస్తుతం నికోల్స్ (36 బ్యాటింగ్), రచిన్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 325; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62; భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) యంగ్ (బి) ఎజాజ్ 62; పుజారా (సి) టేలర్ (బి) ఎజాజ్ 47; శుబ్‌మన్ (సి) లాథమ్ (బి) రచిన్ 47; కోహ్లి (బి) రచిన్ 36; శ్రేయస్ (స్టంప్డ్) బ్లన్‌డెల్ (బి) ఎజాజ్ 14; సాహా (సి) జేమీసన్ (బి) రచిన్ 13; అక్షర్ పటేల్ (నాటౌట్) 41; జయంత్ (సి అండ్ బి) ఎజాజ్ 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (70 ఓవర్లలో 7 వికెట్లకు డిక్లేర్డ్) 276 వికెట్ల పతనం: 1–107, 2–115, 3–197, 4–211, 5–217, 6–238, 7–276. బౌలింగ్: సౌతీ 13–2–31–0, ఎజాజ్ 26–3–106–4, జేమీసన్ 8–2–15–0, సోమర్విల్లే 10–0–59–0, రచిన్ రవీంద్ర 13–2–56–3. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; విల్ యంగ్ (సి–సబ్) సూర్యకుమార్ (బి) అశ్విన్ 20; మిచెల్ (సి) జయంత్ (బి) అక్షర్ పటేల్ 60; రాస్ టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6; నికోల్స్ (బ్యాటింగ్) 36; బ్లన్‌డెల్ (రనౌట్) 0; రచిన్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (45 ఓవర్లలో 5 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–13, 2–45, 3–55, 4–128, 5–129. బౌలింగ్: సిరాజ్ 5–2–13–0, అశ్విన్ 17–7–27–3, అక్షర్ 10–2–42–1, జయంత్ 8–2–30–0, ఉమేశ్ 5–1–19–0. -
IND vs NZ 2nd Test: అందుకే వాళ్లిద్దరూ ఫీల్డింగ్‌కి రాలేదు!
IND vs NZ 2nd Test: Why Mayank Agarwal Shubman Gill Did Not Take Field During Final Session: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడ్డారు. వీరి పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అప్డేట్ ఇచ్చింది. ‘‘రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నపుడు.. మయాంక్ అగర్వాల్ కుడి ముంజేతికి గాయమైంది. ముందు జాగ్రత్తగా అతడిని విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. కాబట్టి అతడు ఫీల్డింగ్‌కు రావడం లేదు’’అని ట్వీట్ చేసింది. ఇక రెండో రోజు ఆటలో భాగంగా శనివారం శుభ్‌మన్ గిల్ మధ్య వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు కూడా ఆదివారం ఫీల్డింగ్‌కు రాలేదు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 276-7 వద్ద డిక్లేర్ చేసింది. ఇక మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. అదే విధంగా శుభ్‌మన్ గిల్... వరుసగా 44 పరుగులు, 47 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీకి చేరువైనప్పటికీ లాంఛనం పూర్తిచేయలేకపోయాడు. చదవండి: Ravichandran Ashwin: అశ్విన్ సరికొత్త రికార్డు.. కుంబ్లేను అధిగమించి.. Sara Tendulkar: నైట్ డేట్‌కు వెళ్లిన సారా టెండుల్కర్.. ఇంతకీ ఎవరా వ్యక్తి! గిల్ బ్యాటింగ్ చేస్తుంటే.. UPDATE - Mayank Agarwal got hit on his right forearm while batting in the second innings. He has been advised not to take the field as a precautionary measure. Shubman Gill got a cut on his right middle finger while fielding yesterday. He will not be taking the field today. — BCCI (@BCCI) December 5, 2021 -
Ravichandran Ashwin: అశ్విన్ సరికొత్త రికార్డు.. కుంబ్లేను అధిగమించి..
Ind Vs Nz 2nd Test: Ashwin Record Most 50 Plus Test Wickets In Calendar Year: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్ చేసి కివీస్‌ను తిప్పలుపెట్టిన మన బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ చుక్కలు చూపిస్తున్నారు. ఇక ముంబై టెస్టు సందర్భంగా ఇప్పటికే పలు రికార్డులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం అశ్విన్ మరో ఘనతను సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌తో పాటు.. రాస్ టేలర్ వికెట్‌ను పడగొట్టాడు. తద్వారా టెస్టుల్లో క్యాలెండర్ ఇయర్లో 50 కంటే ఎక్కువ వికెట్లు.. ఎక్కువసార్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ మొత్తంగా నాలుగుసార్లు (2015, 2016, 2017, 2021) ఈ ఫీట్ సాధించాడు. అంతకు ముందు అనిల్ కుంబ్లే 3 సార్లు(1999, 2004, 2006), హర్భజన్ సింగ్ 3 సార్లు(2001, 2002, 2008), కపిల్‌దేవ్ 2 సార్లు(1979, 1983) ఈ ఘనత సాధించారు. ఇక రెండో టెస్టు విషయానికొస్తే... తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా కాన్పూర్ టెస్టులో 6 వికెట్లు పడగొట్టి హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించాడు. చదవండి: Sara Tendulkar: నైట్ డేట్‌కు వెళ్లిన సారా టెండుల్కర్.. ఇంతకీ ఎవరా వ్యక్తి! గిల్ బ్యాటింగ్ చేస్తుంటే.. Ashwin gets his third as Ross Taylor departs after scoring 6 runs. Live - https://t.co/CmrJV47AeP #INDvNZ @Paytm pic.twitter.com/VExwF4Qg67 — BCCI (@BCCI) December 5, 2021 -
వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు
ఒకటి, రెండు, మూడు, నాలుగు... భారత ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నారు... న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ వికెట్ల లెక్క కూడా మారుతోంది... తొలి రోజు ఆట ముగిసేసరికి పడిన నాలుగు వికెట్లూ అతని ఖాతాలోనే... ఎజాజ్ సంబరపడ్డాడు. తాను పుట్టిన ఊర్లో ఒక గుర్తుంచుకునే ప్రదర్శన వచ్చినందుకు అందరి ముందు సంతోషాన్ని ప్రదర్శించాడు. శనివారం ఉదయం సాహా అవుట్ కాగానే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత... ఇదీ చెప్పుకోదగ్గ విశేషమే! తర్వాతి బంతికే ఆరో వికెట్. కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కూడా వచ్చేసింది. టెస్టుల్లో భారత జట్టు తొలి ఆరు వికెట్లు ఒక స్పిన్నర్‌కు కోల్పోవడం ఇదే తొలిసారి. అయినా సరే అద్భుతం జరగవచ్చని ఎవరూ ఊహించడం లేదు. ‘ఆ ఘనత’ సాధ్యమా అనే చర్చ కూడా వినిపించలేదు. దాదాపు 28 ఓవర్ల పాటు మరో వికెట్ పడకపోవడంతో ఎజాజ్ బౌలింగ్‌పై విశ్లేషణ కూడా దాదాపుగా ఆగిపోయింది. కానీ ఎజాజ్ మాత్రం యంత్రంలా అలుపెరుగకుండా బౌలింగ్ చేస్తూనే పోయాడు. మయాంక్ వికెట్‌తో ఒక్కసారిగా కదలిక... ఏదైనా సాధ్యమే అనిపించింది! కొద్ది సేపటి తర్వాత ఆ సమయం రానే వచ్చింది. 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు... అంతే! పదికి పది.. ఎజాజ్ యూనుస్ పటేల్ టెస్టు క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 144 ఏళ్లు... 2,438 టెస్టుల చరిత్రలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. పాతికేళ్లు తిరిగే సరికి... శుక్రవారం తొలి రోజు 4 వికెట్లు తీసిన ఎజాజ్ పటేల్ ఆట ముగిసిన తర్వాత వాంఖెడే స్టేడియం నుంచి బయటకు వెళుతూ అక్కడి ‘ఆనర్స్ బోర్డ్’ వద్ద క్షణకాలం పాటు ఆగి బోర్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఈ మైదానంలో సెంచరీలు సాధించిన, ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా దానిపై ఉంది. రేపు మరో వికెట్ తీసి తన పేరు అక్కడ చేర్చాలని అతను అనుకున్నాడు. అయితే ఐదు వికెట్లే కాదు... మరికొన్ని గంటల్లో ఏకంగా 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తానని అతను ఊహించి ఉండకపోవచ్చు! ► ముంబైలోనే పుట్టిన ఎజాజ్ ఎనిమిదేళ్ల వయసులో ఉపాధి కోసం అతని కుటుంబం న్యూజిలాండ్‌కు తరలి వెళ్లింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకో, ఇక్కడే ఉండిపోయిన బంధుమిత్రులను కలిసేందుకో గతంలోనూ ఎజాజ్ చాలా సార్లు వచ్చాడు. కానీ ఈసారి మాత్రం పుట్టిన గడ్డపై ఒక అద్భుతాన్ని సృష్టించేందుకే వచ్చినట్లున్నాడు. బాంబేను వీడిన సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మరో జట్టు తరఫున ఆడేందుకు వచ్చి భారత్‌పైనే అతను అత్యంత అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ పాతికేళ్ల ప్రస్థానం అతని కళ్ల ముందు కచ్చితంగా సినిమా రీళ్లలా కదలాడి ఉంటుంది! ► ముంబై టెస్టుకు ముందు మూడేళ్ల కెరీర్లో ఎజాజ్ పటేల్ ఆడినవి 10 మ్యాచ్‌లే! 32.48 పరుగుల సగటుతో 29 వికెట్లు తీసిన సాధారణ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్. టీమ్ మేనేజ్మెంట్ లెక్కల్లో అతను ఆ జట్టు నంబర్‌వన్ స్పిన్నర్ కూడా కాదు. సాన్‌ట్నర్, ఇష్ సోధిల తర్వాతే అతనికి ప్రాధాన్యం. వీరిలో ఎవరైనా తప్పుకుంటేనే మ్యాచ్ దక్కే అవకాశం. కెరీర్ తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచినా అది అతని కెరీర్ జోరుగా సాగేందుకు ఏమాత్రం పనికి రాలేదు. సరిగ్గా చెప్పాలంటే తాజా ప్రదర్శనకు ముందు 33 ఏళ్ల ఎజాజ్‌కు పెద్దగా గుర్తింపూ లేదు. కానీ ఇకపై ఎవరూ మరచిపోలేని విధంగా తన పేరును అతను చరిత్రలో చెక్కుకున్నాడు! ► న్యూజిలాండ్ వెళ్లిన తర్వాతే క్రికెట్‌పై ఎజాజ్‌కు ఆసక్తి కలిగింది. అయితే ఆటను అతను లెఫ్టార్మ్ పేస్ బౌలర్‌గా మొదలు పెట్టాడు. స్వింగ్ బౌలర్‌గా రాణించిన అతను ఆక్లాండ్ తరఫున అండర్–19 స్థాయిలో సౌతీతో సమానంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయినా సరే న్యూజిలాండ్ అండర్–19 టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు. 5 అడుగుల 8 అంగుళాల తన ఎత్తు పదునైన పేస్ బౌలింగ్‌కు పనికి రాదని కూడా అతను గుర్తించాడు. భవిష్యత్తులో కివీస్ తరఫున ఆడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అర్థమైంది. తన క్లబ్ తరఫున ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లిన ఎజాజ్‌కు న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ దీపక్ పటేల్ మార్గదర్శిగా నిలువగా... స్పిన్నర్‌గా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని భావించి కఠోర సాధన చేశాడు. వరుసగా మూడేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడంతో జాతీయ జట్టు పిలుపు లభించింది. 30 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ► ఈ పది వికెట్ల జాతరలో ఎజాజ్ ప్రయోగాలేమీ చేయలేదు. సాంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్నర్ వేసే బంతులతోనే సత్తా చాటాడు. ‘లెన్త్’ మాత్రం తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. సహచర బౌలర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా అతనికి మేలు చేసింది. చివరకు రచిన్ రవీంద్ర పట్టిన క్యాచ్‌తో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయితే దురదృష్టవశాత్తూ గత రెండు సందర్భాలకు భిన్నంగా ఇంత గొప్ప ఆట తర్వాత కూడా ఎజాజ్ ఓటమి పక్షానే నిలవాల్సి వస్తుందేమో! నా క్రికెట్ కెరీర్లో ఇదే అత్యుత్తమ రోజు. ఇక ముందు కూడా ఇదే ఉంటుందేమో. అన్నీ కలిసి రావడంతోనే నేను ముంబైలో ఈ ఘనత సాధించగలిగాను. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నాకు, నా కుటుంబానికి ఇదో ప్రత్యేక క్షణం. ఇంకా నేను ఆనందం నుంచి తేరుకోలేకపోయాను. ఇలాంటి ఘనతకు అందించిన దేవుడికి కృతజ్ఞతలు. ‘10’ వికెట్ల క్లబ్లో చేరడం గర్వకారణం. కుంబ్లే ఘనత నాకు బాగా గుర్తుంది. ఎన్నోసార్లు ఆ వీడియో చూశా. ఇలాంటి క్షణాలు కెరీర్లో ఎప్పుడో గానీ రావు కాబట్టి చివరి వికెట్‌కు ముందు చాలా ఒత్తిడిలో ఉన్నా. ఆఖరి వికెట్ సమయంలో బంతి గాల్లోకి లేచినప్పుడు అందరం ఎంతో ఉత్కంఠ అనుభవించాం. పదో వికెట్ కోసం ఇతర బౌలర్లు వైడ్ బంతులు వేయాలనే చర్చే మాలో జరగలేదు. తొమ్మిది వికెట్లతో కూడా నేను సంతృప్తి చెందేవాడిని. –ఎజాజ్ పటేల్ 10 వికెట్ల క్లబ్‌లోకి ఎజాజ్‌కు స్వాగతం. పర్ఫెక్ట్10. చాలా బాగా బౌలింగ్ చేశావు. టెస్టు తొలి, రెండో రోజు ఇలాంటి ఘనత సాధించడం ఎంతో ప్రత్యేకం. –అనిల్ కుంబ్లే , భారత మాజీ కెప్టెన్ మొత్తం టీమ్‌ను మన జేబులో వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇదో అసాధారణ ప్రదర్శన. –రవిశాస్త్రి, భారత మాజీ హెడ్ కోచ్ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ ఎజాజ్ పటేల్. గతంలో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ (1956 జూలైలో ఆస్ట్రేలియాపై మాంచెస్టర్‌లో 10/53)... భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 10/74) మాత్రమే ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా ఇదే. రిచర్డ్ హ్యాడ్లీ (9/52) రికార్డును ఎజాజ్ బద్దలుకొట్టాడు. -
Ajaz Patel- Ashwin: ‘‘ఏంటి అశ్విన్ బౌల్డ్ అయ్యావు కదా.. మరి ఇదేంటి?’’ వైరల్
Ind Vs Nz Mumbai Test: Ajaz Patel Bowled Ashwin Signaling For Review Video Viral: టీమిండియా- న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ సంచలన రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి.. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు ఒకప్పటి ఈ ముంబై కుర్రాడు. ఈ క్రమంలో వాంఖడే స్టేడియం మొత్తం నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని అభినందించింది. ఇక ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను అజాజ్ క్లీన్‌బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో గందరగోళానికి గురైన అశూ.. తాను బౌల్డ్ అయిన విషయాన్ని గమనించకుండా రివ్యూ కోరడం విశేషం. ఆ తర్వాత తప్పు తెలుసుకుని పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘‘ఏంటి అశ్విన్ బౌల్డ్ అయ్యావు కదా.. మరి ఇదేంటి? క్లీన్‌బౌల్డ్‌కు రివ్యూ కోరి చరిత్ర సృష్టించావు పో’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సైతం.. ‘‘బౌల్డ్ అయిన తర్వాత కూడా అశ్విన్ రివ్యూకు వెళ్లి ఉంటే ఇండియా రివ్యూ అవకాశం కోల్పోయి ఉండేది’’ అని ట్వీట్ చేశాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్ల విజృంభణతో కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ మూడు, అశ్విన్ 4, అక్షర్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. చదవండి: Sourav Ganguly: నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం.. ‘కోహ్లి సేన’పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు! Ashwin trying to review a clean bowled. LoL. #ashwin #AllRounder #INDvzNZ #Ashwin #BCCI #ViratKohli pic.twitter.com/2YNMMepErC — Reshebh Pent🇮🇳 (@reshebpent17) December 4, 2021 Who reviews a clean bowled. Ravi Ashwin 😂 pic.twitter.com/KbxJBVOyIk — Mirchi RJ Vijdan (@rj_vijdan) December 4, 2021 Ashwin makes history by taking a review after getting clean bowled.... pic.twitter.com/drtG5JPJAE — Katherine (@jawairiasyed) December 4, 2021 -
Mohammed Siraj: సిరాజ్ దెబ్బ.. కివీస్ అబ్బా.. జోరు మామూలుగా లేదుగా..
IND vs NZ 2nd Test: Mohammed Siraj Peach of a Delivery to Get Ross Taylor Bowled in Mumbai Test: ముంబై టెస్టుతో జట్టులోకి వచ్చిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆదిలోనే వరుసగా మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి టెస్టులో రాణించిన కివీస్ ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్‌ను పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆ తర్వాత అద్భుతమైన బంతితో రాస్ టేలర్‌ను బౌల్డ్ చేశాడు. ఆరో ఓవర్ తొలి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపాడు. చక్కని లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రాస్ టేలర్‌కు ఊహించని షాకిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘వరుసగా 3 వికెట్లు... సూపర్ సిరాజ్.. నీ దెబ్బకు రాస్ టేలర్‌కు దిమ్మతిరిగింది.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు... నిన్ను నీవు నిరూపించుకున్నావు’’ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రెండో టెస్టు రెండో ఆటలో భాగంగా భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. సిరాజ్(3), అశ్విన్(4) చెలరేగడంతో కివీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో 62 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్‌కు రెండు, జయంత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే That's Ripper from Mohammad Siraj 💥💥#INDvzNZ pic.twitter.com/ja5vkgMbka — Diwakar¹⁸ (@diwakarkumar47) December 4, 2021 -
గంటలోపే ఖేల్ ఖతం
► ముంబై టెస్టులో భారత్ ఘనవిజయం ► ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్, 36 పరుగుల ఆధిక్యంతో గెలుపు ► సిరీస్ 3–0తో కైవసం ఊహించినట్టుగానే జరిగింది.. ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. బరిలో దిగిన గంటలోపే భారత బౌలర్లు విజయ లాంఛనాన్ని ముగించారు. మన బ్యాట్స్‌మెన్ కు మరో ఇన్నింగ్స్ ఆడే పరిస్థితి లేకుండా ఇంగ్లండ్ చివరి వరుస బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోహ్లి సేన 3–0తో దక్కించుకుంది. చివరి రోజు కూడా అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్‌ను ప్రదర్శించి మిగిలిన నాలుగు వికెట్లను కేవలం నాలుగు ఓవర్లలోనే తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసినా... భారత బౌలర్ల ప్రతిభ కారణంగా ఇంగ్లండ్ జట్టుకు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. కోహ్లి నేతృత్వంలో భారత జట్టుకిది వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. అలాగే దాదాపు 24 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్ జట్టుపై స్వదేశంలో తొలిసారిగా మూడు టెస్టులను నెగ్గినట్టయ్యింది. ముంబై: లాంఛనం ముగిసింది. భారత్ ఖాతాలో మరో విజయం చేరింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లి సేన ఇన్నింగ్స్, 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తుగా ఓడించింది. చివరి రోజు ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేదు. దీంతో 55.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మరోవైపు వరుసగా మూడు విజయాలతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 3–0తో కైవసం చేసుకుంది. 1993లో అజహరుద్దీన్ కెప్టెన్సీలో చివరిసారిగా భారత జట్టు ఇంగ్లండ్‌పై మూడు టెస్టులను నెగ్గింది. అశ్విన్ కు ఆరు, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. మొత్తం ఈ మ్యాచ్‌లో అశ్విన్ 12 వికెట్లు తీశాడు. అలాగే ఈ విజయంతో 2012లో ఇంగ్లండ్‌కు కోల్పోయిన ఆంథోనీ డి మెల్లో ట్రోఫీని తిరిగి కైవసం చేసుకున్నట్టయ్యింది. సిరీస్‌లో చివరి టెస్టు ఈనెల 16 నుంచి 20 వరకు చెన్నైలో జరుగుతుంది. ఓవర్‌నైట్ స్కోరు 182/6తో తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ భారత బౌలర్లకు ఎలాంటి శ్రమను ఇవ్వలేదు. అశ్విన్ దెబ్బకు కేవలం ఎనిమిది ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్‌్సను ముగించింది. బెయిర్‌స్టో (107 బంతుల్లో 51; 2 ఫోర్లు) చక్కటి క్యారమ్ బంతికి వికెట్ల ముందు దొరికిపోగా తను రివ్యూకు వెళ్లాడు. అయితే అంపైర్ నిర్ణయమే సరైందని తేలింది. అలాగే క్రిస్ వోక్స్ (0), రషీద్ (7 బంతుల్లో 2)లను అవుట్ చేసిన అశ్విన్ తన కెరీర్లో 24సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఫీట్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత అండర్సన్ (2)ను కూడా అశ్వినే పెవిలియన్ కు పంపి భారత శిబిరంలో విజయోత్సాహాన్ని నింపాడు. అండర్సన్ తో భారత ఆటగాళ్ల వాగ్వాదం 640 పరుగులు... ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటిదాకా సాధించిన పరుగులు. అయితే 128 సగటుతో భీకర ఫామ్‌లో ఉన్న తన బ్యాటింగ్‌ను ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తేలిగ్గా తీసుకుంటున్నాడు. అసలు అతడి బ్యాటింగ్ టెక్నిక్ ఏమంత గొప్పగా లేదని, తను భారత్‌లోనే బాగా ఆడతాడని ఆదివారం ఆట అనంతరం జరిగిన ప్రెస్మీట్లో విమర్శించాడు. ఇది చివరి రోజు తను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మాటల యుద్ధానికి తెర తీసింది. భారత ఫీల్డర్లు అండర్సన్ చుట్టూ చేరి ఏదో అనడం కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన అంపైర్లు అశ్విన్ , జడేజాలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అండర్సన్ కామెంట్స్ తనకు తెలీదని కెప్టెన్ కోహ్లి అన్నాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 400; భారత్ తొలి ఇన్నింగ్స్: 631 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: కుక్ ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 18; జెన్నింగ్స్ ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 0; రూట్ ఎల్బీడబ్ల్యూ (బి) జయంత్ యాదవ్ 77; మొయిన్ అలీ (సి) విజయ్ (బి) జడేజా 0; బెయిర్‌స్టో ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 51; స్టోక్స్ (సి) విజయ్ (బి) అశ్విన్ 18; బాల్ (సి) పార్థీవ్ పటేల్ (బి) అశ్విన్ 2; బట్లర్ నాటౌట్ 6; వోక్స్ (బి) అశ్విన్ 0; అదిల్ రషీద్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 2; అండర్సన్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (55.3 ఓవర్లలో ఆలౌట్) 195. వికెట్ల పతనం: 1–1, 2–43, 3–49, 4–141, 5–180, 6–182, 7–185, 8–189, 9–193, 10–195. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–11–1; ఉమేశ్ 3–0–10–0, జడేజా 22–3–63–2, అశ్విన్ 20.3–3–55–6, జయంత్ యాదవ్ 6–0–39–1. 1 పర్యాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసినా ఓడడం భారత్‌లో ఇదే తొలిసారి. ప్రపంచ క్రికెట్లో ఇంగ్లండ్ రెండుసార్లు, శ్రీలంక ఒక సారి ఇలా ఇన్నింగ్స్ ఓటమిని పొందాయి. 7 మ్యాచ్‌లో పది వికెట్లకు పైగా తీయడం అశ్విన్ కు ఇది ఏడోసారి. భారత్ నుంచి కుంబ్లే (8) టాప్‌లో ఉన్నాడు. 17 స్వదేశంలో భారత్ వరుసగా 17 టెస్టుల్లో ఓటమి లేకుండా సాగుతోంది. 1980ల్లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో జట్టు సాధించిన ఫీట్‌ను సమం చేసింది. 27 ఇప్పటిదాకా ఈ సిరీస్‌లో అశ్విన్ తీసిన వికెట్లు. 5 భారత జట్టు వరుసగా ఐదో సిరీస్‌ను సొంతం చేసుకొని తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. 2008–2010 మధ్యలో కూడా భారత్ ఐదు సిరీస్‌లు నెగ్గింది. ఈ విజయం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఐదు సిరీస్‌లలో ఇదే మధురమైన విజయం. నేను వాస్తవిక ధోరణిలో ఉంటాను. ఇతరుల టెక్నిక్, బలహీనతల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎవరికి వారు అర్థం చేసుకుని దానిపై కృషి చేయాలి. నా దృష్టి అంతా మంచి క్రికెట్‌పైనే ఉంటుంది. వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించను. అండర్సన్ వ్యాఖ్యల గురించి నాకు తెలీదు. మైదానంలో అశ్వినే నాతో చెప్పాడు. వెంటనే నవ్వాను. అయితే అశ్విన్ అతడితో వాగ్వాదానికి దిగితే నేనే వెళ్లి సర్దిచెప్పాను. పరిస్థితిని శాంతింపజేయడం నాకు ఇదే తొలిసారి. –విరాట్ కోహ్లి (భారత కెప్టెన్) మేం చాలా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. దీంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ వికెట్‌పై 400 పరుగులు మంచి స్కోరు. మొయిన్అలీ, రషీద్‌లను తక్కువ చేసినట్టు కాదు గానీ మా జట్టులో 2012లో స్వాన్, పనేసర్లాంటి అత్యుత్తమ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. ఈ పిచ్‌లపై అలాంటి బౌలర్లే కావాలి. ఇక్కడి మైదానాల్లో భారత్‌ను ఓడించాలంటే ఉత్తమ స్థాయిలో ఆడాల్సిందే. అదే మాలో లోపించింది. చక్కటి లెంగ్త్‌తో అశ్విన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిజంగా ఇక్కడి పిచ్‌లపై అతడిని ఎదుర్కోవడం కష్టమే. ఇక జో రూట్‌కు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి –అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్ కెప్టెన్) -
అంపైర్ రీఫెల్‌కు గాయం
ముంబై టెస్టులో ఒక దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ గాయపడ్డాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స 49వ ఓవర్లో స్క్వేర్ లెగ్ దిశగా జెన్నింగ్‌స ఆడిన బంతిని బౌండరీకి ముందు భువనేశ్వర్ ఆపాడు. దానిని అతను పుజారా వైపు వెనక్కి విసిరాడు. అరుుతే భువీ విసిరిన త్రో నెమ్మదిగా రావడంతో పుజారాకంటే ముందే లెగ్ అంపైర్ స్థానంలో ఉన్న రీఫెల్‌కు బంతి తగిలింది. మైదానంలో కూలిపోరుున రీఫెల్‌కు ఇంగ్లండ్ వైద్య సిబ్బంది వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. రీఫెల్ స్థానంలో మూడో అంపైర్ ఎరాస్మస్ విధులు నిర్వర్తించారు.