Fun Day Special
-
Fathers Day: తండ్రీ..నిన్ను తలంచి!
‘మా నాన్న ఎలా బతకాలో నాకు చెప్పలేదు. తానెలా బతికాడో నన్ను చూడనిచ్చాడు’ అన్నాడు అమెరికన్ రచయిత క్లారెన్స్ బడింగ్టన్ కెలాండ్. పెద్దలు చెబితే పిల్లలు వినరు. వాళ్లు పెద్దలను గమనిస్తారు, అనుకరిస్తారు. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే, తండ్రులు ఊరకే నీతిపాఠాలు చెబితే చాలదు. నిజాయితీగా బతికి చూపించాలి. అప్పుడు మాత్రమే పిల్లలు సరైన దారిని ఎంచుకోగలుగుతారు. తండ్రులకు గర్వకారణంగా మనగలుగుతారు. ఇంటి బరువు బాధ్యతలను మోసే తండ్రి పిల్లలకు తొలి హీరో! ఉన్నత వ్యక్తిత్వాన్ని, విలువలను పిల్లలు తండ్రి నుంచే నేర్చుకుంటారు. ఒక కుటుంబంలో తండ్రి దారి తప్పితే, పిల్లలు సరైన దారిని ఎంచుకోలేరు. రేపటి పౌరులు దారి తప్పితే, రేపటి సమాజం విలువలు కోల్పోయిన జనారణ్యంగా మిగులుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ సమానమే అయినా, ప్రపంచ సాహిత్యంలో తల్లులకు దక్కిన ప్రశస్తి తండ్రులకు దక్కలేదు. అరుదుగానైనా తండ్రుల గురించి అద్భుతమైన కవిత్వం వెలువడింది. తండ్రిని త్యాగానికి ప్రతీకగా, మార్గదర్శిగా కొనియాడిన కవులు లేకపోలేదు. తన సంతానం ఉన్నతిని సమాజం పొగిడినప్పుడు పొంగిపోయే తొలి వ్యక్తి తండ్రి! ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అని శతకకారుడు అందుకే అన్నాడు. తండ్రులకు పుత్రోత్సాహం పుత్రుల వల్లనే కాదు, పుత్రికల వల్ల కూడా కలుగుతుంది. చరిత్రలోను, వర్తమానంలోను అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుప్రసిద్ధులైన తండ్రులు, వారికి పుత్రోత్సాహం కలిగించిన వారి పిల్లల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు తండ్రుల దినోత్సవం జరుపుకోవడం వెనుకనున్న కథా కమామిషును కూడా తెలుసుకుందాం. తండ్రుల దినోత్సవం వెనుకనున్న మహిళ అంతర్జాతీయంగా మాతృ దినోత్సవం జరుపుకోవడం 1872 నుంచి మొదలైంది. తల్లుల కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకొంటున్నపుడు బాధ్యతకు మారుపేరైన తండ్రుల కోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అమెరికన్ మహిళ సొనోరా స్మార్ట్ డాడ్ తండ్రుల దినోత్సవం కోసం ప్రచారం ప్రారంభించింది. ఆమె ప్రచారం ఫలితంగా 1910లో తొలిసారిగా అమెరికాలో తండ్రుల దినోత్సవం జరిగింది. దీంతో ఆమె ‘మదర్ ఆఫ్ ఫాదర్స్ డే’గా గుర్తింపు పొందింది. క్రమంగా దీనికి ఆదరణ పెరగడంతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించి, 1972 నుంచి ఏటా జూన్ నెల మూడోవారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ ఒక తండ్రి, ఆయన సంతానం దేశాధినేతలుగా కొనసాగిన సందర్భాలు అరుదు. స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరను తనంతటి నేతగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టినప్పుడు ఆయన జైలు నుంచి తన కూతురికి స్ఫూర్తిమంతమైన ఉత్తరాలు రాసేవారు. తన తండ్రి తనకు రాసిన ఉత్తరాలు తనను ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు, మనుషులపై ఆపేక్షను, ప్రకృతిపై ప్రేమను పెంచుకునేందుకు దోహదపడ్డాయని ఇందిరా గాంధీ ఒక సందర్భంలో చెప్పారు. బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ 1964 మే 27న కన్నుమూసే వరకు ప్రధానిగా కొనసాగారు. స్వాతంత్య్ర భారత దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన అహరహం పాటుపడ్డారు. దేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇందిర తోటి కాంగ్రెస్ నాయకుడైన ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లాడారు. తండ్రి ప్రధాని పదవిలో ఉండగానే, 1959లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణానంతరం లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధాని పదవి చేపట్టగా, ఆయన మంత్రివర్గంలో ఇందిరా గాంధీ తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. లాల్‌బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన ఇందిరా గాంధీ 1975 ఎమర్జెన్సీని అమలులోకి తెచ్చి, ఆ తర్వాత 1977లో వచ్చిన ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. జనతా పార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోవడంతో 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు. బ్యాంకుల జాతీయీకరణ వంటి సాహసోపేతమైన చర్యలతో ఇందిరా గాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి, తండ్రికి తగ్గ కూతురిగా పేరుపొందారు. పండిట్ రవిశంకర్ అనౌష్కా శంకర్ భారతీయ సంగీత దిగ్గజాల్లో పండిట్ రవిశంకర్ ప్రముఖుడు. సితార్ వాద్యానికి పర్యాయపదంగా మారిన రవిశంకర్ సంగీతరంగంలో ఎన్నో అద్భుతాలు చేశారు. తొలినాళ్లలో తన సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలసి నృత్యం చేసుకుని, దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నా, అనతి కాలంలోనే నృత్యాన్ని విడిచిపెట్టి, సంగీతాన్ని తన రంగంగా ఎంచుకున్నారు. నాటి ప్రఖ్యాత విద్వాంసుడు అల్లాఉద్దీన్ ఖాన్ వద్ద సితార్ నేర్చుకున్నారు. ప్రస్తుత సంగీతరంగంలో ప్రాచుర్యం పుంజుకున్న ఫ్యూజన్ ప్రయోగాలను రవిశంకర్ దశాబ్దాల కిందటే చేశారు. ఎందరో పాశ్చాత్యులకు హిందుస్తానీ సంగీతం నేర్పించారు. సంగీతంపై అభిరుచి కనబరచిన తన కూతురు అనౌష్కా శంకర్‌ను అద్భుతమైన విద్వాంసురాలిగా తీర్చిదిద్దారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో మాదిరిగా సంగీత రంగంలో వారసత్వం పెద్దగా పనిచేయదు. పిల్లలకు స్వతహాగా అభిరుచి, ఆసక్తి ఉంటే తప్ప తండ్రుల అడుగుజాడల్లో ఈ రంగంలో రాణించలేరు. పండిట్ రవిశంకర్ కూతురు అనౌష్కా శంకర్ తండ్రి అడుగుజాడల్లోనే సితార్ విద్వాంసురాలిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం ఒక అరుదైన విశేషం. అనౌష్కా తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి రవిశంకర్ శిక్షణలో సితార్‌పై సరిగమలు పలికించడం నేర్చుకున్నారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక, కాలేజీలో చేరకుండా పూర్తిగా సంగీతానికే అంకితం కావాలని నిర్ణయించుకుని, తండ్రి ఆధ్వర్యంలో రోజుకు ఎనిమిది గంటలు సాధన చేస్తూ విద్వాంసురాలిగా ఎదిగారు. ఎన్ని శైలీభేదాలు ఉన్నా, సంగీతం విశ్వజనీనమైనదని తన తండ్రి నమ్మేవారని, ఆయన నుంచే విభిన్న శైలులకు చెందిన సంగీతాన్ని సమ్మేళనం చేయడం నేర్చుకున్నానని, సంగీతంలో తనకు గురువు, దైవం, మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత తన తండ్రేనని అనౌష్కా శంకర్ చెబుతారు. ధీరూభాయ్ అంబానీ ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ భారతీయ పారిశ్రామిక రంగంలో టాటా, బిర్లాల ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా చరిత్ర సృష్టించారు. సామాన్య గ్రామీణ ఉపాధ్యాయుడి కొడుకుగా పుట్టిన ధీరూభాయ్ ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఉపాధి వేటలో భాగంగా యెమెన్ వెళ్లి, అక్కడ కొంతకాలం ఒక పెట్రోల్ పంపులో పనిచేశారు. యెమెన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చేశాక తన సమీప బంధువు చంపక్లాల్ దమానీతో కలసి ‘మజిన్’ పేరుతో ఎగుమతులు దిగుమతుల వ్యాపారం ప్రారంభించారు. కొంతకాలానికి చంపక్లాల్తో భాగస్వామ్యాన్ని వదులుకుని ధీరూభాయ్ సొంతగా వ్యాపారంలోకి దిగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించి, తొలుత పాలియెస్టర్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తర్వాత అంచెలంచెలుగా దాన్ని వివిధ రంగాలకు విస్తరించారు. ధీరూభాయ్ తన కొడుకులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు వ్యాపార నిర్వహణలోని మెలకువలను నేర్పించారు. ధీరూభాయ్ 2002లో మరణించే నాటికి రిలయన్స్ గ్రూప్ భారతీయ పారిశ్రామిక రంగంలోనే అగ్రస్థానంలో ఉండేది. తండ్రి మరణం తర్వాత అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు ముదరడంతో 2004లో రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముకేశ్ అంబానీ చేతికి, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అనిల్ అంబానీ చేతికి వచ్చాయి. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూప్ కొంత వెనుకబడినా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రగామిగా కొనసాగుతోంది. (చదవండి: మెడ పట్టేసినప్పుడు.. త్వరగా నార్మల్ కావాలంటే?) -
సిస్టర్హుడ్.. అత్యంత అవసరమైన బంధం
అదొక ఇల్లు.. గర్భిణీ స్త్రీలకు ప్రసవం గురించిన భయాలను పోగొట్టి.. అమ్మతనాన్ని హాయిగా ఆస్వాదించేలా సలహాలు, సూచనలు, భరోసానిచ్చే సాంత్వన సదనం! అక్కడికి భిన్నమైన నేపథ్యాలు, సంస్కృతీ సంప్రదాయాలు, విభిన్నమైన మనస్తత్వాలతో అంతే వైరుధ్యమైన పరిస్థితుల్లోంచి ఆరుగురు గర్భిణీలు వస్తారు. ఒకరికి భాష అభ్యంతరమయితే.. ఒకరికి భావం తప్పుగా తోస్తుంది. ఇంకొకరికి ప్రవర్తన నచ్చదు. మరొకరికి కట్టుబొట్టు తీవ్రమనిస్తుంది. వేరొకరికి మాట పెడసరంగా వినిపిస్తుంది. ఒకరికి తోటివాళ్ల వ్యవహారమే చిరాకు తెప్పిస్తుంది. ఇలా ఎవరికివారే ముందస్తు అభిప్రాయాలు, తీర్పరి తీరుతోనే అక్కడికి చేరుతారు. వారి ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా ఒక్కోరిది ఒక్కో నేపథ్యం. వారికి సలహాలు, సూచనలిచ్చే మహిళదీ ఒక నేపథ్యం. చిరాకులుపరాకులు, కోపాలు, హేళనలు, స్పర్థలతో మొదలైన వారి ప్రయాణం.. రానురాను ఒకరినొకరు అర్థం చేసుకునే దిశగా మళ్లుతుంది. ఒకరికొకరం అన్నంత దగ్గరగా బంధం బలపడుతుంది. ఆ అనుబంధాన్ని చూసేవాళ్లు ‘వావ్..వండర్ విమెన్..!’ అని అనుకోకమానరు! ఇది నిజ జీవితంలోని దృశ్యం కాదు.. వెబ్ స్క్రీన్ మీది చిత్రం! పేరు.. వండర్ విమెన్! సిస్టర్హుడ్ అవసరాన్ని గుర్తించేలా చేస్తున్న సినిమా! దాని మీద చర్చద్వారా ఆ అవసరాన్ని మరచిపోనివ్వకుండా మహిళలను కార్యోన్ముఖులగా ఉత్సాహపరుస్తున్న ఆలోచన!! ఏ భాష అనే ప్రశ్నకు తావివ్వని అన్ని భాషల ప్రాతినిధ్యాన్ని ఇంకా చెప్పాలంటే అసలు భాషే అవసరం లేని ఒక నిజాన్ని మహిళలు చూసి .. గ్రహించి పెంపొందించుకోవాల్సిన భావం!! దర్శకురాలు.. అంజలీ మీనన్. ప్రతి మహిళకూ ఒక బ్యాగేజ్ ఉంటుంది. దాన్ని పక్కనపెట్టి అవతలి మహిళ బరువును దృష్టిలో పెట్టుకుని సాయం చేయాలి. అదే సిస్టర్హుడ్. ఆ చిత్రం ద్వారా మనం గుర్తించాల్సిన అవసరం! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఎక్కడ ఏ మూల ఏ ట్రోలింగ్ జరిగినా తెలిసిపోతుంది. వియర్డ్ థింగ్స్ వైరల్ అయినంతగా నార్మల్ థింగ్స్ వైరల్ కావు కదా! ముక్కుసూటి నిజాల పోస్టింగ్స్ కన్నా దాని ఈకలు పీకే ట్రోలింగ్సే నలుమూలలకూ చేరిపోతాయి లిప్తపాటులోనే! అలాగే మొన్నామధ్య.. ప్రేమ, ఎమోషనల్ బాండింగ్ పేరుతో లైంగిక దోపిడీకి .. తద్వారా అనారోగ్యానికి గురికాకుండా అమ్మాయిలను అప్రమత్తం చేస్తూ ఓ మహిళా జర్నలిస్ట్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులోని అంశాన్ని పక్కదోవ పట్టించి సంస్కృతీసంప్రదాయాలను తెరమీదకు తీసుకొచ్చి ఆ జర్నలిస్ట్నూ.. ఆ పోస్ట్‌ను సమర్థించిన మిగిలిన మహిళలనూ అసభ్యకరంగా ట్రోల్ చేశారు. విషాదమేంటంటే అలా ట్రోలింగ్ చేస్తున్న పురుషులకు.. మహిళలూ సపోర్ట్‌గా నిలవడమే కాక తమవంతుగా వీళ్లూ ట్రోలింగ్కి పాల్పడడం! వండర్ విమెన్‌కి.. ఈ ట్రోలింగ్కి లింక్ ఏంటో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును.. ఆ సినిమా చెప్పిన సిస్టర్హుడ్ భావన నిజంగానే మనకు ఉండుంటే స్త్రీలే స్త్రీలపై ట్రోలింగ్కి పాల్పడకపోగా ఆ దుశ్చర్యకు దిగిన పురుషులను నిలువరించేవారు. ప్రాక్టికల్‌గా అది జరగడం లేదని తెలుస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో ఇలాంటి ధోరణినే చూస్తున్నాం.. దానికి సాక్ష్యం అందరి జీవితాల్లో ముఖ్య భూమికయిన సోషల్‌మీడియా వేదికే! అందుకే సిస్టర్హుడ్ భావనను పెంపొందించుకునే ఆవశ్యకత ఏర్పడింది. శత్రువులం కాదు.. సామెతలు రొదపెడ్తున్నట్టుగా ఆడవాళ్లు ఆడవాళ్లకు శత్రువులు కారు. అలా శత్రువుల్లా చూపించి.. మభ్యపెడుతున్నది పురుషాధిపత్య లోకం. సిస్టర్‌హుడ్‌కు విరుద్ధమైన ఈ పురుషాధిపత్య భావజాలన్ని స్త్రీ మెదడులో నింపిందీ సమాజం. అలా కండిషనింగ్ అయిన మైండ్ ఆ భావజాలాన్ని తరతరాలకూ మోసుకెళ్తోంది పెంపకం ద్వారా! అందుకే పురుషాధిపత్య భాజాలానికి భిన్నంగా.. విరుద్ధంగా ఏ చిన్న అభిప్రాయం వినిపించినా.. కనిపించినా ముందు స్త్రీలే ఒప్పుకోరు.. విరుచుకుపడతారు. సఖ్యత కోల్పోతారు.. ఐక్యత చెడి విడిపోతారు. ఆ అధిపత్యానికి కావల్సింది ఇదే! తద్వారా స్త్రీ ఎప్పటికీ సెకండ్ సిటిజన్‌గానే ఉంటుంది. ఇది కూతురు, కొడుకు అనే వివక్ష నుంచి మొదలై అత్త – కోడళ్ల గొడవలు, వదిన– మరదళ్ల ఆరళ్లు, తోడికోడళ్ల మధ్య చిచ్చులుగా కొనసాగుతూ బయటి ప్రపంచంలోకి వెళ్లి.. ఉద్యోగినుల మధ్య పోటీలు, క్యారెక్టర్ అసాసినేషన్లు, బాడీషేమింగ్ ఎట్సెట్రా దాకా వెళ్తాయి. ఒకవేళ కొండకచో.. పురుషాధిపత్య జిత్తులను స్త్రీలే నిర్లక్ష్యం చేస్తే అప్పుడు పురుషులు ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగుతారు. ఒక స్త్రీ ముందు ఇంకో స్త్రీని కామెంట్ చేస్తుంటారు! తన ముందున్న స్త్రీని పొగడ్తల్లో ముంచేస్తారు. దేవలోకంలో కూర్చోబెడ్తారు.. అక్కడ లేని స్త్రీని పాతాళంలోకి తోసేస్తారు. ఇలా ఆడవాళ్ల మధ్య అభద్రతను క్రియేట్ చేస్తారు. అసూయాద్వేషాలను రగిలిస్తారు. ఒకరితో ఒకరు పోటీ పడేలా చేస్తారు. మహిళల మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టేలా చూస్తారు. తెలియకుండానే ఆడవాళ్లు ఆ కుట్రలో భాగస్వాములవుతారు. ‘చూశారా.. మూడు కొప్పులు ఒక్కచోట చేరలేవు..’, ‘అందుకే అన్నారు పెద్దలు స్త్రీకి స్త్రీయే శత్రువు అని’ అంటూ చోద్యం చూస్తుంటారు. భావోద్వేగాలకు పురుషుడు అతీతమా? మగవాళ్లకు మగవాళ్లు కూడా శత్రువులే! అసలు భావోద్వేగాలు, తమోరజో గుణాలకు స్త్రీ, పురుషులనే తేడా ఏంటి? పరిస్థితులను బట్టి మనుషులందరూ భావోద్వేగాలకు లోనవుతారు. వాళ్ల వాళ్ల తీరును బట్టి ప్రతిస్పందిస్తారు. అంతేకానీ కొన్ని గుణగణాలు ప్రత్యేకించి స్త్రీలకే ఉండవు. ఈ విషయాన్ని మహిళలు దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకోనందువల్లే రాజకీయాల్లో కూడా పురుషాధిపత్య ఆటలు కొనసాగుతున్నాయి. నాటి నుంచి నేటి వరకు.. ఏ పార్టీలోనైనా మహిళా సభ్యురాలు జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్ నుంచి జెండర్ పొలిటికల్ స్టేట్మెంట్ ఏది ఇచ్చినా.. ఎదుటి పార్టీనాయకత్వం ప్రతిస్పందించకుండా ఆ పార్టీలోని మహిళా సభ్యులను ఉసిగొల్పుతుంది. మాటలతో వాళ్లు యుద్ధం చేసుకుంటుంటే చిద్విలాసంగా తమాషా చూస్తుంది. ఎరుకపడాలి.. ఈ కుట్రలు, పన్నాగలు, గిమ్మిక్కులు, జిత్తులు అన్నీ కూడా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసమే చేస్తుంది పురుష సమాజం. అసలు సమాజం అంటేనే మేల్ అనే సింగిల్ వర్డ్ మాట. అదలా వాళ్ల ప్రపంచంగా మనుగడ సాగించాలంటే స్త్రీలు కిందమెట్టు మీదే ఉండాలి. కులం, మతం అనే సామాజిక హోదాల నుంచి ఒంటి రంగు, ఒడ్డుపొడుగు అనే వ్యక్తిగత అంశాలు, ఉద్యోగహోదా వంటి విషయాల దాకా స్త్రీలను విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది. మహిళల ఎమోషనల్ కొషెంట్నూ వాడుకుంటుంది. ఏ గడబిడ లేకుండా ఈ విభజన సాఫీగా సాగిపోవడానికి సంస్కృతీసంప్రదాయాలను కాపాడే బృహత్తర బాధ్యతను స్త్రీల భుజాల మీద పెడుతుంది. ఇది సక్రమంగా సాగేలా అమ్మను పురమాయిస్తుంది. ఎందుకంటే పెంపకం ఆమె చేతుల్లో ఉంటుంది కనుక. అలా ఈ సంస్క్రృతీసంప్రదాయాల పరిరక్షణ అనే పురుషాధిపత్య భావజాలానికి కండిషనింగ్ అయిన అమ్మ .. పెంపకం ద్వారా వాటిని చక్కగా పంపకం చేస్తుంది. ఆ చైన్ అలా కొనసాగి ఇల్లు దాటి బయటి ప్రపంచానికి చేరుతుంది. దాంతో మహిళ.. అడుగడుగునా తన స్థానాన్ని ఆక్రమించడానికే ఇంకోమహిళ పుట్టిందేమో అన్న అభద్రతతో బతికేస్తుంటుంది. కాబట్టి వీటన్నింటి పట్ల ఎరుకపడి.. నిజాలను తెలుసుకుని పురుషాధిపత్య భావజాల బరువును దించేసుకోవాలి. అప్పుడే తోటి ఆడవాళ్ల పట్ల సోదరిభావన.. అదే సిస్టర్హుడ్ భావన కలుగుతుంది. సాహిత్యంలో దొరకదు.. సోదరిభావన.. అంటే కొత్తగా అనిపిస్తుంది కదూ! అవును మరి.. ఏ పదాలైనా ఆ భావాలు అనుభవంలోకి వస్తేనే పుడతాయి కదా! స్త్రీని స్త్రికి శత్రువును చేసిన లోకం అనుభవంలోకి రాని సిస్టర్‌హుడ్‌కు సమానార్థకాలను ఎలా క్రియేట్ చేస్తుంది? బ్రదర్హుడ్ ప్రాక్టికాలిటీలోకి వచ్చింది కాబట్టి ఆంధ్రీకరించిన సౌభ్రాతృత్వం అనే సంస్కృత పదం వచ్చింది. ఏ భావాలనైనా వాటి తాలూకు పదాలనైనా జనసామాన్యంలోకి తెచ్చేది సాహిత్యమే. సిస్టర్హుడ్ గురించి వివరించిన పురాణాలు.. కథలు, నవలలు మన దగ్గర లేవనే చెపాలి. అభ్యుదయ రచయిత్రులు కొందరు ఈ సిస్టర్హుడ్ మీద కొన్ని కథలు రాశారు. ఇంగ్లిష్‌లో చిత్ర బెనర్జీ దివారకుని రాసిన ‘సిస్టర్ ఆఫ్ మై హార్ట్’ను సిస్టర్‌హుడ్‌ను అక్షరీకరించిన నవలగా పరిగణిస్తారు. అయినా దీని మీద చెప్పుకోదగినంత సాహిత్య కృషి జరగలేదనే చెప్పాలి. ఆ మాటకొస్తే మొత్తం భారతీయ నవలా సాహిత్యంలో కథానాయకులకు ఉన్నట్లుగా కథానాయికలకు ప్రధానమైన అంటే వాళ్ల జీవితాల్లో ముఖ్యపాత్రను పోషించే స్నేహితులు ఉండరు. మహిళలకు మహిళలను హితులుగా.. సన్నిహితులుగా చూపించే ఒక్క అంశమూ.. సన్నివేశమూ కానరాదు. కాబట్టి సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవడానికి సాహిత్యం మనకు పెద్దగా సాయపడుతుందని అనుకోలేం. మరి సినిమాలు? సమస్యే లేదు. ‘ఇది కథ కాదు’, ‘కల్కి’ వంటి సినిమాలతో 80, 90ల్లో బాలచందర్ అనే దర్శకుడు సిస్టర్హుడ్ ప్రమోషన్‌కు ఓ ఆశా కిరణంలా కనపడ్డాడు. సింగీతం శ్రీనివాసరావునూ బాలచందర్ సరసన చేర్చుకోవచ్చు ఆయన తీసిన ‘ఆడవాళ్లకు మాత్రమే’ సినిమాతో. అలాంటివి అతి కొన్ని తప్ప సినిమాల పరంగానూ పెద్దగా ప్రయత్నం జరిగినట్టు ఏ రీలూ చూపించడం లేదు. అయితే ఇటీవలి కాలంలో బాలీవుడ్లో అలాంటి ఫోకస్ ఒకటి కనిపిస్తోంది. దానికి ఉదాహరణగా ‘క్వీన్’ను చూపించొచ్చు. సో ఈ విషయంలో వెండితెర మీదా మనకు వెలుగు లేదు. ఇక సీరియల్స్.. ప్రస్తావించుకోకపోవడమే మంచిది. కొత్తదేం కాదు.. నిజానికి సిస్టర్హుడ్ మాట కొత్తదేం కాదు. అది సాధించిన విజయాలూ తక్కువేం కాదు. పురుషులతో సమానంగా వేతలనాల కోసం నాడు జరిగిన ఉద్యమం నుంచి చదువుల్లో, కొలువుల్లో, బస్సుల్లో, స్థానిక పరిపాలనా సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు సాగిన.. సాగుతున్న అన్నిరకాల స్త్రీవాద ఉద్యమాలకూ ఊపిరి ఈ సిస్టర్హుడే. వరకట్న నిషేధం, గృహ హింస, విశాఖ గైడ్‌లైన్స్, నిర్భయ, దిశ వంటి చట్టాల ఏర్పాటుకూ వెనుకున్నది సిస్టర్హుడే. అంటే ఎంత కడిషనింగ్ అయినా తోటి వాళ్ల పట్ల సహానుభూతి ప్రదర్శించే మన సహజ గుణం సజీవంగా ఉన్నట్టే కదా. దానికి కండిషనింగ్ అవుదాం. ఒకే రక్తం పంచుకుని పుట్టిన, ఒకే నేపథ్యంలో పెరిగిన అక్కాచెల్లెళ్ల మధ్యే సవాలక్ష అభిప్రాయ భేదాలుంటాయి. కానీ ఏ కష్టం వచ్చినా.. ఆపద తలెత్తినా అక్కకు చెల్లి తోడు.. చెల్లికి అక్క అండ ఉంటుంది కదా జీవితకాలం! అలా సోదరిభావానికి కట్టుబడి ఉందాం. పురుషాధిపత్యం నేర్పిన తీర్పరి వైఖరిని, విక్టిమ్ బ్లేమింగ్ స్వభావానికి ఫుల్స్టాప్ పెడదాం. అర్థంచేసుకునే నైజాన్ని అలవర్చుకుందాం. కులం, మతం, రంగు, భాష, చదువు, కొలువు, డబ్బు..