బోథ్(ఆదిలాబాద్): ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం వద్ద చోటుచేసకుంది. చాట్లా నరేష్(28) అనే యువకుడు సరదాగా తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పొచ్చెర జలపాతంలో మునిగిపోయాడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.