PC: (Disney + Hotstar)
Ind Vs Nz Mumbai Test: Ajaz Patel Bowled Ashwin Signaling For Review Video Viral: టీమిండియా- న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ సంచలన రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి.. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు ఒకప్పటి ఈ ముంబై కుర్రాడు. ఈ క్రమంలో వాంఖడే స్టేడియం మొత్తం నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని అభినందించింది. ఇక ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను అజాజ్ క్లీన్‌బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే.
అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో గందరగోళానికి గురైన అశూ.. తాను బౌల్డ్ అయిన విషయాన్ని గమనించకుండా రివ్యూ కోరడం విశేషం. ఆ తర్వాత తప్పు తెలుసుకుని పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి.
‘‘ఏంటి అశ్విన్ బౌల్డ్ అయ్యావు కదా.. మరి ఇదేంటి? క్లీన్‌బౌల్డ్‌కు రివ్యూ కోరి చరిత్ర సృష్టించావు పో’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సైతం.. ‘‘బౌల్డ్ అయిన తర్వాత కూడా అశ్విన్ రివ్యూకు వెళ్లి ఉంటే ఇండియా రివ్యూ అవకాశం కోల్పోయి ఉండేది’’ అని ట్వీట్ చేశాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్ల విజృంభణతో కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ మూడు, అశ్విన్ 4, అక్షర్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
చదవండి: Sourav Ganguly: నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం.. ‘కోహ్లి సేన’పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!
Ashwin trying to review a clean bowled. LoL. #ashwin #AllRounder #INDvzNZ #Ashwin #BCCI #ViratKohli pic.twitter.com/2YNMMepErC
— Reshebh Pent🇮🇳 (@reshebpent17) December 4, 2021
Who reviews a clean bowled.
— Mirchi RJ Vijdan (@rj_vijdan) December 4, 2021
Ravi Ashwin 😂 pic.twitter.com/KbxJBVOyIk
Ashwin makes history by taking a review after getting clean bowled.... pic.twitter.com/drtG5JPJAE
— Katherine (@jawairiasyed) December 4, 2021
Comments
Please login to add a commentAdd a comment