విద్యుదాఘాతంలో విద్యార్థికి గాయాలు | two students wounded with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంలో విద్యార్థికి గాయాలు

Published Mon, Aug 1 2016 11:57 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

two students wounded with electric shock

కొత్తపల్లి(లింగాలఘణపురం):  మండలంలోని కొత్తపల్లికి చెం దిన ఎనిమిదో తరగతి విద్యార్థి జనగామ రాజు విద్యుదాఘాతంతో తీవ్రంగా గా యపడ్డాడు.  బోనాల పండుగ సందర్భంగా సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో పలవురు విద్యార్థులు స్థానిక ప్రాథమిక పాఠశాలలో క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో బంతి పాఠశాల పైకప్పుపై పడింది. అయితే, పాఠశాలకు మెట్లు లేకపోవడంతో గోడపై నుంచి పైకి ఎక్కిన రాజు బంతి తీసుకుని దిగుతుండగా విద్యుత్‌ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడి స్లాబ్‌పై పడిపోయాడు. శరీరం ఎడమ చేతితో పాటు భుజం కింది భాగం వరకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు తోటి విద్యార్థులు కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు చేరుకుని రాజును జనగామ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement