ఇది అత్యాచారం కన్నా తక్కువేం కాదు.. | SpiceJet Crew Alleged About Strip Searching | Sakshi
Sakshi News home page

ఇది వేధింపులు, అత్యాచారం కన్నా తక్కువేం కాదు

Published Sat, Mar 31 2018 11:08 AM | Last Updated on Sat, Mar 31 2018 6:25 PM

SpiceJet Crew Alleged About Strip Searching - Sakshi

చెన్నై : స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ అనుసరిస్తున్న ‘నో ఫ్రిల్స్‌ కారియర్‌’కు వ్యతిరేకంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్‌ హోస్టెస్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలసీలో భాగంగా ఎయిర్‌లైన్‌ అధికారులు వారి భద్రతా సిబ్బంది చేత ఇబ్బందికరరీతిలో తమపై వ్యక్తిగత తనిఖీలు నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులగా విమానాలు డీబోర్డింగ్‌ అయ్యాక భద్రతా సిబ్బంది తమను ఈ విధంగా ఇబ్బందిపెడుతున్నారని, చివరకు తమ హ్యండ్‌బాగ్‌లో నుంచి శానిటరి ప్యాడ్స్‌ను కూడా తొలగించాలని చెప్తున్నారని ఎయిర్‌ హోస్టెస్‌లు చెప్తున్నారు.

‘తనిఖీల పేరుతో వారు మా శరీరాన్ని అసభ్యకర రీతిలో తాకుతున్నారు. ఇది మాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. మా సానిటరి ప్యాడ్స్‌ను తీసివేయాలని, మా శరీరాన్ని తాకాలని మీ పాలసీలో ఉందా? ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం​ మమ్మల్ని నియమించుకున్నారు. కానీ మా భద్రత గౌరవం మాటేంటి’ అంటూ ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే తక్కువగా ఉందా అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎయిర్‌హోస్టెస్‌లు ఆహారపదార్థలు, ఇతర పదర్థాలను అమ్మడానికి ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు తీసుకుంటున్నారనే అనుమానంతో కొద్దికాలం నుంచి స్పైస్‌జెట్‌ యాజమాన్యం విమానాలు డీబోర్డింగ్‌ అయ్యాక వారిని భద్రతా సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తుంది. తనిఖీలు నిర్వహించే వరకు బాత్‌రూంలోకి కూడా వెళ్లకూడదని ఎయిర్‌హోస్టెస్‌లను ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిర్‌హోస్టెస్‌లు నిరసన తెలపడంతో స్పైస్‌జెట్‌ అధికారులు వారితో గుర్గావ్‌లోని తమ కార్యలయంలో మీటింగ్‌ నిర్వహించారు. దీనివల్ల ఆ రోజు రెండు ఇంటర్నేషనల్‌ విమానాలు ఆలస్యంగా నడిచాయి. అందులో ఒకటి కొలొంబో వెళ్లే విమానం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యూనిఫామ్‌ ధరించిన కొంతమంది ఎయిర్‌హోస్టెస్‌లు, సాధారణ దుస్తుల్లో ఉన్న కొంతమంది గుంపుగా నిలబడి ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement