![Rafael Nadal expecting lengthy wait before tennis returns - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/17/nadal.jpg.webp?itok=RTi3twbJ)
రాఫెల్ నాదల్
మాడ్రిడ్: ప్రస్తుత పరిస్థితుల్లో టెన్నిస్ ఆట తిరిగి ఆరంభమవడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని 19 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. ‘టెన్నిస్ విశ్వ క్రీడ... ప్రపంచం నలుమూలలా టెన్నిస్ ఈవెంట్‌లు జరుగుతాయి. మేము టెన్నిస్ ఆడటానికి ఒక దేశం నుంచి మరో దేశానికి తరచూ ప్రయాణించాల్సి ఉం టుంది. కానీ ప్రస్తుతం అలా జరిగే అవకాశమే లేదు.’ అని నాదల్ వ్యాఖ్యానించాడు. ప్రేక్షకులు లేకుండా టెన్నిస్ ఈవెంట్‌లను నిర్వహించినా తాను ఆడటానికి సిద్ధమేనని అయితే దానికి కూడా కొంత సమయం వేచి చూడాల్సిందేనని నాదల్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment