
సాక్షి, చెన్నై: ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న కేవలం రూ.70 వివాదం పసిబిడ్డ ప్రాణాలను హరించిన దుర్ఘటన తిరుచ్చిరాపల్లిలో చోటుచేసుకుంది.తిరుచ్చిరాపల్లి జిల్లా తొట్టియం సమీపం కల్లుపట్టికి చెందిన రంగర్ అనే వ్యక్తి నిదీశ్వరన్ అనే తన 15 నెలల బాబును ఎత్తుకుని ఆదివారం రాత్రి రోడ్డులో నిలబడి స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అదే ప్రాంతానికి చెందిన సెంథిల్ వీరి వద్దకు వచ్చి ఆనంద్ అనే వ్యక్తి జేబులో చేయిపెట్టి రూ.70 తీసుకునేయత్నం చేశాడు. దీంతో రంగర్ కలుగజేసుకుని సెంథిల్‌ను నిలదీశాడు. దీంతో రంగర్, సెంథిల్ మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఇందుకు ఆగ్రహించిన సెంథిల్ సమీపంలో ఉన్న దుడ్డుకర్రను తీసుకుని రంగర్ తలపై కొట్టబోగా అతడు పక్కకు తప్పుకోవడంతో పసిబాలుడి తలకు దెబ్బ తగిలింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. నిందితుడు సెంథిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment