Janayutham
-
బాబు, రాజన్నపాలనలో... ఉద్యోగాలు
బాబు పాలన బాబు పాలనలో యువత నిరుద్యోగంతో నిరాశకు గురయ్యారు. అసహనంతో నిరుద్యోగులు ఉద్యమిస్తే అణచివేశారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేసింది లేదు.{పభుత్వ ఉద్యోగ నియామకాలపై అనధికారిక నిషేధం ఉండేది. టీచర్, పోలీస్ ఉద్యోగాల భర్తీ కూడా అంతంత మాత్రమే. రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలున్నా ఏనాడూ వాటిని భర్తీ చేయలేదు.విద్యా రంగంలో కూడా కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టారు.టీచర్లకు, లెక్చరర్లకు సకాలంలో ప్రమోషన్లు ఇవ్వలేదు.ఎన్నికలకు ముందు ‘‘ఉద్యోగాలే, ఉద్యోగాలు’’ అని చెప్పిన చంద్రబాబు 1996లో అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. రాజన్న రాజ్యం ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్‌ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.నిరుద్యోగుల ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు.దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు.1999 గ్రూప్-2 నోటిఫికేషన్లోఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యగుల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరదించారు.తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు.జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు.డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు! ఇక, 1995-2004 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా బాబు భర్తీ చేసిన ఉద్యోగాలివీ... 1998 {Vూప్-1 83 పోస్టులు (బ్యాక్లాగ్) 1998 ఎంపీడీవో 235 పోస్టులు 1999 గ్రూప్-2 104 పోస్టులు 2001 జూనియర్ లెక్చరర్స్ 360 మొత్తం 782 1999 గ్రూప్-2లో 1,500కుపైగా గ్రూప్-2 పోస్టులు ఖాళీలుంటే కేవలం 245 పోస్టులకే బాబు నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ వాటిలోనూ 141 సచివాలయ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఉపసంహరించారు. జగన్ సంకల్పం ఇప్పటిదాకా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసింది... ఇక ఉద్యోగాలే యువత కోసం ఎదురు చూస్తాయ్!నిన్నటి వరకు ఉద్యోగాలంటే హైదరాబాదే కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఉద్యోగాలంటే పట్టణాల్లోనే కాకుండా పల్లె పల్లెలో... పంట పొలాల్లో కూడా పండుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు 13 జిల్లాల్లో, ప్రతి ఒక్క గ్రామంలో కోరుతున్న ఇలాంటి అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన ప్రణాళికలో మచ్చు తునకలివి..మూడు వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, రీసెర్చ్ స్టేషన్లు... జిల్లాకో విశ్వ విద్యాలయం. తెలుగు యూనివర్శిటీ, గిరిజన విశ్వ విద్యాలయం... వీటన్నింటి ఏర్పాటుతో ఉన్నత విద్యావంతులకు, ఇతరులకు ఉద్యోగాల పంట. ఇవన్నీ నేరుగా లభించే ఉద్యోగాలు. పరోక్షంగా లభించే ఉద్యోగాలు ఇంతకు పదింతలు. జలయజ్ఞం, విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నిర్మాణం, అన్నింటికీ మించి మహాద్భుత రాజధాని నిర్మాణం... టూరిజం పరంగా ప్రారంభం కానున్న నూతన అధ్యాయం, దేశ విదేశాల నుంచీ ప్రవహించే పెట్టుబడుల నుంచి రూపుదిద్దుకునే ఐటీ పారిశ్రామిక సంస్థల నిర్మాణం, విద్యా రంగంలో ప్రభవించే కళాశాలలు, స్కూళ్ళ ద్వారా విస్తరించనున్న ఉద్యోగావకాశాలు, రవాణా ద్వారా కలిగే ఉద్యోగం, ఉపాధి.... ...ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే- మన కొత్త ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూడనక్కర లేదు, ఉద్యోగాలే యువత కోసం ఎదురుచూస్తాయి. -
బాబు, రాజన్నపాలనలో... వ్యవసాయం
అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఒకే విధానం... వ్యవసాయం ఓ దండగమారి పని అన్నదే నినాదం! ఉన్నంత కాలం ఆ విధంగానే ముందుకు పోయారు. అందుకే ఆయన పేరు చెబితే సగటు రైతు ఇప్పటికీ కలవరంతో ఉలిక్కిపడతాడు. ఆయనే చంద్రబాబు! ఇదే ఆయన పాలన..! రాష్ట్రంలో ఎటుచూసినా మరణమృదంగమే ఆనాడు! చంద్రబాబు పాలనలో వ్యవసాయం ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని చూసింది. రైతులపై కక్షగట్టినట్లు వ్యవహరించారు చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్నారు... నష్టాలు వస్తున్నాయంటే మానేయమన్నారు. రైతును చీదరించుకున్నారు... సన్నచిన్నకారు రైతులు భూములు అమ్ముకుని కూలీలుగా మారిపోయారు. కరవు వలసలు, ఆకలి చావులు.. ఆత్మహత్యలు... ఆంధ్రరాష్ట్రంలో ఎటు చూసినా మరణ మృదంగమే ఆనాడు! పరిహారం కోసమే ఆత్మహత్యలన్నాడు..! బహుళజాతి కంపెనీ అయిన మోన్శాంటో కంపెనీతో కుమ్మక్కయిన బాబు రాష్ట్రంలోని పత్తి రైతులకు విత్తనాలు అందకుండా చేశారు. తెగుళ్లను తట్టుకుంటాయని చెబుతూ ఆ కంపెనీ ఒక్కో బీటీ విత్తనాల ప్యాకెట్‌ను రైతులకు రూ.1850కి అంటగట్టేది. సాగును సంక్షోభంలోకి నెట్టిన అపరాధ భావం ఏ కోశాన లేని చంద్రబాబు రైతులపై వ్యతిరేకతను ఎక్కడా ఆపుకోలేదు. రైతుల కష్టాలకు, ఆత్మహత్యలకు ప్రధాన కారణం సరైన దిగుబడులు, గిట్టుబాటు ధరలు రాకపోవడం, దానివల్ల అప్పులు పెరిగిపోవడమేనని తెలిసినా... వారికి కనీస సహాయం అందించకపోగా పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కారుకూతలు కూసిన బాబు మాటలు రైతులింకా మరచిపోలేదు! అన్నం పెట్టే చేతికి సంకెళ్లు అందరికీ అన్నం పెట్టే రైతు చేతులకే సంకెళ్ళు వేయించిన ఘనుడు బాబు! అప్పు కట్టకపోతే పొలంలో మోటారు పీక్కెళ్ళారు. ఇంటి తలుపులు లాక్కెళ్ళారు, రైతుల ఉసురు తీశారు. బిల్లులు చెల్లించని రైతులపై ఏకంగా దొంగతనం కేసులు నమోదు చేయించారు. బేడీలు వేయించి జైలుకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. మొత్తం మీద 78 వేల కేసులను రైతుల మీద నమోదు చేశారు. కరువుసీమ అయిన ఒక్క అనంతపురం జిల్లాలోనే పాతిక వేల మంది అన్నదాతలపై కేసులు పెట్టారు! మద్దతు ధర ఊసెత్తితే ఒట్టు! చంద్రబాబు తన పాలనలో ఏ పంటకూ రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించలేదు. ఫలితంగా ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో వరి కనీస మద్దతు ధర రూ.50 మాత్రమే పెరిగింది. 2004లో వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 590 ఉండేది. ఇక పప్పుధాన్యాలు, పత్తి తదితర పంటల పరిస్థితైతేమరీ దారుణం! రైతులకు కరెంటు షాక్! వ్యవసాయం దండగనే సిద్ధాంతాన్ని నమ్మిన బాబు అధికారంలో ఉన్న ఆఖరి ఏడాది (2004) బడ్జెట్లో వ్యవసాయానికి కేవలం రూ. 214 కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటికీ కలిపి రూ.5014 కోట్లు మాత్రమే విదిల్చారు. 1995లో రూ.150 ఉన్న 3 హార్స్ పవర్(హెచ్‌పీ) కరెంటు చార్జీలను పాలనా కాలం ముగిసేసరికి ఏకంగా రూ.825కు పెంచారు! ఇవన్నీ చాలవన్నట్టుగా... వ్యవసాయ రంగానికి ఇస్తున్న సబ్సిడీని కొనసాగించడం సాధ్యం కాదని, అందుకే భారాన్ని రైతులు భరించవలసిందేనని ముఖ్యమంత్రి హోదాలో బాబు ఆనాడు పార్టీ నేతల సమావేశాల్లో స్పష్టంగా ప్రకటించా రు. అంతేకాదు, ‘మనసులో మాట’ పుస్తకంలో ‘అసలు సబ్సిడీ అనేది పులి మీద స్వారీ చేయడం లాంటిది’ అని కూడా ఆయన సెలవిచ్చారు! బాబు పాలనంతా కరువుకాలమే. అతివృష్టి, అనావృష్టి రైతులను అతలాకుతలం చేశాయి. ఏ పంట వేసినా అప్పులు, తిప్పలే ఎదురుకావడంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా... గ్రాసం దొరకని స్థితిలో పశువులు కూడా బక్కచిక్కిపోయాయి.కంప్యూటరే సర్వస్వమని నమ్మిన హైటెక్ బాబు వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు. ఆయన హయాంలో పంట రుణాలపై 14శాతం వడ్డీరేటు ఉండేది. దీనిపై మళ్లీ రెండుశాతం స్టాంపు డ్యూటీ కూడా ఉండేది. దిక్కు తోచని రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. బాబు రైతు రుణమాఫీ హామీ వట్టి బూటకం... ఎస్ఎల్బీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రైతుల రుణాలు రూ.1.27లక్షల కోట్లు. ఇవి కాక బాబు మాఫీ చేస్తానన్న డ్వాక్రా రుణాలు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తం రూ 1.47 లక్షల కోట్లు. కానీ రాష్ట్ర రెవెన్యూ మాత్రం రూ.1.25 లక్షల కోట్లే. ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు అన్నీ మానేసినా ఈ రెండు మాఫీలూ చేయడం అసాధ్యం. ఎలా మాఫీ చేస్తారని ఎన్నికల సంఘం అడిగితే బాబు వద్ద జవాబు లేదు. రాజన్న రాజ్యం వ్యవసాయానికి, పల్లెలలకు ఊపిరినిచ్చి అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం నింపారు కాబట్టే వైయస్సార్ రాజ్యంలో వ్యవసాయ వృద్ధిరేటు 6.14 శాతానికి చేరుకుంది. ఇది చంద్రబాబు పాలనలో 3.84 శాతం మాత్రమే!బడ్జెట్లో వ్యవసాయానికి చంద్రబాబు 2.46 శాతం నిధులు కేటాయిస్తే, వైయస్సార్ 4.62 శాతం నిధులు కేటాయించారు! చంద్రబాబు నిర్లక్ష్య నిరంకుశ పాలన ఫలితంగా, ముందు చూపులేని విధానాల వల్ల 2002-03లో మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులకే పరిమితమైంది. వైయస్సార్ వ్యవసాయాన్ని కన్నబిడ్డలా సాకడంతో 2008-09లో ఆహారధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులకు చేరింది! ఉత్పత్తి రెట్టింపు అయిందంటే రైతుల ఆదాయాలు పెరిగినట్టేగా! ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు, మద్దతు ధరలు, విత్తనాలు, ఎరువుల ధరలపై నియంత్రణ. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి.... ఇలా అన్నదాతకు సంబంధమున్న ఏ విషయాన్నీ వైయస్సార్ నిర్లక్ష్యం చేయలేదు. వైయస్సార్ పాలన భేషుగ్గా ఉందని, వ్యవసాయానికి ఆయన చేస్తున్న సాయం ఉన్నతంగా ఉందని, అదే పద్ధతిలో నడుచుకోమని ఓ దశలో చంద్రబాబుకు ఆయన చిన్నాయన నారా కృష్ణమనాయుడు సలహా ఇచ్చారు. రెతన్న కోసం జగనన్న సంకల్పం... గిట్టుబాటు ధర కోసం స్థిరీకరణ నిధిదిగుబడి, గిట్టుబాటు ధరలను సమతుల్యం చేసేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం రూ. 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి {పకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగినప్పుడు తక్షణం అంచనాల వేసి, వీలైనంత త్వరగా రైతులకు పరిహారం చెల్లించడం దీని లక్ష్యం రెండో పంట వేసే నాటికే రైతు చేతికి పరిహారం అందేలా చూస్తాం వడ్డీలేని రుణాలు రైతులకు వడ్డీ లేని పంట రుణాలు అందిస్తాం యాంత్రీకరణను ప్రోత్సహించడానికి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై రైతులకు సబ్సిడీలిస్తాం రుణ మాఫీ కోసం కేంద్రంపై ఒత్తిడి వరదలు, తుపాన్లు; కరవు కాటకాలతో రైతులు అల్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందున సరికొత్త రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తెస్తుంది ఇద్దరు వ్యవసాయ మంత్రులు వ్యవసాయ రంగానికి ఇద్దరు మంత్రులను నియమిస్తాంఒకరు వ్యవసాయ ఉత్పత్తులను పర్యవేక్షిస్తారుమరొకరు పంట నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ఏటా సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతాం ఆరు నూరైనా ఉచిత విద్యుత్ వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్‌ను ఆరు నూరైనా అందిస్తాం. ఇందులో 7 గంటల పాటు పగలే నిరంతరాయంగా ఇస్తాం, ఎంత ఖర్చయినా భరిస్తాం మూడు వ్యవసాయ వర్సిటీలు వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తుంది {పతి రెండు జిల్లాలకూ ఒక వ్యవసాయ డిగ్రీ కళాశాల పంటలను బట్టి రెండు జిల్లాలకో వ్యవసాయ పరిశోధన కేంద్రం పురుగు మందుల నాణ్యత, పర్యవేక్షణ బాధ్యతలు ఈ పరిశోధన కేంద్రాలకే 102 సేవలు భూసార పరీక్షలు, వ్యవసాయ సూచనల కోసం మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం దీని లక్ష్యం .రైతులు 102 నంబర్‌కు ఫోన్ చేయగానే వారి పొలాల వద్దకే వాహనాలొచ్చి నమూనాలు సేకరిస్తాయి. 103 సేవలు 103 నంబర్‌కు ఫోన్ చేయగానే 20 నిమిషాల్లోనే సంచార పశువైద్యశాల రైతు ముందే ప్రత్యక్షమవుతుంది.అవసరమైన వైద్య సేవలను అప్పటికప్పుడే అందిస్తారు. అంతేగాక మండలానికో పశు వైద్యశాల ఏర్పాటు చేస్తాం -
బందరులో లంగరేసేదెవరు?
మచిలీపట్నానికి చారిత్రక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల క్రితం నుంచే వర్తక కేంద్రంగా వర్ధిల్లుతోంది. రాజకీయంగానూ ఇక్కడ భిన్న వాతావరణం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. నాలుగు పార్టీల తరఫున అభ్యర్థులు బరిలోకి దిగి...అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే నడుస్తోంది. యిర్రింకి ఉమామహేశ్వరరావు-మచిలీపట్నం, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ తరఫున కొనకళ్ల నారాయణరావు, కాంగ్రెస్ నుంచి శిష్ట్లా రమేష్, జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థిగా కమ్మిలి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. సానుకూల పవనాలు... సమైక్యాంధ్ర నినాదంతో పోరు సాగించిన వైఎస్సార్ సీపీకి ప్రజల్లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ‘సమైక్య’ పరిరక్షణకు పోరాడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ అభ్యర్థిగా ఆయన... వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే వాటిని సమర్థవంతంగా కొనసాగిస్తారని తెలియజేస్తున్నారు. ఇందుకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. కాగా, పార్థసారథి తండ్రి కొలుసు పెద రెడ్డయ్య గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేశారు. జిల్లాలో ఏకైక మంత్రిగా పనిచేసిన పార్థసారథికి కూడా అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ ఉంది. సామాజికంగానూ పట్టుంది. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో పార్లమెంటులో అడుగుపెడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోష్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు. కొనకళ్ల డీలా... బందరు లోక్‌సభ స్థానంలో మారిన రాజకీయ సమీకరణలతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు డీలా పడ్డారు. గత ఎన్నికల్లో ఆయనకు సామాజిక సమీకరణలు కలిసిరావడంతో ఎంపీగా గెలిచారు. అయితే, ఐదేళ్లలో నియోజకవర్గాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. గతంలో ఆయనకు ఓట్లు తెచ్చి పెట్టిన గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, పెనమలూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం సీన్ మారింది. అక్కడ పార్టీకి సానుకూల పరిస్థితి లేకపోవడం కొనకళ్లను ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ ఖాళీ.. ఆదరణ లేని జేఎస్పీ రాష్ట్ర విభజన సెగతో బందరులో కాంగ్రెస్ అడ్రెస్ గల్లంతైంది. జాతీయ పార్టీగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు ఇక్కడ సరైన అభ్యర్థి దొరకలేదు. విధిలేక గుడివాడకు చెందిన శిష్ట్లా రమేష్‌కు టికెట్ ఇచ్చింది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పట్లో పోటీ ఎక్కువగా ఉండటంతో టికెట్ దక్కలేదు. గత మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగానూ తెరపైకి వచ్చారు. 23వ వార్డులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక జేఎస్పీ అభ్యర్థి కమ్మిలి శ్రీనివాస్ ప్రచారంలో కాంగ్రెస్ కంటే కాస్త ముందున్నా..