బాబు, రాజన్నపాలనలో... ఉద్యోగాలు | Babu, rajannaa Governance ... jobs | Sakshi
Sakshi News home page

బాబు, రాజన్నపాలనలో... ఉద్యోగాలు

Published Sun, May 4 2014 1:11 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

బాబు, రాజన్నపాలనలో...  ఉద్యోగాలు - Sakshi

బాబు, రాజన్నపాలనలో... ఉద్యోగాలు

బాబు పాలన
 
బాబు పాలనలో యువత నిరుద్యోగంతో నిరాశకు గురయ్యారు. అసహనంతో నిరుద్యోగులు ఉద్యమిస్తే అణచివేశారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేసింది లేదు.{పభుత్వ ఉద్యోగ నియామకాలపై అనధికారిక నిషేధం ఉండేది. టీచర్, పోలీస్ ఉద్యోగాల భర్తీ కూడా అంతంత మాత్రమే. రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలున్నా ఏనాడూ వాటిని భర్తీ చేయలేదు.విద్యా రంగంలో కూడా కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టారు.టీచర్లకు, లెక్చరర్లకు సకాలంలో ప్రమోషన్లు ఇవ్వలేదు.ఎన్నికలకు ముందు ‘‘ఉద్యోగాలే, ఉద్యోగాలు’’ అని చెప్పిన చంద్రబాబు 1996లో అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు.

 రాజన్న రాజ్యం
     
ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్‌ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.నిరుద్యోగుల ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు.దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు.1999 గ్రూప్-2 నోటిఫికేషన్‌లోఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యగుల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరదించారు.తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు.జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు.డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు!
 
 ఇక, 1995-2004 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా బాబు భర్తీ చేసిన ఉద్యోగాలివీ...

 1998         {Vూప్-1             83 పోస్టులు (బ్యాక్‌లాగ్)
 1998         ఎంపీడీవో                235 పోస్టులు
 1999         గ్రూప్-2                  104 పోస్టులు
 2001        జూనియర్ లెక్చరర్స్      360
                     మొత్తం                      782

1999 గ్రూప్-2లో 1,500కుపైగా గ్రూప్-2 పోస్టులు ఖాళీలుంటే కేవలం 245 పోస్టులకే బాబు నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ వాటిలోనూ 141 సచివాలయ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఉపసంహరించారు.

 జగన్ సంకల్పం

ఇప్పటిదాకా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసింది... ఇక ఉద్యోగాలే యువత కోసం ఎదురు చూస్తాయ్!నిన్నటి వరకు ఉద్యోగాలంటే హైదరాబాదే కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఉద్యోగాలంటే పట్టణాల్లోనే కాకుండా పల్లె పల్లెలో... పంట పొలాల్లో కూడా పండుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు 13 జిల్లాల్లో, ప్రతి ఒక్క గ్రామంలో కోరుతున్న ఇలాంటి అభివృద్ధి కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూపొందించిన ప్రణాళికలో మచ్చు తునకలివి..మూడు వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, రీసెర్చ్ స్టేషన్లు...  జిల్లాకో విశ్వ విద్యాలయం. తెలుగు యూనివర్శిటీ, గిరిజన విశ్వ విద్యాలయం... వీటన్నింటి ఏర్పాటుతో ఉన్నత విద్యావంతులకు, ఇతరులకు ఉద్యోగాల పంట. ఇవన్నీ నేరుగా లభించే ఉద్యోగాలు. పరోక్షంగా లభించే ఉద్యోగాలు ఇంతకు పదింతలు.

జలయజ్ఞం, విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నిర్మాణం, అన్నింటికీ మించి మహాద్భుత రాజధాని నిర్మాణం... టూరిజం పరంగా ప్రారంభం కానున్న నూతన అధ్యాయం, దేశ విదేశాల నుంచీ ప్రవహించే పెట్టుబడుల నుంచి రూపుదిద్దుకునే ఐటీ పారిశ్రామిక సంస్థల నిర్మాణం, విద్యా రంగంలో ప్రభవించే కళాశాలలు, స్కూళ్ళ ద్వారా విస్తరించనున్న ఉద్యోగావకాశాలు, రవాణా ద్వారా కలిగే ఉద్యోగం, ఉపాధి....  ...ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే- మన కొత్త ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూడనక్కర లేదు, ఉద్యోగాలే యువత కోసం ఎదురుచూస్తాయి.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement