మాస్కో: క్రొయేషియా ఫ్వార్వర్డ్ నికొలా కలినిచ్ ప్రపంచకప్ నుంచి ఇంటికొచ్చేస్తున్నాడట. దీనికి కారణం అతను నైజీరియాతో మ్యాచ్‌తో ఆడడటానికి నిరాకరించడమే! నైజీరియాతో మ్యాచ్‌లో రెండో అర్ధభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లాల్సిందిగా కోచ్ జ్లాకో డాలిచ్ నికొలాను కోరాడు. అయితే తాను ఆడలేనని అతను చెప్పడంతో స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా డాలిచ్ ఆదేశించాడట. అయితే కలినిచ్ ఇంటికి వెళ్లే విషయాన్ని క్రొయేషియా ఫుట్‌బాల్ సంఘం అధికారికంగా ధ్రువీకరించలేదు. తొలి మ్యాచ్‌లో క్రొయేషియా 2-0తో నైజీరియాపై గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్ ఇటలీ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు ఏసీ మిలాన్ తరపున 41 మ్యాచ్‌లు ఆడిన నికోలా ఆరు గోల్స్ చేశాడు. కాగా, ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగో అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయిన నికొలా.. తనకు వెన్ను గాయంతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆ క‍్రమంలోనే ఆదేశాలు పాటించని నికోలా.. కోచ్ ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment