కిర్గిజిస్తాన్‌లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్‌ | Indian Give Advisory To Students In Kyrgyzstan To Stay Indoors Amid Reports Of Violence | Sakshi
Sakshi News home page

కిర్గిజిస్తాన్‌లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్‌

Published Sat, May 18 2024 11:13 AM | Last Updated on Sat, May 18 2024 12:04 PM

Indian give advisory to Students In Kyrgyzstan To Stay Indoors

ఢిల్లీ: కిర్గిజిస్తాన్‌ దేశంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడుల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ​కిర్గిజిస్తాన్‌ రాజధాని నగరం బిష్కెక్‌లో విదేశీ  విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీ విద్యార్థులు ఎవ్వరూ బయటకు రావద్దని అక్కడి భారతీయ ఎంబసీ ‘ఎక్స్‌’వేదికగా అడ్వైజరీ విడుదల చేసింది.

‘కిర్గిజిస్తాన్‌ బిష్కెక్‌లోని భారతీయ విద్యార్థులతో టచ్‌లో ఉన్నాం.  ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి కొం‍తమేరకు అదుపులోకి వచ్చింది. విద్యార్థులు ఎంబీసీ అధికారులతో  టచ్‌లో ఉండాలని సూచిస్తున్నాం. 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎదైనా సమస్య వస్తే.. 0555710041 నంబర్‌ను సంప్రదించండి’ అని పేర్కొంది.

విదేశీ విర్థులపై దాడుల నేపథ్యంలో  విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేశారు. ‘కిర్గిజిస్తాన్‌ బిష్కెక్‌లోని భారతీయ విద్యార్థుల పరిస్థితిని భారతీయ ఎంబీసీ ఎప్పటికప్పుడు కనుకుంటోంది. అక్కడి పరిస్థితి ప్రసుతం సద్దుమణిగింది.  విద్యార్థులు ఎవరూ బయటకు రావోద్దు’ అని  ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు.

మే 13న కిర్గిజిస్తాన్‌, ఈజిప్ట్‌ దేశాల విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.  దీంతో ఇక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది.  ఇక.. మెడికల్‌ యూనివర్సిటీ హాస్టల్‌ వద్ద చెలరేగిన విద్యార్థుల హింసలో పాకిస్తాన్‌ను చెందిన పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement