talks fail
-
నేటి నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలు బంద్
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన ఆందోళనను తీవ్రం చేశారు. శనివారం నుంచి పీహెచ్‌సీల్లో అత్యవసర వైద్య సేవలు, మినహా మిగిలిన సేవలను అందించబోమని ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌సర్వీస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 10 నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం వైద్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ వైద్యులతో సచివాలయంలో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారంపై అధికారులు కనీస ఆసక్తి చూపించలేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉంది అని చెబుతూ తాము చూపిన ప్రత్యామ్నాయాల్లో వేటినీ స్వీకరించకపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని సంఘం తెలిపింది. ప్రభుత్వంలోకంటే ప్రైవేటులో మెరుగైన సేవలు అందుతున్నాయని అధికారులు అనడం శోచనీయమంది. ఈ క్రమంలో ఆదివారం చలో విజయవాడ, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని తెలిపింది. మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని వెల్లడించింది. పీహెచ్సీ వైద్యులు కోల్పోతున్న మొత్తం సీట్లు 336336 సీట్లు నష్టపోతున్న వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్యను పెంచడం కోసం పీహెచ్‌సీల్లో సేవలు అందించే ఎంబీబీఎస్ వైద్యులను ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ చేయించి, అనంతరం వారి సేవలను ఆస్పత్రుల్లో వినియోగిస్తుంటారు. కాగా, గత ప్రభుత్వంలో అన్ని ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో స్పెషలిస్ట్‌లను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఇన్‌సర్వీస్ కోటాను పెంచారు. -
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు
న్యూఢిల్లీ : ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. చర్చల్లో రైల్వేలు, వాణిజ్యం, ఆహారం శాఖల మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్‌కు చెందిన ఎంపీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. గత సమావేశాల్లో చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలను వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వారికి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చల ప్రారంభం సందర్భంగా పంజాబీలో మంత్రి సోమ్ ప్రకాశ్ వారికి తెలిపారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు. స్పష్టమైన హామీ లభించకుంటే బయటకు వెళ్లిపోతామంటూ తెగేసి చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని దీంతో మంత్రులు వారికి సర్దిచెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు విషయం తేల్చాలంటూ రైతు ప్రతినిధులు గంటపాటు మౌనవ్రతం సాగించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, అంతర్గతంగా చర్చలు జరిపి నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఈ నెల 9 వరకు సమయం కావాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే వాయిదా పడ్డాయి. ఆహారం, టీ వెంట తెచ్చుకున్న రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ వద్ద ఆందోళన సాగిస్తున్న ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ఆహారం, టీ తమతోపాటు తెచ్చుకున్నారు. గురువారం కూడా రైతులు ఆహారం, టీతోపాటు మంచినీరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రైతు ప్రతినిధుల సూచనలు కోరాం: తోమర్ చర్చల అనంతరం మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాల నేతల నుంచి నిర్దిష్ట సూచనలను కోరాం. అయితే, చలి తీవ్రత దృష్ట్యా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లల్ని ఇళ్లకు పంపించాలని కోరాం’అని తెలిపారు. వివిధ పార్టీలు..సంఘాల మద్దతు 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్‌కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. రహదారులే గ్రామాలుగా... ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసలు తెలుపుతుండటంతో గడిచిన 10 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాపిక్ జాంలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కొన్ని మార్గాలను మూసివేసి, మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తం అవుతుండటంతో కొన్ని రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి, వాటిపై టెంట్లు వేసుకున్నారు. అక్కడే వంటావార్పూ చేపట్టారు. అవసరమైన సరుకులు, కాయగూరలు వంటివి అక్కడికి అందుతున్నాయి. సెల్ఫోన్లకు సోలార్ ప్యానళ్లతో చార్జింగ్ చేసుకుంటున్నారు. ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు హుక్కా పీలుస్తూ కాలం గడుపుతున్నారు. చర్చలకు ముందు ప్రధానితో భేటీ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు వెళ్లేముం దు మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రైతుల ముందుంచబోయే ప్రతిపాదనలపై వారంతా కలసి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటి సారి. రైతు ప్రతినిధుల మౌనవ్రతం చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాల ప్రతినిధులంతా మౌనవ్రతం పాటించారు. ప్రధానమైన ఈ డిమాండ్ కేంద్రానికి సమ్మతమా కాదా స్పష్టం చేయాలని కోరుతూ ప్రతినిధులు అవును/ కాదు అని రాసి ఉన్న కాగితాలను వారు నోటికి అతికించుకున్నారని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్ధు సింగ్ తెలిపారు. ప్రభుత్వం వారిని మాట్లాడించేందుకు మౌనంతోనే సమాధానం చెప్పారని మరో నేత కవితా కురుగంటి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. సాగు చట్టాలకు ప్రభుత్వం పలు సవరణలు చేస్తామంటూ ముందుకు వచ్చిందనీ, తాము మాత్రం పూర్తిగా రద్దు చేయాలని కోరామని బీకేయూ ఏక్తా అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహన్ చెప్పారు. శనివారం సింఘూ వద్ద జరిగిన ధర్నాలో నినదిస్తున్న రైతుల పిల్లలు చర్చల విరామ సమయంలో వెంట తెచ్చుకున్న ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధులు -
నేపాల్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
కఠ్మాండు: అధికారాన్ని పంచుకునే విషయంలో రాజీ కుదరకపోవడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండల మధ్య చర్చలు ఆదివారం అసంపూర్తిగా ముగిశాయి. మళ్లీ సోమవారం చర్చలు కొనసాగించాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. కీలక పార్టీ స్టాండంగ్ కమిటీ సమావేశానికి ముందే ఒక ఒప్పందానికి రావాలని వారు భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కేపీ శర్మ ఓలి దిగిపోవాలని ప్రచండ వర్గం కోరుతోంది. ప్రచండకు సీనియర్ నేతలు మద్దతిస్తున్నారు. మరోవైపు, విపక్ష నేపాలీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో ప్రధాని ఓలి భేటీ అయ్యారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విపక్ష మద్దతును కోరేందుకే ఓలి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఓలి ప్రధానిగా కొనసాగేందుకు అవసరమైతే.. అధికార పార్టీని చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి. -
చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంతో 108 అంబులెన్స్ ఉద్యోగుల చర్చలు విఫలమయ్యాయి. వేతనాల పెంపును వెంటనే అమలు చేయడంతో పాటు తాము డిమాండ్ చేస్తున్న 56 సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదని 108 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అధికారి ఒకరు శనివారం రాత్రి చర్చలకు వచ్చారని.. అర్థరాత్రి దాటే వరకు సమావేశం జరిగినా స్పష్టమైన హామీ రాలేదని వెల్లడించారు. 56 డిమాండ్లలో ఒక్కదానికి కూడా పరిష్కారం చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మళ్లీ చర్చలకు పిలిచారని తెలిపారు. అప్పుడు కూడా స్పష్టమైన హామీ లభించకపోతే 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. 108 అంబులెన్స్‌ల నిర్వహణ సంస్థ అయిన భారత్ వికాస్ గ్రూప్(బీవీజీ) బెదిరింపులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బెదిరింపులకు ఉద్యోగులెవరూ భయపడరన్నారు. ఒకప్పుడు అద్భుతంగానడిచిన ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. తమ డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలేమీ కాదన్నారు. నెలకు రూ.4 వేలు పెంచుతున్నామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నామని.. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. సరైన నిర్వహణ లేక అంబులెన్స్‌లు మూలనపడుతున్నాయని.. ఆక్సిజన్ కాదు కదా కనీసం మందులు కూడా ఉండటం లేదన్నారు. వర్షం పడితే అనేక వాహనాల్లో నీరు కారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆప్, కేంద్రం మధ్య ముదిరిన వివాదం
న్యూఢిల్లీ: తమ డిమాండ్లపై కేంద్రం మౌనం వీడకుంటే ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఐదు రోజులుగా నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐఏఎస్‌లు విధుల్లో పాల్గొనేలా చేసే విషయమై శుక్రవారం హోం మంత్రితో చర్చలు విఫలం కావటంతో ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం నాటికి కేంద్రం నుంచి ఏ సమాధానం రాకుంటే ఇంటింటికీ వెళ్లి పదిలక్షల కుటుంబాల సంతకాలు సేకరించి ప్రధానికి పంపుతామన్నారు. ఆదివారం తాము ప్రధాని నివాసం ఎదుట నిరసన తెలుపుతామని ఆప్ ప్రకటించింది. ఈ పరిణామాలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీని కలిసి చర్చించారు. -
చర్చలు విఫలం
వారం వారం విడుదలయ్యే కొత్త చిత్రాల కోసం సినిమా లవర్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. అయితే మార్చి 2కి థియేటర్లలోకి కొత్త బొమ్మ వచ్చే అవకాశం కనిపించడంలేదు. థియేటర్లు మూతపడబోతున్నాయి. వినడానికి షాకింగ్‌గానే ఉంటుంది. ఎందుకీ పరిణామం అంటే.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్ఓ), నిర్మాతల మధ్య ధర విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ధర ఎక్కువగా ఉందని భావించిన నాలుగు (తెలుగు, తమిళ, కన్నడ, కేరళ) రాష్ట్రాల నిర్మాతలు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు. శుక్రవారం బెంగళూరులో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ జాయింట్ యాక్షన్ కమిటీ (తెలుగు, తమిళ, కేరళ, కర్నాటక) వారు డిజిటల్ ప్రొవైడర్స్‌తో మరో సమావేశం నిర్వహించారు. ఇçప్పుడు వసూలు చేస్తున్న మొత్తంలో 20 శాతం తగ్గిస్తే చాలన్నది నిర్మాతల విన్నపం అని తెలిసింది. గత సమావేశాల్లా ఈసారి కూడా చర్చలు విఫలం అయ్యాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు 9 శాతం మాత్రమే తగ్గించడానికి ముందుకు వచ్చారని సమాచారం. దాంతో మార్చి 2 నుంచి కొత్త చిత్రాల కంటెంట్ ఇవ్వకూడదనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారు. కంటెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా థియేటర్లు మూతపడతాయి. అది మాత్రమే కాదు.. అప్పటికే ఆడుతున్న సినిమాలను కూడా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఈ పరిస్థితి ఎందాకా వెళుతుందో వేచి చూడాలి. -
పరిహారం చెల్లింపుపై చర్చలు విఫలం
♦ నక్కర్తమేడిపల్లి భూములు తీసుకోం ♦ నానక్‌నగర్, తాడిపర్తి రైతులతో పరిహారం ఇచ్చే విషయంలో చర్చలు జరుపుతాం ♦ ఆ గ్రామాల్లో రైతులు ఒప్పుకోకపోతే మహబూబ్‌నగర్ జిల్లాలో భూములు తీసుకుంటాం ♦ జేసీ రజత్‌కుమార్‌సైనీ యాచారం: ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి భూములను తీసుకునేది లేద§ýని, ఆ గ్రామ రైతులు పరిహారం చెల్లింపు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నందున ఆ భూములను తీసుకునే విషయంలో విత్‌డ్రా అవుతున్నట్లు జేసీ రజత్‌కుమార్‌సైనీ తెలిపారు. ముచ్చర్ల ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి భూముల సేకరణ విషయంలో గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆ గ్రామ రైతులతో జేసీ రెండో దఫా చర్చలు జరిపారు. చర్చల ప్రారంభంలో సర్పంచ్ పాశ్ఛ భాషా మాట్లాడుతూ ఎకరా భూమికి రూ. 15లక్షలు చెల్లిస్తే భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నట్లు జేసీకి తెలియజేశారు. జేసీ కల్పించుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇంతకు ముందు భూమి సేకరించిన గ్రామాల్లో ఇచ్చినట్టుగానే రూ. 8లక్షలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. ప్రభుత్వం నింబంధనలకు వ్యతిరేకంగా పైసా కూడా పెంచి ఇచ్చేది లేదన్నారు. ఇంతలోనే కొందరు రైతులు భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.15లక్షలకు పైగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తాం.. లేదంటే భూములిచ్చేది లేదని ఆందోళనకు దిగారు. దీంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ భూములను తీసుకోం...ఇక నక్కర్తమేడిపల్లి రైతులతో పరిహారం చెల్లింపు విషయంలో చర్చలు జరిపేది లేదని చెప్పి సమావేశం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిపోయారు. అనంతరం సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భూసేకరణ విషయంలో నక్కర్తమేడిపల్లి రైతులు మొండిగా వ్యవహరిస్తున్నందున ఆ గ్రామ భూములు తీసుకునే విషయంలో విత్‌డ్రా అవుతున్నట్లు తెలిపారు.యాచారం మండలంలోని భూముల కంటే పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో తక్కువ ధరకు వచ్చే భూములను తీసుకుంటామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే తన తపన తప్పా రైతులకు అన్యాయం చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. యాచారం మండలంలో ఎకరా భూమి రూ. 8 లక్షలు పెట్టి కొనుగోలు చేసే బదులు పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎకరా రూ. 3 నుంచి రూ. 4 లక్షలకే ఎకరా భూమిని కొనుగోలు చేస్తామన్నారు. నక్కర్తమేడిపల్లి రైతులతో సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల రైతులతో మాత్రమే సమావేశం అవుతామని తెలిపారు. రైతుల్లో ఆందోళన ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి రెవెన్యూ భూములను తీసుకునేది లేదని జేసీ తెలియజేయడంతో ఆ గ్రామ రైతుల్లో ఆందోళన మొదలైంది. జేసీతో సమావేశమైన రైతులు ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రూ. 8 లక్షలు కాకున్నా కొంచెం పెంచైనా పరిహారం ఇవ్వడానికి జేసీ ఒప్పుకుంటే భూములు ఇస్తామని రైతులు అభిప్రాయానికి వచ్చారు. కొంతమంది రైతులు స్వయంగా జేసీని కలిసి రూ. 8 లక్షలైనా సరే మా భూములిస్తామని జేసీకి చెప్పారు. సర్పంచ్ పాశ్ఛ భాషా, ఉప సర్పంచ్ చిగురింత శ్రీనువాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కర్నాటి రంగారెడ్డి తదితరులు మరోమారు జేసీని కలిసి మీ మాటకు గౌరవం ఇచ్చి భూములు ఇవ్వడానికి త్వరలో గ్రామసభ పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఏపీసర్కార్తో మున్సిపల్ ఉద్యోగులచర్చలు విఫలం
-
తెలంగాణలో నిలిచిపోయిన లారీలు
హైదరాబాద్ : తెలంగాణలో లారీల సమ్మె ప్రారంభమైంది. బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం లారీ యజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె యథాతథం అయ్యింది. రవాణా పన్ను తగ్గించడంతో పాటు... రెండు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ ప్రవేశపెట్టడం సహా 11 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లారీలు, ట్రక్కులు నిలిచిపోయాయి. లారీల సమ్మెతో వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. కూరగాయలు, నిత్యావసరాల ధరల పెంపుతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఎపిఎన్జిఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం
హైదరాబాద్: ఎపిఎన్జిఓ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో మంత్రి మండలి ఉపసంఘం ఎపిఎన్జిఓ నేతలతో చర్చలు జరిపింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె విరమించేదిలేదని నేతలు చెప్పారు. చర్చలు ముగిసిన అనంతరం ఎపిఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయేది ఉద్యోగులేనని చెప్పారు. స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.