
న్యూఢిల్లీ: తమ డిమాండ్లపై కేంద్రం మౌనం వీడకుంటే ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఐదు రోజులుగా నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐఏఎస్‌లు విధుల్లో పాల్గొనేలా చేసే విషయమై శుక్రవారం హోం మంత్రితో చర్చలు విఫలం కావటంతో ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం నాటికి కేంద్రం నుంచి ఏ సమాధానం రాకుంటే ఇంటింటికీ వెళ్లి పదిలక్షల కుటుంబాల సంతకాలు సేకరించి ప్రధానికి పంపుతామన్నారు. ఆదివారం తాము ప్రధాని నివాసం ఎదుట నిరసన తెలుపుతామని ఆప్ ప్రకటించింది. ఈ పరిణామాలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీని కలిసి చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment