‘హిందూ-ముస్లిం లొల్లి.. ఆ జట్టును చూసి నేర్చుకోండి’ | Harbhajan Singh Says Stop Playing Hindu Muslim Learn From Croatia | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 16 2018 11:48 AM | Last Updated on Mon, Jul 16 2018 1:19 PM

Harbhajan Singh Says Stop Playing Hindu Muslim Learn From Croatia - Sakshi

హర్భజన్‌ సింగ్‌

హైదరాబాద్‌ : దేశంలో నెలకొన్న హిందూ-ముస్లిం గొడవల పట్ల టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ గొడవలను పక్కన పెట్టి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఫ్రాన్స్‌-క్రొయేషియా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు బజ్జీ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశాడు.

‘కేవలం 50 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతోంది. కానీ 135 కోట్ల జనాభా గల మన దేశంలో మాత్రం హిందూ-ముస్లింలు అనుకుంటూ గొడవపడుతున్నాం’ అని ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇక ఫిఫా తుది సమరంలో సంచలనాల క్రొయేషియా పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement