మంచుకొండల్లో రక్తజలపాతం.. ఎక్కడంటే? | Did You Know About The Blood Falls in Antarctica | Sakshi
Sakshi News home page

మంచుకొండల్లో రక్తజలపాతం.. ఎక్కడంటే?

Published Sun, Oct 30 2022 11:45 AM | Last Updated on Sun, Oct 30 2022 11:49 AM

Did You Know About The Blood Falls in Antarctica - Sakshi

అక్కడి జలపాతాన్ని చూస్తే, అక్కడేదో రక్తపాతం జరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఎర్రని రక్తధారల్లా నీరు ఉరకలేస్తూ ఉంటుంది. చలికాలంలో పూర్తిగా గడ్డకట్టుకుపోయి, నీటి మధ్య వెడల్పాటి నెత్తుటి చారికలా కనిపిస్తుంది. ఈ రక్తజలపాతం అంటార్కిటికాలో ఉంది. టేలర్‌ వ్యాలీ వరకు విమానంలో చేరుకుని, ఇక్కడకు పర్వతారోహణ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అంటార్కిటికా మంచుకొండల మీదుగా ఈ జలపాతం ఉరుకుతున్న దృశ్యం సందర్శకులను గగుర్పాటుకు గురిచేస్తుంది. 

అరుదైన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు ఔత్సాహిక పర్వతారోహకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి నీటిలో ఇనుము సాంద్రత ఎక్కువగా ఉండి, ఆ ఇనుము ఉప్పునీటి కారణంగా తుప్పుపట్టడం వల్ల జలపాతం మధ్యలో నీరు ఎర్రగా మారుతోందని అలాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జలపాతాన్ని చూడటానికి ఏటా నవంబర్‌ నుంచి మార్చి వరకు అనుకూలమైన కాలం. ఈ కాలంలోనే సాహస ప్రవృత్తిగల పర్యాటకులు దేశ దేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు.
చదవండి: VenkampalliL: వెల్‌కమ్‌ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement