సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. 2018లో చివరిసారి దక్షిణాఫ్రికాలో పర్యటించిన టీమిండియా ఆ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. తాజాగా కోహ్లి సారధ్యంలోని టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడడానికి మరోసారి సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే రోజున తొలి టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: టీమిండియా మాజీ కోచ్‌పై రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లి- కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. తుది జట్టులో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీయాలనేదానిపై వారిద్దరికి సమస్యగా మారనుంది. ఫామ్‌లో లేకపోయినప్పటికి రహానేకు బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. అయితే ఇదే రహానే 2018లో సౌతాఫ్రికా పర్యటనలో విశేషంగా రాణించాడు. జోహెన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రహానే కీలకపాత్ర పోషించాడు. అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రహానే మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో వైస్‌కెప్టెన్సీ పదవి కూడా పోగొట్టుకున్న రహానే సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికవ్వడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.
ఇక రహానే గత 12 టెస్టుల్లో 411 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సమయంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అయ్యర్ కివీస్‌తో సిరీస్‌లో సెంచరీ, అర్థసెంచరీతో రాణించి సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికయ్యాడు. ఇక ఇటీవలే ఇండియా- ఏ తరపున సౌతాఫ్రికా గడ్డపై ఆడిన హనుమ విహారి ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు అర్థసెంచరీలు సాధించి తుది జట్టు ఎంపికలో తాను ఉన్నట్లు స్పష్టం చేశాడు.
చదవండి: Ashes 2021: 'ఆస్ట్రేలియన్ కామెంటేటర్లకు పిచ్చి పట్టింది'
Comments
Please login to add a commentAdd a comment