లండన్: ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖరీదైన నగరంగా(జీవించడానికి, పనిచేయడానికి) ముంబై నిలిచింది. ఇక అత్యంత ఖరీదైన నగరంగా హాంగ్‌కాంగ్‌ను తోసిరాజని లండన్ మొదటి స్థానంలోకి దూసుకువచ్చిందని ఇంగ్లండ్‌కు చెందిన రియల్టీ సంస్థ శావిల్స్ నివేదిక పేర్కొంది. అద్దెలు, జీవించడానికి, పనిచేయడానికి లండన్ అత్యంత ఖరీదైనదంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని
ముఖ్యాంశాలు...,
కంపెనీలు ఒక్కో ఉద్యోగికి చేసే వార్షిక వ్యయం లండన్‌లో 1,20,568 డాలర్లుగా ఉంది. అదే ముంబైలో అయితే ఇది 29,742 డాలర్లు. 12 నగరాలతో రూపొందిన ఈ అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబైది చివరి స్థానం.
లండన్ తర్వాత 1,15,717 డాలర్ల వార్షిక ఉద్యోగ వ్యయంతో హాంకాంగ్ రెండో అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూ యార్క్(1,07,782 డాలర్లు), ప్యారిస్(1,05,550 డాలర్లు)లు నిలిచాయి.
63,630 డాలర్లు వార్షిక ఉద్యోగ వ్యయంతో ఆస్ట్రేలి యాకు చెందిన సిడ్నీ అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 43,171 డాలర్లతో షాంఘై 10వ స్థానంలో, 32,179 డాల ర్లతో రియోడీజెనీరో 11వ స్థానంలో నిలిచాయి.
2008లో ఐదో స్థానంలో ఉన్న లండన్ ఈ ఏడాది మొదటి స్థానంలోకి వచ్చింది. అయితే 2011లో హాంకాంగ్ 1,28,000 డాలర్లతో అత్యంత ఖరీదైన నగరంగా అవతరించింది. ఈ ఏడాది మొదటి స్థానంలోకి వచ్చినప్పటికీ లండన్ 2011 నాటి హాంకాంగ్ స్థాయిని అందుకోలేకపోయింది.
ఇక రెసిడెన్షియల్ ప్రోపర్టీ విషయానికొస్తే ఇప్పటికీ హాంకాంగ్‌దే పై చేయి. లండన్‌తో పోల్చితే హాంకాంగ్‌లో నివాస ప్రాపర్టీ ధరలు 40% అధికం.
ప్రపంచంలో అతి తక్కువ ఖరీదైన నగరం.. ముంబై
Published Thu, Sep 25 2014 12:52 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM
Advertisement