డ్యాన్స్ చేస్తున్న మార్తా
మాడ్రిడ్ : మనసు పెట్టి నేర్చుకున్న కొన్ని కళలు మనం మట్టిలో కలిసిపోయేంత వరకు మన ఆలోచనల్లో భాగంగానే ఉండిపోతాయి. ముసలి తనం వచ్చినా.. వ్యాధులు వేధిస్తున్నా.. అసలు ఏ పరిస్థితులో ఉన్నా వాటి సంగతులు గుర్తొచ్చినా.. ఎవరైనా గుర్తు చేసినా మనల్ని మనం మర్చిపోతాము. స్పెయిన్‌కు చెందిన ఓ బామ్మ ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. వాలెంన్సియాకు చెందిన మార్తా సీ గౌంజలెజ్ అనే బామ్మ యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఎంతో ఇష్టపడి ప్రిమా బాల్లెరినా డ్యాన్స్‌ను నేర్చుకుంది. ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అయితే వృద్ధాప్యంలో ఉండగా ఆమె అల్జీమర్స్ బారిన పడింది. కొద్దికొద్దిగా అన్ని జ్ఞాపకాలను మెదడు చెరిపేసుకుంటూ పోతోంది. (ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’)
2019లో వీల్ ఛైర్‌కు పరిమితమైన ఆమెకు మనవడు ప్రిమా బాల్లెరినా డ్యాన్స్‌కు సంబంధించిన ఓ పాటను వినిపించాడు. వెంటనే ఆమె చేతులు అసంకల్పింతా వంపులు తిరిగాయి. ఆ వెంటనే ఓపిక లేదన్నట్లు తనను తాను నిగ్రహించుకుంది. మనవడి కోరిక మేరకు వీల్‌ఛైర్‌లోనే ఎంతో అందంగా డ్యాన్స్ చేసింది. అయితే ఆ సంవత్సరమే ఆమె మృత్యువాత పడటం బాధాకరం. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( పానీపూరీ.. ఇక నో పరేషాన్!)
Comments
Please login to add a commentAdd a comment