అవకాశం రావాలే కాని.. ఐపీఎల్‌పై మనసులో మాటను బయటపెట్టిన అజాజ్‌ పటేల్‌ | Would Love To Play In Indian Premier League Says Ajaz Patel | Sakshi
Sakshi News home page

Ajaz Patel: ఐపీఎల్‌పై మనసులో మాటను బయటపెట్టిన కివీస్‌ సంచలన స్పిన్నర్‌

Dec 7 2021 9:30 PM | Updated on Dec 8 2021 7:36 AM

Would Love To Play In Indian Premier League Says Ajaz Patel - Sakshi

Would Love To Play In Indian Premier League Says Ajaz Patel: టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో పదికి పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ తాజా సంచలనం అజాజ్ పటేల్ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)పై తన మనసులోని మాటను బయటపెట్టాడు. అవకాశం రావాలే కాని ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని అస్సలు వదులుకోలేనని తెలిపాడు. భారత్‌ వేదికగా జరిగే ఐపీఎల్‌లో ఆడడం చాలా గొప్ప అనుభూతి అని, అలాంటి థ్రిల్లింగ్‌ లీగ్‌లో పాల్గొనే అవకాశం కోసం ప్రతి క్రికెటర్‌ ఎదురుచూస్తాడని పేర్కొన్నాడు. 

ప్రతి ఐపీఎల్‌ సీజన్‌ను మిస్‌ కాకుండా అనుసరించానని, వచ్చే ఏడాది జరగబోయే మెగా లీగ్‌లో ఆడే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఐపీఎల్‌పై తన క్రష్‌ను బహిర్గతం చేశాడు. కాగా, ముంబై వేదికగా భారత్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు నేలకూల్చిన అజాజ్.. రాత్రికిరాత్రి హీరోగా మారిపోయాడు. క్రికెట్‌ చరిత్రలో జిమ్‌ లేకర్‌, అనిల్‌ కుంబ్లే తర్వాత ఈ అత్యంత అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. అజాజ్ అద్భుతమైన ప్రతిభ చూపినప్పటికీ ఆ మ్యాచ్‌లో కివీస్ 372 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడం విశేషం.
చదవండి: జనవరి 11, 2022.. ఆ రోజు కోహ్లికి చిరకాలం గుర్తుండిపోనుంది.. ఎందుకంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement