భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం,మాజీ విజేత జర్మనీ జట్ల మధ్య మంగళవారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పూల్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం ఓటమి అంచున నిలిచింది. అయితే ఆఖరి క్వార్టర్లో వెగ్నేజ్ (54వ ని.లో) చేసిన గోల్‌తో ‘డ్రా’తో బయటపడింది. అంతకుముందు జర్మనీ జట్టులో వెలెన్ నిక్లస్ (22వ ని.లో), టామ్ గ్రామ్‌బుష్ (52వ ని.లో) చెరో గోల్ చేయగా, సెడ్రిక్ చార్లియర్ 9వ నిమిషంలోనే బెల్జియంకు తొలి గోల్ అందించాడు.
ఈ నెల 20న జరిగే ఆఖరి లీగ్‌తో క్వార్టర్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో బెల్జియం, దక్షిణ కొరియాతో జర్మనీ తలపడతాయి. ఈ పూల్ లో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో జపాన్‌పై గెలిచింది. కొరియా తరఫున లీ జంగ్ జన్ (8వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. జపాన్ జట్టులో నగయొషి (1వ ని.లో) గోల్ సాధించాడు. అయితే జపాన్ 11 మందితో కాకుండా 12 మందితో ఆడటం వివాదం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment