
మాడ్రిడ్: పోర్చుగల్ కెప్టెన్, స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో... ఇకపై ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్‌కు ఆడనున్నాడు. గత తొమ్మిదేళ్లుగా అతడు స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు ఆడుతున్నాడు. కొత్త ఒప్పందం ప్రకారం రొనాల్డో నాలుగేళ్లపాటు యువెంటస్‌కు ఆడతాడు. సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున రొనాల్డోకు వేతనంగా లభిస్తాయని సమాచారం. ఒదిలీ ఒప్పందంలో భాగంగా యువెంటస్ క్లబ్ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్ మాడ్రిడ్‌కు చెలిస్తుందని స్పెయిన్ మీడియా వెల్లడించింది.
తాజా మార్పుపై రొనాల్డో స్పందిస్తూ... ‘మాడ్రిడ్‌కు ఆడిన సమయం నా జీవితంలో అత్యంత సంతోషకరమైనది. జట్టు, అభిమానులు, నగరానికి నా ధన్యవాదాలు. కొత్త అధ్యాయం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. అందుకే బదిలీకి అంగీకరించమని కోరా. మద్దతుదారులంతా అర్ధం చేసుకోగలరు’ అని పేర్కొన్నాడు. రొనాల్డో ప్రాతినిధ్యంలో... రియల్ మాడ్రిడ్ ఈ సీజన్‌లో చాంపియన్స్ లీగ్‌ను గెల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment