Kottapalli
-
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, హేచరీలు, బల్క్ డ్రగ్ పార్క్...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. పారిశ్రామిక కారిడార్‌కు ఊతం తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్ఈజెడ్ భూ సేకరణను సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడమనే ప్రక్రియ దేశంలోనే తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాకినాడ తీరంలో ఒక వెలుగు ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చురుగ్గా మేజర్ హార్బర్ పనులు కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ మినీ హార్బర్ స్థానే మేజర్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ప్లాంట్లు కూడా సిద్ధవమతున్నాయి. తీరం వెంబడి... ► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి జీవనోపాధి లభిస్తోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది. ► కాకినాడ ఎస్ఈజడ్లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ) ► పెద్దాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది. ళీ తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్ఫ్యాక్టరీలు, థర్మాకోల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. నమ్మకంతో వస్తున్నారు తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్కుకు భూమిని కేటాయిస్తారు. – దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్ హార్భర్ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్ హార్భర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. –పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం -
గంజి నాగప్రసాద్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, ద్వారకాతిరుమల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ఏ ఒక్క నాయకుడిని, అతడి కుటుంబాన్ని ఆ పార్టీ విడిచిపెట్టదని చెప్పడానికి గంజి నాగప్రసాద్ కుటుంబానికి అందించిన చేయూతే ఒక ఉదాహరణ. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో మూడునెలల కిందట వైఎస్సార్సీపీ నేత గంజి నాగప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది జూలై 3వ తేదీన కొవ్వూరులో జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలో నాగప్రసాద్ కుమారుడు ఉదయఫణికుమార్కు ఆయన రూ.15 లక్షల చెక్కు అందించారు. అలాగే మరో రూ.10 లక్షల చెక్కును మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 16న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా నాగప్రసాద్ కుమారుడు ఉదయఫణికుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మిథున్‌రెడ్డి, రాజీవ్‌కృష్ణ, జీవీ, చెలికాని రాజబాబు, ప్రతాపనేని వాసు తదితరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న వైఎస్సార్సీపీకి తాము రుణపడి ఉంటామని చెప్పారు. (క్లిక్: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు) -
దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని..
కొత్తపల్లి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి ఏడాది మాదిరిగానే కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో పోలేరమ్మ తీర్థంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గురువారం ఉదయం దున్నపోతును తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానిని గరగ నృత్యాల మధ్య గ్రామమంతా ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా నేలపై వరుసగా పడుకున్నారు. వారి మీదుగా దున్నపోతును నడిపించారు. ఓ భక్తురాలు కూడా వీరిని తొక్కుకుంటూ ముందుకు సాగింది. అలా మూడుసార్లు భక్తులు దున్నపోతుతో తొక్కించుకున్నారు. ఇలా తొక్కించుకోవడం వలన వల్ల గ్రామానికి ఉన్న అరిష్టం పోవడంతో పాటు తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గతంలో ఈ దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు అలా చేయకుండా పూజల అనంతరం విడిచి పెట్టేస్తున్నారు. -
అరుదైన ఘటన; కవలలకు మళ్లీ కవలలు..
