New Zealand spinner
-
టీమిండియా ఓపెనర్‌కు నిరాశ.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న న్యూజిలాండ్ స్పిన్నర్
Ajaz Patel: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో మాయంక్ అగర్వాల్, అజాజ్ పటేల్‌లతో పాటు ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. అజాజ్‌నే అవార్డు వరించింది. గతేడాది డిసెంబర్లో ముంబై వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల పడగొట్టిన అజాజ్.. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్‌లో మొత్తం 14 వికెట్లు తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. తన జన్మస్థలమైన ముంబైలో అరుదైన ఫీట్‌ను సాధించాడు. కాగా, అవార్డు ప్రకటన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ కమిటీ మెంబర్ జేపీ డుమిని మాట్లాడుతూ.. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే 10 వికెట్ల ఫీట్‌ను అందుకున్న అజాజ్‌కు ఐసీసీ జ్యూరీతో పాటు అభిమానులు భారీ ఎత్తున ఓటింగ్ చేశారని, మరి ముఖ్యంగా భారత అభిమానులు అజాజ్ పటేల్‌కు భారీ ఎత్తున మద్దతు తెలిపారని పేర్కొన్నాడు. అజాజ్ సాధించిన ఫీట్ చాలా ప్రత్యేకమైందని, చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోతుందని డుమిని అన్నాడు. చదవండి: NZ Vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు -
అవకాశం రావాలే కాని.. ఐపీఎల్‌పై మనసులో మాటను బయటపెట్టిన అజాజ్ పటేల్
Would Love To Play In Indian Premier League Says Ajaz Patel: టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో పదికి పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ తాజా సంచలనం అజాజ్ పటేల్ క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తన మనసులోని మాటను బయటపెట్టాడు. అవకాశం రావాలే కాని ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని అస్సలు వదులుకోలేనని తెలిపాడు. భారత్ వేదికగా జరిగే ఐపీఎల్లో ఆడడం చాలా గొప్ప అనుభూతి అని, అలాంటి థ్రిల్లింగ్ లీగ్‌లో పాల్గొనే అవకాశం కోసం ప్రతి క్రికెటర్ ఎదురుచూస్తాడని పేర్కొన్నాడు. ప్రతి ఐపీఎల్ సీజన్‌ను మిస్ కాకుండా అనుసరించానని, వచ్చే ఏడాది జరగబోయే మెగా లీగ్‌లో ఆడే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఐపీఎల్‌పై తన క్రష్‌ను బహిర్గతం చేశాడు. కాగా, ముంబై వేదికగా భారత్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు నేలకూల్చిన అజాజ్.. రాత్రికిరాత్రి హీరోగా మారిపోయాడు. క్రికెట్ చరిత్రలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత ఈ అత్యంత అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. అజాజ్ అద్భుతమైన ప్రతిభ చూపినప్పటికీ ఆ మ్యాచ్‌లో కివీస్ 372 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడం విశేషం. చదవండి: జనవరి 11, 2022.. ఆ రోజు కోహ్లికి చిరకాలం గుర్తుండిపోనుంది.. ఎందుకంటే..? -
మళ్లీ టెస్టుల్లోకి వెటోరీ
వెల్లింగ్టన్: ఇక క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని అనుకుంటున్న సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ వెటోరీ అనూహ్యంగా టెస్టు జట్టులోకి వచ్చాడు. రెండేళ్లుగా టెస్టులకు దూరంగా ఉంటూ కేవలం వన్డేలు, టి20లు ఆడుతున్న వెటోరీని... పాకిస్థాన్‌తో బుధవారం జరగనున్న మూడో టెస్టు కోసం న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉండాలని భావించిన సెలక్టర్లు... యూఏఈలోనే న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో ఉన్న వెటోరీని పిలిపించింది. ఈ మ్యాచ్ ఆడితే న్యూజిలాండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన పెద్ద వయస్కుడిగా 35 ఏళ్ల వెటోరీ రికార్డు సృష్టిస్తాడు.