కొత్తపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని రెండిళ్లు కాలిపోయిన ఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. పైడిమాను పక్కీరయ్య కుటుంబసభ్యులు ఇంట్లో మంగళవారం ఉదయం వంట చేసే యత్నంలో పొయ్యిలో కిరోసిన్ చల్లారు.
అయితే, ఒక్కసారిగా మంటలు లేచి ఇంటి పైకప్పుకు అంటుకున్నాయి. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో ఇంటికి అంటుకున్నాయి. రెండిళ్లలో ఉన్న ధాన్యం, దుస్తులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. మొత్తం రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆర్‌ఐ అపర్ణ చెప్పారు.