కరీంనగర్ టౌన్: నిఖిత, లిఖిత ఇద్దరు కవలలు. ఇటీవల నిఖిత ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే మూడు నెలల కిందటే లిఖిత కూడా ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో ఆ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వడం సాధారణమే అయినప్పటికీ కవల పిల్లలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇలా కవల పిల్లలకు జన్మనివ్వడం అరుదైన రికార్డు అని వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామానికి చెందిన నిఖిత మొదటి కాన్పు కోసం కరీంనగర్‌లోని యశోద కృష్ణ ఆస్పత్రికి రాగా, పరీక్షించిన వైద్యురాలు ఆకుల శైలజ.. ఆమె గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే 8 నెలలు దాటడం మహిళకు నొప్పులు రావడంతో శనివారం ఉదయం సిజేరియన్ చేశారు. దీంతో ఇద్దరు ఆడ, ఇద్దరు మగ శిశువులు జన్మించారు. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో ఇంక్యుబేటర్‌లో ఉంచారు. నిఖిత సోదరి లిఖితకు కూడా 3 నెలల కింద అదే ఆస్పత్రిలో డెలివరీ కాగా, ఆమెకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. నిఖిత భర్త సాయికిరణ్ పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నిఖితతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని, జన్యుపరంగానే ఇలా పుడతారని డాక్టర్ శైలజ చెప్పారు. ఇది అత్యంత అరుదైన ఘటన అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!) -
ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి
ప్రతి రోజూ ఉదయమే వెళ్లొస్తానని చెప్పిన తన పెనిమిటి తిరిగిరాని లోకానికి వెళ్లాడని జీర్ణించుకోలేని భార్య.. అమ్మా..నాన్న ఇక రాడా? అని పదేపదే అమాయకంగా అడిగే పిల్లలు.. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకుంటే మధ్యలోనే వదిలివెళ్లిన తమ కొడుకు ఇక లేడనే తల్లిదండ్రులు.. సాయంత్రం వేళావీధి చివర్లో అక్కా.. చెల్లె..అన్న..అని పలకరించుకున్న వారు ఇక లేరని..ఇక రారనే నిజాన్ని నమ్మలేని బంధుమిత్రులు.. ఇలా అందరూ తమతమ వాళ్లను గుర్తు చేసుకుని బాధను దిగమింగుకుని జీవచ్ఛవాలుగా మారిన పరిస్థితి సోమవారం కొత్తపల్లి, గోగ్యనాయక్‌తండాలో కనిపించింది. ప్రస్తుతం ఆ గ్రామాలను నిశ్శబ్దం కాటేస్తోంది. శుభకార్యాలకు డప్పు కొట్టిన వాళ్లే చావుడప్పులు కొట్టారు. ఎవరిని తట్టినా.. గుండె పిండేంత బాధ.. కళ్లలో కన్నీళ్లు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 మంది మృత్యుఒడిలోకి జారుకోవడం ఆ పల్లెల్లో పెను విషాదాన్నే నింపింది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఉదయం 11.30గంటలకు గ్రామానికి చేరుకున్న మృతదేహాలను చూసి.. అంత వరకూ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న బాధ కన్నీళ్ల రూపంలో ఎగసిపడింది. దు:ఖాన్ని దిగమింగుకుని నిశ్శబ్దంగా లోలోపల కుమిలికుమిలి పోయిన వారు ఒక్కసారిగా గొల్లుమన్నారు. విగతజీవులుగా మారిన తమ ఆప్తులను చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి. తమవారిని కడసారి చూపు కోసం బంధువులు, మిత్రులు తరలివచ్చారు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నాయకులు, అధికారులు కొత్తపల్లికి చేరుకున్నారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం మొత్తం కన్నీటి సంద్రంగా మారింది. సాక్షి, మహబూబ్‌నగర్(కొత్తపల్లి) : అమ్మా.. నాన్నా.. మీరిద్దరూ వెళ్లిపోయారు.. మాకు ఇప్పుడు దిక్కెవరు.. అంటూ శివాజీ, చాందీ దంపతుల పిల్లలు గుండెలవిసేలా రోదించారు.. గతంలోనే నాన్నను కోల్పోయాం.. ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయావా.. అంటూ పార్వతమ్మ కూతురు, కుమారుడు కన్నీరుమున్నీరయ్యారు.. భర్తను మృత్యువు కబళించగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. ఇదీ సుక్రు కుటుంబ పరిస్థితి.. సొంత అక్కాచెల్లెళ్లు ఒకేసారి మృత్యుఒడికి చేరుకున్నారు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ.. అందరివీ నిరుపేద కుటుంబాలే.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. అలాంటి వారి కుటుంబాలను రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు చిన్నాభిన్నం చేసింది.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి గాధలే వినిపించాయి.. మృతుల కుటుంబ పరిస్థితులను చూసిన వారంతా చలించిపోతున్నారు. కూలి పనులు చేస్తూ.. కోడలు అరుణమ్మ కొన్నేళ్ల్ల క్రితం మృతి చెందడంతో వారి పిల్లలు కార్తిక్, జ్యోతిలకు నానమ్మ వడ్డె చెన్నమ్మ పెద్దదిక్కుగా మారింది. అయితే ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నమ్మ సైతం మృత్యువాత పడటంతో వీరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. చెన్నమ్మ భర్త నర్సయ్య కూడా గతంలో మరణించాడు. దీంతో మనవడు, మనుమరాలుకు పెద్దదిక్కుగా ఉంటూ వారి పోషణ కోసం కూలీ పనులు చేస్తుండేంది. అనాథలుగా మారిన పిల్లలు గోగ్యతండాకు చెందిన భార్యాభర్తలు శివాజీ, చాందిలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. దీంతో వారి పిల్లలు అనూష, సరిత, సంతోష్‌లు అనాథలుగా మిగిలారు. సోమవారం తమ ఇంటికి విగతజీవులుగా వచ్చిన తల్లిదండ్రులను చూసిన పిల్లలు లబోదిబోమంటూ మృతదేహాలపై పడి రోదించారు. ఈ క్రమంలో చిన్నకుతూరు సరిత సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే కారులో జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. వీరికి చిన్న ఇల్లు ఉండగా అంతంత మాత్రమే భూమి ఉన్నట్లు బంధువులు తెలిపారు. వ్యవసాయం లేక భార్యాభర్తలు ఇద్దరు కూలీ పనులకు వెళ్తుంటారు. అదే క్రమంలో ఆదివారం కూడా వరినాట్లు వేసేందుకు వెళ్లి అనంతలోకాలకు చేరుకోవడంతో పిల్లలుదిక్కులేని వారయ్యారు. భర్త మృతి.. భార్య ఆస్పత్రిలో భర్త అంత్యక్రియలకు కూడా భార్య హాజరుకాలేని అత్యంత విషాదకర ఘటన గోగ్యతండాలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండాకు చెందిన సక్రునాయక్ మృతి చెందగా అతని భార్య దేవి తీవ్ర గాయాలతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సోమవారం జరిగిన సక్రు అంత్యక్రియలకు దేవి హాజరుకాలేకపోయింది. సక్రు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో వారి పిల్లలు గోగ్య, శ్రీవాణి, శివతోపాటు అతని ముసలి తల్లిదండ్రులు చావిలీ, గోబ్రియాలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వారి కుటుంబ పోషణ మరీ దయనీయంగా మారింది. సొంత భూమి లేకపోవడంతో వాడ్యాల్ శివారులో కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సక్రు దూరం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. సొంత అక్కాచెల్లెళ్లు.. కొత్తపల్లికి చెందిన నెల్లికంటి చంద్రమ్మ, ముదిగొండ వెంకటమ్మలు సొంత అక్కాచెల్లెళ్లు. వారి తల్లి చంద్రమ్మ తన కూతుళ్లు తన కళ్ల ముందే ఉండాలనే ఉద్దేశంతో కొత్తపల్లికి చెందిన వారితోనే వివాహం జరిపించింది. వీరి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉన్నాయి. మృతిచెందిన వెంకటమ్మకు భర్త లక్ష్మయ్య, కూతుళ్లు శివలీల, రాణి, కుమారుడు శ్రీను ఉన్నారు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటమ్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. అదేవిధంగా చంద్రమ్మ భర్త నర్సింహులు కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోగా.. పిల్లలు రాఘవేందర్, రమేష్, సుజాతలు ఉన్నారు. పెద్దదిక్కుగా ఉన్న తల్లికూడా చనిపోడవంతో ఒంటరి వారయ్యారు. వీరికి చిన్న ఇల్లు తప్ప భూమి తదితర ఎలాంటి ఆధారం లేదని బంధువులు తెలిపారు. తల్లి మృతితో తల్లడిల్లిన పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బండారి ఎల్లమ్మకు ఆరుమంది ఆడపిల్లలే సంతానం. ముగ్గురి కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించగా మరో ముగ్గురు కూతుళ్లు సునీత, లావణ్య, రాణి ఉన్నారు. ఎల్లమ్మ భర్త బొందయ్య కూడా దివ్యాంగుడు కావడంతో వెంకటమ్మనే కుటుంబ భారాన్ని మోస్తుంది. ప్రతిరోజు కూలీ పనులకు వెళ్లి కూలీ డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. రాణి, లావణ్య కవల పిల్లలు. వీరు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతుండగా సునీత ఇంటర్ చదువుతుంది. తల్లి మృతితో వీరి చదువులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది. పోషించే అమ్మ దూరమైంది బొంకూరు పార్వతమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి పిల్లలు శ్రీలత, శ్రీకాంత్‌లు ఒంటరి వారయ్యారు. తండ్రి చెన్నయ్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందగా.. తల్లి పార్వతమ్మ అన్నీతానై తన పిల్లలను కూలీ పనిచేసి చదివిస్తూ పోషిస్తుంది. ఈ క్రమంలో కూలీ పనులు ముగించుకొని తిరిగి వస్తూ మృతుఒడికి చేరడంతో ఆ పిల్లలు దిక్కులేనివారయ్యారు .శ్రీకాంత్ ఇంటర్ చదువుతుండగా, శ్రీలత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరికి కేవలం ఒక చిన్న గదితోపాటు గుడిసె మాత్రమే ఉంది. వీరికి ఎలాంటి వ్యవసాయ భూమి లేదని బంధువులు చెప్పారు. కూలి పనే ఆధారం కొత్తపల్లికి చెందిన బోలేపోగు వెంకటమ్మది ధీనస్థితి. వెంకటమ్మకు భర్త జంగయ్యతోపాటు కూతురు శైలజ ఉంది. వీరికి ఉండడానికి రెండు చిన్నగదుల ఇల్లు మాత్రమే ఉండగా.. దాదాపు ఎకరం గైరాన్ భూమి ఉంది. కూలీ పనే ప్రధాన జీవనాధారంగా కుటుంబం గడుస్తుంది. వెంకటమ్మ మృతితో కుటుంబం దయనీయ స్థితికి చేరుకుంది. తేరుకోలేకపోతున్నాం.. కొత్తపల్లిలో తొమ్మిది మంది, అలాగే గోగ్యతండాలో నలుగురు మొత్తం 13 మంది ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మా గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇంకా ఈ సంఘటన నుంచి గ్రామస్తులు తెరుకోలేకపోతున్నారు. ఇలాంటి సంఘటన జరగడం ఎంతో దురదృష్టకం. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. – దేవేందర్, సర్పంచ్, కొత్తపల్లి ఈ ఘటన కలచివేసింది.. గ్రామంలో 13 మంది ఒకేసారి మృతి చెందడం పట్ల గ్రామంలోని ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా మృతుల అంత్యక్రియలకు ఎంతో సహకరించారు. ఇలాంటి సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరం. ఈ ఘటన మొత్తం గ్రామస్తులను కలచివేసింది. – బాలయ్య, కొత్తపల్లి విషాదం అలుముకుంది.. గ్రామంలో ఒకేసారి 13 మంది మృతి చెందడం ఎంతో బాధాకరం. ఇలాంటి సంఘటన గ్రామంలో ఎప్పుడూ జరగలేదు. ప్రతి కులంలో ఒకరు మృతిచెందడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. దేవుడు బాధిత కుటుంబాలకు త్వరగా విషాదం నుంచి బయటపడేలా చూడాలి. – సుదర్శన్‌రెడ్డి, కొత్తపల్లి -
వెంటాడుతున్న చిరుత భయం
సాక్షి, యాచారం: కొత్తపల్లి గ్రామస్తులను చిరుతపులి కంటికి కునుకు లేకుండా చేస్తుంది. గత మూడు రోజులుగా వరుసగా రాత్రుళ్లు మందలపై దాడులు చేసి మేకలు, గొర్రెలను చంపి తినేస్తుండడంతో అటవీ ప్రాంతంలో ఉండాలంటేనే కాపరులు భయాందోళన చెందుతున్నారు. చిరుతపులి భయం వల్ల కొత్తపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నా అటవీ శాఖ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి చిరుత పులి కాస జంగయ్య మందపై దాడి చేసి మేకను చంపి ఎత్తుకెళ్లడం, రెండు మేకలను తీవ్రంగా గాయపర్చడం, బుధవారం రాత్రి చిక్కుడు వెంకటేష్‌కు చెందిన మందపై దాడి చేసి మేకను చంపడం, శుక్రవారం రాత్రి బైకని అశోక్ మందపై దాడి చేసి మేకను చంపి తినేయడం, రెండు మేకలను తీవ్రంగా గాయపర్చడంతో కాపరులు జంకుతున్నారు. మాడ్గుల – యాచారం మండలాల సరిహద్దులోని తాడిపర్తి నుంచి మాల్ వరకు 10 కిలోమీటర్ల మేరా గుట్టలు, పెద్ద పెద్ద రాళ్లతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. రాత్రి పూల గుట్టల సమీపంలో ఉన్న మందలపై దాడులు చేస్తున్న చిరుతపులి తెల్లవారే సరికి గుట్టల్లోకి చేరుకుంటొంది. చిరుతపులి ఎక్కడ దాడి చేసి చంపేస్తుందోనని కాపలాదారులు చెట్లపైన తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రి పూటే పగలు కూడా అటవీ ప్రాంతం, వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు జంకుతున్నారు. సంచరిస్తుంది చిరుతపులే.... గత మూడు, నాలుగు రోజుల రాత్రుళ్లు కొత్తపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది చిరుతపులేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. శుక్రవారం రాత్రి బైకని అశోక్ మందపై దాడి చేసి మేకను చంపి తినేయడం తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి సత్యనారాయణతో పాటు విజయభాస్కర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, నర్సింహ, ఇంద్రసేనారెడ్డి తదితర అధికారులు బృందం శనివారం కొత్తపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. దాడులు చేసిన మందల సమీపంలో పాదముద్రలను గుర్తించి కొత్తపల్లిలో సంచరిస్తుంది చిరుతపులేనని నిర్ధారించారు. గ్రామంలో దండోరా వేయించి రాత్రి పూట అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు పంపించారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మందల్లో గొర్రెలు గాని, మేకలు గాని ఉంచరాదని కాపరులకు సూచించారు. ఒకటా..? లేదా రెండు చిరుతపులులు తిరుగుతున్నాయా..? అనే విషయం తెలుసుకోవడానికి మందల సమీపాల్లో సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. అదే విధంగా అటవీ ప్రాంతంలో జూ అధికారులు బోన్లు ఏర్పాటు చేసే విధంగా స్థలాలను ఎంపిక చేసినట్లు రేంజ్ అధికారి సత్యనారాయణ తెలిపారు. కొత్తపల్లిలో చిరుతపులి దాడిలో మృతి చెందిన మేకను చూపిస్తున్న కాపరి -
ఆసిఫ్‌నగర్‌లో ఉద్రిక్తత
కొత్తపల్లి(కరీంనగర్) : కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో బీ.ఆర్.అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాల ఏర్పాటు వివాదానికి దారితీసింది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆసిఫ్‌నగర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గల రామాలయం పక్కన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఓవర్గం గద్దెను నిర్మించారు. గ్రామపంచాయతీ సమీపంలో మరోవర్గం గాంధీ విగ్రహ నిర్మాణానికి గద్దెను నిర్మించారు. అయితే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా గ్రామపెద్దలు సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. చివరికి గురువారం ఉదయం అంబేద్కర్ విగ్రహం గద్దెపై ప్రతిష్ఠించేందుకు ఒక వర్గం ప్రయత్నించగా, మరొక వర్గం వ్యతిరేకించడంతో వివాదం మొదలైంది. దీనికితోడు కరీంనగర్, బద్దిపల్లి, ఖాజీపూర్, ఎలగందులనుంచి ఒకవర్గం నాయకులు రావడంతో ఆసిఫ్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలతో డీసీపీ సంజీవ్‌కుమార్, తహసీల్దార్ వి.వినోద్‌రావు, కరీంనగర్‌రూరల్, టౌన్ ఏసీపీలు టి.ఉషారాణి, పి.వెంకటరమణ సమావేశమయ్యారు. వారి సూచనలపై సానుకూలంగా స్పందించిన ఇరువర్గాలు గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండు విగ్రహాల ఏర్పాటుకు అంగీకరించారు. దీంతో వివాదానికి తెరపడింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు భూమిపూజ చేశారు. -
ఇది ‘వంగపండు’ వరి?
తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన కొత్తపల్లిలో ఓ రైతు పొలంలో వరి వంగపండు రంగులో పండి అబ్బు రపరుస్తోంది. ఈ వరి ఏ రకానికి చెందిందో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులు శాంపిల్స్ సేకరించారు. కొత్తపల్లికి చెందిన గణేశుల వీరవెంకట సత్యనారాయణ అనే రైతు.. పొలంలో వరి విత్తనాలను నాటాడు. కలుపు తీసే సమయంలో కొన్ని వరి దుబ్బులు వంగపండు రంగులో ఉండటంతో అలాగే వదిలేశాడు. పంట కోత కోసేట ప్పుడు మాత్రం వేర్వేరుగా నూర్చాడు. వంగపండు రంగులో వరిని నూర్పి చూడగా బియ్యం ఎరుపు రంగులో ఉన్నాయి. వరి విత్తనాలలో కొత్త వంగడం ఏదైనా కలసి ఉంటుందని అధికారులు చెప్పారు. –పిఠాపురం -
తుపాను గుప్పెట్లో బోట్లు!
సముద్రంలోనే కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు అనుకున్న సమయానికి తీరం చేరటం కష్టమని బంధువుల ఆందోళన పిఠాపురం : వార్దా తుపాను తీవ్రమవుతున్న తరుణంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన 30 బోట్లు సముద్రంలో చిక్కుకోవడం మత్స్యకార కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ బోట్లలో వేటకెళ్లిన సుమారు 160 మంది వరకు మత్స్యకారులు ఉండడంతో వారి బంధువులు భయపడుతున్నారు. తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం వుందని చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారే తప్ప ఆ హెచ్చరికలు నడిసముద్రంలో ఉన్న మత్స్యకారులకు చేరే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మత్స్యకారులందరి వద్ద సెల్ఫోన్లు ఉన్నా సుదూర ప్రాంతం కావడంతో సెల్ఫోన్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయానికి తప్పక తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తుండగా సుమారు 150 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మత్స్యకారులకు ఆ సమాచారం అంది, వారు వేటను నిలిపివేసి తిరిగి ప్రయాణం అయినా తీరానికి చేరుకోవడానికి సుమారు 24 గంటల నుంచి 36 గంటలు పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుపానులో చిక్కుకునే అవకాశం ఉందని మత్స్యకారుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడలో కడలి కన్నెర్ర తుపాను ప్రభావంతో ఉప్పాడ సమీపంలోని తీరప్రాంతం వెంబడి ఉన్న బీచ్‌రోడ్డు కడలి ఆగ్రహానికి గురై ముక్కలైంది. దీంతో కాకినాడ–ఉప్పాడల మధ్య బీచ్‌రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. శుక్రవారం ఉదయం నుంచి సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. తీరంలో కెరటాలు సుమారు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ తీరప్రాంతాన్ని తీవ్ర కోతకు గురిచేస్తున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. బలమైన ఈదురుగాలులు ఈ ప్రాంతంలో మత్స్యకారుల గృహాలను ధ్వంసం చేస్తున్నాయి. అందరికీ సమాచారం అందించే ఏర్పాట్లు చేశాం సముద్రంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులకు ఇప్పటికే సమాచారం అందించాం. చాలాబోట్లు ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నాయి. ఇంకా 30 వరకు బోట్లు ఒడ్డుకు చేరుకోవాలి. అవి శనివారం ఉదయానికి తప్పక చేరుకుంటాయి. మత్స్యకారులకు సంబంధించినంత వరకు అందరి ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సాంకేతికపరమైన పరికరాలతో సమాచారం అందించే ఏర్పాట్లు చేశాం. ఎవరికైనా సమాచారం అందకపోతే తక్షణం చర్యలు తీసుకునే విధంగా మత్స్యఖాధికారులను అప్రమత్తం చేశాం. మత్స్యకార కుటుంబీకులు ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదు. – అంజలి, మత్స్యశాఖ డీడీ, కాకినాడ -
నడిరోడ్డుపై హత్య
♦ భయాందోళనకు గురైన జనం ♦ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు..? ♦ వివాహేతర సంబంధమే కారణం? కొత్తపల్లి (జమ్మికుంట రూరల్): జమ్మికుంట మండలం కొత్తపల్లిలో బుధవారం సాయంత్రం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్య జరిగింది. నిందితుడు వెంటపడి మరీ కత్తితో మెడ, చాతిపై పొడిచిన సంఘటన తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఇది చూసిన జనం భయబ్రాంతులకు లోనయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమ్మికుంటలో మూడు దశాబ్దాలపాటు సర్పంచ్‌గా పనిచేసిన ఎర్రంరాజు కృష్ణంరాజు మూడో కుమారుడు విజేందర్‌రాజు(42) కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే రంగంలో ఉన్న కొత్తపల్లిలో నివాసముంటున్న జూనూతుల కోనారెడ్డితో వృత్తిపరంగా సంబంధాలు ఏర్పడ్డాయి. తరచూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఈ క్రమంలో విజేందర్ భార్యతో కోనారెడ్డికి సాన్నిహిత్యం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు సమాచారం. ఈ విషయం విజేందర్రాజుకు తెలియడంతో పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కాగా బుధవారం కోనారెడ్డి.. విజేందర్రాజుకు ఫోన్ చేసి కొత్తపల్లికి రప్పించి కత్తితో పొడిచాడు. విజేందర్‌రాజు హత్యలో మరికొందరి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే హత్య చేసిన వెంటనే నిందితుడు తన స్నేహితుని ద్వారా ద్విచక్ర వాహనంపై వచ్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి కుమారుడు సాయికృష్ణంరాజు(5) ఉన్నాడు. సంఘటనా స్థలంలో మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలాన్ని హుజూరాబాద్ ఏసీపీ మూల రవీందర్‌రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను సేకరించారు. నిందితుని స్వగ్రామం వీణవంక మండలం బొంతుపల్లి. కొన్నేళ్లుగా జమ్మికుంటలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవలే కొత్తపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నాడు. -
వావ్...కొత్తపల్లి జలపాతం
జి.మాడుగుల: మండలంలో కొత్తపల్లి గ్రామంలోని జలపాతాలకు పలు ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులతో ఆదివారం కిక్కిరిసింది. జలపాతాల ప్రాంతాల్లో ప్రభుత్వం తగిన వసతుల ఏర్పాట్లు చేయటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. జిల్లా నుండి ఇతర జిల్లాల నుండి పర్యాటకులు కుటుంబాలుతో వచ్చి జలకాలాడి రోజుంతా ఆనందంగా గడిపారు. -
కొత్తపల్లి జలపాతాలకు పర్యాటకశోభ
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాలు పర్యాటక శోభ సంతరించుకుంటుంది. గిరిజన ప్రాంతాల్లో పలు సుందర జలపాతాల్లో కొత్తపల్లి జలపాతానికి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ చల్లటి, చక్కటి ఆహ్లదకరమైన వాతావరణంలో జలపాతాలు ఉండటంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండే కాక ఇతర దేశాల నుండి కూడా పర్యాటకులు ఇక్కడకు వచ్చి అందాలను తిలకిస్తున్నారు. గతంలో విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన అమెరికా బృందం కొత్తపల్లి జలపాతాలు అందాలను వీక్షించిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర, జిల్లా, ఐటీడిఏ ఉన్నతాధికార్లు సైతం సందర్శించారు. కొత్తపల్లి గ్రామం సమీపంలో అనేక చోట్ల ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు పై నుండి జలవారుతున్న నీటి అందాల కనుల విందు చేస్తున్నాయి. జలపాతాల వద్ద సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాఫీహౌస్, దుకాణాలు, గెడ్డపై రెండు చోట్ల ఇసుప బ్రిడ్జిలు, కొండవాలు ప్రాంతం నుంచి కిందకు దిగటానికి రక్షణ ఇనుప గొట్టాలు అమర్చి నిర్మించిన మెట్లు, అక్కడడక్కడ కూర్చోవటానికి సిమ్మెంట్ దిమ్మలు వనబంధు కళ్యాణయోజన పథకం కింద నిధులు వె చ్చించి నిర్మంచారు. ప్రధానం ద్వారం వద్ద ఏసుప్రభువు విగ్రహం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొత్తపల్లి జలపాతాలను ప్రకతి అందాలకు తగ్గట్టుగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. -
విద్యుదాఘాతంలో విద్యార్థికి గాయాలు
కొత్తపల్లి(లింగాలఘణపురం): మండలంలోని కొత్తపల్లికి చెం దిన ఎనిమిదో తరగతి విద్యార్థి జనగామ రాజు విద్యుదాఘాతంతో తీవ్రంగా గా యపడ్డాడు. బోనాల పండుగ సందర్భంగా సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో పలవురు విద్యార్థులు స్థానిక ప్రాథమిక పాఠశాలలో క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో బంతి పాఠశాల పైకప్పుపై పడింది. అయితే, పాఠశాలకు మెట్లు లేకపోవడంతో గోడపై నుంచి పైకి ఎక్కిన రాజు బంతి తీసుకుని దిగుతుండగా విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడి స్లాబ్‌పై పడిపోయాడు. శరీరం ఎడమ చేతితో పాటు భుజం కింది భాగం వరకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు తోటి విద్యార్థులు కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు చేరుకుని రాజును జనగామ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. -
అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధం
కొత్తపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని రెండిళ్లు కాలిపోయిన ఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. పైడిమాను పక్కీరయ్య కుటుంబసభ్యులు ఇంట్లో మంగళవారం ఉదయం వంట చేసే యత్నంలో పొయ్యిలో కిరోసిన్ చల్లారు. అయితే, ఒక్కసారిగా మంటలు లేచి ఇంటి పైకప్పుకు అంటుకున్నాయి. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో ఇంటికి అంటుకున్నాయి. రెండిళ్లలో ఉన్న ధాన్యం, దుస్తులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. మొత్తం రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆర్ఐ అపర్ణ చెప్పారు. -
లక్ష్మన్న కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
కొత్తపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ: పరిస్థితి ఉద్రిక్తం
బుక్కపట్నం (అనంతపురం): అనంతపురం జిల్లా అమడగూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక విషయమై ఇరు వర్గాల మధ్య శనివారం ఉదయం ఒకసారి, తిరిగి రాత్రి మరోసారి ఘర్షణ జరగడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. లాఠీలకు పనిచెప్పారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు ఎదురుతిరిగారు. ఎస్, సీఐ, ఇతర సిబ్బందిని గ్రామం నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయమే ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని, డీఎస్పీ వచ్చి సమాధానం చెప్పేవరకు గ్రామం నుంచి వెళ్లనీయబోమని భీష్మించుకూర్చున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
నాయకుడికి విశ్వసనీయత ఉండాలి
-
అనుమానంతో భార్యపై దాడి
కొత్తపల్లి, న్యూస్‌లైన్ : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన ఆదివారం కొత్తపల్లి మండలం కొండెవరం శివారు పాటి గ్రామంలో జరిగింది. స్థానికులు, బాధితురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండెవరం శివారు కాశీవారి పాకలులో కూలీ మేడిశెట్టి లోవరాజు తన భార్య దుర్గతో ఉంటున్నాడు. ఆమె అమ్మమ్మ, తాతయ్యలు పాటి గ్రామంలో నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం దుర్గ అమ్మమ్మ చనిపోయింది. ఈ క్రమంలో తాతయ్యను పరామర్శించేందుకు దుర్గ, లోవరాజులు పాటి గ్రామానికి ఆదివారం వచ్చారు. మధ్యాహ్నం భోజనం తర్వాత దుర్గ ఇంట్లో పడుకుంది. కొంతకాలం నుంచి దుర్గ నడవడికపై అనుమానం పెంచుకున్న లోవరాజు మద్యంమత్తులో కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దుర్గ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, బంధువులు అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ దుర్గను చికిత్స కోసం పిఠాపురంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న లోవరాజును సమీపంలోని విద్యుత్ స్తంభానికి కట్టి, దేహశుద్ధి చేసి విడిచిపెట్టారు. ఈ సంఘటనపై కొత్తపల్లి సీఐ ఎన్.కొండయ్యను అడగ్గా, విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.