వంటి ఎన్ని భేదాలున్నా ఫిమేల్ జెండర్ అనే ఒకేఒక్క ఐడెంటిటీతో ఒక్కటికావాలి. ఆ జెండర్‌కున్న వల్నరబులిటీనే ఐకమత్యంతో బలంగా మలచుకోవాలి. అప్పుడే అది రక్తసంబంధం కన్నా గొప్ప అనుబంధంగా.. ఎప్పటికీ వెన్నంటే ఉండే బంధంగా బలపడుతుంది. ఆ యూనిటీతో సాధించలేని విజయాలు ఉండవు. ఆ భావన వల్ల తోటి వాళ్లను వినడం మొదలుపెడతాం. ముందస్తుగా ఏర్పరచుకున్న మన అభిప్రాయాల్లోని తప్పుని గ్రహించగలుగుతాం. తప్పు పట్టడాన్ని మానుకుంటాం. షేరింగ్‌ను అలర్చుకుంటాం. ధైర్యాన్ని ప్రదర్శించగలుగుతాం. ఆలోచనాపరిధిని పెంచుకుంటాం. ఇవన్నీ మహిళలను సాధికారత వైపు నడిపిస్తాయి. ‘డియర్ సిస్టర్..’ అనే ఒకే ఒక్క మాట తోటి మహిళలకిచ్చే నైతిక బలం అలాంటిది మరి. సిస్టర్హుడ్ మ్యాజిక్ అది. ఈ భావనవల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికస్వావలంబనకు దాన్ని మించిన టూల్ ఇంకేం ఉంటుంది! ఆర్థికస్వావలంబన సాధించామంటే నిర్ణయాధికారాన్ని సాధించినట్టే.. పాలనలో భాగస్వామ్యానికి సిద్ధమైనట్టే. ఇన్ని విజయాలకు ఒకే ఒక్క మంత్రం.. సిస్టర్హుడ్! ఇక చేతులు కలపడమే! ఆ ధోరణులను, పోకడలను వదిలించుకోవాలి.. నాకు సంబంధించి, సిస్టర్ హుడ్ అంటే ఒక అమ్మాయిగా నేను పడ్డ కష్టం ఇంకో అమ్మాయి పడకూడదన్న ఆలోచన..అది నచ్చని మనిషైనా సరే. ప్రతి అమ్మాయికీ సొంత గుర్తింపు ఎందుకు లేదన్న ప్రశ్న.. ఆ గుర్తింపు ఏర్పరచుకోడానికి, సాధికారత సాధించడానికి ‘నా’తో మొదలై, ‘మనం’ దాకా అమ్మాయిలందరూ చేయాల్సిన ప్రయాణమే సిస్టర్హుడ్. ఇదంతా సాధ్యపడాలంటే.. తెలిసో, తెలియకో మనందరం పాటిస్తున్న ఈ మనువాద ధోరణులు, పితృస్వామ్యపు పోకడలను వదిలించుకోవాలి. ఒకరి కోసం ఒకరు నిలబడాలి. బేషరతుగా అని చెప్పను కానీ ఒక మార్పు.. నిర్ణయం సరైనది అని తెలిసినప్పుడు మాత్రం కచ్చితంగా సహాయసహకారాలు అందించాలి. – వై. కృష్ణజ్యోతి, జర్నలిస్ట్ ఉమన్ నీడ్స్ ఉమన్ ఏ సమస్యనయినా ఒంటరిగా ఎదుర్కోలేం.. సమూహంగా ఉంటేనే పరిష్కరించుకోగలుగుతాం. ఆ యూనిటీయే సిస్టర్హుడ్. ఈ మధ్య నేనొక అధ్యయనం చదివాను. ఒక విమెన్ గ్రూప్‌లో బ్రెస్ట్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలు తమ ఆరోగ్య సమస్యలు.. వాటితో ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ.. ఓదార్చుకుంటూ.. మోరల్‌గా సపోర్ట్ చేసుకుంటూ.. చిన్న చిన్న ఆనందాలను పంచుకుంటూ.. ఒకరికొకరు తోడుగా, అండగా ఉన్నారట. దీనివల్ల వాళ్లు క్యాన్సర్‌ను జయించే అవకాశాలు పెరిగాయని ఆ అధ్యయనం చెప్పింది. అదీ సిస్టర్హుడ్ ఇచ్చే స్ట్రెంత్! ‘‘నిన్ను విభేదించినా సరే నీ హక్కుల కోసం నిలబడతా నా ప్రాణం పోయినా ’’ అని వోల్టేర్ చెప్పినట్టుగా మనలో మనకు ఎన్నో విభేదాలున్నా సరే తోటి మహిళ అవసరాన్ని గుర్తించి ఆమెకు అండగా నిలబడాలి. ఆ భావనను డెవలప్ చేసుకోవాలి. దానికోసం ముందు మన మీద మగవాళ్లు క్రియేట్ చేసిన స్త్రీకి స్త్రీయే శత్రువు, మహిళలకు ఈర్షా్యసూయలు ఎక్కువ వంటి ఇమేజెస్‌ను తుడిచేయాలి. వాళ్లు మనల్ని తొక్కిపెట్టడానికి సంధించిన ఆ అస్త్రాలను విరిచేయాలి. ఉమన్ నీడ్స్ ఉమన్ అంతే! ఎక్కడికెళ్లినా.. ఏ స్పేస్‌లో ఉన్నా తన చుట్టూ ఉన్న మహిళలు తనకు సపోర్ట్‌గా ఉన్నారు అన్న భరోసాను తోటి మహిళకు ఇవ్వాలి. మనం ఉన్న చోటునుంచే దీన్ని మొదలుపెట్టాలి. – ఆలమూరు సౌమ్య జర్నలిస్ట్ అత్యంత అవసరమైన బంధం ఆడవారు కలవాలన్నా ఆలోచనలు కలబోసుకోవాలన్నా పెద్దగా లెక్కలుండవు. వాష్‌రూమ్‌లో తెలియనివారితో చీర పిన్నీసు నుంచి లిప్‌స్టిక్ దాకా పంచుకోగలరు. ఇక ఆత్మీయతనూ ఆర్ద్రతను పంచుకునే లక్షణం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? నా జీవితంలో అంతకంతకూ ఈ అనుభూతి నాలో జీవనలాలసను పెంచుతోంది. నా కథలు తీవ్ర విమర్శలకు గురైనా ఎందరో ఆడవారు ఆ కథల్లోని పాత్రలతో తమ జీవితంలోని అనేక పార్శా్వలతో గుర్తించి ప్రేమించారు. ఇలాంటి షేరింగ్, కంపాషన్, ఎంపథీ.. మహిళల సహజ లక్షణాలు. ఇవి చాలు సిస్టర్హుడ్ డెవలప్చేసుకోవడానికి! ఈ భావన మనకు భరోసాను, భద్రతను ఇస్తుంది. ఒకసారి నా కొడుకు పుట్టిన రోజు. ఎవరూ చుట్టూలేని సందర్భం. ఒంటరిగా ఫీల్ అవలేదు కాని ఉన్నట్లుండి స్నేహితురాళ్లంతా కలసి వాళ్లే మావాడి పుట్టినరోజు జరిపారు. ఆ రోజు నాకు దొరికిన భరోసా మాటల్లో చెప్పలేనిది. ఈ సిస్టర్హుడ్ వల్ల జీవితంలో తిరిగి నిలబడ్డవాళ్లున్నారు. ఇదే స్ఫూర్తిని వాళ్లూ కంటిన్యూ చేయాలి. ఒక చైన్ లా పెరుగుతూ పోవాలి. అయితే ఈ బాండింగ్ ఏకాభిప్రాయమున్న వాళ్లతోనే కాదు మన ఆలోచనలు, అభిప్రాయాలు కలవని వాళ్లతోనూ క్రియేట్ చేసుకోవాలి. మనలో మనకు ఎన్ని వైరుధ్యాలున్నా సరే కలసే నడవాలి.. కలసికట్టుగా ఉండాలి. అదిప్పుడు అత్యంత అవసరమైన బంధం. – అపర్ణ తోట, భూమిక విమెన్స్ కలెక్టివ్, రచయిత్రి కూడా. ఈ ప్రయాణం ఆగిపోకూడదు ‘నేను శాండియాగాలో ఉండి.. నువ్వు బర్మాలో ఉన్నా.. నేనొక జెలస్ పర్సన్‌ని పెళ్లిచేసుకున్నా.. నువ్వొక ఓవర్పొజెసివ్ పర్సన్‌ని పెళ్లి చేసుకున్నా.. ఏ అర్ధరాత్రో నీకు నా అవసరం పడింది అంటే నేను నీ దగ్గరకి రావల్సిందే! దటిజ్ సిస్టర్హుడ్ అన్న మాయా ఏంజిలో కోట్ నాకెప్పుడూ గుర్తొస్తుంటుంది. నిజమే!తోటి మహిళలందరినీ అక్కాచెల్లెళ్లుగా భావించి వాళ్ల బాధను పంచుకోవడం, వాళ్లకోసం నిలబడ్డం కావాలిప్పుడు! ఒక్కోసారి చిన్న మాట సాయం కూడా అవతలి వాళ్లను నిలబెడుతుంది. అలాంటివి చేయడంలో ఎప్పుడైతే ఫ్యామిలీ ఫెయిల్ అవుతుందో అప్పుడు మనం ఈ సిస్టర్హుడ్ కన్సర్న్ చూపించాలి. జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనమున్నామనే భరోసానివ్వాలి. పట్టుకున్న చేతులను వదిలిపెట్టకుండా తప్పొప్పులను సవరించుకుంటూ ఒకరికొకరం తోడుగా, ఒకరికొకరం అండగా నడవడాలి. ఈ ప్రయాణం ఆగిపోకూడదు. సమాజం కులం పేరుతో మనుషులను, మనుషుల్లో మళ్లీ ఆడవాళ్ల మ«ధ్యా విభజన గీత గీసింది. దాని ప్రభావంతో ఒకప్పుడు దళిత మహిళల మీద లైంగికదాడి జరిగితే ఇతర స్త్రీలెవరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ మహిళలే బాధిత మహిళల పక్షాన నిలబడుతున్నారు. అంటే పురుషాధిపత్యం క్రియేట్ చేసిన కుల మత భేదాల అడ్డంకులన్నిటినీ దాటుకొని సిస్టర్హుడ్ ఇవాల్వ్ అవుతోందన్నట్టే కదా! మంచి పరిణామమే. అయినా ఇంకో వైపు భయమేస్తోంది కూడా మళ్లీ వెనక్కి వెళ్లిపోతామేమోనని.. కుల మత భేదాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే! దీనివల్ల సిస్టర్హుడ్ కూడా కచ్చితంగా ఎఫెక్ట్ అవుతది. కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. మరింత స్ట్రాంగ్ బాండ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ దిశగా మహిళలను మోటివేట్ చేస్తూ బాండింగ్ గ్రూప్స్ ఏర్పాటులో సహాయపడుతూ సిస్టర్‌హుడ్‌ను డెవలప్ చేయాల్సిన అవసరం ఫెమినిస్ట్లకు కూడా ఉంది. – దీప్తి సిర్లా, సామాజిక కార్యకర్త, దళిత్ ఫెమినిస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చాన్నాళ్ల కిందట.. సిమీ గరేవాల్ చాట్ షోలో.. ‘మిస్ ఇండియా పోటీలో నాతోపాటు లారా దత్తా కూడా కంటెస్టెంట్ అయ్యుండి కూడా తను నాకు మేకప్ వేసుకోవడం నేర్పించింది, ఎలా నడవాలో చూపించింది’ అని చెప్పింది ప్రియాంక చోప్రా. తర్వాత కొన్నాళ్లకు అదే చాట్ షోకి వచ్చిన లారా దత్తాతో ‘మిస్ ఇండియా బ్యూటీ కంటెస్ట్ టైమ్‌లో నువ్వు ప్రియాంక చోప్రాకు చాలా హెల్ప్ చేశావట కదా.. ఒకసారి ఈ షోలోనే ప్రియాంక చెప్పింది. తను నీకు పోటీ కదా? అలా ఎలా సాయం చేయగలిగావ్?’ అని అడిగింది సిమీ గరేవాల్. బదులుగా లారా ‘పోటీలో గెలుపు కన్నా తోటి అమ్మాయికి సాయం చేశానన్న ఫీలే నాకు సంతృప్తినిస్తుంది. ఎదుటివాళ్ల ఇబ్బందిని అడ్వాంటేజ్‌గా తీసుకుని సాధించే గెలుపును ఆస్వాదించలేను. ఆ గిల్ట్‌ను మోయలేను’ అని చెప్పింది. స్త్రీకి స్త్రీ శత్రువు కానేకాదు అని చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం ఉంటుంది?! చదవండి: FIFA World Cup Qatar 2022 Second Final : మెస్సీ VS ఫ్రాన్స్ -
ఆ ఊరంతా అద్దెకు.. ఒక్క రోజుకు ఎంతంటే?
ఏదైనా ఊరికి బదిలీ అయితే, ఆ ఊళ్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం మామూలు. కొద్దిరోజుల పనికోసమే అయితే, హోటల్ గది అద్దెకు తీసుకోవడమూ మామూలే. ఇటలీలోని ఒక చిత్రమైన ఊరుంది. ఎవరైనా నిర్ణీత మొత్తం చెల్లిస్తే, ఏకంగా ఆ ఊరంతటినీ అద్దెకు తీసుకోవచ్చు. ఇటలీ నడిబొడ్డున ఉండే లె మార్షె ప్రాంతంలో ఉన్న ఈ మధ్యయుగాల నాటి ఊరి పేరు పెట్రిటోలి. రోమన్ నాగరికత కాలం నాటి పురాతన కట్టడాలు, వాటిలోని నేలమాళిగలు, బోటిక్ లాడ్జింగులు, వాటితో పాటే ముప్పయ్యేడు పడకగదుల భారీ రాచప్రాసాదం, ఒక రంగస్థల వేదిక ఈ ఊరి ప్రత్యేకతలు. వీటన్నిటితో కూడిన ఈ ఊరును అద్దెకు తీసుకోదలచుకున్న వారు రోజు 1303 పౌండ్లు (రూ.1,28,577) చెల్లించాల్సి ఉంటుంది. యూరోప్‌లోని సంపన్నుల్లో చాలామంది కుటుంబ సమావేశాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు వంటి కార్యక్రమాల కోసం దీనిని అద్దెకు తీసుకుంటున్నారు. సముద్రమట్టానికి మూడువందల మీటర్ల ఎత్తున ఉండే ఈ ఊరి వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. చదవండి: Winter Festivals: శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని రాయడంతో! శీతాకాల సంబరాల విశేషాలు.. -
మంచుకొండల్లో రక్తజలపాతం.. ఎక్కడంటే?
అక్కడి జలపాతాన్ని చూస్తే, అక్కడేదో రక్తపాతం జరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఎర్రని రక్తధారల్లా నీరు ఉరకలేస్తూ ఉంటుంది. చలికాలంలో పూర్తిగా గడ్డకట్టుకుపోయి, నీటి మధ్య వెడల్పాటి నెత్తుటి చారికలా కనిపిస్తుంది. ఈ రక్తజలపాతం అంటార్కిటికాలో ఉంది. టేలర్ వ్యాలీ వరకు విమానంలో చేరుకుని, ఇక్కడకు పర్వతారోహణ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అంటార్కిటికా మంచుకొండల మీదుగా ఈ జలపాతం ఉరుకుతున్న దృశ్యం సందర్శకులను గగుర్పాటుకు గురిచేస్తుంది. అరుదైన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు ఔత్సాహిక పర్వతారోహకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి నీటిలో ఇనుము సాంద్రత ఎక్కువగా ఉండి, ఆ ఇనుము ఉప్పునీటి కారణంగా తుప్పుపట్టడం వల్ల జలపాతం మధ్యలో నీరు ఎర్రగా మారుతోందని అలాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జలపాతాన్ని చూడటానికి ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు అనుకూలమైన కాలం. ఈ కాలంలోనే సాహస ప్రవృత్తిగల పర్యాటకులు దేశ దేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. చదవండి: VenkampalliL: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ -
ఒకే లాంటి మూడు హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే!
అది 1984 జూలై 21, అమెరికాలోని మోంటానా.. రోసన్డన్ లోని సేక్రడ్ హార్ట్ క్యాథలిక్ చర్చి. అక్కడంతా ఫాదర్ జాన్ కెర్రిగన్(58) కోసమే వెతుకుతున్నారు. ముందురోజు రాత్రి 11 గంటలకు అతడ్ని చర్చ్‌కి ఎదురుగా ఉన్న బేకరీలో చూశామని, మాట్లాడామని, కాసేపట్లో వెళ్లి పడుకుంటాను అంటూ గుడ్‌నైట్ కూడా చెప్పారని కొందరు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఎంతసేపటికీ జాన్ ఆచూకి తెలియక పోవడంతో.. చర్చ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే విచారణ మొదలైంది. మరుసటి రోజు, ఫ్లాట్‌హెడ్ సరస్సు సమీపంలో హైవే వెంబడి రక్తంతో తడిసిన షర్ట్, షూస్, చలికోటు దొరికాయి. అవి కెర్రిగన్వే కావడంతో మిస్సింగ్ కేసు కాస్తా మర్డర్ కేసుగా మారిపోయింది. ఆ చోటంతా జల్లెడపట్టారు అధికారులు. అప్పుడే కోట్ హ్యాంగర్ ఒకటి కనిపించింది. దాన్ని కిల్లర్.. కెర్రిగన్ని బంధించడానికి లేదా గొంతు కోయడానికి ఉపయోగించి ఉంటాడని అంచనాకొచ్చారు. అయితే కెర్రిగన్ బాడీ మాత్రం దొరకలేదు. సరిగ్గా వారం తర్వాత జూలై 29న, కెర్రిగన్ కారు రక్తపు మరకలతో కనిపించింది. కొద్ది అడుగుల దూరంలో కారు తాళం పడేసి ఉంది. డిక్కీ తెరిచే ఉంది. దానిలో పార, దిండుతో పాటు కెర్రిగన్ వాలెట్ కూడా రక్తంతో ముద్దయ్యాయి. వాలెట్ నిండా డబ్బులుండటంతో.. ఈ నేరం డబ్బు కోసం జరగలేదని.. పగ, ప్రతీకారంతోనే జరిగిందని కేసు దర్యాప్తు అధికారులకు క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో 1982లో జరిగిన మరో ఇద్దరు చర్చ్ ఫాదర్స్ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసులు మళ్లీ చర్చనీయాంశాలుగా నిలిచాయి. ఆ రెండు కేసులకి, ఫాదర్ కెర్రిగన్ అదృశ్యానికీ.. ఏదో సంబంధం ఉందనే అనుమానంతో.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. అంతకు ముందు ఏం జరిగింది? 1982 ఆగస్ట్ 7న న్యూ మెక్సికోలోని శాంటా ఫేలో సెయింట్ ఫ్రాన్సిస్ కేథడ్రల్ చర్చ్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘నా పేరు మైకేల్ కార్మెల్లో, చావుబతుకుల మధ్య ఉన్న మా తాతకు ఎక్స్ట్రీమ్ అంక్షన్(క్యాథలిక్ మతకర్మల ప్రకారం తీవ్ర అనారోగ్యానికి గురైనవారి కోసం, చివరి దశలో ఉన్న వృద్ధుల కోసం చర్చ్ ఫాదర్స్ ప్రార్థనలు చేస్తారు) ఇవ్వాలని కోరాడు. మొదట ఫోన్ లిఫ్ట్ చేసిన ఓ ఫాదర్.. నాకు వీలుపడదు కానీ..మరో పదిహేను నిమిషాలు ఆగి కాల్ చేయమని చెప్పాడు. సరిగ్గా పదిహేను నిమిషాలకి ఆ అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేíసిన.. రెనాల్డో రివెరా(57) అనే ఫాదర్ ఆ అజ్ఞాత వ్యక్తి కోరికను కాదనలేకపోయాడు. వస్తానని అతడికి మాటిచ్చాడు. ఎక్కడికి రావాలని రివెరా అడిగితే.. ‘న్యూ మెక్సికోలోని వాల్డో సమీపంలో రెస్ట్ స్టాప్‌లో ఉంటాం’ అని వివరాలు చెప్పాడు ఆ వ్యక్తి. దాంతో రివెరా వాల్డోకు వెళ్తునట్లు చర్చ్ మఠాధిపతికి సమాచారం ఇచ్చి చర్చ్ నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత అతడు తిరిగి రాలేదు. సరిగ్గా మూడు రోజుల తరువాత, ఫాదర్ రివెరా మృతదేహం రెస్ట్ స్టాప్ నుంచి మూడు మైళ్ల దూరంలో బయటపడింది. కాస్త దూరంలో కారు కూడా దొరికింది. ఫాదర్ కెర్రిగన్ అదృశ్యానికి, ఫాదర్ రివెరా హత్యకు మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరి కార్లూ నేరస్థలానికి దూరంగానే విడిచారు. రెండు కేసుల్లోనూ కోట్ హ్యాంగర్స్ కామన్‌గా నిలిచాయి. అవి కూడా ఒకే కంపెనీకి చెందినవి. ఇన్ని సరిపోలిన తర్వాత రెండు హత్యలకు సూత్రధారులు ఒక్కరనే నమ్మకానికి వచ్చేశారు పోలీసులు. పైగా ఈ హత్యలకు క్యాథలిక్ వ్యతిరేకవర్గాలే ప్రేరణగా నిలుస్తున్నాయని.. చాలా మంది నమ్మారు. అయితే అందుకు సరైన ఆధారాలు లభించకపోవడంతో ఆ ఊహాగానాలను పోలీసులు కొట్టి పడేశారు. రివెరాతో ఫోన్లో మాట్లాడిన.. మైకేల్ కార్మెలో అనే వ్యక్తి కోసం పోలీసులు ఓ రేంజ్లో వేట మొదలుపెట్టారు. మోంటానా రాష్ట్ర సైనికుల సాయం కూడా తీసుకున్నారు. హత్యలో కనీసం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని చాలామంది భావిస్తున్నారు. కొందరు అనుమానితుల్ని పట్టుకుని నిలదీశారు. స్థానికంగా కొందరు యువకుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయినా ఎలాంటి ఆధారం దొరకలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఆగస్ట్ 8న చివరిసారిగా ఫాదర్ కెర్రిగన్ను చూశామని తేలడంతో.. అసలు కెర్రిగన్ చనిపోలేదా? బతికే ఉన్నాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. పైగా 1982లో మిస్ అయిన మరో ఫాదర్ జేమ్స్ ఓటిస్ ఆండర్సన్.. కెర్రిగన్ స్నేహితుడే కావడం కూడా ఈ కథలో రక్తికట్టించే అంశమే. మరో ఫాదర్ కథ? జేమ్స్ ఓటిస్ 1982 జూన్ 13న మోంటానాలోని టౌన్సెండ్లోని హైవే 12వైపు కారులో వెళ్తూ కొందరికి కనిపించాడు. అదే చివరిసారి. ఆ తర్వాత అతడి కారు టౌన్‌సెండ్‌కు ఈశాన్యంలో ఉన్న బిగ్బెల్ట్ పర్వతాలలో పెద్దపెద్ద చెట్ల మధ్య దొరికింది. అతడి భార్య.. జేమ్స్‌కి డ్రైవింగ్ అంతగా రాదని.. అలాంటి పర్వతాల మధ్య అస్సలు డ్రైవ్ చేయలేడని చెప్పింది. దాంతో అప్పట్లో.. కారు ఎవరో కావాలనే అక్కడికి తీసుకుని వెళ్లారనే కోణంలో విచారణ చేశారు. అలాగే ఆ పరిసర ప్రాంతాలను క్షుణంగా పరిశీలించగా.. జేమ్స్‌కి సంబంధించిన బైబిల్స్, కళ్లజోడు, టోపీ, క్లరికల్ కాలర్ ఇలా చాలా వస్తువులు దొరికాయి. కానీ జేమ్స్ మాత్రం దొరకలేదు. కెర్రిగన్ మిస్సింగ్ తర్వాత.. పోలీసులు ఈ మూడు కేసుల్ని చాలెంజింగ్‌గా తీసుకున్నారు. కానీ ఎలాంటి క్లూస్ లభించలేదు. అయితే 2015లో రోమన్ క్యాథలిక్ డియాసెస్ ఆఫ్ హెలెనా నిర్వహించిన సర్వే ఒకటి బయటికి వచ్చింది. అందులో పశ్చిమ మోంటానాలో పిల్లలను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఎనభై మంది మాజీ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. వారిలో ఫాదర్ కెర్రిగన్ ఒకడు. ఒక్కసారిగా కేసు ఆ దిశగా తిరిగింది. లైంగిక వేధింపులతో సంబంధం ఉండటం వల్లే ఆ బాధితుల్లో ఎవరో చంపేసి ఉంటారని ఊహాగానాలు పుట్టు కొచ్చాయి. అయితే కొందరు పరిశోధకులు ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. ఏదిఏమైనా కెర్రిగన్, జేమ్స్‌లు ఎప్పుడూ, ఎవరికీ కనిపించ లేదు. కనీసం మృతదేహాలు కూడా కానరాలేదు. మరి ముగ్గురి అదృశ్యానికి, మరణానికి ఒక్కడే సీరియల్ కిల్లర్ కారణమా? లేక వేరువేరు కథలను కన్ఫ్యూజన్తో పోలీసులు ఏకం చేయడానికి ప్రయత్నించారా? అనేది నేటికీ మిస్టరీగానే ఉంది. ∙సంహిత నిమ్మన -
60 ఏళ్లగా ఆ ఊరు ఖాళీ... ఒక్కరు కూడా లేరు! ఎక్కడంటే?
దాదాపు అరవయ్యేళ్లుగా ఆ ఊరు ఖాళీగానే ఉంటోంది. చిట్టచివరి మనిషి ఈ ఊరిని ఖాళీచేసి వెళ్లిపోయిన నాటి నుంచి ఇక్కడ పిట్టమనిషి కూడా ఉండటం లేదు. స్పెయిన్‌లోని స్వయంపాలిన ప్రాంతమైన ఎస్ట్రెమాడురాలో ఉన్న ఈ ఊరి పేరు గ్రానడిల్లా. ప్రపంచం నలుమూలలా రకరకాల కారణాల వల్ల అక్కడక్కడా ఖాళీ ఊళ్లు కనిపిస్తుంటాయి గాని, గ్రానడిల్లా ఖాళీగా పడి ఉండటానికి కారణం మాత్రం కొంత విచారకరమైనది. ఈ చిన్న పట్టణాన్ని తొమ్మిదో శతాబ్దిలో అప్పటి ముస్లింపాలకులు నిర్మించారు. ఈ ఊళ్లోని జనాలు ప్రధానంగా ఊరిబయటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్లు. స్పెయిన్ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1950లో ఈ ఊరి సమీపంలోని నది మీద రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ప్రకటించాడు. రిజర్వాయర్ పనులు కొనసాగుతుండగా, 1960 ప్రాంతంలో ఊరు మునిగిపోవచ్చని అప్పటి అధికారులు అంచనా వేశారు. దాంతో ఊళ్లోని జనాలు భయపడి ఊరిని ఖాళీచేసేశారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా, ఊరు మునిగిపోలేదు. అయితే, రిజర్వాయర్ కోసం ఊరికి దారితీసే రోడ్లన్నిటినీ కొట్టేశారు. దాంతో ఈ ఊరు బాహ్యప్రపంచంలో సంబంధాలు కోల్పోయి ఒక ద్వీపంలా మారింది. చదవండి: Pauline Death Mystery: పాలిన్ చనిపోయిందంటున్నారు.. ఇంటికి వచ్చిందెవరు? -
World Kitchen Garden Day: ఇంతింతైన ఇంటిపంటల సంస్కృతి..
‘ఆహారమే ప్రథమ ఔషధం’ అన్న పెద్దల మాటను కరోనా .. ప్రజలకు జ్ఞాపకం చేసింది. అంతేకాదు, సేంద్రియ ఇంటిపంటలు మిద్దెతోటల సాగు దిశగా పట్టణ ప్రజలను పురికొల్పింది. సీనియర్ కిచెన్ గార్డెనర్ల సలహాలు, సూచనలకు గిరాకీ పెంచింది. సాధారణ గృహిణులైనప్పటికీ సీనియర్లు ప్రత్యేక యూట్యూబ్ చానల్స్ ప్రారంభించారు. తరచూ వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి వ్యూస్ పొందుతున్నారు. తమ సలహాలకు ఆర్థిక విలువ చేకూరటం కూడా వారికి సంతోషాన్నిస్తోంది. ఇంటిపట్టునే ఉండి ఉద్యోగాలు చేసుకునే సదుపాయం యువతకు అందుబాటులోకి రావటం వల్ల కూడా ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ (అర్బన్ అగ్రికల్చర్, సిటీ ఫార్మింగ్) వ్యాపకం తెలుగునాట ఆరోగ్యదాయకంగా విస్తరిస్తోంది! ఆగస్ట్ 28న ‘వరల్డ్ కిచెన్ గార్డెన్ డే’ సందర్భంగా ఈ కవర్ స్టోరీ.. పల్లెల్లో నాగలి పట్టిన రైతులు, రైతు కూలీలు ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తూ ఉంటే.. వారు పండించే ఆహారోత్పత్తులను తింటూ పట్టణాలు, నగరాల్లో నివసించే వారు పరోక్షంగా వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. రైతులు ఉత్పత్తిదారులైతే, వినియోగదారులు సహ–ఉత్పత్తిదారులన్న మాట. ‘భోజనం చేయటం కూడా వ్యవసాయక చర్యే’ అని ప్రసిద్ధ పర్యావరణవేత్త వెండెల్ బెర్రీ అన్నది ఇందుకే! ప్రజలు తినగోరే వ్యవసాయోత్పత్తులకే మార్కెట్లో గిరాకీ ఉంటుంది. వాటినే గ్రామాల్లో రైతులు పండిస్తూ ఉంటారు. మనం గ్రహించినా, గ్రహించకపోయినా.. మనందరం వ్యవసాయంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్లమే. నగరవాసుల్లో ఉంటూlతమ కోసం సేంద్రియ పద్ధతుల్లో ఆరోగ్యదాయకమైన ఇంటి పంటలు పండించుకొని తినే ‘అర్బన్ ఫార్మర్స్’ సంఖ్య మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మన నగరాల్లో సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల సాగు వేగంగా విస్తరిస్తోంది. పెరట్లో, బాల్కనీల్లో, భవనాలు, మిద్దెల మీద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రసాయనాలు వాడకుండా సాగు చేయటం బాగా పెరిగింది. అంతేకాదు, కరోనా నేపథ్యంలో నగర పరిసరాల్లో అంతకుముందు ఖాళీగా ఉన్న ఫామ్ హౌస్ భూములు, కమ్యూనిటీ ఖాళీ స్థలాల్లోనూ ప్రకృతి,సేంద్రియ సేద్యం ఊపందుకుంది. నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో నివసించే వారిలోనూ సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటలపై ఆసక్తి గత రెండేళ్లలో అనేక రెట్లు పెరిగింది. ప్రధానంగా సొంత భవనాల్లో నివాసం ఉండే మధ్య తరగతి లేదా ఉన్నత–మధ్య తరగతి సాగుదారులు ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. బెంగళూరు, పుణే, త్రివేండ్రం, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కరీంనగర్, వరంగల్ వంటి అనేక భారతీయ నగరాల్లో ఈ ధోరణి మనకు ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రజలకు, పర్యావరణానికీ ఆరోగ్యదాయకంగా నిలిచే సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల సాగు సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో తామర తంపరగా విస్తరిస్తోంది. ప్రచారోద్యమానికి శ్రీకారం సాక్షి మీడియా గ్రూప్ ‘రేపటికి ముందడుగు’ నినాదంతో దశాబ్దం క్రితమే సేంద్రియ ‘ఇంటిపంట’ల ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇంటిపంటల సాగులో కొత్త టెక్నిక్స్‌ను పరిచయం చేయటమే కాకుండా, సుసంపన్నమైన ప్రజల ఇంటిపంటల సాగు అనుభవాలతో కూడిన కథనాలను శ్రద్ధగా ప్రచురించటం గత పదకొండేళ్లుగా ‘సాక్షి’ చేస్తోంది. ఇంటిపంటల సాగుదారుల కథనాలతో పాటు వారి ఫోన్ నంబర్లు ప్రచురించడం ద్వారా ఈ అనుభవాలను ఇతరులు నేర్చుకోవడానికి వీలు కలిగింది. ఈ కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో లోగిళ్లు సేంద్రియ ఇంటిపంటలతో కళకళలాడుతున్నాయి. ‘సాక్షి’ ఇంటిపంటల కథనాల ప్రేరణతో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యాన శాఖ హైదరాబాద్‌లో ఇంటిపంటల సాగు ప్రారంభానికి అవసరమైన సరంజామాను సబ్సిడీపై అందించటం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉద్యాన శాఖ అప్పట్లోనే అర్బన్ అగ్రికల్చర్ విభాగాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం సబ్సిడీ కిట్లు ఇవ్వటం లేదు కానీ, ఔత్సాహికులకు నెలకు రెండు రోజులు శిక్షణ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అడపా దడపా కిచెన్ గార్డెనింగ్పై శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో సమృద్ధిగా సమాచారం అందుబాటులో ఉండటంతో చిన్నా చితకా పట్టణాలు, గ్రామాల్లో నివాసం ఉండే ఆరోగ్యాభిలాషులు చాలా మంది స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతోనే సేంద్రియ ఇంటిపంటల సాగుకు ఉపక్రమిస్తున్న ట్రెండ్ కనిపిస్తోంది. సొంతూళ్లకు చేరిన ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కూడా ఇంటిపంటల వ్యాప్తికి దోహపడిందనే చెప్పాలి. రోజువారీ తినే కూరగాయలు, పండ్లల్లో చాలా వరకు తమ మిద్దె, ఇంటిపైనే పండించుకుంటున్న ప్రొఫెషనల్ కిచెన్ గార్డెనర్స్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఉన్నారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి వారైతే చాలా ఏళ్లుగా నూటికి నూరు శాతం తమ మిద్దెతోటపైనే ఆధారపడుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇళ్లపైన కంటెయినర్లలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసే వంద మందిపై జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) అధ్యయనం చేసింది. తాము రోజువారీగా తినే కూరగాయల్లో 81%, పండ్లలో 10% వరకు తమ ఇంటిపైనే పండించుకుంటున్నామని 50% కన్నా ఎక్కువ మంది చెప్పారు. కొంతమంది కూరగాయల కన్నా పండ్లపైనే దృష్టి పెడుతుండటం విశేషం. తింటున్న పండ్లలో 85%, కూరగాయల్లో 7% మేరకు తామే కుండీలు, మడుల్లో ఇంటి దగ్గర పండించుకుంటున్నామని 25% మంది చెప్పారు. ఏభయ్యేళ్లు దాటిన వారు 46% మంది ఇంటిపంటలు పండిస్తున్నారు. వీరిలో 35 ఏళ్లు దాటిన వారు 34%. పది కన్నా ఎక్కువ రకాల కూరగాయలు, పండ్లను 15% మంది సాగు చేస్తున్నారు. 5 రకాలను 45% మంది, 10 రకాలను 40% మంది సాగు చేస్తున్నారు. 91% మేరకు మట్టి కుండీలను వాడుతుండటం విశేషం. బెంగళూరు భళా వంటింటి వ్యర్థాలతో ఇంటి వద్దే కంపోస్టు తయారు చేయటం, ఇళ్లపై కంటెయినర్లలో సేంద్రియ కూరగాయలు, పండ్లు పెంచుకోవడంలో బెంగళూరు మన దేశంలోనే ముందంజలో ఉందని చెప్పొచ్చు. భారతీయ సిటీ ఫార్మింగ్ పితామహుడుగా పేరుగాంచిన డా. విశ్వనాథ్ బెంగళూరు వారే. వ్యవసాయ శాస్త్రవేత్తగా రిటైరైన తర్వాత, గత ఏడాది కరోనాతో చనిపోయేంత వరకు, 20 ఏళ్ల పాటు వేలాది మందికి టెర్రస్ ఫార్మింగ్‌లో శిక్షణ ఇచ్చిన ఘనత ఆయనది. అంతేకాదు, టెర్రస్ కిచెన్ గార్డెన్స్‌లో పెంచి తాము తినగా మిగిలిన కూరగాయలు, పండ్లు.. వాటితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 3 నెలలకోసారి ప్రత్యేక మేళాలు నిర్వహించుకునే ఉన్నత స్థాయికి సిటీ ఫార్మింగ్ చైతన్యం బెంగళూరులో వికసించింది. ఇంటిపంటలతో ప్రయోజనాలోన్నో పట్టణ వ్యవసాయం బహుళ ప్రయోజనాలను చేకూర్చగలదని బెంగళూరులోని భారతీయ మానవ ఆవాసాల సంస్థ (ఐఐహెచ్ఎస్) భావిస్తోంది. బెంగళూరు, పుణేలో సేంద్రియ ఇంటిపంటల సాగు తీరుతెన్నులపై ఈ సంస్థ ఇటీవల పరిశోధన చేపట్టింది. మరింత వైవిధ్యమైన – పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం, వైద్య ఖర్చులు తగ్గించడం, తడి వ్యర్థాలను పునర్వినియోగించడం, వర్షపు నీటి సంరక్షణకు దోహదం చేస్తుంది. పట్టణ పౌరులు ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వడానికి, సుస్థిర జీవనంపై లోతైన అవగాహన కలిగించుకోవడానికి అర్బన్ అగ్రికల్చర్ సహాయపడుతుంది. ప్రజలకు చేకూరుతున్న ఈ ప్రయోజనాలు పైకి కొట్టొచ్చినట్టు కనిపించనివైనప్పటికీ భారతీయ నగరాల సుస్థిర భవిష్యత్తుSదృష్ట్యా విధానాల రూపకల్పనకు ఎంతగానో దోహదపడతాయని అంటున్నారు ఐఐహెచ్ఎస్ నిపుణులు స్వర్ణిక శర్మ. ఆరోగ్యవంతమైన నగరాల కోసం.. ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ ద్వారా ప్రజలకు సుమారు 15% ఆహారం అందుతోందని అంచనా. 70 కోట్ల మంది నగరవాసులకు ఈ ఫుడ్ అందుతోంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఊపందుకున్న నగరీకరణ వల్ల 2030 నాటికి 60% మంది అర్బన్ ప్రాంతాల్లోనే నివాసం ఉంటారు. కాబట్టి, నగరాలు, పట్టణాల శివారు ప్రాంత భూముల్లోను, కాంక్రీటు జంగిల్‌గా మారిన నగరాలు, పట్టణాల్లోని భవనాలపైన, బాల్కనీల్లో, ఖాళీ స్థలాల్లో వీలైన చోటల్లా అలంకరణ మొక్కలకు బదులు ఆహార మొక్కలు, పండ్ల చెట్లు పెంచటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తాజాగా, స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ‘అర్బన్ అగ్రికల్చర్’తో ఒనగూడే ప్రయోజనాలు పుష్కలం. ఆహార కొరత తీర్చటం, ఆరోగ్యాన్ని జీవన నాణ్యతను మెరుగుపరచడం, పర్యావరణంపై అవగాహనను పెంపొందించటం వంటి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అర్బన్ అగ్రికల్చర్ దోహదపడుతుంది. అందుకే ఐక్యరాజ్య సమితి ఆహార–వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) అర్బన్–పెరీ అర్బన్ అగ్రికల్చర్ పాలసీపై పాలకులకు తాజాగా సరికొత్త సూచనలు చేసింది. అర్బన్ ప్లానింగ్‌లో ఈ స్పృహను మిళితం చేయాలని, ‘గ్రీన్ సిటీ’లకు బదులు ‘ఎడిబుల్ సిటీలు’గా తీర్చిదిద్దాలని ఎఫ్.ఎ.ఓ. సూచిస్తోంది. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సేంద్రియ ఇంటిపంటలు,మిద్దె తోటల ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలను పూర్తి స్థాయిలో గుర్తించి ప్రోత్సహించాలి. యూట్యూబర్ల హవా తెలుగు నాట రూఫ్‌టాప్ కిచెన్ గార్డెనర్లు అర్బన్ అగ్రికల్చర్‌ను స్థిరమైన దిగుబడులు పొందే రసాయన రహిత పద్ధతులు, సరికొత్త నమూనాలతో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. సందేహాలు తీర్చటం, అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి తొలి దశలో ఫేస్బుక్ గ్రూపులు కీలకపాత్ర పోషించాయి. తర్వాత లేక్కలేనన్ని వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపులు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉండి పనులు చేసుకునే అవకాశం అందిరావటం వల్ల నగరాలు, పట్టణ వాసులు ఆరోగ్య పరిరక్షణోద్యమంగా సేంద్రియ ఇంటిపంటలు,మిద్దె తోటల సాగును చేపట్టారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు ప్రత్యేకించి ఔషధ మొక్కల సాగు సైతం తెలుగు నాట ఇప్పుడు ఉధృతమైంది. ఈ పూర్వరంగంలో యూట్యూబ్ చానళ్లు రంగంలోకి రావటంతో ఇది సరికొత్త ఉపాధి మార్గంగానూ మారింది. అంతకుముందు గత కొన్ని ఏళ్ల నుంచి అనుభవం గడించిన వారిలో కొందరు యూట్యూబ్ చానళ్లు ప్రారంభించి తమ అనుభాలను వీడియోల ద్వారా పంచుతూ ప్రాచుర్యం పొందుతున్నారు. ఓ తాజా సర్వే ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 168 యూట్యూబ్ చానల్స్ ఉన్నట్లు లెక్క తేలింది. సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటలపై సమగ్ర సమాచారాన్ని, అనుభవ జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్, కొన్ని యాప్‌ల ద్వారానే వీడియోలను ప్రొడ్యూస్ చేసే సాంకేతికత అందుబాటులోకి రావటం కలసివచ్చింది. తరచూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కిచెన్ గార్డెనింగ్‌లో ఏ సందేహం ఉన్నా నివృత్తి చేయటానికి ఇప్పుడు వీడియోలు యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. రోజుకో వీడియో పెడుతున్న వారూ ఉన్నారు. సృజనాత్మకతో కూడిన నాణ్యమైన వీడియోలు లక్షలాది వ్యూస్ నమోదు చేసుకుంటున్నాయి. యూట్యూబర్లుగా మారిన సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటల సాగుదారులు తమ అనుభవాలను ఇతరులకు అందుబాటులోకి తేగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నారు. అంతేకాదు.. ఈ వీడియోల ద్వారా నెలవారీగా గణనీయమైన ఆదాయాన్ని సైతం పొందుతుండటం సంతోషదాయకం. వీరిలో హైదరాబాదీయులు, ముఖ్యంగా మహిళలే ఎక్కువ! టెర్రస్ మీద 9 ఏళ్లుగా వందల కుండీలు, మడుల్లో ఎంతో వైవిధ్యభరితమైన పండ్ల చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సాగు చేస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని కుటుంబానికి అందిస్తున్నారు హైదరాబాద్ బీరంగూడకు చెందిన గృహిణి లత. పత్రికలు, టీవీ చానళ్లలో ఆమె కృషి గురించి కథనాలు వచ్చాయి. సలహాలు, సూచనల కోసం కరోనా కాలంలో ఫోన్లు, వాట్సప్ మెసేజ్‌లు వెల్లువయ్యాయి. ప్రతిసారీ వివరించి చెప్పాల్సి రావటం కష్టంగా ఉండటంతో ‘లతాస్ టెర్రస్ గార్డెన్’ పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభించాను అంటారామె సంతృప్తిగా. ఆరోగ్యానికి ఆహారమే మూలం అని గ్రహిస్తున్న ప్రజలు ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ విలువ తెలుసుకుంటున్నారని ఆమె అంటున్నారు. కిచెన్ వేస్ట్ బయటపడేయకుండా మట్టి కొంచెం, పేడ కొంచెం కలుపుకుంటే 20 రోజుల్లో కంపోస్టు తయారవుతుందని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కిచెన్ గార్డెనర్ నూర్జహాన్ అంటారు. నలుగురికీ మాట సాయం అందించే సాధనంగా ‘నూర్జహాన్ టెర్రస్ గార్డెన్’ పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. రోజు మార్చి రోజు వీడియోలు పెడుతున్నారు. ఇప్పటికి 754 వీడియోలున్నాయి. తన మేడపై దశాబ్దాలుగా గడించిన ఇంటిపంటల సాగు అనుభవ జ్ఞానాన్ని ప్రజలకు వివరంగా తెలియజెప్తున్నానన్న ఆనందం కలుగుతోందని నూర్జహాన్ సంతోషిస్తున్నారు. ∙పంతంగి రాంబాబు -
సైకిల్ రైడ్‌కి వెళ్లిన 'తారా లీ'కి ఏమైంది..? ఇప్పటికీ మిస్టరీగానే!
అది 1989 జూలై నెల. ఫ్లోరిడాలోని పోర్ట్సెయింట్ జాన్‌లోని రద్దీగా ఉండే కన్వీనియెన్స్ స్టోర్ పార్కింగ్‌లో ఓ మహిళ తన కారును పార్క్ చేస్తూ.. పక్కనే ఆగిన టయోటా కార్గో వ్యాన్ని గమనించింది. దాన్ని ఒక ముప్పై ఏళ్ల మీసాల వ్యక్తి డ్రైవ్ చేసుకుని రావడం, పార్క్ చేసి వేగంగా స్టోర్ లోపలికి వెళ్లడం చూసింది. ఆ టయోటాలో ఏదో అలికిడిగా అనిపించి.. వెనుక నుంచి వెళ్లి గమనించింది. ఆ కారు విండో ఓపెన్ చేసి ఉండటంతో.. తొంగి చూసింది. చూడగానే షాక్ అయ్యింది. అందులో ఒక యుక్త వయస్కురాలు, ఒక చిన్న బాలుడు నోటికి నల్లటి ప్లాస్టర్ వేసి, చేతులు వెనక్కి కట్టేసి బందీలుగా ఉన్నట్లు గుర్తించింది. వాళ్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కారు డోర్ రావట్లేదు. తను కూడా వాళ్లకు సాయం చెయ్యాలని అనుకుంది కానీ వీలు కాలేదు. వెంటనే వాళ్లను తన కారులో ఉన్న కెమెరాతో ఫొటో తీసి (చిత్రంలో గమనించొచ్చు) పోలీసులకు సమాచారం ఇవ్వడానికి పరుగుతీసింది. పోలీసులు వెంటనే స్పందించారు. కారు పోయేదారుల్లో రోడ్డు బ్లాక్ చేయడంతో పాటు.. కొందరు ఆ స్టోర్ పార్కింగ్‌ని తనిఖీ చేశారు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. కేవలం ఆమె తీసిన ఫొటో తప్ప మరే సాక్ష్యం లేదు. విషయం బయటికి రావడంతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె తీసిన ఫొటో చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. పలు టెలివిజన్ కార్యక్రమాల్లో విస్తృతమైన కవరేజీ వచ్చింది. ఆ ఫొటోలో యువతిని పరిశీలనగా చూసిన కొందరు.. తను కచ్చితంగా తారా లీ క్యాలికో అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు కాలికో కాదని కొట్టి పారేశారు. ఇంతకీ ఎవరా తారా లీ క్యాలికో? 1988 సెప్టెంబర్ 20న ఉదయం 9:30 గంటలకు ఇంటి నుంచి సైకిల్ రైడ్‌కి వెళ్లి, తిరిగి రాని పందొమ్మిదేళ్ల అమ్మాయి తారా. న్యూ మెక్సికోలోని వాలెన్సియా కౌంటీలో నివసించే ఆమె.. హైవే 47పైకి ప్రతిరోజు రైడ్‌కి వెళ్లేది. తనకది చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన తల్లి ప్యాటీ డోయెల్తో కలసి పోటీ పడేది. ఒకసారి తారా, ప్యాటీ కలసి రైడ్‌కి వెళ్లినప్పుడు.. ఓ అనుమానాస్పద ట్రక్ తమను వెంబడించడం చూసి ప్యాటీ భయపడింది. కొన్ని రోజులు రైడింగ్‌కి వెళ్లడం మానేస్తే బెటర్ అని.. వెళ్లినా సెక్యూరిటీ వెపన్స్ అందుబాటులో ఉంచుకోమని తారాను హెచ్చరించింది. అయితే తారా తేలిగ్గా తీసుకుంది. ‘ఆ రోజు తన సైకిల్ టైర్ గాలి తక్కువగా ఉందని నా సైకిల్ తీసుకుని వెళ్లింది. ఎప్పుడూ గంటలోపు వచ్చేసేది. ఆ రోజు రాలేదు. అనుమానం వచ్చి నేను వెతుక్కుంటూ వెళ్లాను. ఎక్కడా తారా కానీ తను వేసుకుని వెళ్లిన సైకిల్ కానీ కనిపించకపోవడంతో భయపడి పోలీసులకు కంప్లైంట్ చేశా’ అని చెప్పుకొచ్చింది ప్యాటీ. అయితే ఆ మరునాడు ప్యాటీ.. తారా వెళ్లిన దారిలోనే మరింత ముందుకు వెళ్తే.. ఇంటికి మూడు మైళ్ల దూరంలో తారా వాడే వాక్‌మన్ భాగాలు, బోస్టన్ టేప్ ముక్కలు కనిపించాయి. ఈ సారి పోలీసులు రంగంలోకి దిగారు. తారా అదృశ్యమైన నాలుగు రోజుల తర్వాత జాన్ ఎఫ్. కెన్నెడీ క్యాంప్‌గ్రౌండ్ సమీపంలో మరిన్ని వాక్‌మన్, టేప్ ముక్కలు దొరికాయి. అయినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తారా ఆ రోజు సైకిల్ మీద వెళ్లడం చాలా మంది చూశారు. అయితే అందులో కొందరు.. క్యాంపర్ షెల్ కలిగిన ఒక లేత–రంగు పికప్ ట్రక్‌ను తారాకు సమీపంలో గమనించామని చెప్పారు. ఫొటోలో బందీగా ఉన్న అమ్మాయి ముఖానికి ప్లాస్టర్ ఉండటంతో.. ప్యాటీ తన కూతురు తారాని సరిగా గుర్తించలేకపోయింది. అయితే ఫొటోలోని అమ్మాయి కాలు మీద ఉన్న చిన్న మచ్చను చూసి.. తన కూతురు తారాకు కారు యాక్సిడెంట్లో ఏర్పడిన గాయమే అదని గుర్తుపట్టింది. పైగా ఫొటోలో అమ్మాయి పక్కనే ఉన్న పుస్తకం తారాకు బాగా ఇష్టమైన పుస్తకం కావడంతో తనే తారా అని ఫ్యాటీ నిర్ధారించింది. మరి తను తారా అయితే.. ఆ బాబు ఎవరు? ఈ ప్రశ్నే పోలీసులకు మరో సవాలుగా మారింది. మొత్తానికీ ఆ అబ్బాయి పేరు మైకేల్ హేన్లీ అని, 1988లో తారా అపహరణకు గురైన ప్రదేశానికి 75 మైళ్ల దూరంలో తన తండ్రితో కలసి వేటకు వెళ్లినప్పుడు తప్పిపోయాడని ఆధారాలు సంపాదించారు. హేన్లీ కుటుంబం కూడా ఆ ఫొటోలో ఉన్న బాబు తమ బాబే అని అంగీకరించింది. దాంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. సరిగ్గా అప్పుడే కొన్నినెలల తేడాలో.. మరిన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. వాటిలో తారాను పోలిన అమ్మాయిలు నోటికి ప్లాస్టర్స్ కట్టి.. బందీగా ఉన్నట్లే ఉండటంతో ఇది కేసును పక్కదారి పట్టించడానికి నేరస్థులు ఆడుతున్న ఆటేనని పోలీసులు భావించారు. ఇక 1990లో మైకేల్ హేన్లీ అవశేషాలు.. తను అదృశ్యమైన ప్రదేశానికి 7 మైళ్ల దూరంలో బయటపడ్డాయి. దాంతో ఫొటోలో ఉన్న అబ్బాయి హేన్లీనేనా అనే అనుమానాలూ మొదలయ్యాయి. కూతురు మీద బెంగతో ప్యాటీ.. ఆరోగ్యం క్షీణించి 2006లో చనిపోయింది. 2008లో వాలెన్సియా కౌంటీకి చెందిన రెనే రివెరా అనే అధికారి మాట్లాడుతూ.. ‘తారా మిస్ అయిన రోజు.. ఇద్దరు యువకులు తారాతో మాట్లాడాలని ట్రక్‌లో ఆమెని ఫాలో చేశారు. కానీ అనుకోకుండా ట్రక్ సైకిల్ని ఢీ కొట్టడంతో.. తారా సైకిల్ మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కేసు అవుతుందనే భయంతో తారాను చంపేసి.. ఓ చెరువులో పడేశారని నాకు సమాచారం ఉంది. కానీ.. తారా బాడీ దొరక్కుండా నేను ఏ చర్యలు తీసుకోలేను’ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. రివెరా చెప్పిన కథ చాలా వరకూ నిజమేనని.. ఆ వెంబడించిన యువకుల్లో ఒకడు పోలీసు అధికారి కొడుకని.. తారాపై లైంగిక దాడి చేసి, చంపేసి ఉంటారని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అయితే స్టోర్ పార్కింగ్ ఫొటోలోని అమ్మాయి.. తారా ఒక్కరేనా? అసలు తారా ఏమైపోయింది? ఆ ఫొటోలో ఉన్న బాబు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలతో నేటికీ ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. ∙సంహిత నిమ్మన -
అల్లుకుంటున్న 'ఈ' స్నేహం.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ స్టోరీ!
అల్లుకుంటున్న ఈ స్నేహం స్నేహం... చెప్పేది కాదు.. చేసేది! వర్ణించే వీలు లేనిది.. ఆస్వాదనలో మాత్రమే అందేది! కష్టాన్ని తీర్చేది.. సంతోషాన్ని పెంచేది! మంచి.. చెడులు ఎంచకుండా ఎల్లకాలం వెంట ఉండేది! తప్పుల్ని కాస్తూ ఒప్పుల్లో నడిపించేది.. జనం మెప్పు అందించేది! దీని గుణం ఇంత గొప్పది కాబట్టే ఫ్రెండ్ లేని జీవన ప్రయాణం ఎడారిని తలపిస్తుంది! ఈ ప్రస్తావనకు సందర్భం ‘ఫ్రెండ్షిప్ డే’ అని అర్థమయ్యే ఉంటుంది! ఇరుగు,పొరుగు ఆవరణలు.. వీథులు.. బడులు.. కాలేజీలు.. ప్రయాణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా.. స్నేహం కుదరని చోటు లేదు ఈ లోకంలో. కరోనా వచ్చి మనిషిని ఏకాకిని చేద్దామని ప్రయత్నించింది. ఆ పరీక్షకూ నిలబడింది స్నేహం.. సోషల్ మీడియా ద్వారా వర్చువల్ రూపం తీసుకుని. నిజానికి ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్.. సోషల్ మీడియా పరిచయం అయిన నాటి నుంచే ఉనికిలో ఉంది. దాన్ని కరోనా బలోపేతం చేసింది. ఆ మాటకొస్తే కలం స్నేహాల కాలంలోనే వర్చువల్ ఫ్రెండ్షిప్లు ఊపిరి పోసుకునుంటాయి. ఉత్తరాలు.. లాంగ్ డిస్టెన్స్ స్నేహాలను పదిలంగా ఉంచాయి. వీటన్ని భర్తీ చేస్తోంది సోషల్ మీడియా! మార్పులు మనుషుల మీద ప్రభావం చూపిస్తున్నా తాను ఇగిరిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉంది స్నేహం. ఏ కొత్త మీడియం వచ్చినా దాన్ని తనకు వేదికగా మలచుకుంటోంది మనిషిని వదిలి వెళ్లిపోకుండా! ఈమెయిల్స్ మొదలు ఆర్కుట్.. ఫేస్బుక్.. ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్.. వాట్సాప్ ఇలా ఏ నెట్‌వర్క్‌లోనైనా ముందు ఇమిడిపోయింది స్నేహమే. బిజీ లైఫ్.. సాయంత్రాలు వీథి మలుపుల్లో.. ఇరానీ చాయ్ సెంటర్లలో.. థియేటర్లలో.. బాతాఖానీ కొట్టే వెసులుబాటును ఇవ్వలేకపోయినా ‘ఆన్లైన్’లో కావలసినంత స్పేస్ తీసుకుంటోంది ఫ్రెండ్షిప్. Hai.. Hwru, 5n అనే పొడి పొడి పదాల దగ్గర్నుంచి బాల్య స్నేహితుల గ్రూప్, స్కూల్, కాలేజ్ గ్రూప్స్, వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ గ్రూప్, ట్రావెల్ ఫ్రెండ్స్ గ్రూప్, కామన్ ఇంటరెస్ట్స్ ఫ్రెండ్స్ గ్రూప్ దాకా రకరకాల సమూహాల రూపంలో స్నేహం పలకరిస్తూనే ఉంది. నైతికంగా మద్దతిస్తూనే ఉంది. సోషల్ నెట్వర్క్ సిస్టమ్ వల్ల వ్యక్తిగతంగా కంటే వర్చువల్‌గా నడుస్తున్న స్నేహాలే ఇప్పుడు మనిషికి ఊరటనిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆన్లైన్ స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటున్న వాళ్లూ పెరిగిపోతున్నారు. అందుకే ఆన్లైన్ స్నేహం పాత జాన్ జిగ్రీలను బ్లెస్ చేస్తూనే కొత్త దోస్తుల జాబితానూ తయారు చేస్తోంది. ఫేస్బుక్ ద్వారా 40 ఏళ్లకు.. నలభై ఏళ్ల కిందట.. విడిపోయిన బాల్యమిత్రులు ఫేస్బుక్ ద్వారా తిరిగి కలుసుకున్న ఘటన ఇది. వాళ్లది ఇరవై ఏళ్ల స్నేహం. ఒకరికి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబసమేతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అడ్రస్ మిస్సయ్యింది. పైగా అప్పట్లో ఫోన్ సౌకర్యం కూడా పెద్దగా లేకపోవడంతో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఎయిర్‌ఫోర్స్ మిత్రుడు రిటైర్మెంట్ తర్వాత ఇంట్లోనే ఉండిపోయాడు. ఒకరోజు.. ఫేస్బుక్లో తన చిన్ననాటి స్నేహితుడు తారసపడ్డాడు. రాజకీయవేత్తగా ఎదగడంతో సంతోషం వ్యక్తం చేసి.. ఫేస్బుక్లో అతని వాల్ మీద ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. ‘ముంబై నుంచి జాకబ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడ’ని అవతలి స్నేహితుడికి చెప్పాడు. అతను ఎవరో కాదు టీఆర్ఎస్ నేత పద్మారావు. తనకు ఫోన్ చేసిన వ్యక్తి 40 ఏళ్ల కిందట దూరమైన తన బాల్యమిత్రుడు జాకబ్ అని తెలియడంతో పద్మారావు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ప్రాణ సఖి వేలు నాచియార్.. పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన మహారాణి. బ్రిటిషర్స్ మీద మొట్టమొదటిసారిగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సాహసి. నిజానికి ఆమె చేసిన పోరును ప్రథమ స్వాతంత్య్ర సమరం అనొచ్చు. అయితే కుయిలీ అనే యోధ లేకపోతే వేలు నాచియార్ ఆ పోరాటం అంత సులవయ్యేది కాదు. కుయిలీ.. వేలు నాచియార్‌కు ప్రాణ స్నేహితురాలు. బ్రిటిష్ పాలకుల మీద స్నేహితురాలు తలపెట్టిన యుద్ధంలో ఆమెకు అండగా నిలిచి పోరాడింది. తన ఒంటి మీద నెయ్యి, నూనె పోసుకుని, నిప్పంటించుకుని మానవ బాంబుగా కదనరంగంలోకి దూకింది. తన స్నేహితురాలి కోటను కాపాడింది. భారతదేశ చరిత్రలో తొలి మానవ బాంబు కుయిలేనట. తుది శ్వాస వరకు.. కొప్పెరుంచోళుడు .. చోళుల తొలితరం రాజుల్లో ఒకడు. పిసిరంతైయార్ కవి. ఈ ఇద్దరూ తమ జీవితకాలంలో ఒకరినొకరు చూసుకోలేదు. కొప్పెరుంచోళుడి పరిపాలనకు ముగ్ధుడయ్యాడు పిసిరంతైయార్. అతని కవిత్వానికి ఆరాధకుడయ్యాడు కొప్పెరుంచోళుడు. కాలం గడుస్తోంది. కొప్పెురుంచోళుడి ఇద్దరు కొడుకులకు పరిపాలనా కాంక్ష పెరిగింది. తండ్రిని హింసించసాగారు. కొడుకులను ఏం చేయలేక.. అలాగని ప్రజల బాధ్యతను దుర్మార్గులైన తన కొడుకుల చేతుల్లో పెట్టలేక తాను ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు అన్నపానీయాలు మానేసి. తను ప్రాణత్యాగానికి సిద్ధమవుతున్నానని.. తానుంటున్న గదికి పక్కనున్న గదిలోకి వచ్చి ఉండాల్సిందిగా తన మిత్రుడు పిసిరంతైయార్కు వర్తమానం పంపాడు చోళరాజు. అయితే.. పిసిరంతైయార్ బయలుదేరి వచ్చేసరికే కొప్పెరుంచోళుడు ప్రాణాలు వదిలేశాడట. అప్పుడు ఆ కవి.. తనను తన స్నేహితుడు కూర్చోమన్న గదిలో కూర్చుని అతనూ అన్న, పానీయాలు మానేసి.. ప్రాణాలను వదిలేశాడట స్నేహితుడిలాగే. అలా చివరికి ప్రాణాలు విడిచే సమయంలోనూ ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. హిస్టరీ మెన్ జధునాథ్ సర్కార్, జీఎస్ సర్దేశాయి, రఘుబీర్ సింగ్.. ఈ ముగ్గురూ చరిత్రకారులు. చక్కటి స్నేహితులు. ఎలాంటి పొరపొచ్చాలకు తావీయని యాభై ఏళ్ల స్నేహ బంధం వాళ్లది. ముందు ఉత్తరప్రత్యుత్తరాల ద్వారానే వీళ్ల మధ్య స్నేహం కుదిరింది. నాలుగేళ్ల ఆ లెటర్ కరెస్పాండెన్స్ అనంతరం 1909లో సర్దేశాయి, సర్కార్ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రఘుబీర్ సింగ్ కూడా తోడయ్యాడు. అప్పటి నుంచి ఈ ముగ్గురూ తరచుగా కలుసుకుంటూ చరిత్ర నుంచి ప్రాపంచిక విషయాల దాకా ఎన్నిటినో చర్చించుకునేవాళ్లు. ఈ చర్చలు, వాళ్ల స్నేహం భారతదేశ చరిత్రలో కొత్త కోణాలు శోధించడానికి.. సరికొత్త అధ్యాయాలను రచించడానికి దోహదపడ్డాయి. వాళ్ల మైత్రిని ‘హిస్టరీ మెన్’ అనే పుస్తకంగా మలచాడు టీసీఏ రాఘవన్ అనే రచయిత. జాన్ జిగ్రీస్ మహ్మద్ అలీ జిన్నా.. లోకమాన్య బాల గంగాధర్ తిలక్.. సిద్ధాంతాలు, అభిప్రాయ భేదాలకు అతీతంగా చక్కటి స్నేహం చేయొచ్చని నిరూపించిన మంచి మిత్రులు. తీరిగ్గా తిలక్ వాళ్లింట్లో .. పనిలో ఉన్నప్పుడు హైకోర్ట్‌లోని జిన్నా చాంబర్లో కూర్చుని ఈ ఇద్దరూ గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్లట. ఆ సంభాషణల్లో వాళ్ల రోజూవారి పనుల నుంచి దేశ స్వాతంత్య్రం వరకు ఎన్నో విషయాలుండేవట. తిలక్‌తో తన స్నేహం గురించి తన దగ్గరి వాళ్లతోనే కాదు బహిరంగ సమావేశాల్లోనూ ప్రస్తావించేవాడు జిన్నా. తర్వాత కాలంలో జిన్నా తన రాజకీయ వైఖరిని మార్చుకున్నప్పటికీ తిలక్‌తో స్నేహంలో మాత్రం రవ్వంత తేడా కూడా రానివ్వలేదట. మైత్రీ మధురిమలు జార్జ్ హ్యారిసన్.. పండిట్ రవిశంకర్ల స్నేహం చెప్పుకుని తీరాల్సిందే. ఏషియన్ మ్యూజిక్ సర్కిల్ ద్వారా పండిట్ రవిశంకర్ పరిచయమయ్యాడు హ్యారిసన్‌కు. అప్పుడు మొదలైన స్నేహం.. మ్యూజిక్ ఫ్యూజన్‌గా సంగీతాభిమానులకే కాదు.. యావత్ స్నేహ ప్రపంచానికి మైత్రీ మధురిమలను పంచింది. తోడు నీడ ఇందిరా గాంధీ, పుపుల్ జయకర్.. ఇద్దరూ అలహాబాద్‌లోనే పుట్టి.. కలసి పెరిగారు. కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖంలో, సంతోషంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు వీడలేదు. ఇందిరా గాంధీ రాజకీయ జీవితం వాళ్ల స్నేహాన్ని ఏ మాత్రం చెక్కుచెదరనీయలేదు. ఇందిరాగాంధీ విజయాల్లోనే కాదు ఆపత్కాలంలోనూ ఆమె వెన్నంటే ఉంది జయకర్. ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలోనూ ఇందిరాగాంధీనే సపోర్ట్ చేసింది. తన ఆత్మకథ రాయమని చాలాసార్లు జయకర్‌ను కోరిందట ఇందిరా. ఎందుకో రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందట. చివరకు ఇందిరా గాంధీ చనిపోయాక ఆమె బయోగ్రఫీ రాసింది పుపుల్ జయకర్. బాబాయ్.. అబ్బాయ్ స్నేహం.. కుల, మత, ప్రాంత, కలిమిలేములకు మాత్రమే కాదు .. వయసు క్కూడా అతీతమే అనిపిస్తుంది రతన్ టాటా, శంతను నాయుడుల ఫ్రెండ్షిప్ చూస్తే. ఈ ఇద్దరి మధ్య స్నేహాన్ని కుదిర్చిన కామన్ పాయింట్ మూగజీవాల పట్లæ ఇద్దరికీ ఉన్న ప్రేమ. స్ట్రే డాగ్స్ కోసం శంతను నాయుడు చేసిన వర్క్ గురించి తెలిశాక అతనికి ఈ మెయిల్ పంపాడు రతన్ టాటా. బదులు ఇచ్చాడు శంతను. అలా వాళ్ల ఫ్రెండ్షిప్ మొదలైంది. కార్నెల్ యూనివర్శిటీలో శంతను కాన్వొకేషన్‌కు రతన్ టాటా హాజరయ్యారు. చిత్రమేంటంటే రతన్ టాటా ఆ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఈతరం ప్రతినిధి శంతను.. నాటి విలువల మనిషి రతన్ టాటాకు సాంఘిక మాధ్యమాలను ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడట రతన్ టాటా. బాధ్యతలను పంచుకున్నాడు గాంధీ దక్షిణాఫ్రికా జీవితం ఆయన బయోగ్రఫీలో భాగంగానే కాదు.. చాలా కథలుగానూ ఎంతో ప్రచారంలో ఉంది. అయినా ఆయనకు సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలున్నాయి ఇంకా. వాటిల్లో ఒకటే హెన్రీ పోలాక్, మిల్లీ దంపతులతో ఆయనకున్న స్నేహం. విప్లవభావాలున్న యూదుడు హెన్రీ. క్రైస్తవాన్ని పాటించే స్త్రీవాది మిల్లీ. ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పరస్పర విరుద్ధ మతాలు వీళ్ల పెళ్లికి అడ్డం పడ్డాయి. ఇరు పెద్దలూ ఒప్పుకోలేదు. కోకపోగా మిల్లీని మరచిపోవడానికని హెన్రీని దక్షిణాఫ్రికా పంపించారు అతని పెద్దలు. జోహాన్నెస్ బర్గ్‌లోని ఓ శాకాహార హోటల్లో హెన్రీకి గాంధీ పరిచయమయ్యాడు. అనతికాలంలోనే అది స్నేహంగా మారింది. గాంధీతో తన గోడంతా వెళ్లబుచ్చుకున్నాడు హెన్రీ. మిల్లీ తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత తీసుకున్నాడు గాంధీ. ఒప్పించి మిల్లీని దక్షిణాఫ్రికా రప్పించాడు. హెన్రీ, మిల్లీ పెళ్లికి ప్రధాన సాక్షిగా సంతకం కూడా చేశాడు గాంధీ. దాంతో హెన్రీ దంపతులకు గాంధీ అప్తమిత్రుడుగా మారాడు. ఎంతలా అంటే మన దేశ స్వాతంత్య్ర సమరంలో గాంధీ జైల్లో ఉన్నప్పుడు గాంధీ మొదలుపెట్టిన ఉద్యమాలను తాను ముందుండి నడిపించాడు హెన్రీ. ఫ్రెండ్.. గురు, గైడ్ అన్నీ! సోషల్ మీడియా ఒకరకమైన గ్రూప్ థెరపీ సెషన్. ఎలాంటి భావోద్వేగాలను అయినా.. సోషల్ మీడియాలో పంచుకుంటే ఊరట దక్కుతోంది అంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే వాళ్లు. ఏదైనా విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ మాధ్యమంలో లేదా ఆ గ్రూపుల్లో జరిగే చర్చలు.. వచ్చే జవాబులతో ఎంతోకొంత ధైర్యం, ఉపశమనం కలుగుతుందంటారు వాళ్లు. కరెంట్ టాపిక్స్ దగ్గర్నుంచి వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ విషయాలు, వ్యాపారలావాదేవీలు, ఆరోగ్యం ఒక్కటేంటి సమస్త అంశాల మీదా సలహాలు, సూచనలు దగ్గర్నుంచి అనుభవాలు, అభిప్రాయాల దాకా అన్నీ అందుతున్నాయి. ఏదైనా విషయం మీద మద్దతు దొరకాలన్నా.. అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడు సోషల్ మీడియానే ఫ్రెండ్, గురు, గైడ్, ఫిలాసఫర్ అన్నీ! ‘రోజూ కలిసే ఫ్రెండ్స్ కంటే.. సోషల్ నెట్వర్క్ స్నేహాలే మెదళ్లకు పదును పెట్టిస్తున్నాయి. చర్చల ద్వారా ఎక్కువ మందిని స్నేహితులను తయారు చేసుకునేందుకు చాన్స్ ఇస్తున్నాయి’ అంటున్నారు ఆన్లైన్ ఫ్రెండ్ షిప్‌ను ఇష్టపడేవారు. స్నేహ బంధాన్ని బలంగా ఉంచడంలో సోషల్ మీడియా చేస్తున్న మరో సాయం.. పాత స్నేహాలను పైకి తేవడం. ఎప్పుడో విడిపోయిన స్నేహితులు, బంధువులు సైతం దీని ద్వారా తిరిగి దగ్గరవుతున్నారు. సోషల్ మీడియాలోని అకౌంట్లలో సెర్చింగ్ ద్వారా, ఫోన్ నెంబర్లను సంపాదించడం ద్వారా తిరిగి ఆ పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటు న్నారు. పలుచబడ్డ బంధాలను మళ్లీ బలోపేతం చేసుకుంటున్నారు. కామన్ స్నేహితులు లేదంటే గ్రూపుల ద్వారా మళ్లీ పాత స్నేహాలను.. పాత రోజుల్ని గుర్తు చేసుకునే అవకాశం కలుగు తోంది. గెట్ టు గెదర్, ఔటింగ్స్ వంటివన్నీ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారానే నిర్వహించుకుంటున్నారు. అయినా అప్రమత్తం సోషల్ మీడియాను వాడే ప్రతీ వందలో 80 మంది.. దీన్నొక ఫ్రెండ్షిఫ్ ప్లాట్‌ఫామ్‌గానే అభివర్ణిస్తున్నారు. ఆన్లైన్ స్నేహితులు.. తమ క్రియేటివిటీకి తోడుగా ఉంటున్నారని కొందరు, గ్రూపు స్నేహాలు పెంపొందడానికి వీలుగా ఉంటోందని ఇంకొందరు, కష్టకాలంలో మద్దతు దొరుకుతోందని మరికొందరు చెబుతున్నారు. నాణేనికి రెండు వైపులున్నట్లే.. ఆన్లైన్ స్నేహాలకూ రెండు కోణాలు ఉన్నాయి. వాస్తవ ప్రపంచ స్నేహంలోనే కాదు.. వర్చువల్ ఫ్రెండ్‌షిప్‌లోనూ గొడవలు సహజం. మోసాలకు, వెన్నుపోట్లకు ఆస్కారం ఎక్కువే. అలాగని సోషల్ మీడియా చెడ్డది కాదు. ఆన్లైన్ స్నేహాలన్నీ మోసాలే కావు. అయితే అప్రమత్తం గా ఉండడం మాత్రం అవసరమే. అనుమానా స్పదంగా ఉన్న వ్యక్తులను, పూర్తి అపరిచితులను ఫ్రెండ్స్లిస్ట్లోకి చేర్చుకోకపోవడమే ఉత్తమం. అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను ఎంత తక్కువగా షేర్ చేసుకుంటే అంత మంచిది. కనిపించిన వాళ్లందరినీ కలుపుకుని వెళ్లడమే సోషల్ నెట్వర్క్ సిస్టం. నమ్మకాన్ని, వంచనను వేరు చేసే గుణం దానికి లేదు. అసలు అది దాని ప్రోగ్రామే కాదు. కాబట్టి మనమే ఆ జాగ్రత్త తీసుకోవాలి. స్నేహానికి చేయి చాచాలి.. స్నేహితులను అండగా ఉండాలి. కానీ మోసాన్ని పసిగట్టే పరిశీలనను అలవర్చుకోవాలి. అదీ స్నేహమే నేర్పిస్తుంది. నేర్చుకోవాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!! ∙భాస్కర్ శ్రీపతి -
డోరతి జేన్ హత్య.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
కొన్ని పరిచయాలు నివురుగప్పిన నిప్పులై.. నీడలా వెంటాడుతూ.. నిర్దాక్షిణ్యంగా ఉసురు తీసేస్తాయి. నిండు జీవితాన్ని నిలువునా కాల్చేస్తాయి. ‘డోరతి జేన్ స్కాట్’ అనే సింగిల్ మదర్ హత్య కేసు కూడా అలాంటిదే. అది 1980 మే 28, రాత్రి 9 గంటలు. కాలిఫోర్నియాలో యు.సి. ఇర్విన్ మెడికల్ సెంటర్లోని వెయిటింగ్ హాల్లో డోరతి జేన్ స్కాట్(32) చాలా టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తోంది. డాక్టర్ బయటికి ఎప్పుడు వస్తాడా? ఎలాంటి వార్త చెబుతాడా? అనేదే ఆమె భయం. ఎందుకంటే తన సహోద్యోగి బోస్ట్రాన్.. ఎమర్జెన్సీ వార్డ్‌లో చికిత్స పొందుతున్నాడు. కాలిఫోర్నియాలోని స్టాంటన్‌లో తన నాలుగేళ్ల కొడుకు, అత్తతో కలసి జీవించేది డోరతి. తల్లిదండ్రులు ఉండే అనాహైమ్లోనే ఒక స్టోర్‌లో సెక్రటరీగా పని చేసేది. కొన్ని సార్లు తను పనికి వెళ్లేటప్పుడు తన బాబుని తల్లిదండ్రుల దగ్గరే వదిలి వెళ్లేది. తను డ్యూటీలో ఉండగానే బోస్ట్రాన్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మరొక సహోద్యోగి పామ్ హెడ్ సాయంతో తన కారులోనే బోస్ట్రాన్ను ఆసుపత్రికి తీసుకొచ్చింది డోరతి. మొత్తానికి డాక్టర్ బయటికి వచ్చాడు. ‘భయపడాల్సిన పని లేదు.. బ్లాక్ విడో స్పైడర్ కరవడం వల్లే బోస్ట్రాన్ అస్వస్థతకు గురయ్యాడు.. చికిత్స పూర్తి అయ్యింది. ఓ అరగంట తర్వాత ఇంటికి తీసుకుని వెళ్లొచ్చు’ అని చెప్పాడు. ఊపిరి పీల్చుకుంది డోరతి. రాత్రి 11 దాటింది. బోస్ట్రాన్ చాలా నీరసంగా ఉండటంతో.. డిశ్చార్జ్ సమ్మరీ పూర్తి చేసేలోపు కారు తీసుకొస్తానని డోరతి పార్కింగ్ ఏరియాకి వెళ్లింది. అయితే సమ్మరీ పూర్తి అయ్యి.. చాలా సేపు అయినా డోరతి కారు తీసుకుని రాకపోవడంతో.. బోస్ట్రాన్, పామ్ హెడ్ పార్కింగ్ దగ్గరకు వెళ్లారు. అప్పుడే డోరతి కారు వేగంగా వారి ముందు నుంచే దూసుకుపోయింది. కారు హెడ్‌లైట్స్ డైరెక్ట్‌గా వాళ్ల కళ్లల్లో పడటంతో.. డ్రైవింగ్ సీట్లో ఉన్నదెవరో చూడలేదు. అయితే.. బాబుకి అత్యవసర పరిస్థితి వచ్చి డోరతి అంత వేగంగా తమని వదిలి వెళ్లి ఉంటుందని వాళ్లు భావించారు. మరునాడు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో డోరతి కారు ఆసుపత్రికి పది మైళ్ల దూరంలో ఉన్న సందులో కాలిపోతున్నట్లు కనిపెట్టారు పోలీసులు. దాంతో డోరతి కిడ్నాప్ అంటూ కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు పోలీసులు. డోరతి నిబద్ధత కలిగిన క్రైస్తవురాలని.. సాయం చేయడంలో ముందుంటుందని, డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లేవీ ఆమెకు లేవని సహోద్యోగులు, ‘డోరతికి అసలు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు’ అని డోరతి తండ్రి జాకబ్ చెప్పారు. తల్లి మాత్రం ఓ అజ్ఞాత కాలర్ గురించి వణుకుతూ చెప్పింది. నెల రోజులుగా ఏవో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. గట్టిగా అడిగితే ‘ఒక వ్యక్తి డోరతికి చాలాసార్లు కాల్ చేసి.. ‘‘నిన్ను ప్రేమిస్తున్నా, త్వరలో నిన్ను చంపేస్తా’’ అనేవాడట. ఆ మాటలను పట్టించుకోని డోరతి.. ఒక్కసారి మాత్రం చాలా భయపడింది. ఎందుకంటే.. ఒకరోజు సడన్‌గా ఫోన్ చేసి ‘‘నీ కోసం బయట ఒకటి వెయిట్ చేస్తోంది.. వెళ్లు’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడట. వెళ్లి చూస్తే.. కారు విండ్‌షీల్డ్ పైన.. వాడిపోయిన గులాబీ ఉందట. ఆ రోజు నుంచే డోరతి భయపడటం మొదలుపెట్టింది. అప్పుడే నాకు ఆ వ్యక్తి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్న విషయం చెప్పింది’ అంటూ జరిగింది రివీల్ చేసింది డోరతి తల్లి. ఆ భయంతోనే.. డోరతి తుపాకీ కొనాలని కూడా నిర్ణయించుకుందని, కిడ్నాప్‌కి వారం ముందే.. కరాటే క్లాసుల్లో చేరిందని ఆమె స్నేహితులు చెప్పారు. అయితే కిడ్నాప్ అయిన వారం తర్వాత.. డోరతి తల్లికి చాలాసార్లు ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్స్ వచ్చాయి. ‘ఐ హావ్ హర్’ అని చెప్పి ఫోన్ పెట్టేసేవాడు. డోరతి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాల్స్ వచ్చేవి. ఒకవేళ డోరతి తండ్రి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ కట్ అయ్యేది. క్రమం తప్పకుండా డోరతి తండ్రే ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆ వ్యక్తి కాల్ చేసి వేధించడం మానేశాడు. అయితే అధికారులు అతడి లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి చాలా ప్రయత్నించారు కానీ.. ఆ వ్యక్తి అతి తక్కువ సేపే ఫోన్ మాట్లాడేసరికి ఆ ఫోన్ కాల్ ట్రాక్ చేయడానికి పోలీసులకు వీలు కాలేదు. ఇతర ప్రయత్నాలు ఎన్ని చేసినా డోరతి ఆచూకీ దొరకలేదు. నాలుగేళ్లు గడిచింది. 1984 ఆగష్టు 6న.. శాంటా అనా కాన్యన్ రోడ్ నుంచి ముప్పై అడుగుల దూరంలో మనిషి ఎముకలు ఉన్నాయని పోలీసులకు చెప్పాడు ఓ వ్యక్తి. 1982లో ఆ ప్రాంతాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో దేహం పాక్షికంగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటితో పాటు ఒక ఉంగరం, వాచ్ దొరకడంతో ఆ అస్థిపంజరం డోరతిదేనని గుర్తించారు. శవ పరీక్షలో ఆమె మరణానికి గల కారణం తేలలేదు. అయితే ఎవరు చంపారు అనేది తెలియకపోయినా.. కచ్చితంగా ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తే చంపి ఉంటాడని నమ్మారు చాలామంది. అందుకు బలమైన సాక్ష్యం లేకపోలేదు. డోరతి మిస్సింగ్ తర్వాత ఎన్నో ప్రత్యేక కథనాలను ప్రచురించిన.. ‘ఆరెంజ్ కౌంటీ రిజిస్టర్’ అనే న్యూస్ పేపర్ మేనేజింగ్ ఎడిటర్‌కి ఆ అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడట. ‘నేను డోరతి స్కాట్‌ను చంపేశాను. ఆమె నా ప్రియురాలు. కానీ ఆమె నన్ను మోసం చేసింది. వేరొక వ్యక్తితో ఆమె ఉండటం నేను చూశాను. అలాంటిదేం లేదని ఆమె ఖండించింది. అయినా నేను ఆమెను చంపేశాను’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడట. అయితే ‘మే 28 రాత్రి బోస్ట్రాన్ను స్పైడర్ కరచిన విషయం ఆ కాలర్కి ముందే తెలుసు’ అనేది ఆ మేనేజింగ్ ఎడిటర్ ఉద్దేశం. అదీ నిజమై ఉండొచ్చు. ఏదిఏమైనా.. డోరతి మరణానికి కారణం ఎవరో? ఆ అజ్ఞాత వ్యక్తి పేరేంటో నేటికీ తేలలేదు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
మలేషియాలో తెలుగు వైభవం.. 5 లక్షల పైమాటే..!
పరిచయంలేని ప్రదేశంలో మన ప్రాంతం వాళ్లు కనిపిస్తే ఆనందం! పరాయిగడ్డ మీద మన భాష వినిపిస్తే నైతిక బలం..!! సంఘాలు, సంస్థలను ఏర్పాటుచేసుకునేది ఇలాంటి మద్దతు కోసమే! మన మాట, సంస్కృతి, సంప్రదాయాలను పట్టి ఉంచుకోవడానికే!! నివసిస్తున్న దేశమేదైనా మన ఉనికి చాటుకోవడానికే!! ఇదంతా ఓ పోరాటం.. స్వస్థలాలను వదిలి దేశాంతరం వెళ్లిన వాళ్లంతా చేసే కనిపించని పోరాటం!! బ్రిటిష్ రాజ్యంలో మన తెలుగు వాళ్లు కూడా తెల్లవారి కూలీలుగా వాళ్ల కాలనీలకు వలస వెళ్లారు! అందులో మలేసియా ఒకటి! అక్కడి కొబ్బరి, రబ్బరు తోటలు సహా చాలా చోట్ల పనులకు కుదిరారు. అక్కడే స్థిరపడ్డారు. మాతృభాషను పరిరక్షించుకుంటే అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నట్లేనని భావించారు. తెలుగు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. తెలుగును కాపాడుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ద్వైవార్షిక సభలు ఇటీవల రవాంగ్‌లో నిర్వహించారు. ఆ సందర్భంగానే ఈ స్టోరీ! అది రవాంగ్ పట్టణం.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు ఇరవై మైళ్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆకాశపుటంచుల్లోకి కొమ్మలు చాచుకొని పెరిగిన.. ప్రపంచంలోకెల్లా ఎతైన మహావృక్షాలు, వాటితో పోటీపడే కొండలు, కోనలతో పచ్చగా.. ఆహ్లాదభరింతంగా ఉంటుంది. బహుశా ఆ వాతావరణం వల్లనే రవాంగ్ సామాజిక జీవితం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెమ్మదిగా ప్రవహించే నదిలో సాఫీగా సాగిపోయే పడవ ప్రయాణంలా జనజీవితం కనిపిస్తుంది. ఆ రవాంగ్‌లో జూన్ 26వ తేదీ.. ఆదివారం పండగలాంటి సందడి నెలకొంది. మలేసియాకు నలుదిక్కులా ఉన్న రహదారులు రవాంగ్‌కు ప్రయాణమయ్యాయి. ఉదయం ఏడింటికే వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. రవాంగ్‌కు వందల మైళ్ల దూరంలోని జోహూర్, క్లింగ్, బాగాన్ డత్తో తదితర నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి ఉదయం తొమ్మిదింటికల్లా వచ్చేశారు. ఇటు సింగపూర్, అటు థాయ్‌లాండ్ సరిహద్దు జిల్లాల నుంచి కూడా వందలాది మంది వచ్చారు. వాళ్లంతా ఆ దేశంలో పుట్టిపెరిగిన మలేసియన్ తెలుగువాళ్లు. ఎనభై ఏళ్లు దాటిన రెండో తరం పెద్దల నుంచి ఐదారేళ్ల నేటి తరం చిన్నారుల వరకూ ఉన్నారు. అది వాళ్లు ప్రాణప్రదంగా భావించే తెలుగుతల్లి ఆలయం. మలేసియా తెలుగు అకాడమీ భవన ప్రాంగణం. గత 50 ఏళ్లుగా ఆ ప్రాంగణంతో మలేసియా తెలుగువాళ్లకు అనుబంధం ఉంది. ఒకప్పుడు రవాంగ్ తెలుగు సంఘం కార్యాలయంగా, తెలుగు సాంస్కృతిక నిలయంగా వెలుగొందిన ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఐదంతస్తుల తెలుగు అకాడమీ భవనాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని తెలుగువాళ్లంతా కలసి ఒక్కో రింగిట్ (అక్కడి కరెన్సీ) పోగు చేసుకొని ఆ భవానాన్ని కట్టుకున్నారు. అది అక్కడి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. 150 ఏళ్లకు పైగా కాపాడుకుంటున్న తల్లిభాష తెలుగును భవిష్యత్ తరాలకు వారసత్వ కానుకగా అందజేసేందుకు మలేసియా తెలుగు సంఘం సకల సదుపాయా లతో ఆ భవనాన్ని నిర్మించింది. విశాలమైన తరగతి గదులు, వసతి కేంద్రాలు, గ్రం«థాలయం, ఆటస్థలం వంటి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. తెలుగు భాషాభివృద్ధి, బోధన, సాహిత్య అధ్యయనం, మలేసియా తెలుగువారి చరిత్రను గ్రంథస్థం చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన తెలుగు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్లు ఆ ఆదివారం అక్కడ సమావేశామయ్యారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మలేసియా తెలుగు సంఘం 44వ ద్వైవార్షిక ప్రతినిధుల మహాసభ కూడా అదే రోజు కావడం మరో విశేషం. కుటుంబ వేడుకలా... నిజానికి రెండేళ్ల క్రితమే తెలుగు అకాడమీ భవనం ప్రారంభం కావలసి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. గతంలో ఏడాదికి రెండు, మూడు సార్లయినా ఎక్కడో ఒకచోట కలుసుకొనే తెలుగువాళ్లు గత రెండేళ్లుగా కలవలేకపోయారు. దాంతో జూన్ 26వ తేదీ నాటి కార్యక్రమం వారికి ఒక భావోద్వేగభరితమైన వేదికైంది. అందుకే ఇంటిల్లిపాదీ ఆ తెలుగు వేడుకల కోసం తరలివచ్చారు దూరభారాలు లెక్కచేయకుండా! దేశంలోని తెలుగు వాళ్లంతా ఆ రోజు అక్కడ ఒక కుటుంబంలా కలసిపోయారు. ఆత్మీయ పలకరింపులతో తెలుగు భాష తేనెలూరింది. సంప్రదాయ వస్త్రధారణతో తెలుగుదనం ఉట్టిపడింది. మలేసియా మాజీ ప్రధానమంత్రి దత్తో శ్రీ నజీబ్‌తోపాటు అక్కడి తెలుగు ప్రముఖులు అందరూ ఆ వేడుకకు హాజరయ్యారు. మొదటగా మలేసియా జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులూ’ అంటూ తెలుగుతల్లి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అక్కడ తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటే కార్యక్రమాలు, ప్రసంగాలు, ఆటలు, పాటలతో ఆ ఉదయం.. సాయంకాలంగా ఎప్పుడు కరిగిపోయిందో తెలియలేదు. మలేసియాలోని తెలుగువాళ్లు మొదట్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాళ్లు పనిచేసే తోటల్లో తెలుగు బడులు, గుడులు ఉండేవి. పిల్లలు తెలుగు నేర్చుకొనేవారు. పెద్దవాళ్లు సాయంత్రం పూట రాముడి సన్నిధిలో చేరి కష్టసుఖాలను పంచుకొనేవారు. కాలక్రమంలో తెలుగు బడులు శిథిలమయ్యాయి. ఆ తదనంతర తరాలకు చెందినవారు ఉన్నత చదువులు చదువుకొని గొప్ప స్థానాల్లో స్థిరపడ్డప్పటికీ తల్లి భాష తెలుగుకు దూరమయ్యారు. మలేసియా తెలుగు సంఘానికి ఇది మనస్తాపంగా మారింది. ఈ క్రమంలోనే 2006లో ఆ సంఘం జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు నేతృత్వంలో తెలుగు భాషాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠ్యపుస్తకాలను తయారు చేశారు. పలు చోట్ల నీతిశిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. తెలుగు వారిని తిరిగి సంఘటితం చేశారు. మలేసియా అంతటా 30కి పైగా తెలుగు శాఖల్లో ఇది ఒక ఉద్యమంలా సాగింది. ప్రస్తుతం 6 వేల మంది పిల్లలు తెలుగు భాష నేర్చుకుంటున్నారు. ‘మలేసియా భూమిపైన తెలుగు వాడు ఉన్నంత కాలం తెలుగు వర్ధిల్లుతుంది. ఆ లక్ష్యంతోనే అకాడమీ నిర్మించుకున్నాం. భవిష్యత్ తరాలకు ఇది బాటలు వేస్తుంది. తెలుగుకు దూరమైన వాళ్లంతా ఇప్పుడు దగ్గరయ్యారు. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు’అని సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు. ఆయన నేతృత్వంలో మొదలైన తెలుగు భాషోద్యమం ఇప్పుడు చక్కటి ఫలితాలనిస్తోంది. తెలుగు వారి ముఖద్వారం బాగాన్ డత్తో... మలేసియా తెలుగువాళ్లకు గొప్ప చరిత్ర ఉంది. 150 ఏళ్లకు పూర్వమే వలస వెళ్లిన తెలుగువాళ్లు ఆ దేశ చరిత్రలో భాగమయ్యారు. ఒకప్పటి మలయా దేశం (ఇప్పుడు మలేసియా)లో కొబ్బరి, కాఫీ, తేయాకు, రబ్బరు, పామాయిల్ తోటల్లో పని చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి కార్మికులను తరలించింది. 1850 నుంచే ఈ వలసలు మొదలైనప్పటికి 1890 నాటికి వేలాది మంది తమిళ, తెలుగు ప్రజలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో పొట్టచేతపట్టుకొని అక్కడికి చేరుకున్నారు. విశాఖ, చెన్నపట్టణం, తదితర రేవు పట్టణాల నుంచి బయలుదేరి ఓడలు ఏడు రోజుల తరువాత మలేసియాలోని పినాంగ్ రేవుకు చేర్చాయి. అలా వెళ్లిన తెలుగువాళ్లు పినాంగ్ నుంచి జంగ్ అనే చైనా వారి తెరచాప ఓడల్లో మలక్కా జలసంధి గుండా పేరాక్ నది ముఖద్వారమైన బాగాన్ డత్తోకు చేరుకున్నారు. ఆ రోజుల్లో అది ఒక చేపల రేవు. బ్రిటన్‌కు చెందిన స్ట్రెయిట్స్ ప్లాంటేషన్ కంపెనీకి చెందిన వేల ఎకరాల విస్తీర్ణంలోని కొబ్బరి తోటల్లో మొట్టమొదటి తెలుగు తరం పనిలో చేరారు. ఆ తరువాత తెలుగు కుటుంబాలు విస్తరిస్తున్న కొద్దీ వివిధ ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి, రబ్బరు, పామాయిల్ తోటలకు స్థానికంగా వలసబాట పట్టారు. రబ్బరు తోటలతో నిండి ఉన్న రవాంగ్లోనూ బాగాన్ డత్తోకు సమాంతరంగా తెలుగు కుటుంబాలు విస్తరించాయి. ఒకప్పుడు గుప్పెడు మంది కూడా లేని తెలుగు జనాభా ఇప్పుడు ఇంచుమించు 5 లక్షలకు చేరుకుంది. ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్లు బ్రిటిష్ కంపెనీల లాభాల కోసం నెత్తురు ధారపోశారు. ఆ తదనంతరం మలేసియా అభివృద్ధిలో భాగమయ్యారు. రెండు ప్రపంచయుద్ధాల కాలంలో మలేసియా స్వాతంత్య్రోద్యమంలో తెలుగు ప్రజల త్యాగాలు ఉన్నాయి. తెలుగు ఒక్కటే అస్తిత్వం... బ్రిటిష్ వారు పంపిన వలస కూలీలుగా మలేసియాకు చేరుకున్న తెలుగువాళ్లు బతుకుతెరువు కోసం తమిళ, మలయ్, చీనా తదితర భాషలను నేర్చుకున్నారు. అయినా మృతృభాష తెలుగును మాత్రం విస్మరించలేదు. ఎక్కడెక్కడో స్థిరడిన తెలుగు వాళ్లను ఆ భాషే ఒక్క గూటి పక్షులను చేసింది. అదొక్కటే వారి అస్తిత్వం. మెజారిటీ భాషల ఆధిపత్యం నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు ఎంతో కష్టపడ్డారు. తెలుగు బడులు మూసివేసిన తరువాత ఆ కష్టం మరింత ఎక్కువైంది. ‘ఒకదశలో తెలుగును బతికించుకోవడమే సవాలుగా మారింది. తెలుగు నీతి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం తెలుగు బోధించాం. క్రమంగా ఫలితాలు కనిపించాయి’ అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చెగు అక్కయ్య అప్పల్నాయుడు. 74 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు మలేసియాలోని అన్ని తెలుగు శాఖల్లో తెలుగు భాషా బోధన పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఇంచుమించు 1990 నుంచి 2005 వరకు తెలుగు భాష సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం విధిగా అలవరచుకోవాలనే లక్ష్యంతో 2006లో మలేసియా తెలుగు సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నారు. ఈ ఉద్యమానికి తెలుగు వారి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించాయి. ప్రతి ఇల్లు, ప్రతి తెలుగుశాఖ ఒక తెలుగు బడి అయింది. ఆరువేల మంది పిల్లలు ఇప్పుడు తెలుగుభాష పైన పట్టు సాధించారు. మలేసియా తెలుగువారి మహత్తరమైన తెలుగు వెలుగుల ప్రస్థానానికి ప్రతీకగానే తెలుగు అకాడమీ భవనం ప్రారంభమైంది. తెలుగుభాషోద్యమ రథసారథి 2006 నుంచి 2020 వరకు మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు తెలుగు నీతి శిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ప్రాథమిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద అనే నాలుగు దశల్లో తెలుగు బోధనకు అవసరమైన పాఠ్యప్రణాళికలను రూపొందించడం వెనుక ఆయన కృషి ఉంది. తెలుగు అకాడమీ భవన నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకొని పూర్తి చేశారు. అలుపెరుగని అధ్యాపకుడు తెలుగు, తమిళ, మలయ్, ఇంగ్లిష్ భాషలపైన గట్టి పట్టు ఉన్న చెగు అక్కయ్య చెగు అప్పల్నాయుడు ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి తెలుగు భాషా బోధన కోసం కృషి చేశారు. ఇప్పటికీ కాలికి బలపం కట్టుకొని మలేసియా అంతటా పర్యటిస్తూ తెలుగుశాఖలను ప్రోత్సహిస్తున్నారు. పాఠ్యప్రణాళికలను రూపొందించడంలోనూ, భాషాబోధనలోనూ ఆయన నిపుణులు. తెలుగు సాంస్కృతిక వారధి రెండో తరానికి చెందిన పెద్దలు, ఎనభై ఏళ్లు దాటినా తెలుగు భాషాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ విద్యావేత్త డీవీ శ్రీరాములు. మలేసియాకు, తెలుగు రాష్ట్రాలకు నడుమ సాంస్కృతిక వారధిగా నిలిచారు. 1970ల నుంచే అక్కడి తెలుగు వాళ్లకు హైదరాబాద్, విశాఖ, సహా అన్ని ప్రాంతాలను పరిచయం చేయడంతో పాటు తెలుగు ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటారు. ∙పగిడిపాల ఆంజనేయులు -
హింటర్‌కైఫెక్ హత్యలు.. ఇప్పటికే మిస్టరీ గానే..!
కొన్ని నేరాలు ఘోరాతి ఘోరంగా.. భయంకరంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా.. ఉంటాయి! హింటర్‌కైఫెక్ మర్డర్స్ అలాంటివే! జర్మనీ అపరిష్కృత నేరాల్లో ఇదీ ఒకటి. సుమారు 100 ఏళ్ల నాటి ఆ కథే.. ఈ వారం మన ముందున్న మిస్టరీ. జర్మనీలోని మ్యూనిక్‌కి 43 మైళ్ల దూరంలో ఉంటుంది ఈ హింటర్‌కైఫెక్ అనే గ్రామీణ అటవీ భూభాగం. అక్కడ ఆండ్రీస్ గ్రూబర్(64) అనే మోతుబరి అతి పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. అతని భార్య కాజిలియా గ్రూబర్(73), వాళ్ల వితంతు కూతురు విక్టోరియా(35), ఆమె ఇద్దరు పిల్లలు జూనియర్ కాజిలియా(7), జోసెఫ్(2) అంతా కలసి ఆ ఇంట్లోనే ఉండేవారు. వారికి అన్ని పనులు చేసిపెట్టడానికి ఓ పనిమనిషి వాళ్లతోనే ఉండేది. అయితే 1921 అక్టోబర్‌లో ఆమె ఉన్నట్టుండి ఆ ఇంటి నుంచి పారిపోయింది. అప్పటికే ఆమె ‘ఆ ఇంటి అటక మీద ఏవో స్వరాలు, శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంగా ఉంటోంది’ అంటూ ప్రచారం చేసింది. అదే విషయాన్ని ఆండ్రీస్ కూడా చాలామందితో చెప్పేవాడు. పైగా ఇంటి వెనుకవైపు పడిన మంచు మీద ఏవో విచిత్రమైన అడుగులు కనిపించాయని, అవి ఇంటివైపు వేసిన అడుగులే కానీ బయటకు వెళ్లిన అడుగులు కావనీ, లేవనీ అతడు చెప్పాడు. అది విన్నవారంతా ‘ఇంట్లో ఓ తుపాకీ ఉంచుకోవడం మంచిది’ అని సలహా కూడా ఇచ్చారు. కానీ ఆండ్రీస్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆరునెలల తర్వాత మారియా(45) అనే ఆవిడ ఆ ఇంట్లో పనికి కుదిరింది. గ్రామస్థులతో కలివిడిగా ఉండే ఆ కుటుంబం.. 1922 మార్చి 31 తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆదివారం రోజున చర్చ్‌కి రాలేదు. సోమవారం జూనియర్ కాజిలియా స్కూల్లోనూ కనిపించలేదు. పోస్ట్మ¯Œ బట్వాడా చేసిన ఉత్తరాలూ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. దాంతో గ్రామస్థుల్లో అనుమానం మొదలైంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. ఆండ్రీస్ ఇంట్లోనూ వెదకడం మొదలుపెట్టారు. బెడ్రూమ్లో కొత్త పనిమనిషి మారియా రక్తపు మడుగులో పడి చనిపోయి ఉంది. రెండేళ్ల జోసెఫ్ తన ఉయ్యాల్లో నిర్జీవంగా పడి ఉన్నాడు. మిగిలిన వారు ఎక్కడా కనిపించలేదు. ఇంతలో పోలీసులూ వచ్చారు. కాసేపటికి ధాన్య కొటారంలో నాలుగు శవాలు వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చి.. ఎండు గడ్డి కప్పి ఉన్నట్లుగా గుర్తించారు. ఆ శవాలను చూస్తే అక్కడున్నవారందరి వెన్నులో వణుకుపుట్టింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో.. ఆ హత్యలు చేయడానికి మట్టాక్ (పదునైన వ్యవసాయ పరికరం)ను ఉపయోగించినట్లు తేలింది. ఎవరెవరు ఏ విధంగా చనిపోయారు? ఏ సమయంలో చనిపోయారు? అన్నీ లెక్కలు తేలాయి. ఆ క్రమంలోనే ఏడేళ్ల కాజిలియా చావు అందరినీ కలచివేసింది. కిల్లర్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ పాప.. చాలా సమయం ఆ శవాల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడిందని.. చనిపోయే ముందు చాలా భయపడిందని తేలింది. పైగా హత్యల తర్వాత కూడా కిల్లర్.. అదే ఇంట్లో వంట చేసుకుని తిన్నట్లు ఆధారాలు ఉన్నాయి. దాంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వందమందికి పైగా అనుమానితుల్ని విచారించారు. కానీ ఫలితం లేదు. ఈ కేసులో మరో విషాదకరమైన విషయమేంటంటే.. కొత్త పనిమనిషి ఆ ఇంటికి వచ్చిన రాత్రే ఆమె హత్యకు గురైంది. అయితే గతంలో ఆండ్రీస్ మాటలను గుర్తు చేసుకున్న చాలామంది.. హంతకుడు చాలా కాలంగా ఆ ఇంటి అటకపైన ఉన్నాడని నమ్మారు. విచారణలో భాగంగా ఆండ్రీస్ కుటుంబ చరిత్రను తవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. అప్పుడో సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆండ్రీస్.. కూతురు విక్టోరియాతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని, అందుకే 1915లో ఆ ఇద్దరికీ జైలు శిక్ష విధించారని, అయినా వాళ్లలో మార్పు రాలేదని.. జోసెఫ్ వాళ్లిద్దరికీ పుట్టిన బిడ్డేనని ఇరుగుపొరుగు చెప్పుకొచ్చారు. మరికొంత మంది.. జోసెఫ్ తండ్రి ఆండ్రీస్ కాదని.. ఆ ఇంటికి సమీపంలో నివసించే లోరెంజ్ బౌర్ అనే వ్యక్తి అని వాదించారు. దాంతో జోసెఫ్ అసలు తండ్రి ఎవరో నేటికీ తేలలేదు. తదుపరి పరీక్ష కోసం బాధితుల తలలను వేరు చేసి, వాటిని మ్యూనిక్‌కి పంపినట్లు నివేదిక రాసి.. అందరినీ ఒకేచోట ఖననం చేశారు. అయితే ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి ఓ డాక్టర్.. ఆ తలలను అంజనం వేసే వ్యక్తుల దగ్గరకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు మాత్రం.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పుర్రెలు కనిపించకుండా పోయాయని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హంతకుడు ఎవరో తెలియకపోవడంతో చాలా ఊహా గానాలు మొదలయ్యాయి. నిజానికి విక్టోరియా భర్త గాబ్రియేల్ ఒక సైనికుడు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయాడు. అయితే గాబ్రియేల్ చనిపోలేదని.. తిరిగి వచ్చాడని.. విక్టోరియా పాపాలు తెలుసుకుని.. ఈ ఊచకోతలకు తెగబడ్డాడనేది ఓ వర్గం వాదన. మరోవైపు.. ఈ ఘోరానికి తెగబడింది లోరేంజ్ అని.. విక్టోరియా తనతో ఉంటూనే తండ్రితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఇలా చేశాడనేది మరికొందరి ఊహాగానం. అయితే 1919లో ఓ వృద్ధురాలు పోలీస్ అధికారులను కలసి.. ‘ఈ హత్యలను నా మాజీ భూస్వామి చేశాడు. మొత్తం సమాచారం అతడితోనే ఉంది’ అని తెలిపింది. అయితే ఆ ప్రధాన నిందితుడు అప్పటికి ప్రాణాలతో లేడు. 2007లో జర్మనీ పోలీసు అకాడమీలోని విద్యార్థులు.. ఎలాగైనా ఈ కేసుని క్లోజ్ చెయ్యాలని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి.. ఒక అనుమానితుడ్ని హంతుకుడిగా గుర్తించారు. అయితే అతడు కూడా అప్పటికి ప్రాణాలతో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని.. అతడి పేరునూ బహిర్గతం చేయలేదు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
జగమంతా రాగమయం..
‘అంతా రామమయం– జగమంతా రామమయం’ అన్నాడు భక్త రామదాసు. తూర్పు పడమరల ఎల్లలు చెరిగిపోతున్న నేటి సంగీత ప్రపంచాన్ని గమనిస్తుంటే ‘అంతా రాగమయం– జగమంతా రాగమయం’ అని తన్మయంగా పాడుకోవచ్చు సంగీతాభిమానులు. ఇటు కర్ణాటక అటు హిందుస్తానీ సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై కూర్చుని జుగల్బందీ కచేరీలతో శ్రోతలను అలరించిన సందర్భాలు నిన్నటితరం సంగీతాభిమానులకు తెలిసిన ముచ్చటే! ఇప్పటికీ తరచుగా జుగల్బందీ కచేరీలు దేశ విదేశాల్లో విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలోని భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు మాత్రమే కాదు, విదేశీ విద్వాంసులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యూజన్ ఆల్బమ్స్‌కు అన్ని ప్రాంతాల్లోనూ శ్రోతల ఆదరణ పెరుగుతోంది. ఫ్యూజన్ ప్రయోగాలు సంగీతం విశ్వజనీనమని చాటుతున్నాయి. జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం... మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది. ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్‌కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్ ఎన్ రోల్ బృందాలతో కలసి ఫ్యూజన్ కచేరీలు చేశారు. సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్ శంకరాభరణ రాగంలో రచించిన ‘నోట్టు స్వరాలు’ పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి. ఫ్యూజన్ ప్రయోగాలు హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్ రాక్‌బ్యాండ్ ‘బీటిల్స్’ బృందానికి చెందిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్, అమెరికన్ వయోలినిస్ట్ యెహుది మెనుహిన్ వంటి వారితో కలసి పండిట్ రవిశంకర్ 1960 దశకంలోనే ఫ్యూజన్ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్ హారిసన్ స్వయంగా పండిట్ రవిశంకర్ వద్ద సితార్ నేర్చుకుని, ‘బీటిల్స్’ పాట ‘నార్వేజియన్ వుడ్’లో సితార్ స్వరాలను పలికించాడు. పండిట్ రవిశంకర్ కృషి ఫలితంగా ప్రాక్ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి ‘కలోనియల్ కజిన్స్’ పేరుతో ఫ్యూజన్ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్ బ్యాండ్స్ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్.సుబ్రమణ్యం, ఎల్.శంకర్, మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, సితారా దేవి, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం. కూత ఘనం పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్.రెహమాన్, అద్నాన్ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్ పాయ్ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు. ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. ‘యూట్యూబ్’ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్ పాయ్ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు. మన సంగీతంలో పాశ్చాత్యవాద్యాలు మన సంగీత కచేరీల్లోకి పాశ్చాత్యవాద్య పరికరాలు బ్రిటిష్ హయాంలోనే ప్రవేశించాయి. కర్ణాటక సంగీత కచేరీలకు క్లారినెట్ను తొలిసారిగా మహాదేవ నట్టువనార్ పరిచయం చేశారు. తర్వాతి కాలంలో ఎ.కె.సి. నటరాజన్ వంటివారు క్లారినెట్ను కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువ చేశారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మహాదేవ నట్టువనార్ తంజావూరు మరాఠా రాజుల ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. అప్పట్లోనే ఆయన పాశ్చాత్య పరికరమైన క్లారినెట్‌పై ఆయన అద్భుతమైన స్వరవిన్యాసాలు చేసి, పండిత పామరులను అలరించారు. తర్వాతి కాలంలో క్లారినెట్ కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువైంది. తంజావూరు ఆస్థానానికి చెందిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్ సోదరుడు బాలస్వామి దీక్షితార్ పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో కర్ణాటక సంగీతానికి వయోలిన్‌ను పరిచయం చేశారు. ద్వారం వెంకటస్వామినాయుడు వయోలిన్‌ను కర్ణాటక సంగీతంలో అవిభాజ్య వాద్యం స్థాయికి చేర్చారు. ద్వారం వెంకటస్వామినాయుడు ప్రభావంతో కర్ణాటక సంగీత కచేరీలలో వయోలిన్ ఒక తప్పనిసరి పక్కవాద్యం స్థాయికి చేరుకుంది. అంతేకాదు, వయోలిన్‌తో సోలో కచేరీలిచ్చే ఉద్దండులు కర్ణాటక సంగీతంలో చాలామందే ఉన్నారు. కదిరి గోపాలనాథ్ తొలిసారిగా శాక్సోఫోన్‌ను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో మరికొన్ని పాశ్చాత్య వాద్యపరికరాలు కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలకు పరిచయమయ్యాయి. పాశ్చాత్య వాద్యపరికరమైన శాక్సోఫోన్‌కు కొద్దిపాటి మార్పులు చేసి, దానిని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని గమకాలన్నీ పలికేలా తీర్చిదిద్దారు. మాండోలిన్‌ను శ్రీనివాస్ బాలుడిగా ఉన్నప్పుడే కర్ణాటక సంగీతానికి పరిచయం చేసి, ‘మాండోలిన్ శ్రీనివాస్’గా ప్రఖ్యాతి పొందారు. సుకుమార్ ప్రసాద్ తొలిసారిగా గిటార్‌ను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. అనిల్ శ్రీనివాసన్ పియానోను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. పాశ్చాత్య వాద్యపరికరమైన హార్మోనియం పంతొమ్మిదో శతాబ్దం నాటికి మన దేశంలో బాగా జనాదరణ పొందింది. పరిమాణంలో కొన్ని మార్పులకు లోనై, హిందుస్తానీ గాత్ర కచేరీలకు పక్కవాద్యంగా చక్కగా ఇమిడిపోయింది. పాశ్చాత్య వాద్యపరికాలు మన సంప్రదాయ సంగీతంలోని నిశితమైన గమకాలను, సంగతులను పలికించలేవనే విమర్శలు ఉన్నా, వాటిని తమవిగా చేసుకుని కచేరీలు చేసిన కళాకారులు ఆ విమర్శలన్నింటినీ వమ్ము చేశారు. ఆధునిక కాలంలో మన భారతీయ సంగీత విద్వాంసులు పలువురు ప్రపంచ స్థాయిలో మన్ననలు అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై కచేరీలు చేసి, శ్రోతలను ఉర్రూతలూపారు. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన వారిలో అటు హిందుస్తానీ, ఇటు కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. శైలీ సంప్రదాయాలు వేర్వేరు అయినా, సంగీతం అంతా ఒక్కటేననే భావనతో భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు జుగల్బందీ కచేరీలతో భారతీయ సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. భీమ్సేన్ జోషి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, పండిట్ జస్రాజ్, ఎల్.సుబ్రమణ్యం తదితరుల జుగల్బందీలు భారతీయ సంగీతానికే వన్నె తెచ్చేవిగా నిలుస్తాయి. హిందుస్తానీ సంగీతకారుల్లో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మ, తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆధునిక కర్ణాటక సంగీతకారుల్లో చెంబై వైద్యనాథ భాగవతార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మధురై మణి అయ్యర్, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, జి.ఎన్.బాలసుబ్రమణ్యం, టి.ఎన్.శేషగోపాలన్ తదితర గాయకులు చెరగని ముద్ర వేశారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్.వసంతకుమారి కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా గుర్తింపు పొందారు. ద్వారంవారి తర్వాత వయొలినిస్టుల్లో లాల్గుడి జయరామన్, కన్నకుడి వైద్యనాథన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, అన్నవరపు రామస్వామి, ఎల్.వైద్యనాథన్, ఎల్.సుబ్రమణ్యం, ఎల్. శంకర్, అవసరాల కన్యాకుమారి, వైణికుల్లో ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, దొరైస్వామి అయ్యంగార్, ఇ.గాయత్రి, జయంతి కుమరేశ్, వేణుగానంలో టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి, ప్రపంచం సీతారాం, నాదస్వరంలో షేక్ చినమౌలానా, టి.ఎన్.రాజరత్నం పిళ్లె తదితరులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించిన వారిలో ప్రముఖులు. ఇప్పటి తరంలో టి.ఎం.కృష్ణ, సిక్కిల్ గురుచరణ్, పాల్ఘాట్ రామ్‌ప్రసాద్, అక్కారయ్ శుభలక్ష్మి, అమృతా మురళి, విద్యా కళ్యాణరామన్ తదితరులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాణిస్తున్నారు. మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది. ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్‌కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్ ఎన్ రోల్ బృందాలతో కలసి ఫ్యూజన్ కచేరీలు చేశారు. సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్ శంకరాభరణ రాగంలో రచించిన ‘నోట్టు స్వరాలు’ పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి. ఫ్యూజన్ ప్రయోగాలు హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్ రాక్‌బ్యాండ్ ‘బీటిల్స్’ బృందానికి చెందిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్, అమెరికన్ వయోలినిస్ట్ యెహుది మెనుహిన్ వంటి వారితో కలసి పండిట్ రవిశంకర్ 1960 దశకంలోనే ఫ్యూజన్ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్ హారిసన్ స్వయంగా పండిట్ రవిశంకర్ వద్ద సితార్ నేర్చుకుని, ‘బీటిల్స్’ పాట ‘నార్వేజియన్ వుడ్’లో సితార్ స్వరాలను పలికించాడు. పండిట్ రవిశంకర్ కృషి ఫలితంగా ప్రాక్ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి ‘కలోనియల్ కజిన్స్’ పేరుతో ఫ్యూజన్ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్ బ్యాండ్స్ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్.సుబ్రమణ్యం, ఎల్.శంకర్, మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, సితారా దేవి, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం. కూత ఘనం పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్.రెహమాన్, అద్నాన్ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్ పాయ్ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు. ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. ‘యూట్యూబ్’ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్ పాయ్ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు. -
టమాటతో హల్వా, డిఫరెంట్ రెసిపీ మీకోసం
పనీర్ లాలీపాప్స్ కావలసినవి: పనీర్ తురుము – రెండున్నర కప్పులు, బ్రెడ్ పౌడర్ – అర కప్పు, జీడిపప్పు పేస్ట్ – పావు కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్ చొప్పున, ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 3, చిక్కటి పాలు – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – అవసరాన్ని బట్టి, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, జీడిపప్పు పేస్ట్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, 2 కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, ప్రతి బాల్కి సన్నటి పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి. అనంతరం రెండు చిన్న చిన్న బౌల్స్ తీసుకుని ఒకదానిలో మొక్కజొన్న పిండి, మరోదానిలో ఒక గుడ్డు, పాలు వేసుకుని, ఆ బాల్స్‌ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి, వెంటనే మొక్కజొన్న పౌడర్ పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటో హల్వా కావలసినవి: పండిన టమాటోలు – 5 (నీళ్లలో మెత్తగా ఉడికించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి), పంచదార , నెయ్యి – పావు కప్పు చొప్పున, ఫుడ్ కలర్ – కొద్దిగా (మీకు నచ్చిన రంగు), బొంబాయి రవ్వ – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ – 2 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి), ఏలకుల పొడి – అర టీ స్పూన్ తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వలను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి.. అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జు, పంచదార, ఫుడ్ కలర్, సగం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీల్మేకర్ పకోడా కావలసినవి:మీల్మేకర్ – 1 కప్పు(పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున, శనగపిండి – పావు కప్పు+3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్ కారం, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకుని సరిపడా నీళ్లతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో శనగపిండి, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలుచగా కలుపుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని ముంచి కాగుతున్న నూనెలో పకోడాలను దోరగా వేయిస్తే రుచి అదిరిపోతుంది. -
మిగిలిందెవరు?
ఇంకో గంటలో తెల్లారుతుంది. బయటంతా చీకటి. ఆ ఇంటి హాల్లో మాత్రం ట్యూబ్‌లైట్ వెలుగుతోంది. నాన్న మొబైల్లో అలారం సెట్ చేసుకుని, నాలుగ్గంటలకే లేచి కూర్చొని, ఇద్దరు పిల్లలు రేపటి పరీక్షకి తయారవుతున్నారు. నిమిషానికోసారి తలపైకెత్తి చూస్తున్నారు. అప్పుడు కూడా ఇద్దరి పెదాలు, నిశ్శబ్దంగా కదుల్తూనే ఉన్నాయి, చదువుతున్నదాన్ని మననం చేసుకుంటున్నట్లు. అక్కకి ఎనిమిదేళ్లు. తమ్ముడికి ఆరేళ్లు. రాత్రి పదింటిదాకా వాళ్లతో పాటు కూచున్న వాళ్ల అమ్మానాన్నా ఇంకో గదిలో నిద్రపోతున్నారు. కాసేపట్లో వాళ్లూ నిద్ర లేస్తారు. ఇంట్లో ఉరుకులు పరుగులు మొదలవుతాయి. ఈ ఒక్క పరీక్షా అయిపోతే ఎల్లుండినుంచి వేసవి సెలవులు. సుమారు రెణ్ణెల్లపాటు స్కూలుండదు. పిల్లలిద్దరి మనసూ రాబోయే ఆట విడుపు మీద లేదు. రాయబోయే ఆఖరి పరీక్ష మీద ఉంది. పిల్లలూ! బాగున్నారా?ఓ పరిచయం లేని గొంతు వాళ్లిద్దరినీ పలకరించింది. అది విని పిల్లలిద్దరూ ఉలిక్కిపడి తలెత్తి చూశారు. సోఫాలో ఇద్దరు కొత్త వ్యక్తులు కూర్చొని ఉన్నారు. పిల్లలకి ఇంతకు ముందెప్పుడూ వాళ్లని చూసిన గుర్తు లేదు. తమకి తెలీకుండా సోఫాలోకి వాళ్లెప్పుడు వచ్చారో తెలీదు. చడీ చప్పుడు లేదు. ఉన్నట్లుండి తమ ముందు ప్రత్యక్షమైన వాళ్లని చూసి ఇద్దరు పిల్లల గుండెలూ అవిసిపోయాయి. ముందు తలుపు వంక అనుమానంగా చూశారు. అది వేసింది వేసినట్లే ఉంది. అయినా వీళ్లు లోపలకి ఎలా వచ్చారు? ఏదో అనుమానం. జరగగూడనిదేదో జరిగినట్లు పిల్లలిద్దరికీ అర్థమైంది. ఒక్క క్షణం అటూ ఇటూ చూశారు. అమ్మానాన్నా పడుకున్న గదిలోకి పరిగెత్తబోయారు. నేలకి అతుక్కుపోయినట్లు లేవలేకపోయారు. గట్టిగా అరవబోయారు. గొంతు పెగల్లేదు. ఏం చెయ్యాలో అర్థంకాక అలానే వచ్చిన వాళ్లిద్దరివంకా భయంభయంగా చూస్తూ కూర్చున్నారు. పిల్లలిద్దరి కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి. వచ్చింది దొంగలా? దొంగలూ మనుషులే అని ఇంతకుముందు నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చింది. కాని, వచ్చిన వాళ్లు మనుషుల్లా లేరు. రాజుల సినిమాల్లో కనపడే సైనికుల్లా ఉన్నారు. కనుక దొంగలు కాదు. సోఫాలో కూర్చున్న వాళ్లిద్దరి ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇంతలో ఒకతను తన చేతిలో ఉన్న పెట్టెలాంటిది తెరిచాడు. నెమ్మదిగా అందులో ఉన్న వస్తువులని సరిచూసుకోవటం ఆరంభించాడు. రెండో అతను తలపైన ఉన్న కిరీటం తీసి కుడిచేత్తో పట్టుకున్నాడు. ఎడంచేత్తో చెదిరిన జుట్టు సరిచేసుకున్నాడు. కిరీటం మళ్లీ తలమీద పెట్టుకుని, ఒకసారి మీసాలు దువ్వుకుని నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మీ అమ్మానాన్నా లోపల నిద్రపోతున్నారు కదూ?’’ అడిగాడు. అతని గొంతు వాళ్లకి చిత్రంగా అనిపించింది. మాట విచిత్రంగా వినిపించింది. క్లాసులో పాఠాలు చెప్పే టీచర్ల గొంతుకీ దానికీ ఏదో తేడా కనిపించింది. అంతకు ముందు తమకు గొంతు పెగలని విషయం పిల్లలిద్దరికీ గుర్తొచ్చింది. మాట నోట్లోంచి రాకుండా ఎలా జవాబు చెప్పాలో తెలియలేదు. ప్రశ్న అడిగిన వ్యక్తివేపు మౌనంగా చూశారు. తమకు మాటలు రావడం లేదన్నట్లు చేతుల్తో సైగ చేశారు. ‘‘ఇందాక మీ గొంతు పనిచేయని మాట నిజమే. అది మీరు వేరే వాళ్లతో మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే. మాతో మాట్లాడాలనుకుంటే అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించండి..’’ అనునయంగా అన్నాడు రెండో అతను.‘‘అవును! అమ్మానాన్నా నిద్రలేచే టైమయింది. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే వాళ్లతోనే మాట్లాడండి..’’ పోయిన ధైర్యం కూడకట్టుకుని అక్క జవాబు చెప్పింది. ‘‘వాళ్లలో ఒక్కళ్లు మాత్రమే నిద్ర లేస్తారు..’’ మొదటతను తన పెట్టెలాంటిది మూసేస్తూ జవాబు చెప్పాడు. అతడి మొఖంలో అదో రకమైన చిరునవ్వు. మరి రెండోవాళ్లు..?అక్క అడక్కముందే తమ్ముడు ఆత్రంగా అడిగాడు. మా వెంట వస్తారు.. మీరెవరు?అక్క అడిగింది. యమభటులం..రెండో అతను చెప్పక తప్పదన్నట్లు సాధ్యమైనంత మామూలుగా చెప్పాడు. అంటే ఏమిటి?అన్నట్లు తమ్ముడు అక్క వైపు చూశాడు. మనుషుల్ని చంపి తమ వెంట తీసుకుపోయేవాళ్లు. అవునా? అక్క భయంభయంగా కంగారుగా అడిగింది. వచ్చిన వాళ్లిద్దరూ అవునన్నట్లు తల ఊపారు. ఎందుకు ఒకళ్లని తీసుకు వెళ్లటం?అక్క ఏడుస్తూ గద్గదస్వరంతో అడిగింది. ఏం జరగబోతోందో ఆ అమ్మాయికి అప్పటికే అర్థమయింది. నీకు తెలియదా? ఆయుష్షు తీరిపోయినవాళ్లను మా లోకం తీసుకువెళతాం. అప్పటినుంచీ వాళ్లు చచ్చిపోయినట్లు లెక్క..మొదటతను నిర్వికారంగా సమాధానమిచ్చాడు. ఆయుష్షు అంటే పిల్లలిద్దరికీ అర్థం కాలేదు. చచ్చిపోవటం అంటే మన కళ్ల ముందు అప్పటిదాకా తిరిగిన వాళ్లు చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోవటం. వాళ్లు తిరిగి రారు. మిగిలిన వాళ్లు మాత్రం ఏడుస్తుంటారు. మేం ఇంకా చిన్న పిల్లలం. మాకు అమ్మానాన్నా అవసరం చాలా ఉంది. వాళ్లు లేకుండా మేం బతకలేం. ఇంకొన్ని రోజులు వాళ్లిద్దరినీ మా దగ్గరనే ఉండనివ్వకూడదా?అక్క బతిమాలుతున్నట్లు అడిగింది. ఆ అమ్మాయి అడిగిన విధానం గుండెని కలచేసేలా ఉంది. కాని వచ్చిన వాళ్లకి గుండె ఉన్నట్లు లేదు. కుదరదమ్మా! అసలు మీ అమ్మానాన్నా ఇద్దర్నీ తీసుకెళ్లాలి. కాని, మా దగ్గరే ఉన్న మీ తాతగారికి ఈ విషయం ముందే తెలిసింది. ఎలా తెలిసిందో ఏమో! మా రాజు గారిని కలిసి బతిమలాడుకున్నాడు. ఆయన కాళ్ల మీద పడి వేడుకున్నాడు. పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. పెద్దవాళ్లు అయేంతవరకూ మీ అమ్మానాన్నని మీతోనే ఉంచమన్నాడు. మా రాజుగారు కుదరదంటే కుదరదన్నారు. కనీసం ఒక్కళ్లనన్నా ఉంచమని మీ తాతగారు ప్రాధేయపడ్డారు. దానికి మా రాజుగారు ఒప్పుకున్నారు. అదీ అతికష్టం మీద.. ఇంతకుముందు యమధర్మరాజుకు ఆ అధికారం లేదు. ఈ మధ్యనే బ్రహ్మదేవుడు ఆయనకా అధికారం ఇచ్చాడు ఒక షరతు మీద. అందరి విషయంలో ఆ అధికారం ఉపయోగించకూడదు. చిన్నపిల్లలున్న తల్లిదండ్రుల విషయంలోనే దాన్ని వాడాలి. కాని ఎవర్ని ఉంచాలో, ఎవర్ని తీసుకెళ్లాలో నిర్ణయించే అధికారం రాజుగారికి లేదు. అది నిర్ణయించుకోవాల్సింది ఆ తల్లిదండ్రుల పిల్లలే.ఆ ఒక్కళ్లూ ఎవరు?’’ కొంచెం తేరుకుని తమ్ముడు ప్రశ్నించాడు. మాకూ తెలీదు. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుని, మీకెవరు కావాలో మాకు చెప్పాలి. చెప్పకపోతే, చెప్పలేకపోతే? మా ఇష్టం వచ్చిన ఒకళ్లని తీసుకు వెళతాం..ఆ తర్వాతేం మాట్లాడాలో తమ్ముడికి అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. పోనీ మా ఇద్దర్లో ఒకళ్లని తీసుకెళ్లి అమ్మానాన్నా ఇద్దర్నీ ఉంచొచ్చుగా! కనీసం ఒకళ్లకైనా అమ్మానాన్నా ఇద్దరూ ఉండేవాళ్లు..అక్క అడిగింది. ఊహించని ప్రశ్న ఇది. జవాబు ఏం చెప్పాలో వచ్చిన వాళ్లకి వెంటనే తెలీలేదు. కాని ఏదో ఒకటి చెప్పాలి. అలా అని మీ తాతగారు ముందే అడిగి ఉండాల్సింది. ఆయనకి ఆ ఆలోచన వచ్చినట్లు లేదు. ఇప్పుడిక ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు.తాతగారు పెద్ద పొరపాటు చేసినట్లు పిల్లలిద్దరికీ అనిపించింది. ఏం చెయ్యాలో తెలీక పిల్లలిద్దరూ ఏడ్వటం మొదలుపెట్టారు. చిత్రంగా వాళ్ల ఏడుపు వాళ్లకే వినపడటం లేదు. ఎటన్నా కదుల్దామంటే కుదరదు. పిలుద్దామంటే గొంతు పనిచేయదు. ఏం చెయ్యాలో తెలీక ఉన్నచోట్లోనే కూర్చుండిపోయారు. మొహాల్లో విషాదం. కళ్లలో భయం. రేపటి పరీక్ష మర్చిపోయారు. కొద్ది నిమిషాలు అలాగే గడిచాయి. అమ్మానాన్నా లేస్తే బాగుండు. హాల్లోకి వస్తే బాగుండు అని పిల్లలిద్దరి మనసులోనూ ఉంది. కాలం జరుగుతోంది. వాళ్లు అనుకున్నది జరగటం లేదు.మీరు అనుకునేది మాకు తెలుసు. మా పని పూర్తయ్యేదాకా మీ అమ్మానాన్నకి మెలకువ రాదు. వాళ్లు పడుకున్న గది తలుపులూ తెరుచుకోవు..’’మొదటతను పిల్లలిద్దరితో చెప్పాడు. దాంతో జరగబోయేదేమిటో, చేయాల్సిందేమిటో పిల్లలకు కొంచెం కొంచెం అర్థం కావటం మొదలుపెట్టింది. నెమ్మదిగా గుండె దిటవు చేసుకుని ధైర్యం తెచ్చుకున్నారు. మేమిద్దరం కాసేపు మాట్లాడుకోవచ్చా? ఓ! అలాగే. మీ మాటలు మీ ఇద్దరికే కాక మాక్కూడా వినపడతాయి. స్వేచ్ఛగా మాట్లాడుకోండి. మేం వింటూ ఉంటాం..వచ్చిన వాళ్లు సానుభూతిగా చూస్తూ అనుమతి ఇచ్చారు. సరే కానీ, మాకేదన్నా అనుమానం వస్తే అడగొచ్చా?’’ పిల్లలు బ్రతిమిలాడుతున్నట్లు అడిగారు. వాళ్లకి స్కూల్లో పరీక్షకన్నా ఇది పెద్ద పరీక్షగా అనిపిస్తోంది. అడగొచ్చు.. మొదటతను చెప్పాడు. కళ్లలోంచి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లని చేతుల్తో తుడుచుకుని పిల్లలిద్దరూ వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. చెప్పక్కా! ఎవర్ని ఉంచమని అడుగుదాం. అమ్మనా? నాన్ననా?’’ తమ్ముడు అక్క మొహంలోకి చూస్తూ అడిగాడు. అక్క తెలివితేటల మీద అతడికి ఎక్కళ్లేని నమ్మకం. అదే అర్థం కావటం లేదురా!అక్కా! నాకో చిన్న అనుమానం. నాన్న రోజూ పొద్దున్నే బయటికెళ్లి రాత్రి ఎప్పుడో కానీ ఇంటికి రాడుగా. పగలంతా ఎక్కడుంటాడు? ఏం చేస్తాడు? కంపెనీలో పని చేస్తాడు. దానికొచ్చిన జీతంతోనే కదా మనకు అన్నమూ, బట్టలూ, చదువూ..’’ సాలోచనగా జవాబిచ్చింది అక్క. ఐతే నాన్న లేకపోతే అవన్నీ ఉండవా?నిస్పృహగా అడిగాడు తమ్ముడు. అనే అనుకుంటాను. నాన్న లేకపోతే మనం ఏమైపోయేవాళ్లమో! అమ్మ నాతో ఆ మాట చాలాసార్లు అంది..’’ దిగులుగా అంది అక్క. వచ్చినవాళ్లు ఈ నాన్నను తీసుకెళ్లిపోతే అమ్మ, కొత్త నాన్నను తెచ్చుకోకూడదా?’’ అనుమానంగా అడిగాడు తమ్ముడు.కుదరదనుకుంటాను. పక్కింటి అంకుల్ చనిపోతే ఆంటీ ఒక్కతే అలా ఉండిపోయింది. ఇంకో అంకుల్ని తెచ్చుకోలేదుగా..’’ ఈ మధ్య జరిగింది గుర్తు తెచ్చుకుంటూ అంది అక్క. అక్కా! నాన్న ఎన్నాళ్లనుంచో వాళ్ల దగ్గర చేస్తున్నాడుగా. నాన్నకేమన్నా ఐతే వాళ్లేమీ పట్టించుకోరా? నాన్న చేసే పని అమ్మ చేయకూడదా?’’ మరిచిపోయిన విషయమేదో గుర్తొచ్చినట్లు ప్రశ్నించాడు తమ్ముడు. చేయొచ్చు. కాని అమ్మకి ఆ పని చేతకావాలి. కంపెనీ వాళ్లు ఒప్పుకోవాలి. ఇంట్లో పనీ, కంపెనీలో పనీ రెండూ అంటే అమ్మకి కుదరొద్దూ? మనని స్కూలుకు కూడా పంపాలిగా.. ఐతే అమ్మ ఇంట్లో ఉండటం చాలా అవసరం.అందుకనేగా నా క్లాస్మేట్ రామూ అమ్మ చనిపోతే, వాళ్ల నాన్న ఇంకో అమ్మను తెచ్చింది..కానీ ఆ అమ్మ రామూని రోజూ కొడుతుందనీ నువ్వేగా చెప్పావు..చాలా మంది కొత్త అమ్మలు అలానే ఉంటారట..సరే కానీ అక్కా! మన దగ్గర బోలెడన్ని డబ్బులుంటే బాగుండేది కదా?కానీ లేవుగా. అమ్మ కూడా ‘మన దగ్గర బోలెడంత డబ్బులేదు కదా! కావాల్సినవన్నీ తెచ్చుకోవటానికి అంటుంది అప్పుడప్పుడు..ఐతే ఏం చెప్పుదాం వాళ్లకి?అయోమయంగా అడిగాడు తమ్ముడు. అదే అర్థం కావడం లేదు..’’ నిస్సహాయంగా అంది అక్క. అక్కకే అర్థం కాకపోతే తనకేం అర్థమవుతుంది. తమ్ముడు బిక్క మొహం వేశాడు. చెప్పండి పిల్లలూ! ఏం చెయ్యమంటారు?’’ మొదటతను అడిగాడు. మాకేం అర్థం కావటం లేదు..’’ పిల్లలిద్దరూ ఒకేసారి జవాబు చెప్పారు. వచ్చినవాళ్లిద్దరూ ఇలాంటి సమస్యని ఇంతకుముందు చాలాసార్లు ఎదుర్కొన్నారు. వాళ్ల అనుభవం ఏ పరిస్థితిలో ఎవర్ని ఉంచొచ్చో వాళ్లకి తెలిసేలా చేసింది. కానీ, వాళ్లంతట వాళ్లు ఒక నిర్ణయం తీసుకోకూడదు. అమలుపర్చకూడదు. అలా చేస్తే రాజుగారు వీళ్లకి శిక్ష వేస్తారు. అంకుల్ ! మీరిలాంటి పనులు ఇంతకుముందూ చేసి ఉంటారుగా. మేమేం చెయ్యాలో మీరే చెప్పొచ్చుగా..’’ తమ్ముడు తన తెలివితేటలని ఎలాగైతేనేం దారికి తెచ్చుకోగలిగాడు. చెప్పొచ్చు. కానీ తర్వాత మీకేదన్నా కష్టం వస్తే అది మా వల్లనే అని మీరనకూడదు..లేదంకుల్! అలా అనం..’’ గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలిద్దరూ హామీ ఇచ్చారు. ఐతే సరే! కాని మా సలహా ఎవరూ వినకూడదు. మీ ఇద్దరి చెవుల్లో రహస్యంగా చెపుతాం..’’ అంటూ ఇద్దరు యమభటులూ పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ల చెవుల్లో తమ అభిప్రాయం చెప్పారు. యమభటులిచ్చిన సలహా పాటించటం తప్ప వేరే మార్గం ఏమీ వాళ్లకు కనపడలేదు. సరే అంకుల్! అలాగే చేయండి..’’ అని పిల్లలిద్దరూ అన్నారు. వాళ్ల గొంతుల్లో భరించలేని విషాదం. ఇప్పుడేం జరుగుతుంది? పిల్లలిద్దరూ ఆందోళనగా, ఆత్రుతగా బెడ్రూమ్ తలుపుల వంక చూస్తూ కూర్చున్నారు. తలుపులు తెరుచుకోలేదు. అయినా, వాట్లోంచి యమభటులిద్దరూ లోపలికి వెళ్లారు. ఒక్క నిమిషం తర్వాత బయటికి వచ్చారు. ఉన్నట్లుండి మాయమయ్యారు.వాళ్లు వెళ్లింతర్వాత బెడ్రూమ్ తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. చిత్రంగా పిల్లలిద్దరి శరీరాలూ వాళ్ల స్వాధీనంలోకి వచ్చాయి.పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్లారు.మరో నిమిషం తర్వాత ఆ ఇంట్లోనుంచి ముగ్గురి ఏడుపులు పెద్దగా వినపడ్డాయి. -
బాబు, రాజన్నపాలనలో... ఐటీ
బాబు పాలన హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధికి తానే కారకుడినంటూ చెప్పుకునే చంద్రబాబు మాటల్లో నిజం ఎంతుందో ఓసారి చూద్దాం! వై2కే వల్ల అమెరికాలో ఏర్పడిన డిమాండ్ కారణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎగుమతులకు భారతదేశానికి గొప్ప అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తన ముందు పని చేసిన ముఖ్యమంత్రులంతటి సమర్థుడై ఉన్నా ఆ ఆవకాశాన్ని అందిపుచ్చుకుని సాఫ్ట్వేర్ ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టి ఉండేవారు. ఎందుకంటే దేశంలోని ప్రప్రథమ ఎస్టీపీఐ (సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్) 1991లోనే ఆంధ్రప్రదేశ్‌లోనే స్థాపించడం జరిగింది. అలాగే ప్రభుత్వ రంగ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీఎంసీ) సైతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఎస్టీపీఐ, సీఎంసీ ఒక వైపు, సత్యం కంప్యూటర్స్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజం మరో వైపు ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ ఎగుమతులలో రాష్ట్రం ఆయన హయాంలో అగ్రస్థానం సాధించలేకపోయింది. ఐటీ నిజాలు 1995 సెప్టెంబర్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడానికి ముందుగా సాఫ్ట్వేర్ ఎగుమతులలో దేశంలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2004 నాటికి 5వ స్థానానికి పడిపోయింది. 1995-96 మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఎగుమతులలో బెంగుళూరు, హైదరాబాద్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే 2003-04లో అంటే చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేనాటికి సాఫ్ట్వేర్ ఎగుమతులలో ఈ రెండు నగరాల మధ్య ఉన్న వ్యత్యాసం 2,500 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది.2003-04లో భారతదేశం నుంచి జరిగిన సాఫ్ట్వేర్ ఎగుమతులలో కర్నాటక వాటా 38 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 8 శాతం మాత్రమే. చాలా ఆలస్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ఆ తర్వాత కాలంలో అంటే... చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అధిగమించిపోయాయి. అలా... దక్షిణ భారతదేశంలో మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ‘భారతదేశానికే ఐటీ రాజధాని’ అంటూ, చంద్రబాబు మీడియాను మేనేజ్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం ప్రారంభించారు. ఐటీ రంగంలో ఎవరి పరిపాలన ఎలా జరిగింది? ఆంధ్ర ప్రదేశ్ అధికారిక చంద్రబాబు వై.ఎస్.ఆర్. వృద్ధి గణాంకాలు (1994-’04 సగటు) (2004-’09) దేశంలో ఐ.టి.లో రాష్ట్ర వాటా 8 శాతం 14 శాతం ఐ.టి. ఉద్యోగాలు 81 వేలు 2.51 లక్షలు ఐ.టి. ఎగుమతులు 2004లో 5 వేల కోట్లు 2009లో 33 వేల కోట్లు జగన్ సంకల్పం కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం హైదరాబాద్‌ను కోల్పోయినందున రెవెన్యూలో వాటానే కాదు... మాన్యుఫాక్చరింగ్, ఐటీ రంగాలను కూడా కోల్పోయింది. అంతమాత్రాన నిరాశ చెందనక్కరలేదు. అభివృద్ధికి కేవలం నిధుల లేమి ఒక్కటే అవరోధం కాదని నిరూపిస్తా! ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఐటీఐఆర్ (ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)ను నెలకొల్పుతామని విభజన బిల్లులో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికోసం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తాం. రాయలసీమ, కోస్తా ఆంధ్రల్లో రెండుచోట్లా ఐటీఐఆర్‌లు ఏర్పాటు చేస్తాం. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక కారిడార్ నెలకొల్పడంతో పాటు కేంద్రం ఇచ్చిన పారిశ్రామిక, ఐటీఐఆర్ హామీలు నెరవేరేలా కృషిచేస్తాం. వీటివల్ల అన్ని ప్రాంతాల్లోనూ ఐటీ పరిశ్రమల వృద్ధికి వీలు ఏర్పడుతుంది. తద్వారా ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, టెక్నీషియన్లకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు వీలు కలుగుతుంది. పరిశ్రమలు బాబు పాలన ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి కార్మిక వర్గం నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. ఆయన ఏలుబడిలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డ గడ్డు పరిస్థితులే శ్రామిక లోకానికి గుర్తుకొస్తున్నాయి. బాబు హయాంలో సంస్కరణల పేరుతో 87 ప్రభుత్వ రంగ సంస్థల నడ్డి విరిచారనేది కార్మిక సంఘాల ప్రధాన ఆరోపణ. 1994- 2004 మధ్యకాలంలో 22 సంస్థలను మూసివేశారు. మరో 12 సంస్థలను పునర్వ్యవస్థీకరించారు. 11 సంస్థలను ప్రైవేటీకరించారు. 9 సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 54 సంస్థల తలరాతనే చంద్రబాబు మార్చేయడం అప్పట్లో విమర్శలకు కారణమైంది. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనేది ఆరోపణ.రాష్ట్ర స్థాయి సంస్థలు, కో-ఆపరేటివ్ సంస్థల మార్కెట్ విలువ రూ. 636 కోట్ల వరకూ ఉంటే కేవలం రూ.209 కోట్లకే అమ్మారనే దానికి బాబు వద్ద సరైన సమాధానం లేదు. ఏమిటీ దారుణం? చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకూ సజావుగా లాభాలతో నడిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు దివాలా తీశాయో, ఆ తర్వాత అవి టీడీపీ నాయకగణం చేతుల్లోకి వెళ్లాక ఎలా లాభాల బాట పట్టాయో విడ్డూరమే. ఈ క్రమంలో అనేక మంది కార్మికులు ఇంటిదారి పట్టినా చంద్రబాబు సర్కారుకు పట్టలేదు.2002లో హనుమాన్, ఏఎస్ఎం కో ఆప రేటివ్ షుగర్‌మిల్స్, డెల్టా పేపర్ మిల్స్‌ను కారు చౌకగా కట్టబెట్టడం, టీడీపీ ఎంపీ నామా నాగే శ్వరరావుకు పాలేరు షుగర్స్ ధారాదత్తం చేయడం, బాబుకు సన్నిహితుడు మండవ ప్రభాకర్ రావుకు చెందిన ఎన్ఎస్ఎల్ గ్రూప్‌నకు షుగర్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లును రాసివ్వడం సభా సంఘాలనే విస్మయపరచింది. ఇదో పెద్ద దోపిడీ నిజాం షుగర్స్ బాబును ఇప్పటికీ వెంటాడే శాపమే. ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ పరిశ్రమ వెన్నులో కత్తి దూసిన వైనాన్ని కార్మిక లోకం నేటికీ జీర్ణించుకోలేకపోతోంది. షక్కర్నగర్, మెట్పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులతో పాటు షక్కర్నగర్ డిస్టిలరీని విక్రయిం చిన వ్యవహారంలో ప్రభుత్వానికి 300 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని శాసనసభా సంఘం అంచనా వేసింది. నిజాం షుగర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 173 కోట్లు సాయం చేసిందంటూ 2000 సెప్టెంబర్‌లో చంద్రబాబు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని ఉటంకించింది. వివిధ కార్పొరేషన్స్ ద్వారా నిజాం షుగర్స్ రుణాలు తీసుకుందని వెల్లడించింది.నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత. తన హెరిటేజ్ కోసం వేలాది రైతులు, ఉద్యోగుల పొట్టగొట్టారనే ఆరోపణలకు చంద్రబాబు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. రాజన్న రాజ్యం హా దేశంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది: రిజర్వ్‌బ్యాంకు నివేదిక 2007 హా దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో ఆంధ్రప్రదేశ్ మంచి ఫలితాలను సాధిస్తోంది: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హా దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది: ప్రపంచబ్యాంకు నివేదిక 2007 హా పేపరు, సిమెంట్, బల్క్ డ్రగ్స్ తయారీలో దేశంలో మొదటిస్థానం హా 2008-09 తొలి ఆరు నెలలకు రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకొచ్చాయి. వాటిని ఆకర్షించడంలో ఏపీయే నంబర్‌వన్: సీఐఐ సర్వే జగన్ సంకల్పం పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మూడవ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని అంశాలను అమలుచేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.అలాగే, అందుబాటులో ఉన్న అన్ని సహజ వనరులు, ఖనిజాలను సద్వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికీకరణ అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించేలా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మరో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర పరిధిలోని అనంతపురం, కృష్ణపట్నం కారిడార్లను కూడా ఏర్పాటు చేస్తాం. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, పీసీపీఐఆర్, ఐటీఐఆర్, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజీ అన్నీ తోడైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొప్ప ప్రేరణ కలుగుతుంది. దేశంలోని మాన్యుఫాక్చరింగ్ రంగంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈ) అత్యంత ప్రధాన భూమిక పోషిస్తాయి.అత్యధికమందికి ఉపాధి కల్పించే రంగాలలో మాన్యుఫాక్చరింగ్ రంగం ఒకటి. అలాంటి ఈ రంగం తీవ్రంగా పెరిగిపోయిన విద్యుత్ చార్జీలు, ప్రకటిత, అప్రకటిత విద్యుత్ కోతలతో దారుణంగా నష్టపోయింది. ఈ రంగం ఆర్థికంగా లాభసాటిగా మారేందుకు దీనికి ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీని అందించాలని మేము భావిస్తున్నాం. -
బాబు, రాజన్నపాలనలో... మైనార్టీల సంక్షేమం
బాబు పాలన బాబు పాలనలో మైనార్టీలకు కేవలం రూ.32 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అవి కూడా చాలా వరకు అందకపోవడంతో మైనారిటీ విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు.విద్యాసంస్థల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేక చాలామంది చదువుకు దూరంగా ఉండేవారు. మధ్యలోనే చదువును మానేసి, బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవాళ్లు. దుకాన్-మకాన్ స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, ఇళ్ల నిర్మాణానికి 3 శాతం వడ్డీతో రుణాల పంపిణీవితంతువులు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు 3 శాతం వడ్డీతో రూ.పది వేల రుణాలు.ష్నీ పథకం ద్వారా వృత్తి పనివారికి 20 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ మైనార్టీ పేద అమ్మాయిల వివాహాలకు నామమాత్రపు ఆర్థికసాయం చేసేవారు. రాజన్న రాజ్యం ళీ మైనారిటీల బడ్జెట్‌ను రూ. 350 కోట్లకు పెంచారు. ళీ పేద ముస్లింలకు రుణ మాఫీ చేశారు. ళీ ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రూ.30 వేల చొప్పున సబ్సిడీ రుణాలు ఇచ్చారు. ళీ డోమువా పథకం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో నివసించే పేద ముస్లిం మహిళలకు సబ్సిడీ రుణాలు ళీ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ పథకం ద్వారా ముస్లిం పిల్లలకు విద్యా రుణాలు ళీ స్కాలర్షిప్ పథకం ద్వారా ప్రతి ఏటా 3 లక్షల మంది ముస్లిం పిల్లలు విద్యావంతులయ్యారు. ళీ ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి 4 శాతం రిజర్వేషన్ల కల్పన. దీనివల్ల లక్షల మంది విద్య, ఉపాధి రంగాల్లో రాణించారు. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎదిగాయి. ళీ పేద ముస్లిం అమ్మాయిల కోసం మాస్ మ్యారేజెస్ (సామూహిక వివాహాల) పథకాన్ని ప్రవేశ పెట్టారు. ళీ కుటుంబ వార్షికాదాయం రూ. 80 వేల కంటే తక్కువగా ఉన్నవారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాల పంపిణీ ళీ దీపం పథకం ద్వారా ముస్లిం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ళీ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు కోసం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించారు. ళీ మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఓపెన్ స్కూల్స్ ఏర్పాటు. ళీ మదరసాల్లో చదివే విద్యార్థుల కోసం కంప్యూటర్ల ఏర్పాటు ళీ యువతకు ఐటీ, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాల కల్పన. జగన్ సంకల్పం వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన అన్ని మైనార్టీ పథకాలనూ నూతనంగా ఏర్పడబోయే రాష్ట్రంలో కూడా కొనసాగిస్తాం. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, మాస్ మ్యారేజెస్, ఉర్దూ భాషాభివృద్ధి, ఉర్దూ మీడియం స్కూళ్లలో వసతులు, ఉర్దూ టీచర్ల నియామకం, ఉర్దూ అకాడమీకి మరిన్ని నిధులు, మైనారిటీ విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, పవిత్ర హజ్ యాత్రలో సబ్సిడీ, వక్ఫ్ భూముల పరిరక్షణ చట్టం, అర్హులైన అందరికీ గృహనిర్మాణాలు మొదలైనవన్నిటినీ అమలుచేస్తాం. మతపరమైన దాడులు జరగకుండా చట్టాలను కఠినతరం చేస్తాం. ముస్లింల కోసం ప్రస్తుతమున్న బడ్జెట్‌ను పెంచుతాం. ముస్లిం అమ్మాయిలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు సైకిళ్లు, యూనిఫామ్‌లను అందిస్తాం. మధ్యలో చదువు మానేసిన ముస్లిం విద్యార్థుల కోసం, అమ్మాయిలకు వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు రూ. 5 లక్షల వరకు వడ్డీ రుణాలు ఇస్తాం. మసీదుల నిర్మాణం, మరమ్మతుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. ప్రభుత్వంలోని ప్రతి సంక్షేమ పథకంలో ముస్లిం జనాభా ప్రతిపాదికన వాటా కల్పిస్తాం. పేద ముస్లిం అమ్మాయిల వివాహం కోసం ఒక అన్నయ్యలా వారి నిఖా సందర్భంగా 50 వేల రూపాయలను కానుకగా అందించి అర్థికంగా అదుకుంటా. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పటిష్ఠపరిచి తద్వారా చిన్న తరహా వ్యాపారులకు రుణాలు అందేలా చేస్తాం. -
బాబు, రాజన్నపాలనలో... పింఛన్లు
పెన్షన్.. బలహీనులకు ఆర్థిక భరోసానిచ్చే ఆయుధం! వృద్ధాప్యం వల్లనో, వైకల్యం వల్లనో సొంతంగా సంపాదించుకోలేని వారికి ప్రభుత్వం కచ్చితంగా అందించాల్సిన చేయూత. పెన్షన్ల పథకం 1995-96లో ప్రారంభమైంది. అంతకుముందు వితంతు పెన్షన్లు ఉన్నా, దానివల్ల అతి తక్కువ మందికి లబ్ధి చేకూరేది. 1995-96లో వృద్ధాప్య, 2000లో వికలాంగ, 2001లో చేనేత పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ వైఎస్ వచ్చే వరకు ప్రభుత్వాలు పింఛను అంశాన్ని ఆర్థికాంశంగా, ఖజానాపై భారంగా, అనవసర వ్యయంగానే చూశాయి. బాబు పాలన చంద్రబాబు హయాంలో అర్హులైన అందరికీ కాకుండా, ‘ఒకరు మరణిస్తేనే.. మరొకరికి’ పింఛన్ ఇచ్చేవారు. అదీ మూడు నెలలకోసారి గ్రామ సభల్లో అందించేవారు. 2004లో పదవి నుంచి దిగిపోయే నాటికి.. రాష్ట్రంలో మొత్తం వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగ పెన్షన్ల సంఖ్య 18.97 లక్షలు. పెన్షన్ల కోసం ఏడాదికి చేసిన వ్యయం రూ.163.90 కోట్లు. రాజన్న రాజ్యం 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే.. 50 రూపాయలు, 75 రూపాయలున్న పెన్షన్లను వంద రూపాయలకు పెంచారు.2005-06 ఆర్థిక సంవత్సరంలోనే పెన్షన్ మొత్తాన్ని రూ. వంద నుంచి రూ. 200కు పెంచారు.2006 సంవత్సరం నుంచి అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో.. సంతృప్తస్థాయి విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా 21 లక్షల నుంచి 71 లక్షలకు చేరింది. దరఖాస్తు చేసుకున్న, తెల్లరేషన్‌కార్డు ఉన్న, అర్హులైన వారందరికీ.. ఎలాంటి మధ్యవర్తులు, సిఫారసులు లేకుండానే పెన్షన్లు మంజూరు చేశారు. {పతి నెలా జీతంలా పెన్షన్లు ఇచ్చారు. జగన్ సంకల్పం అన్నం కోసం వృద్ధులు కూలి పని చేయకూడదు. ప్రతి అవ్వకు, తాతకు నెలకు రూ.700 పింఛను, వితంతువులకు నెలకు రూ.700, వికలాంగులకు నెలకు రూ.1000 ఇస్తాం. ప్రతి నియోజకవర్గంలో వృద్ధులకు, అనాథలకు ఆశ్రమాలు స్థాపిస్తాం. వాటిని మండలస్థాయికి విస్తరిస్తాం. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను చేసే రెండో సంతకం ఇదే! అవ్వాతాతలకు ఇది ఒక మనవడి మాట. -
బాబు, రాజన్నపాలనలో... పక్కా ఇళ్లు
బాబు పాలన తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం దక్కినా కనీసం మూడో వంతు కుటుంబాలకు కూడా ఇళ్లను నిర్మించి ఇవ్వలేకపోయారు చంద్రబాబు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మితమైన ఇళ్లు 20 లక్షల లోపే.నియోజకవర్గానికి ఏడాదికి వేయి ఇళ్లు చొప్పున నిర్మిస్తున్నట్టు అప్పట్లో చెప్పిన ఆయన, వాటి నిర్మాణంలో ఎమ్మెల్యేల పెత్తనాన్ని పెంచారు. వారు చెప్పినవారికే ఇళ్లు కేటాయించే పద్ధతిని కొనసాగించి, వాటిలో అనర్హులు పాగా వేసేలా చేశారు.జన్మభూమి పేరుతో అట్టహాసంగా నిర్వహించిన కార్యకమాల్లో... ఇళ్లు కావాలంటూ పేదలు లక్షల సంఖ్యలో అందజేసిన విజ్ఞాపనలను బుట్టదాఖలు చేశారు. ‘వాంబే’ పేర కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనే తన ఘనతగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీశారు. రాజన్న రాజ్యం పేదలందరికీ సొంత గూడు ఉండాలన్న ఆలోచన కొత్తది కానప్పటికీ, సొంతిల్లు లేని కుటుంబం ఒక్కటి కూడా రాష్ట్రంలో ఉండరాదనే సంకల్పంతో ఆ బృహత్ ప్రణాళికను పూర్తి చేయటం ప్రారంభించింది మాత్రం వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేపట్టిన పాదయాత్రలో పేదల కష్టాలను కళ్లారా చూసి... వాటిని దూరం చేయాలన్న తపనతో వారికి ఏం చేస్తే బాగుంటుందన్న కోణంలో అప్పుడే ప్రారంభమైన ఆలోచనలో పుట్టుకొచ్చిందే... ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్న తపన. 2004లో అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతకుముందు కొనసాగిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని మామూలుగానే కొనసాగించారు. అంతకుముందు మంజూరై నత్తనడక నడుస్తున్న కొన్ని ఇళ్లు కలుపుకొని మొత్తం నాలుగు లక్షల ఇళ్లను పూర్తి చేశారు. విప్లవాత్మక మార్పులు తెస్తేగాని పేదలందరికీ సొంత గూడు లభించదన్న ఉద్దేశంతో ‘ఇందిరమ్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం మూడేళ్ల కాలంలో వీలైనంతమంది పేదలకు ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ఓ యజ్ఞంలా దాన్ని ప్రారంభించి కొనసాగించారు. 2006-07, ఇందిరమ్మ మొదటి దశ: కనీవినీ ఎరుగని రీతిలో కేవలం ఒక్క ఏడాదిలోనే 20,22,801 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.దేశం మొత్తం రాష్ట్రం వైపు చూడసాగింది. ఇంతటి భారీ సంఖ్యలో ఇళ్లను ప్రారంభించి, పూర్తి చేయటం సాధ్యమా అని ముఖ్యమంత్రులంతా విస్తుపోయారు. కానీ రాజశేఖరరెడ్డి దాన్ని చేసి చూపారు.2007-08, ఇందిరమ్మ రెండో దశ: అంతకుముందు సంవత్సరం రికార్డును బద్దలు కొడుతూ 20,95,110 ఇళ్లను ప్రారంభించారు.2008-09, ఇందిరమ్మ మూడో దశ: 15,44,889 ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇలా ఈ మూడేళ్ల కాలంలో సింహభాగం పేదలకు ఇళ్లు అందాయి. వైఎస్సార్ బతికున్నపుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే.. ఆయన హయాంలోనే ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షలు ఇళ్లు కట్టారు.మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఇంకా పేదల ఇంటి పరిస్థితిని కళ్లారా చూసి, వారి నోటివెంటే వారి పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. ఈలోపు ఎన్నికలు ముంచుకొచ్చాయి. పేదల వెన్నంటి ఉన్నందున రాజశేఖరరెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో ‘రచ్చబండ’ కార్యక్రమం చేపట్టారు... ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలోనే ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మనందరికీ దూరమయ్యారు. జగన్ సంకల్పం ‘‘సొంత గూడు లేక లక్షల మంది దుర్భర జీవితం గడుపుతున్నారు. వారందరికీ యోగ్యమైన సొంతింటి అవసరముంది. వారి కలను నిజం చేసి చూపిస్తా. 2019 నాటికి ‘మాకు సొంతిల్లు లేదు’ అని ఎవరూ చెయ్యెత్తి చూపే పరిస్థితి లేకుండా చేస్తా. ఏటా 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. ఇల్లు ఇచ్చినప్పుడే ఆడపడుచు పేరున పట్టా ఇస్తా. ఇంటిని రుణంలో కాదు.. ఇంటి మీదే రుణం తెచ్చుకునేలా చేస్తా. ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు తీసుకునే అవకాశం కల్పిస్తా. ఉండడానికి నీడనిస్తా... ఇంటి పత్రాలను చేతికిస్తా... ఆపదలో అవసరమైతే పావలావడ్డీకి రుణం తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చి ఆదుకుంటా! దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పేదలకు సొంత గూడు కల్పించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరు స్ఫూర్తిగా దీన్ని సాధ్యం చేసి చూపుతా...’’ -
బాబు, రాజన్నపాలనలో... ఆరోగ్యం
బాబు పాలన చంద్రబాబు తన పాలనలో వైద్య, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. {పభుత్వాసుపత్రుల్లో తగినంత మంది వైద్యులుండేవారు కాదు. ఇతర సిబ్బందీ అరకొరగానే ఉండేవారు. వైద్య పరికరాలు ఎప్పుడూ మరమ్మత్తులోనే ఉండేవి. 2002లో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద రోగులతోనూ యూజర్ చార్జీలు వసూలు చేశారు.మందులు బయటి నుంచి తెచ్చుకోవాల్సిందే. ఏవైనా సేవలు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే.పేద రోగుల పరిస్థితి దారుణంగా ఉండేది. చికిత్స సరిగా జరగదేమోనన్న భయంతో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లలేక, ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో చికిత్సకయ్యే ఖర్చు భరించలేక కొట్టుమిట్టాడేవారు. ఆపదలో ఆస్పత్రికెళ్లాలంటే వందలాది రూపాయలు చెల్లించి ఏ ప్రైవేటు వాహనాన్ని మాట్లాడుకుని వెళ్లాల్సిన పరిస్థితి. రోడ్డు ప్రమాదం జరిగితే అంబులెన్సులు లేవు. పురిటినొప్పులకు ఎద్దుల బళ్లు లేదా వ్యక్తిగత వాహనాలే దిక్కు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే డోలీలోనే తీసుకుపోవాల్సిన పరిస్థితి. అంబులెన్సు అంటే ఏంటో ప్రజలకు తెలియని పరిస్థితి. వేళగాని వేళ ప్రమాదం జరిగితే ప్రాణంపై ఆశ వదులుకోవాల్సిన దుస్థితి. ఎలాగోలా ఆస్పత్రికి తీసుకెళ్లినా వైద్యం చేసేవారు కరువు. ఇక పల్లెటూరి రోగుల పరిస్థితిని ఊహించలేం. వృద్ధులు, బాలింతలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికెళ్లినా సరైన మందులు దొరికేవి కావు. పట్నంలో ఉన్న పెద్దాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. పల్లెటూళ్లలో దీర్ఘకాలిక జబ్బులతో పాటు సాధారణ జబ్బులతో బాధపడే కోట్లాది మంది పేద రోగులు దుర్భర పరిస్థితులు అనుభవించేవారు. బాబు పాలనలో సీఎంఆర్ఎఫ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) కింద ఆర్థికసాయం కావాలంటే ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో బ్రతిమాలుకొని వారి ద్వారా వినతిపత్రం సమర్పించినా కచ్చితంగా సాయం వస్తుందనే భరోసా ఉండేది కాదు.ఒకవేళ ఈ సిఫార్సుల వల్ల మంజూరైనా అది అరకొర మొత్తమే. అప్పోసప్పో చేసి ఖరీదైన జబ్బులకు మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి పాతికవేలు మంజూరు చేస్తే అదే గొప్ప అన్నట్లుండేది.కీలక భూమిక నిర్వహించే మంత్రులు, శాసనసభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలున్నవారికే ఎక్కువ మొత్తం మంజూరయ్యేది.దరఖాస్తు చేశాక అది మంజూరు కావడానికి కూడా రెండు3 నెలలకు పైగా పట్టేది. అత్యవసర వైద్యం కావాలంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మాటే లేదు. అందువల్ల నిరుపేదలైనా అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సిందే. ఈ నిధి (ఎల్ఓసీ) కోసం ఎదురుచూస్తే రోగుల ప్రాణాలకే ముప్పుగా ఉండేది. సిఫార్సులు లేని అభాగ్యులు చంద్రబాబు పాలనా కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి మీద ఆశపెట్టుకోవడమన్నదే అత్యాశ అన్న పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చంద్రబాబు నాయుడు తన చివరి అయిదేళ్ల పదవీ కాలం (1999 - 2004)లో 15 వేల మందికి 36 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేశారు. రాజన్న రాజ్యం 108 - 104 + 2006 సెప్టెంబర్‌లో తొలుత 8 జిల్లాల్లో 310 అంబులెన్సులతో పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. + 2007 నవంబర్ నాటికి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి 802 వాహనాలు ఇచ్చారు. + 2009 నాటికే ఈ పథకం పై సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు. + రోజుకు 6వేలకు పైగా ఎమర్జన్సీ కాల్స్ వస్తే అందులో నాలుగువేల కాల్స్‌ను అటెండ్ చేసేవారు. + రోజూ రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 3500 నుంచి 4వేల మందిని కాపాడి ఆస్పత్రులకు చేరుస్తున్నాయి ఈ అంబులెన్సులు. + పథకానికి ఏటా రూ.100 కోట్లు తక్కువ కాకుండా కేటాయింపులు జరిపారు. + 70 శాతం మంది గర్భిణులు ప్రసవం కోసం 108 అంబులెన్సులకు ఫోన్ చేసి వినియోగించుకునేవారు. + ఫోన్ చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఘటనా స్థలానికి 25 నిమిషాల్లోనే చేరుకునేవి. + 108 వాహనాల్లో అత్యవసర పరికరాలతో పాటు మందులకు, సిబ్బందికి లోటు లేకుండా ఉండేది వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఖరీదైన చికిత్స అవసరమైన జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు.తొలి దశగా 2007 ఏప్రిల్ 1న మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 163 జబ్బులతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు.రెండవ దశలో భాగంగా 2007 డిసెంబర్ నాటికి ఈ పథకం కింద మరో ఐదు జిల్ల్లాలను (చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రంగారెడ్డి, నల్లగొండ) చేర్చారు. రెండో దశలో 163 జబ్బుల నుంచి 272 జబ్బులకు పెంచారు.మూడవ దశలో భాగంగా 2008 ఏప్రిల్‌లో ఆరోగ్యశ్రీ పథకంలోకి కడప, కరీంనగర్, మెదక్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను చేర్చి, చికిత్సల సంఖ్య 332కు పెంచారు.2008 జూలై నాటికి మిగిలిన పది జిల్లాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి, పథకం పరిధిలోకి ఏకంగా 942 జబ్బులను చేర్చారు. అంటే సరిగ్గా ఏడాదిన్నరలో పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన ఘనత దక్కించుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకూ లబ్ధి పొందిన వారు 23 లక్షల మంది పైనే. ఇందులో ఆరు లక్షల మంది ప్రభుత్వాసుపత్రుల్లోనూ, 16 లక్షల మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు.గుండెజబ్బులు, కిడ్నీ (డయాలసిస్ రోగులు), నరాల జబ్బులు, కేన్సర్, కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి ఖరీదైన జబ్బులతో బాధపడే వారు ఎక్కువ శాతం మంది ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు. పుట్టుకతోనే గుండె జబ్బులొచ్చిన నిరుపేద చిన్నారులెందరో ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందారు.రోజూ రెండు వేల వరకూ శస్త్రచికిత్సలు జరిగేవి. రోజూ రూ.2 కోట్లుపనే వాటికి వెచ్చించేవారు.నిత్యం ఆరోగ్యశ్రీ హెల్త్ క్యాంపులు జరిగేవి. రోజూ పాతికవేల మంది ఔట్పేషెంట్లు సేవలు పొందేవారు.ఆరోగ్యశ్రీ పథకానికి ఏటా రూ. 925 కోట్లు కేటాయించేవారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.350 కోట్లు ఇచ్చేవారు.ఆరోగ్యశ్రీ పథకంలో అత్యంత ఖరీదైన చికిత్స కాక్లియర్ ఇంప్లాంట్. పుట్టుకతోనే చెవిటి, మూగతో పుట్టే వారిని శాశ్వత వైకల్యం నుంచి బయటపడేసేదే ఈ చికిత్స. రాజన్న రాజ్యంలో సీఎంఆర్ఎఫ్ వైఎస్సార్ సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టిన స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి సహాయనిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.అప్పటి వరకూ పెద్దల సిఫార్సులున్న వారికే పరిమితమైన సీఎం సహాయనిధి ఒక్కసారిగా పేదల పాలిట పె‘న్నిధి’గా మారింది.దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిధులు మంజూరు చేయడం ప్రారంభించారు.రాష్ట్ర సచివాలయంలోనే కాకుండా తన అధికార నివాసంలో కూడా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని తెచ్చారు.వైఎస్ రాజశేఖరరెడ్డి తన అయిదేళ్ల పదవీకాలంలో సీఎంఆర్ఎఫ్ నుంచి లక్షా ముప్పై వేల మందికి పైగా రూ. 441.41 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేశారు. చంద్రబాబు తన పాలనలోని చివరి అయిదేళ్ల కాలంలో మంజూరు చేసిన మొత్తంతో పోల్చితే ఇది 12 రెట్లు ఎక్కువ. {పజాప్రతినిధులు (ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల) సిఫార్సుల ఆధారంగా వచ్చిన వినతులకు సంబంధించి 86,468 మందికి రూ. 279.50 కోట్ల రూపాయల ఆర్థికసాయం మంజూరు చేశారు. ఎవరి సిఫార్సులూ లేకుండా నేరుగా తనను కలిసి ఆర్థికసాయం కోరిన 43,532 మందికి రూ. 156.50 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేశారు.పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్న ఎందరికో సీఎంఆర్ఎఫ్ కింద వైద్యసాయం లభించింది.హఠాత్తుగా కుటుంబ యజమానిని కోల్పోయి పూట గడవక కష్టాలు పడుతున్న ఎన్నో నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి సాయం అందించారు. పేద రోగుల కష్టాలు తెలిసిన వైద్యునిగా, డాక్టరు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణల వల్ల ఎందరో పేదలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొంది వైద్యం చేయించుకుని ఆరోగ్యవంతులయ్యారు. సీఎంఆర్ఎఫ్ నుంచి నిధుల మంజూరులో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఏ పార్టీ వారు సిఫారసు చేసినా వినతి అందిన వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేశారన్న ప్రశంసను వైఎస్ అందుకున్నారు. జగన్ సంకల్పం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నుంచి తొలంగించిన 133 వ్యాధులను మళ్ళీ ఆ పథకంలో చేర్చి, మరిన్ని ఆస్పత్రుల్లో పథకం అమలయ్యేలా చూస్తాం. బధిరులకు, మూగవారికి... ప్రత్యేకంగా కాక్లియర్ ఇంప్లాంట్ వంటి ఖరీదైన వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును రీయింబర్సు చేస్తాం. ఈ ఖర్చు ఒక్కోసారి రూ. 6 లక్షల వరకూ ఉంటుంది. మరిన్ని 104, 108 వాహనాలు 108, 104 వాహనాల సంఖ్యను మరింతగా పెంచి ఆరోగ్య సేవల రంగాన్ని పటిష్ఠం చేస్తాం. ప్రతి ఒక్క జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ, రాజధానిలో 20 ఫ్యాకల్టీ ఆసుపత్రులు{పతి జిల్లా కేంద్రంలోనూ వైద్య కళాశాలతో అనుబంధం ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం. వీటిని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసే 20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతో అనుసంధానం చేస్తాం. తద్వారా రొటేషన్ పద్ధతిలో స్పెషాలిటీ వైద్యుల్ని ప్రతి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండేలా చూస్తాం. {పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ సరిపడినన్ని మందులు, వైద్యులు, సిబ్బంది ఉండేలా చూస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయటానికి మేం అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఆపరేషన్ లేదా తీవ్ర ఫ్రాక్చర్లకు వైద్యం పొంది ఆసుపత్రి నుంచి బయటపడినా పనిచేయలేని రోగికి ఉపాధి, మందుల కోసం నెలకు రూ. 3000 చొప్పున సహాయం చేస్తాం. మెడికల్ పీజీ సీట్లు రెట్టింపు ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసి, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల సంఖ్యను రెట్టింపు చేస్తాం. -
బాబు, రాజన్నపాలనలో... మహిళల రుణాలు
మహిళా పక్షపాతిగా వ్యవహరించిన వైఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా వారిని అన్ని విధాల ప్రోత్సహించారు.బాబు హయాంలో మహిళలు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ మైక్రో ఫైనాన్స్ కంపెనీల మెట్లెక్కి దిగుతూ నానా ఇబ్బంది పడేవారు. అప్పు వచ్చే వరకు ఒక బాధ అయితే రుణం తీర్చే విషయంలో చాలా అవమానాలకు గురయ్యేవారు. బకాయిల వసూలుకు కంపెనీలు రౌడీలను పురమాయించేవి. వారు చేసే యాగీని భరించలేక అవమానాలను తట్టుకోలేక చాలా మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ మహిళలకు అన్నగా, అందగా, పెద్ద కొడుకుగా నిలిచారు. జీవితంపై భరోసా కల్పించారు. మహిళలకు వడ్డీ రేట్లను ఒకవైపు తగ్గిస్తూ ప్రైవేటు మైక్రోఫైనాన్స్ సంస్థలపై మరోవైపు నియంత్రణ పెంచారు. చివరికి పావలావడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోయే విధానాన్ని అమలుచేశారు. వైఎస్ హయాంలో మహిళా సంఘాలు సమర్థంగా పనిచేస్తూ కుటుంబాల జీవనప్రమాణాలను మార్చేశాయి. బాబు పాలన ‘‘మహిళా ఓట్లతోనే అధికారంలోకి వచ్చాం.. వారంతా మా పక్షమే’’... అప్పట్లో చంద్రబాబు పదేపదే చెప్పిన మాటలివి. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తమకు ఏం జరిగిందని ఏ స్త్రీమూర్తిని అడిగినా ఆ నాటి ఘటనలు తలచుకుని మండిపోతుంది. ఎన్నికల నాడు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సాక్షిగా గుర్రాలతో తొక్కించిన వైనం... చంకలో పసిపిల్లలతో ఆందోళన చేస్తున్నా పోలీసులతో తరిమితరిమి కొట్టించిన పాశవిక సన్నివేశాలు... గుక్కెడు నీటి కోసం జన్మభూమిలో నిలదీస్తే తెలుగుసేన రూపంలో దండెత్తిన వైనాలు... తండా మహిళలపై ‘దేశం’ తమ్ముళ్లు జరిపిన దారుణాలు... విద్యుత్ చార్జీలు భారమంటే లాఠీలు ఝళిపించిన దృశ్యాలు... ఇలా ఎన్నెన్నో రాజన్న రాజ్యం వైఎస్ సీఎం అయ్యేనాటికి రాష్ట్రంలో 5 లక్షల మహిళా సంఘాలుంటే, ఆయన హయాంలో ఏకంగా 4.5 లక్షలకు పైగా కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళా సంఘాలకు లభించే బ్యాంకు రుణంగా ఎప్పుడూ గరిష్ఠంగా రూ.25 వేలకు మించలేదు. కానీ వైఎస్ మరణించే నాటికి ప్రతి గ్రూపుకూ సగటున లభించిన బ్యాంకు రుణం ఏకంగా రూ.1.6 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 8 రెట్లు! ఇక బాబు హయాంలో లభించిన బ్యాంకు రుణాలు రూ.1,898 కోట్లు మాత్రమే ఉంటే వైఎస్ మరణించే నాటికి అవి ఏకంగా రూ.27,000 కోట్లకు చేరాయి. పావలా వడ్డీ పథకం కింద వైఎస్ తన హయాంలో దాదాపు రూ.500 కోట్లు పావలా వడ్డీ కోసం మహిళలకు రీయింబర్స్ చేశారు. పండుటాకులకు ఆసరా... 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలకు ఆసరాగా నిలిచేందుకు, వారు కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు వైఎస్ ప్రారంభించిన బీమా తరహా పథకం అభయహస్తం. 18-59 ఏళ్ల మధ్య వయసు మహిళలంతా ఇందులో చేరడానికి అర్హులు. వారు రోజుకు ఒక రూపాయి పొదుపు చేస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. 60 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.2,250 దాకా పించన్ వస్తుంది. కొద్ది నెలల్లోనే దాదాపు 45 లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. 4.5 లక్షల మంది వృద్ధులకు ప్రతి నెలా రూ.500 పెన్షన్ మంజూరైంది. మహిళల కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క మహిళతన భర్తతో సమానంగా సంపాదించగలిగినప్పుడే ఆమెకు మంచి గౌరవం లభిస్తుంది. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేసేవరకు నిద్రపోను.నేను కలలుగన్న మరో ప్రపంచానికిమహిళలే మూలస్తంభాలు. - దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి -
బాబు, రాజన్నపాలనలో... ఉద్యోగాలు
బాబు పాలన బాబు పాలనలో యువత నిరుద్యోగంతో నిరాశకు గురయ్యారు. అసహనంతో నిరుద్యోగులు ఉద్యమిస్తే అణచివేశారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేసింది లేదు.{పభుత్వ ఉద్యోగ నియామకాలపై అనధికారిక నిషేధం ఉండేది. టీచర్, పోలీస్ ఉద్యోగాల భర్తీ కూడా అంతంత మాత్రమే. రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలున్నా ఏనాడూ వాటిని భర్తీ చేయలేదు.విద్యా రంగంలో కూడా కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టారు.టీచర్లకు, లెక్చరర్లకు సకాలంలో ప్రమోషన్లు ఇవ్వలేదు.ఎన్నికలకు ముందు ‘‘ఉద్యోగాలే, ఉద్యోగాలు’’ అని చెప్పిన చంద్రబాబు 1996లో అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. రాజన్న రాజ్యం ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్‌ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.నిరుద్యోగుల ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు.దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు.1999 గ్రూప్-2 నోటిఫికేషన్లోఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యగుల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరదించారు.తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు.జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు.డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు! ఇక, 1995-2004 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా బాబు భర్తీ చేసిన ఉద్యోగాలివీ... 1998 {Vూప్-1 83 పోస్టులు (బ్యాక్లాగ్) 1998 ఎంపీడీవో 235 పోస్టులు 1999 గ్రూప్-2 104 పోస్టులు 2001 జూనియర్ లెక్చరర్స్ 360 మొత్తం 782 1999 గ్రూప్-2లో 1,500కుపైగా గ్రూప్-2 పోస్టులు ఖాళీలుంటే కేవలం 245 పోస్టులకే బాబు నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ వాటిలోనూ 141 సచివాలయ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఉపసంహరించారు. జగన్ సంకల్పం ఇప్పటిదాకా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసింది... ఇక ఉద్యోగాలే యువత కోసం ఎదురు చూస్తాయ్!నిన్నటి వరకు ఉద్యోగాలంటే హైదరాబాదే కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఉద్యోగాలంటే పట్టణాల్లోనే కాకుండా పల్లె పల్లెలో... పంట పొలాల్లో కూడా పండుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు 13 జిల్లాల్లో, ప్రతి ఒక్క గ్రామంలో కోరుతున్న ఇలాంటి అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన ప్రణాళికలో మచ్చు తునకలివి..మూడు వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, రీసెర్చ్ స్టేషన్లు... జిల్లాకో విశ్వ విద్యాలయం. తెలుగు యూనివర్శిటీ, గిరిజన విశ్వ విద్యాలయం... వీటన్నింటి ఏర్పాటుతో ఉన్నత విద్యావంతులకు, ఇతరులకు ఉద్యోగాల పంట. ఇవన్నీ నేరుగా లభించే ఉద్యోగాలు. పరోక్షంగా లభించే ఉద్యోగాలు ఇంతకు పదింతలు. జలయజ్ఞం, విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నిర్మాణం, అన్నింటికీ మించి మహాద్భుత రాజధాని నిర్మాణం... టూరిజం పరంగా ప్రారంభం కానున్న నూతన అధ్యాయం, దేశ విదేశాల నుంచీ ప్రవహించే పెట్టుబడుల నుంచి రూపుదిద్దుకునే ఐటీ పారిశ్రామిక సంస్థల నిర్మాణం, విద్యా రంగంలో ప్రభవించే కళాశాలలు, స్కూళ్ళ ద్వారా విస్తరించనున్న ఉద్యోగావకాశాలు, రవాణా ద్వారా కలిగే ఉద్యోగం, ఉపాధి.... ...ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే- మన కొత్త ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూడనక్కర లేదు, ఉద్యోగాలే యువత కోసం ఎదురుచూస్తాయి. -
బాబు, రాజన్నపాలనలో... విద్య
బాబు పాలన ఆ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో యువత ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ల చదువు పట్ల బాబుకు చిన్నచూపు ఉండేది.తానే హైటెక్‌సిటీ నిర్మించానని చెప్పుకునే చంద్రబాబుకు అప్పుడు పల్లెల్లోని పేదలు గుర్తుకు రాలేదు. మెరిట్ ప్రతిపాదికన కాకుండా బీసీలందరికీ స్కాలర్షిప్పులు ఇవ్వాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. 2000-01లో 18,782 మంది బీసీ విద్యార్థులకు కేవలం రూ.2.99 కోట్లు కేటాయించారు.స్కాలర్షిప్పులు, మెస్ ఛార్జీలు పెంచాలని ఎన్ని ఉద్యమాలు చేసినా వాటిని అణచివేయడమే తప్ప రూపాయి కూడా అదనంగా ఇచ్చింది లేదు. విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, మేనేజ్మెంటుకు కోటాలో లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా చేశారు. కొత్త ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటును పట్టించుకోలేదు.9 ఏళ్ల బాబు పాలనలో ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు 3 మాత్రమే. రాజన్న రాజ్యం ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే విద్యార్థుల సమస్యలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టి పెట్టారు.విద్యార్థులకు స్కాలర్షిప్పులు, మెస్ చార్జీలు ఏయేటికాయేడు పెంచుతూ విడుదల చేస్తున్నప్పటికీ సంతృప్త (శాచ్యురేషన్) పద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు వికలాంగులైన విద్యార్థులందరికీ లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్సమెంట్ పథకాన్ని ప్రారంభించారు.ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థీ ఎలాంటి ఫీజుల భారమూ లేకుండా విద్యను అభ్యసించడమే ఈ పథకం లక్ష్యం. ఇది విజయవంతం కావడంతో ఈబీసీ విద్యార్థులకు సైతం 2009-10 నుంచి అమలు చేశారు.2008-09 బడ్జెట్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ.1373 కోట్లు కేటాయించిన ఆయన, ఏకంగా రూ.1565.37 కోట్లు విడుద ల చేశారు.2009-10 బడ్జెట్లో రూ. 2,333.04 కోట్లు కేటాయించారు. అయితే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం అనంతరం పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. ఉన్నత విద్యను వికేంద్రీకరించే ఉద్దేశంతో మొత్తం 18 విశ్వవిద్యాలయాలను వై.ఎస్. ఏర్పాటు చేశారు.అనేక డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం అందించారు.జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు తోడ్పాటునందించారు.అంతర్జాతీయ స్థాయి కలిగిన హైదరాబాద్ ఐఐటీ, బిట్స్ వంటి సంస్థల ఏర్పాటుకు చొరవ చూపారు. పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులు, మెస్ ఛార్జీల కోసం భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తూ విడుదల చేశారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 2004-05 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 386.37 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ.409.34కోట్ల మేర విడుదల చేశారు.2005-06 సంవత్సరంలో 409.07 కోట్లు, 2006-07లో రూ.609.91 కోట్లు, 2007-08లో రూ.883.74 కోట్లు విద్యార్థుల కోసం విడుదల చేశారు. సక్సెస్ స్కూళ్లు 6,500 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేసి, 6 నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్‌తో విద్య అందించారు.అన్ని స్థాయుల్లోనూ డ్రాపవుట్లను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకే మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండగా, దానిని 9, 10 తరగతులకు కూడా వైఎస్ వర్తింపజేశారు.ఇందుకు ఏటా అయ్యే ఖర్చు రూ. 250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీలు నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు 2008లో ఏపీ ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు.రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి దాని నేతృత్వంలో తెలంగాణలోని బాసరలో, రాయలసీమలోని ఇడుపులపాయలో, కోస్తాంధ్రలోని నూజివీడులో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు.ఒక్కో క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌కు సంబంధించి 2,000 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. జగన్ సంకల్పం అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రస్తుతమున్న ఆంక్షలను, పరిమితులను తొలగించడం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన 6,500 సక్సెస్ స్కూళ్లను విజయవంతం చేయడం. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం. రాష్ర్టంలో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేయడం.చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ వర్గాలకు చెందిన ప్రతి పేద విద్యార్థికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే లక్ష్యం. పరిమితుల్లేని బడ్జెట్ కేటాయించి, భారమెంతైనా కానీ పథకాన్ని మాత్రం అమలు చేస్తారు. -
బాబు, రాజన్నపాలనలో... వ్యవసాయం
అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఒకే విధానం... వ్యవసాయం ఓ దండగమారి పని అన్నదే నినాదం! ఉన్నంత కాలం ఆ విధంగానే ముందుకు పోయారు. అందుకే ఆయన పేరు చెబితే సగటు రైతు ఇప్పటికీ కలవరంతో ఉలిక్కిపడతాడు. ఆయనే చంద్రబాబు! ఇదే ఆయన పాలన..! రాష్ట్రంలో ఎటుచూసినా మరణమృదంగమే ఆనాడు! చంద్రబాబు పాలనలో వ్యవసాయం ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని చూసింది. రైతులపై కక్షగట్టినట్లు వ్యవహరించారు చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్నారు... నష్టాలు వస్తున్నాయంటే మానేయమన్నారు. రైతును చీదరించుకున్నారు... సన్నచిన్నకారు రైతులు భూములు అమ్ముకుని కూలీలుగా మారిపోయారు. కరవు వలసలు, ఆకలి చావులు.. ఆత్మహత్యలు... ఆంధ్రరాష్ట్రంలో ఎటు చూసినా మరణ మృదంగమే ఆనాడు! పరిహారం కోసమే ఆత్మహత్యలన్నాడు..! బహుళజాతి కంపెనీ అయిన మోన్శాంటో కంపెనీతో కుమ్మక్కయిన బాబు రాష్ట్రంలోని పత్తి రైతులకు విత్తనాలు అందకుండా చేశారు. తెగుళ్లను తట్టుకుంటాయని చెబుతూ ఆ కంపెనీ ఒక్కో బీటీ విత్తనాల ప్యాకెట్‌ను రైతులకు రూ.1850కి అంటగట్టేది. సాగును సంక్షోభంలోకి నెట్టిన అపరాధ భావం ఏ కోశాన లేని చంద్రబాబు రైతులపై వ్యతిరేకతను ఎక్కడా ఆపుకోలేదు. రైతుల కష్టాలకు, ఆత్మహత్యలకు ప్రధాన కారణం సరైన దిగుబడులు, గిట్టుబాటు ధరలు రాకపోవడం, దానివల్ల అప్పులు పెరిగిపోవడమేనని తెలిసినా... వారికి కనీస సహాయం అందించకపోగా పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కారుకూతలు కూసిన బాబు మాటలు రైతులింకా మరచిపోలేదు! అన్నం పెట్టే చేతికి సంకెళ్లు అందరికీ అన్నం పెట్టే రైతు చేతులకే సంకెళ్ళు వేయించిన ఘనుడు బాబు! అప్పు కట్టకపోతే పొలంలో మోటారు పీక్కెళ్ళారు. ఇంటి తలుపులు లాక్కెళ్ళారు, రైతుల ఉసురు తీశారు. బిల్లులు చెల్లించని రైతులపై ఏకంగా దొంగతనం కేసులు నమోదు చేయించారు. బేడీలు వేయించి జైలుకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. మొత్తం మీద 78 వేల కేసులను రైతుల మీద నమోదు చేశారు. కరువుసీమ అయిన ఒక్క అనంతపురం జిల్లాలోనే పాతిక వేల మంది అన్నదాతలపై కేసులు పెట్టారు! మద్దతు ధర ఊసెత్తితే ఒట్టు! చంద్రబాబు తన పాలనలో ఏ పంటకూ రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించలేదు. ఫలితంగా ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో వరి కనీస మద్దతు ధర రూ.50 మాత్రమే పెరిగింది. 2004లో వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 590 ఉండేది. ఇక పప్పుధాన్యాలు, పత్తి తదితర పంటల పరిస్థితైతేమరీ దారుణం! రైతులకు కరెంటు షాక్! వ్యవసాయం దండగనే సిద్ధాంతాన్ని నమ్మిన బాబు అధికారంలో ఉన్న ఆఖరి ఏడాది (2004) బడ్జెట్లో వ్యవసాయానికి కేవలం రూ. 214 కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటికీ కలిపి రూ.5014 కోట్లు మాత్రమే విదిల్చారు. 1995లో రూ.150 ఉన్న 3 హార్స్ పవర్(హెచ్‌పీ) కరెంటు చార్జీలను పాలనా కాలం ముగిసేసరికి ఏకంగా రూ.825కు పెంచారు! ఇవన్నీ చాలవన్నట్టుగా... వ్యవసాయ రంగానికి ఇస్తున్న సబ్సిడీని కొనసాగించడం సాధ్యం కాదని, అందుకే భారాన్ని రైతులు భరించవలసిందేనని ముఖ్యమంత్రి హోదాలో బాబు ఆనాడు పార్టీ నేతల సమావేశాల్లో స్పష్టంగా ప్రకటించా రు. అంతేకాదు, ‘మనసులో మాట’ పుస్తకంలో ‘అసలు సబ్సిడీ అనేది పులి మీద స్వారీ చేయడం లాంటిది’ అని కూడా ఆయన సెలవిచ్చారు! బాబు పాలనంతా కరువుకాలమే. అతివృష్టి, అనావృష్టి రైతులను అతలాకుతలం చేశాయి. ఏ పంట వేసినా అప్పులు, తిప్పలే ఎదురుకావడంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా... గ్రాసం దొరకని స్థితిలో పశువులు కూడా బక్కచిక్కిపోయాయి.కంప్యూటరే సర్వస్వమని నమ్మిన హైటెక్ బాబు వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు. ఆయన హయాంలో పంట రుణాలపై 14శాతం వడ్డీరేటు ఉండేది. దీనిపై మళ్లీ రెండుశాతం స్టాంపు డ్యూటీ కూడా ఉండేది. దిక్కు తోచని రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. బాబు రైతు రుణమాఫీ హామీ వట్టి బూటకం... ఎస్ఎల్బీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రైతుల రుణాలు రూ.1.27లక్షల కోట్లు. ఇవి కాక బాబు మాఫీ చేస్తానన్న డ్వాక్రా రుణాలు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తం రూ 1.47 లక్షల కోట్లు. కానీ రాష్ట్ర రెవెన్యూ మాత్రం రూ.1.25 లక్షల కోట్లే. ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు అన్నీ మానేసినా ఈ రెండు మాఫీలూ చేయడం అసాధ్యం. ఎలా మాఫీ చేస్తారని ఎన్నికల సంఘం అడిగితే బాబు వద్ద జవాబు లేదు. రాజన్న రాజ్యం వ్యవసాయానికి, పల్లెలలకు ఊపిరినిచ్చి అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం నింపారు కాబట్టే వైయస్సార్ రాజ్యంలో వ్యవసాయ వృద్ధిరేటు 6.14 శాతానికి చేరుకుంది. ఇది చంద్రబాబు పాలనలో 3.84 శాతం మాత్రమే!బడ్జెట్లో వ్యవసాయానికి చంద్రబాబు 2.46 శాతం నిధులు కేటాయిస్తే, వైయస్సార్ 4.62 శాతం నిధులు కేటాయించారు! చంద్రబాబు నిర్లక్ష్య నిరంకుశ పాలన ఫలితంగా, ముందు చూపులేని విధానాల వల్ల 2002-03లో మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులకే పరిమితమైంది. వైయస్సార్ వ్యవసాయాన్ని కన్నబిడ్డలా సాకడంతో 2008-09లో ఆహారధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులకు చేరింది! ఉత్పత్తి రెట్టింపు అయిందంటే రైతుల ఆదాయాలు పెరిగినట్టేగా! ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు, మద్దతు ధరలు, విత్తనాలు, ఎరువుల ధరలపై నియంత్రణ. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి.... ఇలా అన్నదాతకు సంబంధమున్న ఏ విషయాన్నీ వైయస్సార్ నిర్లక్ష్యం చేయలేదు. వైయస్సార్ పాలన భేషుగ్గా ఉందని, వ్యవసాయానికి ఆయన చేస్తున్న సాయం ఉన్నతంగా ఉందని, అదే పద్ధతిలో నడుచుకోమని ఓ దశలో చంద్రబాబుకు ఆయన చిన్నాయన నారా కృష్ణమనాయుడు సలహా ఇచ్చారు. రెతన్న కోసం జగనన్న సంకల్పం... గిట్టుబాటు ధర కోసం స్థిరీకరణ నిధిదిగుబడి, గిట్టుబాటు ధరలను సమతుల్యం చేసేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం రూ. 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి {పకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగినప్పుడు తక్షణం అంచనాల వేసి, వీలైనంత త్వరగా రైతులకు పరిహారం చెల్లించడం దీని లక్ష్యం రెండో పంట వేసే నాటికే రైతు చేతికి పరిహారం అందేలా చూస్తాం వడ్డీలేని రుణాలు రైతులకు వడ్డీ లేని పంట రుణాలు అందిస్తాం యాంత్రీకరణను ప్రోత్సహించడానికి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై రైతులకు సబ్సిడీలిస్తాం రుణ మాఫీ కోసం కేంద్రంపై ఒత్తిడి వరదలు, తుపాన్లు; కరవు కాటకాలతో రైతులు అల్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందున సరికొత్త రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తెస్తుంది ఇద్దరు వ్యవసాయ మంత్రులు వ్యవసాయ రంగానికి ఇద్దరు మంత్రులను నియమిస్తాంఒకరు వ్యవసాయ ఉత్పత్తులను పర్యవేక్షిస్తారుమరొకరు పంట నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ఏటా సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతాం ఆరు నూరైనా ఉచిత విద్యుత్ వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్‌ను ఆరు నూరైనా అందిస్తాం. ఇందులో 7 గంటల పాటు పగలే నిరంతరాయంగా ఇస్తాం, ఎంత ఖర్చయినా భరిస్తాం మూడు వ్యవసాయ వర్సిటీలు వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తుంది {పతి రెండు జిల్లాలకూ ఒక వ్యవసాయ డిగ్రీ కళాశాల పంటలను బట్టి రెండు జిల్లాలకో వ్యవసాయ పరిశోధన కేంద్రం పురుగు మందుల నాణ్యత, పర్యవేక్షణ బాధ్యతలు ఈ పరిశోధన కేంద్రాలకే 102 సేవలు భూసార పరీక్షలు, వ్యవసాయ సూచనల కోసం మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం దీని లక్ష్యం .రైతులు 102 నంబర్‌కు ఫోన్ చేయగానే వారి పొలాల వద్దకే వాహనాలొచ్చి నమూనాలు సేకరిస్తాయి. 103 సేవలు 103 నంబర్‌కు ఫోన్ చేయగానే 20 నిమిషాల్లోనే సంచార పశువైద్యశాల రైతు ముందే ప్రత్యక్షమవుతుంది.అవసరమైన వైద్య సేవలను అప్పటికప్పుడే అందిస్తారు. అంతేగాక మండలానికో పశు వైద్యశాల ఏర్పాటు చేస్తాం -
ప్రజావెల్లువతో పులకరింపు...
ప్రజా సేవకుడు అన్న బిరుదును ప్రజానాయకుడు అన్న హోదా కంటే గొప్పగా భావించినపుడు ప్రజాస్వామ్యం పూలతోటలా, పండ్ల చెట్టులా మురిసిపోతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాసేవకుడిగా పనిచేశాడు. ప్రజానాయకుడిగా జీవించాడు. ప్రజలమనిషిగా జీవిస్తున్నాడు. పేద, గొప్ప... కుల, మత... ప్రాంత, వర్గాలకు అతీతంగా ఆయనకు తమ గుండెల్లో పక్క సర్ది, దూది దిండు వేసి ఉయ్యాల సేవ చేశారు. చేస్తున్నారు. అలా నిదురించాలని వైఎస్ఆర్కు మనసులో ఉందో లేదో నాకు తెలియదు కానీ... మెలకువగా ఉన్న ప్రతి నిమిషమూ ప్రజల కష్టాన్ని, ఆవేదనను తన బాధగా కౌగిలించుకున్నాడాయన. బియ్యంలో రాళ్లను ఏరేసినట్టు... బాటలో ముళ్లు వేరేసినట్టు... గుండె తడిలో కన్నీరు వేరేసినట్టు... కాంతితో నీడను వేరేసినట్టు... దీపంలో వొత్తికి ఉన్న నొప్పిని కూడా వేరేసినట్టు... ప్రజల జీవితాల్లో గుచ్చుకున్న ప్రతి కష్టాన్నీ వేరేస్తూ జీవించాడు. అందుకే ప్రజలు ఆయనకు తమ గుండెల్లో పక్క సర్దారు. అక్కడ కంటున్న కలలే వైఎస్ జగన్ నిజం చేయాలంటున్నాడు. తండ్రిని మించిన తనయుడు కావాలన్నది ప్రతి తండ్రి ఆశయం. కానీ జగన్ మరోలా ఆలోచించాడు. తన వల్ల తండ్రికి ఇంకా కీర్తి పెరగాలనుకున్నాడు. ‘వైఎస్ఆర్ శకం ముగిసింది... జగన్ యుగం మొదలైంది’ అని ఎవరైనా చెబితే... కాదు... వైఎస్ఆర్ యుగం కొనసాగుతోంది అని నవ్వుతూ అంటాడు జగన్. అదే ఆయనకు శక్తి. అందుకే... ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, పిల్లల్ని వదిలి పెద్ద కుటుంబం కోసం పరితపించాడు. ఏసీ గదిలో పడుకుని నచ్చిన నాలుగు రకాల వంటలు తినేవాడు గుడిసెలో గంజిని ఎన్నుకున్నాడు. 103 జ్వరం వచ్చి ఒళ్లు కాలిపోతున్నా చల్లగా నవ్వుతూ ఉండగలిగాడు. అభిమానంతో ప్రజలు తనను ఎలాగైనా తాకాలనే ఉత్సాహంలో చేతులకు గాట్లు పడుతున్నా ప్రేమతో కరచాలనం చేయగలిగాడు. ప్రజల పట్ల అతని ప్రేమను తలచుకుంటేనే మనసు పులకరిస్తుంది. వైఎస్ఆర్ ప్రజల గుండెల్లోంచి తొంగి కొడుకును చూసి మురిసిపోతుంటాడు అనిపిస్తుంది. నిజమే కదా! మన పిల్లలు ఒక చూపులేని మనిషిని రోడ్డు దాటిస్తే ఎంతగా ముచ్చటపడతాం! ఎన్నాళ్లు మురిసిపోతాం! మరి జగన్ ఇంతమందిని కష్టం నుంచి దాటేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్మురిసిపోడా! జగన్ అలాంటి కొడుకుగా బతకాలనుకున్నాడు కాబట్టే... తను, తన కుటుంబం కష్టాల నీడలో జీవించాల్సి వచ్చింది. ఒక్కసారి ఢిల్లీ ముందు మోకరిల్లి ఉంటే ఓ క్యాబినెట్ పదవి, ఓ ముఖ్యమంత్రి పదవి ఖాయం కదా! ఆ మాట ఢిల్లీవాళ్లే చెప్పారు కదా! సర్దుబాటు చేసుకుంటే దొంగ కేసులు, 16 నెలల జైలు జీవితం, అవమానం, ఆవేదన తప్పి ఉండేవి కదా! అన్నిసార్లు గుచ్చినా, ఎన్నిసార్లు కింద పడేయాలని చూసినా, ఇంకెన్నిసార్లు వెనక్కి లాగేయాలని కుట్ర చేసినా వదల్లేదు కదా జగన్! ఎంత క్షోభపెట్టినా, ఎంత హింసించినా తన తండ్రి ఆశయాన్ని, తన మాటను ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాడు తప్ప వదిలేయలేదు కదా. అంత కష్టంలో ప్రజలను వదలనివాడు... గెలిపించుకుంటే ఏం చేస్తాడో తలచుకుంటేనే గుండె పులకరిస్తుంది. వైఎస్ఆర్ పడుకున్న ప్రతి గుండెను తట్టి... ఆ సారును లేపి... ‘‘అయ్యా చూడు... అచ్చం నీలాగే ఎంత మంచి మనసయ్యా నీ కొడుకుది. స్వామీ చూడు... నీ ఆశయాలనే వారసత్వంగా తీసుకుని పోరాడుతున్నాడయ్యా! ఎన్ని గాయాలు చేశారు నీ బిడ్డకు... ఒక్కసారి పలకరించిపో అయ్యా! నీ కీర్తి కోసం తన దేహానికి, మనసుకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్న కొడుకుతో ఒక మాట చెప్పి పోవయ్యా! ఒక్కసారి కూడా కన్నీరు పెట్టకుండా గుండెల్లో వెయ్యి అగాథాలను మోస్తూ.... ప్రతి గుండెలో నీ జాడ చూసుకుంటూ జీవిస్తోన్న, ఉద్యమిస్తోన్న తనయుడిని ‘శహభాష్’ అని అనవయ్యా! భూదేవంత సహనాన్ని, ఆకాశమంత ఆశయాన్ని నీకోసం మోస్తున్న ఆ గుండెను దీవించయ్యా..! ఆ గుండెలో రక్తం కాకుండా ప్రవహిస్తోన్న తడిని నీ చిరుజల్లుతో కడుగయ్యా..! పోనీ... ఒక్కసారి జగన్ నిద్రలోకైనా వచ్చి తల నిమిరిపోవయ్యా..! ’’ అని వెక్కివెక్కి ఏడుస్తూ అర్థించాలని ఉంది.అలాంటి యువకుడు మన నాయకుడని గుండె దరువుతో చాటింపు వేయాలని ఉంది. ప్రజాస్వామ్యాన్ని పూబాటలా, పండ్ల తోటలా మార్చాలనే అభిమతానికి సలాం కొట్టాలని ఉంది. ‘యువకుడు, ఉత్సాహవంతుడు. మీకు సేవ చేయాలనుకుంటున్నాడు. ఆశీర్వదించండి’ ఇది ఆరోజు వైఎస్ మాట. అదే ఈ రోజు ప్రజల నమ్మకం. - వాన చుక్క