Ajaz Patel: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో మాయంక్ అగర్వాల్, అజాజ్ పటేల్‌లతో పాటు ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. అజాజ్‌నే అవార్డు వరించింది.
గతేడాది డిసెంబర్‌లో ముంబై వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల పడగొట్టిన అజాజ్.. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్‌లో మొత్తం 14 వికెట్లు తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. తన జన్మస్థలమైన ముంబైలో అరుదైన ఫీట్‌ను సాధించాడు.
కాగా, అవార్డు ప్రకటన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ కమిటీ మెంబర్ జేపీ డుమిని మాట్లాడుతూ.. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే 10 వికెట్ల ఫీట్‌ను అందుకున్న అజాజ్‌కు ఐసీసీ జ్యూరీతో పాటు అభిమానులు భారీ ఎత్తున ఓటింగ్ చేశారని, మరి ముఖ్యంగా భారత అభిమానులు అజాజ్ పటేల్‌కు భారీ ఎత్తున మద్దతు తెలిపారని పేర్కొన్నాడు. అజాజ్ సాధించిన ఫీట్ చాలా ప్రత్యేకమైందని, చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోతుందని డుమిని అన్నాడు.
చదవండి: NZ Vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు
Comments
Please login to add a commentAdd a comment