Ind Vs Nz 2nd Test: India Biggest Victory New Zealand Biggest Defeat By Runs: స్వదేశంలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసినా.. మలి టెస్టులో ఏకంగా 372 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో భారత జట్టు ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది.
అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టుపై టీమిండియా సాధించిన గెలుపు ఇదే కావడం విశేషం. అంతకుముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై కూడా భారత్ ఇదే తరహాలో భారీ తేడాతో (పరుగుల పరంగా) విజయం సాధించినప్పటికీ.. వాటికంటే ఇదే బిగ్గెస్ట్ విక్టరీ. అదే సమయంలో న్యూజిలాండ్ మాత్రం ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
టీమిండియా అతిపెద్ద విజయాలు(పరుగుల పరంగా)
►372-న్యూజిలాండ్‌పై- ముంబై- 2021
►337- దక్షిణాఫ్రికాపై-ఢిల్లీ-2015
►321- న్యూజిలాండ్‌పై- ఇండోర్- 2016
►320-ఆస్ట్రేలియాపై-మొహాలీ- 2008.
టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో ఓటమిపాలైన కివీస్ ఓ చెత్త రికార్డు నమోదు చేసింది.
భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి చెందిన సందర్భాలు(పరుగుల పరంగా)
►372 పరుగులు- ఇండియా చేతిలో- ముంబై- 2021
►358 పరుగులు- దక్షిణాఫ్రికా- జొహెన్నస్‌బర్గ్- 2007
►321 పరుగులు- ఇండియా-ఇండోర్- 2016
►299 పరుగులు- పాకిస్తాన్- ఆక్లాండ్-2001
చదవండి: Ind Vs Nz: అక్షర్.. పటేల్.. రవీంద్ర.. జడేజా.. ఫొటో అదిరింది! ఇదేదో సర్ఫ్ యాడ్‌లా ఉందే!
Ravichandran Ashwin: టెస్టుల్లో అశ్విన్ అరుదైన రికార్డు.. కుంబ్లేను దాటేశాడుగా..
Comments
Please login to add a commentAdd a comment