బుక్కపట్నం (అనంతపురం): అనంతపురం జిల్లా అమడగూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక విషయమై ఇరు వర్గాల మధ్య శనివారం ఉదయం ఒకసారి, తిరిగి రాత్రి మరోసారి ఘర్షణ జరగడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. లాఠీలకు పనిచెప్పారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు ఎదురుతిరిగారు. ఎస్, సీఐ, ఇతర సిబ్బందిని గ్రామం నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఉదయమే ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని, డీఎస్పీ వచ్చి సమాధానం చెప్పేవరకు గ్రామం నుంచి వెళ్లనీయబోమని భీష్మించుకూర్చున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.