Ind vs Nz Test Series: Virat Kohli On Criticism Of Ajinkya Rahane Can Not Judge: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో తొలి టెస్టుకు సారథిగా వ్యవహరించిన రహానే.. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 39(35, 4) పరుగులు మాత్రమే చేశాడు. కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డాడు. ఈ క్రమంలో రహానేపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ అయినందు వల్లే ఇంకా జట్టులో కొనసాగుతున్నాడని.. లేదంటే అతడికి అవకాశం దక్కేది కాదంటూ ట్రోల్స్ చేశారు.
ఈ క్రమంలో రెండో టెస్టుకు కోహ్లి అందుబాటులోకి రావడం.. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో తొలి టెస్టులో తన మార్కు చూపించడం తదితర పరిణామాల నేపథ్యంలో రహానే జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక రెండో టెస్టులో అదరగొట్టిన కోహ్లి సేన అద్భుత విజయం సాధించి సిరీస్‌ను గెలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడుతూ రహానే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘రహానే ఫామ్ గురించి జడ్జ్ చేయలేను. నేనే కాదు ఎవరూ ఆ పని చేయలేరు. తమ లోపాలేమిటి? వాటిని ఎలా అధిగమించాలన్న అంశంపై సదరు ఆటగాడు దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే, కీలక మ్యాచ్‌లలో తమదైన అద్భుత ప్రదర్శనతో ప్రభావం చూపగలరో అలాంటి ఆటగాళ్లకు కష్టకాలంలో మద్దతుగా నిలబడాల్సి ఉంటుంది’’ అని రహానేకు అండగా నిలిచాడు.
అదే విధంగా.. ‘‘ఒక వ్యక్తిపై ఒత్తిడి ఉన్నపుడు... పదే పదే అతడి ఫామ్ గురించి మాట్లాడుతూ... తర్వాత ఏంటి? అంటూ గుచ్చిగుచ్చి మాట్లాడేవాళ్లను ఒక జట్టుగా మేము అస్సలు సహించబోము. బయట కొంతమంది తమకు ఇష్టమైన ఆటగాళ్లకు ఇప్పుడు మద్దతు పలికి.. ఆ తర్వాత వాళ్లను కూడా జట్టులో తీసేయాలంటూ మాట్లాడతారు.
అలాంటి వాళ్ల విమర్శలపై మేము అస్సలు స్పందించము. ఆటను ఆటలాగే చూస్తాం. అజింక్య రహానే.. లేదంటే ఇంకో ఆటగాడు.. ఎవరికైనా సరే మా మద్దతు ఇలాగే ఉంటుంది. బయట ఉన్న పరిస్థితుల ప్రభావం ఆధారంగా జట్టులో ఓ సభ్యుడిని కొనసాగించాలా.. పక్కకు పెట్టాలా అన్న నిర్ణయం తీసుకోము’’ అని కోహ్లి ట్రోల్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
🗣️ 🗣️ The mindset is to take Indian cricket forward and stay at the top: #TeamIndia Captain @imVkohli #INDvNZ @Paytm pic.twitter.com/NWrxTih29K
— BCCI (@BCCI) December 6, 2021
CHAMPIONS 👏👏
This is #TeamIndia's 14th consecutive Test series win at home.#INDvNZ @Paytm pic.twitter.com/FtKIKVCzt8
— BCCI (@BCCI) December 6, 2021
చదవండి: Ravichandran Ashwin: టెస్టుల్లో అశ్విన్ అరుదైన రికార్డు.. కుంబ్లేను దాటేశాడుగా..
Comments
Please login to add a commentAdd a comment