జలపాతం అంచున చిక్కుకున్న ఏనుగులు
బ్యాంకాక్: ప్రమాదవశాత్తు జలపాతంలో పడి నాలుగు అడవి గున్న ఏనుగులు మృతి చెందిన ఘటన థాయ్‌లాండ్‌లోని ఖావో యై జాతీయ పార్కులో చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా పార్క్‌లో ఉన్న జలపాతానికి వరద నీరు పెరిగింది. ఈ నీటిలో మొత్తం ఆరు ఏనుగులు చిక్కుకున్నాయి. అందులో నాలుగు ఏనుగులు ప్రవాహంలో కొట్టుకుపోతూ రాళ్లను ఢీకొని మృతి చెందాయి.
మృతి చెందిన ఓ గున్న ఏనుగును చేరుకొనేందుకు మిగిలిన రెండు ఏనుగులు ప్రయత్నించసాగాయి. దీన్ని గుర్తించిన పార్క్ అధికారులు లోయలో నుంచి వాటిని రక్షించారు. నీటి ప్రవాహానికి ఎదురు వెళ్లిన గున్న ఏనుగులు తీవ్రంగా అలసిపోయాయని, ప్రస్తుతం అవి విశ్రాంతి తీసుకుంటున్నాయని పార్కు అధికారులు తెలిపారు. మరో వారం పాటు వాటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామని తెలిపారు. ఏనుగులను రక్షించే సమయంలో పర్యాటకులను జలపాతం వద్దకు అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment