
తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన కొత్తపల్లిలో ఓ రైతు పొలంలో వరి వంగపండు రంగులో పండి అబ్బు రపరుస్తోంది. ఈ వరి ఏ రకానికి చెందిందో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులు శాంపిల్స్ సేకరించారు. కొత్తపల్లికి చెందిన గణేశుల వీరవెంకట సత్యనారాయణ అనే రైతు.. పొలంలో వరి విత్తనాలను నాటాడు.
కలుపు తీసే సమయంలో కొన్ని వరి దుబ్బులు వంగపండు రంగులో ఉండటంతో అలాగే వదిలేశాడు. పంట కోత కోసేట ప్పుడు మాత్రం వేర్వేరుగా నూర్చాడు. వంగపండు రంగులో వరిని నూర్పి చూడగా బియ్యం ఎరుపు రంగులో ఉన్నాయి. వరి విత్తనాలలో కొత్త వంగడం ఏదైనా కలసి ఉంటుందని అధికారులు చెప్పారు.
–పిఠాపురం
Comments
Please login to add a commentAdd a comment