చెన్నై : స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న ‘నో ఫ్రిల్స్ కారియర్’కు వ్యతిరేకంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాలసీలో భాగంగా ఎయిర్‌లైన్ అధికారులు వారి భద్రతా సిబ్బంది చేత ఇబ్బందికరరీతిలో తమపై వ్యక్తిగత తనిఖీలు నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌హోస్టెస్ చేస్తున్న ఈ నిరసనలపై స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. కొన్ని దొంగతనం కేసులు గుర్తించామని, ఈ మేరకే తాము క్రమశిక్షణ చర్యలు ప్రారంభించామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
ఈ తనిఖీలు కేవలం సాధారణ ఏవియేషన్ ఇండస్ట్రి చేపడుతున్న ప్రక్రియ మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా పలు ఇండస్ట్రీస్ ఈ మేరకు తనిఖీలు చేపడుతూ ఉన్నాయని చెబుతోంది. అయితే ఈ తనిఖీలు తమకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఎయిర్‌హోస్టెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే తక్కువగా ఉందా అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలపై నేడు స్పైస్‌జెట్ అధికారులు, ఎయిర్‌హోస్టెస్‌తో ఓ మీటింగ్ కూడా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment