airhostesses
-
బట్టలు విప్పించి తనిఖీ చేశారు
టీ.నగర్(చెన్నై): విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వివాదంలో చిక్కుకుంది. విమానం దిగగానే తమను స్పైస్‌జెట్ భద్రతాసిబ్బంది దుస్తులు విప్పించి తనిఖీలు చేస్తున్నారని ఎయిర్‌హోస్టెస్‌లు ఆరోపించారు. ప్రయాణికులకు ఆహారపదార్థాల విక్రయాల ద్వారా వచ్చిన నగదును కాజేస్తున్నామన్న అనుమానంతో ఈ తనిఖీలు చేస్తున్నారన్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల పేరిట తమను అభ్యంతరకరంగా తాకుతున్నారనీ, ఇది అత్యాచారం, వేధింపులకు ఏమాత్రం తక్కువకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం ఎయిర్‌హోస్టెస్‌లు ఆందోళనకు దిగిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. నగదును కాజేసిన సిబ్బంది కొందరు ఈ తనిఖీల్లో దొరికిపోయారనీ, వారిపై చర్యలు తీసుకుంటామని స్పైస్‌జెట్ పేర్కొంది. -
ఆ ఆరోపణలపై స్పైస్‌జెట్ స్పందించింది
చెన్నై : స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న ‘నో ఫ్రిల్స్ కారియర్’కు వ్యతిరేకంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాలసీలో భాగంగా ఎయిర్‌లైన్ అధికారులు వారి భద్రతా సిబ్బంది చేత ఇబ్బందికరరీతిలో తమపై వ్యక్తిగత తనిఖీలు నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌హోస్టెస్ చేస్తున్న ఈ నిరసనలపై స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. కొన్ని దొంగతనం కేసులు గుర్తించామని, ఈ మేరకే తాము క్రమశిక్షణ చర్యలు ప్రారంభించామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ తనిఖీలు కేవలం సాధారణ ఏవియేషన్ ఇండస్ట్రి చేపడుతున్న ప్రక్రియ మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా పలు ఇండస్ట్రీస్ ఈ మేరకు తనిఖీలు చేపడుతూ ఉన్నాయని చెబుతోంది. అయితే ఈ తనిఖీలు తమకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఎయిర్‌హోస్టెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే తక్కువగా ఉందా అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలపై నేడు స్పైస్‌జెట్ అధికారులు, ఎయిర్‌హోస్టెస్‌తో ఓ మీటింగ్ కూడా నిర్వహించారు. -
ఇది అత్యాచారం కన్నా తక్కువేం కాదు..
చెన్నై : స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న ‘నో ఫ్రిల్స్ కారియర్’కు వ్యతిరేకంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలసీలో భాగంగా ఎయిర్‌లైన్ అధికారులు వారి భద్రతా సిబ్బంది చేత ఇబ్బందికరరీతిలో తమపై వ్యక్తిగత తనిఖీలు నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులగా విమానాలు డీబోర్డింగ్ అయ్యాక భద్రతా సిబ్బంది తమను ఈ విధంగా ఇబ్బందిపెడుతున్నారని, చివరకు తమ హ్యండ్బాగ్లో నుంచి శానిటరి ప్యాడ్స్‌ను కూడా తొలగించాలని చెప్తున్నారని ఎయిర్ హోస్టెస్‌లు చెప్తున్నారు. ‘తనిఖీల పేరుతో వారు మా శరీరాన్ని అసభ్యకర రీతిలో తాకుతున్నారు. ఇది మాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. మా సానిటరి ప్యాడ్స్‌ను తీసివేయాలని, మా శరీరాన్ని తాకాలని మీ పాలసీలో ఉందా? ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం మమ్మల్ని నియమించుకున్నారు. కానీ మా భద్రత గౌరవం మాటేంటి’ అంటూ ఎయిర్‌లైన్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే తక్కువగా ఉందా అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌హోస్టెస్‌లు ఆహారపదార్థలు, ఇతర పదర్థాలను అమ్మడానికి ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు తీసుకుంటున్నారనే అనుమానంతో కొద్దికాలం నుంచి స్పైస్‌జెట్ యాజమాన్యం విమానాలు డీబోర్డింగ్ అయ్యాక వారిని భద్రతా సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తుంది. తనిఖీలు నిర్వహించే వరకు బాత్రూంలోకి కూడా వెళ్లకూడదని ఎయిర్‌హోస్టెస్‌లను ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిర్‌హోస్టెస్‌లు నిరసన తెలపడంతో స్పైస్‌జెట్ అధికారులు వారితో గుర్గావ్లోని తమ కార్యలయంలో మీటింగ్ నిర్వహించారు. దీనివల్ల ఆ రోజు రెండు ఇంటర్నేషనల్ విమానాలు ఆలస్యంగా నడిచాయి. అందులో ఒకటి కొలొంబో వెళ్లే విమానం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యూనిఫామ్ ధరించిన కొంతమంది ఎయిర్‌హోస్టెస్‌లు, సాధారణ దుస్తుల్లో ఉన్న కొంతమంది గుంపుగా నిలబడి ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. -
ఆ విమానాల ఆలస్యానికి వాళ్లే కారణం
విమానం గల్ఫ్ దేశాలకు వెళ్లిందంటేచాలు.. గంటల తరబడి రెస్ట్ కావాలంటుంది ఒకామె. ఇంకొకరు పైలట్ పదిసార్లు పిలిచిన తర్వాతగానీ క్యాబిన్ లోకి రాదు. మరొకరిపై ప్రయాణికులకు సర్వీస్ అందించే విషయంలో ఎప్పుడూ కంప్లయింట్సే. ఇవీ.. ఎయిర్ ఇండియా విమానాల్లో పనిచేస్తోన్న ఎయిర్ హోస్టెస్ పై తరచూ వినిపిస్తోన్న ఫిర్యాదులు. సమయానుసారంగా విధులు నిర్వర్తించడంలో వీరు కనబరుస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎయిర్ ఇండియా సర్వీసుల్లో 30 శాతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఏకంగా 17 మంది ఎయిర్ హోస్టెస్ లను గురువారం సస్పెండ్ చేశారు. బాధ్యతగల క్యాబిన్ క్రూ మెంబర్లుగా సమయపాలన పాటించాలని ఇప్పటికే మూడునాలుగు సార్లు హెచ్చరించాం. అయినాసరే వారి ప్రవర్తనలో మార్పులేదు. ఆన్ టైమ్ ప్రెజెన్స్ (ఓటీపీ)ను పాటించకుండా సంస్థను నష్టాలపాలుచేసేలా వ్యవహరించినందుకే 17 మందిని విధుల నుంచి తొలిగించామని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. ఈ తొలిగింపులతో ఇప్పటివరకు ఎయిర్ ఇండయా సస్పెండ్ చేసిన ఎయిర్ మోస్టెస్ ల సంఖ్య 272కు పెరిగింది. న్యూయార్క్, బోస్టన్ లకు డైరెక్ట్ సర్వీసులు నడుపుతూ ఉత్తర అమెరికాలో విమాన సేవలు అందిస్తోన్న ఏకైక భారతీయ సంస్థగా పేరున్న ఎయిర్ ఇండియా.. తర్వరలోనే అమెరికా, యూరప్ లలో తన సేవలను విస్తృతం చేయనుంది. ఈ నేపథ్యంలో సమయపాలన, సేవల విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది.