ఫోన్‌లో మునిగి.. పట్టాలపై పడి.. | Woman falls onto subway tracks while checking her phone | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో మునిగి.. పట్టాలపై పడి..

Published Sat, Nov 2 2019 8:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపంచాన్ని మరిచిపోతాం అనేందుకు తాజా ఉదాహరణ ఇది. స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం కూర్చున్న ఓ యువతి స్మార్ట్‌ఫోన్‌లో మునిగితేలుతోంది. ఇంతలో రైలు స్టేషన్‌లోకి రావడంతో ఆ యువతి ముందుకు అడుగులు వేసింది. రైలు ఇంకా రాకమునుపే.. రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు పట్టాలపై పడిపోయింది. ప్రస్తుతం ఈ ఘటన  వీడియో వైరల్‌ అయింది. వీడియో ఆమె పట్టాలపై పడినంత వరకే ఉండటంతో తనకు ఏమైందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై అధికారులు ట్విటర్‌లో స్పందిస్తూ.. స్వల్ప గాయాలతో సదరు యువతి బయటపడినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement