రోమ్: జపాన్‌లో కరోనా వైరస్ ఇంకా నియంత్రణలోకి రాకపోవడంతో తాను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేది లేనిది ఇప్పుడే చెప్పలేనని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తెలిపాడు. ‘సాధారణ పరిస్థితుల్లో ఒలింపిక్స్ క్రీడలకు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాలేవు.
ఏడాదిన్నరకాలంగా కరోనా అందరినీ ఇబ్బంది పెడుతోంది. దాంతో ఏ టోర్నీలో ఆడాలన్న విషయంపై ముందుగానే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు’ అని 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో స్వర్ణం, 2016 రియో ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణం సాధించిన 35 ఏళ్ల నాదల్ అన్నాడు.
చదవండి: Tokyo Olympics: హిరోషిమా వీధుల్లో టార్చ్ రిలే రద్దు
Comments
Please login to add a commentAdd a comment