కర్ణాటక వెళ్తే గెర్సొప్పా జలపాతం చూడాల్సిందే | Karnantaka : Beautiful Gersoppa waterfalls must be seen | Sakshi
Sakshi News home page

కర్ణాటక వెళ్తే గెర్సొప్పా జలపాతం చూడాల్సిందే

Published Mon, Jul 10 2023 1:14 AM | Last Updated on Mon, Jul 10 2023 6:26 PM

కనువిందు చేస్తున్న జలపాతం - Sakshi

కనువిందు చేస్తున్న జలపాతం

శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ జోగ్‌ (గెర్సొప్పా) జలాశయం ఎట్టకేలకు పరవళ్లు తొక్కుతోంది. నలభై రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో నదులు, వాగులు, వంకలు వట్టిపోయాయి. దీంతో రాష్ట్రంలో ప్రముఖ జలపాతాలు మూగనోము పట్టాయి. అయితే సుమారు వారంరోజులుగా రుతుపవన వర్షాలు ముమ్మరం కావడంతో నదులు, వాగులకు కొత్త జీవం వచ్చింది. దీంతో శరావతి నదికి ప్రవాహం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జోగ్‌ వద్ద శరావతి ప్రవాహంతో జలపాతం నురగలు కక్కుతోంది. 253 మీటర్ల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటే నీటి తుంపరలు రేగి సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. దేశంలోనే ఇది రెండవ ఎత్తైన వాటర్‌ ఫాల్స్‌గా పేరు గడించింది.

పర్యాటకుల వరద

జోగ్‌ సౌందర్యాన్ని చూడటానికి వేలాది పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జోగ్‌ పరిసరాలు కిక్కిరిశాయి. మొన్నటివరకు నీరు లేక బోసి పోయిన జోగ్‌ జలపాతం కొత్తందాలను చూసి సందర్శకులు మురిసిపోయారు. పైగా ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతూ, పొగమంచు కొమ్ముకోవడంతో ఆ ప్రాంతంగా ఆహ్లాదమయం అయ్యింది. ఎక్కడెక్కడి నుంచో కార్లు, బస్సులు, బైక్‌లపై సందర్శకులు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement