Ind Vs Nz 2nd Test: Virat Kohli Returns India Train Indoors Mumbai Photos - Sakshi
Sakshi News home page

Ind Vs Nz 2nd Test: రెండో టెస్టుకు సిద్ధమవుతున్న టీమిండియా.. ఫొటోలు

Published Thu, Dec 2 2021 5:10 PM | Last Updated on Sat, Dec 4 2021 3:06 PM

Ind Vs Nz 2nd Test: Virat Kohli Returns India Train Indoors Mumbai Photos - Sakshi

Ind Vs Nz 2nd Test: Virat Kohli Returns India Train Indoors Mumbai Photos: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జట్టుతో చేరడంతో రెట్టించిన ఉత్సాహంతో కివీస్‌తో పోరు సన్నద్ధమవుతోంది. 

అయితే, ముంబైలో అకాల వర్షాల వల్ల భారత్‌- కివీస్‌ జట్ల ప్రాక్టీసు రద్దైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అనుమతితో భారత ఆటగాళ్లు ఇండోర్‌(లోపలే)లో ప్రాక్టీసు​ చేస్తున్నారు.

 ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో కెప్టెన్‌ కోహ్లి.. శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, రహానే ప్రాక్టీసు చేయడం కనిపించింది. 

ఇక ఇషాంత్‌ శర్మ తొలి టెస్టులో విఫలమైన నేపథ్యంలో సిరాజ్‌ను రెండో టెస్టులో ఆడిస్తారన్న విశ్లేషణల నేపథ్యంలో అతడు బంతితో ప్రాక్టీసు చేయడం గమనార్హం. కాగా కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలనున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement