సోనూ సూద్‌ని సాయం కోరిన బ్రహ్మాజీ | Actor Brahmaji Ask Sonu Sood Please Take Me Croatia | Sakshi
Sakshi News home page

సోనూ సూద్‌ని సాయం కోరిన నటుడు బ్రహ్మాజీ

Published Fri, Aug 21 2020 1:06 PM | Last Updated on Fri, Aug 21 2020 1:26 PM

Actor Brahmaji Ask Sonu Sood Please Take Me Croatia - Sakshi

సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్స్‌ పోషించినప్పటికి దాతృత్వంతో రియల్‌‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సోనూ సూద్‌. లాక్‌డౌన్‌లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చడంతో ప్రారంభించిన సోనూ సూద్‌ సహాయక సేవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కష్టం అంటూ తన దృష్టికి వచ్చిన వారందరికి సాయం చేస్తున్నారు సోనూ సూద్‌. అయితే అప్పుడప్పుడు కొందరు తనని ఆటపట్టించడం కోసం వింత వింత కోరికలు కోరుతున్న సంఘటనలు కొన్ని చూశాం. తాజాగా అలాంటి ఫన్ని రిక్వెస్ట్‌ ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఈ విన్నపం‌ చేసిన వ్యక్తి కూడా ఓ ప్రముఖ నటుడు కావడంతో ఈ ట్వీట్‌ వైరలవుతోంది. (సోనూ సూద్‌ సేవ: కొత్త దేశం.. కొత్త మిషన్‌)

వివరాలు.. బ్రహ్మాజీ ట్విట్టర్‌ వేదికగా సోనూ సూద్‌ని ఓ కోరిక కోరారు. ఇంట్లో ఉండి డిప్రెషన్‌కు గురయ్యాను. నన్ను క్రొయేషియా పంపించు సోనూ భాయ్‌ అంటూ రిక్వెస్ట్‌ చేశారు బ్రహ్మాజీ. ‘డియర్‌ సూపర్‌మ్యాన్‌ సోనూ భాయ్‌.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. మెంటల్‌గా లాక్‌డౌన్‌ అయ్యాను. హైదరాబాద్‌లో చిక్కుకుపోయాను. ప్లీజ్‌ నన్ను ఇక్కడకు తీసుకెళ్లు. క్రొయేషియా’ అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక సోనూ సూద్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement