వావ్...కొత్తపల్లి జలపాతం
జి.మాడుగుల: మండలంలో కొత్తపల్లి గ్రామంలోని జలపాతాలకు పలు ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులతో ఆదివారం కిక్కిరిసింది. జలపాతాల ప్రాంతాల్లో ప్రభుత్వం తగిన వసతుల ఏర్పాట్లు చేయటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. జిల్లా నుండి ఇతర జిల్లాల నుండి పర్యాటకులు కుటుంబాలుతో వచ్చి జలకాలాడి రోజుంతా ఆనందంగా గడిపారు.