Ind Vs Sa 1st Test:
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, అజింక్యా రహానే 40 పరుగులతో ఆడుతున్నారు. ఇక తొలిరోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపెట్టింది. దాదాపు మూడు సెషన్లలోనూ టీమిండియాదే పైచేయి అయింది. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ సెంచరీతో మెరవగా.. మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించగా.. కోహ్లి 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రొటీస్ బౌలర్లలో లుంగీ ఎన్గిడి 3 వికెట్లు తీశాడు.
8:05 PM: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో మెరిశాడు. 219 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 78 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రహానే 25 పరుగులతో రాహుల్‌కు సహకరిస్తున్నాడు.
7:24 PM: విరాట్ కోహ్లి(35) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 69 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది ఓపెనర్ కేఎల్ రాహుల్ 90 పరుగులతో సెంచరీకి దగ్గరవ్వగా.. రహానే పరుగులతో క్రీజులో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్, పుజారాలు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, రాహుల్‌లు కలిసి మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.
6:22 PM: టీ విరామ సమయానికి టీమిండియా 57 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో, కోహ్లి 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
5: 45 Pm: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థశతకంతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. రాహుల్ 58, కోహ్లి 12 పరుగులతో ఆడుతున్నారు.
5: 26 Pm: టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఎన్గిడి బౌలింగ్‌లో పుజారా గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. అంతకముందు మయాంక్ అగర్వాల్(60) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 40 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.
4: 26 PM: మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీ.. భారత్ స్కోరు: 98.
3:30 PM: తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు. మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీకి చేరువకాగా... కేఎల్ రాహుల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయడంతో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 83 పరుగులు చేసింది.
2:45 PM: 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 44/0. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 16 పరుగులు, మయాంక్ అగర్వాల్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.
2:20 PM: 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 38/0. కేఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్(26) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 8/0. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆదివారం ఆరంభమైంది. తొలి టెస్టులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లికి, హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు విదేశంలో ఇదే తొలి సిరీస్ కావడంతో ఈ సిరీస్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇంతవరకు సఫారీ గడ్డపై భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదన్న అప్రదిష్టను తొలగించి చరిత్ర సృష్టించాలని ఈ ద్వయం భావిస్తోంది.
ఈ క్రమంలో ఫామ్‌లో లేనప్పటికీ, విదేశాల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అనుభవజ్ఞుడైన అజింక్య రహానే వైపే మొగ్గు చూపడం గమనార్హం. తుది జట్టులో అతడికి చోటు కల్పించారు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టారు. ఇషాంత్ శర్మ కాకుండా హైదరాబాదీ పేసర్ సిరాజ్‌కు అవకాశం ఇచ్చారు.
Updates:
1:50 PM:
ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: IND 8/0.
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.
1: 05PM: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
తుదిజట్లు:
భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా:
డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వియాన్ మల్దర్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.
Comments
Please login to add a commentAdd a comment