
టీ.నగర్(చెన్నై): విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వివాదంలో చిక్కుకుంది. విమానం దిగగానే తమను స్పైస్‌జెట్ భద్రతాసిబ్బంది దుస్తులు విప్పించి తనిఖీలు చేస్తున్నారని ఎయిర్‌హోస్టెస్‌లు ఆరోపించారు. ప్రయాణికులకు ఆహారపదార్థాల విక్రయాల ద్వారా వచ్చిన నగదును కాజేస్తున్నామన్న అనుమానంతో ఈ తనిఖీలు చేస్తున్నారన్నారు.
భద్రతా సిబ్బంది తనిఖీల పేరిట తమను అభ్యంతరకరంగా తాకుతున్నారనీ, ఇది అత్యాచారం, వేధింపులకు ఏమాత్రం తక్కువకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం ఎయిర్‌హోస్టెస్‌లు ఆందోళనకు దిగిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. నగదును కాజేసిన సిబ్బంది కొందరు ఈ తనిఖీల్లో దొరికిపోయారనీ, వారిపై చర్యలు తీసుకుంటామని స్పైస్‌జెట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment