PC: (Disney + Hotstar)
IND vs NZ 2nd Test: Mohammed Siraj Peach of a Delivery to Get Ross Taylor Bowled in Mumbai Test: ముంబై టెస్టుతో జట్టులోకి వచ్చిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆదిలోనే వరుసగా మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి టెస్టులో రాణించిన కివీస్ ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్‌ను పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆ తర్వాత అద్భుతమైన బంతితో రాస్ టేలర్‌ను బౌల్డ్ చేశాడు.
ఆరో ఓవర్ తొలి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపాడు. చక్కని లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రాస్ టేలర్‌కు ఊహించని షాకిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘వరుసగా 3 వికెట్లు... సూపర్ సిరాజ్.. నీ దెబ్బకు రాస్ టేలర్‌కు దిమ్మతిరిగింది..
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు... నిన్ను నీవు నిరూపించుకున్నావు’’ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రెండో టెస్టు రెండో ఆటలో భాగంగా భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. సిరాజ్(3), అశ్విన్(4) చెలరేగడంతో కివీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో 62 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్‌కు రెండు, జయంత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి.
చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే
That's Ripper from Mohammad Siraj 💥💥#INDvzNZ pic.twitter.com/ja5vkgMbka
— Diwakar¹⁸ (@diwakarkumar47) December 4, 2021
Comments
Please login to add a commentAdd a comment