రేసులో మాత్రం వెనుకబడిపోయారు. ఇదీ చరిత్ర మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. గతంలో ఇది ఎన్నోసార్లు రుజువైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన మోటూరు హనుమంతరావు(సీపీఎం), మండలి వెంకటకృష్ణారావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కావూరు సాంబశివరావు, అంబటి బ్రహ్మణయ్య, బూరగడ్డ నిరంజన్‌రావు వంటి వారికి సైతం ఇక్కడ ఓటమి తప్పలేదు. ఒకమారు సినీనటుడు కైకాల సత్యనారాయణ(1996-టీడీపీ)ను ఆదరించిన ఓటర్లు.. మరోమారు సినీగ్లామర్ సైతం పనిచేయదంటూ తిరస్కరించారు. ఇక్కడి నుంచి మూడు పర్యాయాలు(1984,1989,1998) ఎంపీగా గెలిచిన కావూరు సాంబశివరావు గత రెండు పర్యాయాలు ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే మాగంటి అంకినీడు ఇక్కడి నుంచి రెండు సార్లు(1977, 1980) ఎంపీగా గెలిచారు. ఆయన గుడివాడ లోక్‌సభ స్థానం నుంచి కూడా మూడు పర్యాయాలు ఎన్నికై రికార్డు సృష్టించారు. మచిలీపట్నం లోకసభ స్థానం ఏర్పడిన తొలి ఎన్నికల(1952)లో సీపీఐ అభ్యర్థి సనకా బుచ్చికోటయ్య గెలుపొందారు. గాంధేయవాదిగా పేరున్న మండలి వెంకట కృష్ణారావు(కాంగ్రెస్)ను ఇక్కడి ప్రజలు 1957లో పార్లమెంటుకు పంపారు. ఆయన 1962లోనూ పోటీచేసి, ఇండిపెండెంట్ అభ్యర్థి మండల వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు. యార్లగడ్డ అంకినీడు ప్రసాద్(1967 -కాంగ్రెస్), మేడూరి నాగేశ్వరరావు(1971-కాంగ్రెస్), కొలుసు పెదరెడ్డయ్య(1991-టీడీపీ), అంబటి బ్రాహ్మణయ్య (1999-టీడీపీ), బాడిగ రామకృష్ణ (2004-కాంగ్రెస్), కొనకళ్ల నారాయణరావు (2009-టీడీపీ) ను కూడా బందరు ప్రజలు ఆదరించారు. అసెంబ్లీ సెగ్మెంట్లు .. బలాబలాలు బందరు తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ దిశగా సాగిపోతున్నారు. నానికి నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. ఇది కలిసొచ్చే అంశం. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు ప్రజలతో సంబంధాలు తక్కువ. కాంగ్రెస్ నుంచి చలమలశెట్టి ఆదికిరణ్, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున గనిపిశెట్టి గోపాల్ పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం పెద్దగా కన్పించడం లేదు. పెడన అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన కుటుంబానికి నియోజకవర్గంలో పట్టుంది. సొంత కేడర్ కూడా ఉండటం కలిసొచ్చే అంశం. టీడీపీ నుంచి మాజీ చీఫ్ విప్ కె.వెంకట్రావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పిన్నెంటి విశ్వేశ్వరరావు, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున వాకా వాసుదేవరావు బరిలో నిలిచారు. గుడివాడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) రంగంలోకి దిగారు. ‘హ్యాట్రిక్’ కొట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ మంచి క్రేజ్ ఉంది. టీడీపీ అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో లేరు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అట్లూరి సుబ్బారావు నుంచి పోటీ నామమాత్రమే. గన్నవరం వైఎస్ మిత్రుడు, ప్రముఖ వైద్యుడు దుట్టా రామచంద్రరావు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఖరీదైన వైద్యాన్ని సైతం పేదలకు తక్కువ ఖర్చుతో అందించి మన్ననలు అందుకున్నారు. వల్లభనేని వంశీమోహన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వివాదాస్పదుడిగా పేరుగాంచారు. ఇది ప్రతికూలంగా మారే అవకాశముంది. సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ తరపున, బోయపాడి సౌజన్య జేఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. పెనమలూరు జెడ్పీ మాజీ చైర్మన్ దివంగత కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కేవీఆర్ విద్యాసాగర్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన యువకుడు, విద్యావంతుడు. ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నారు. తండ్రి హయాంలో చేసిన అభివృద్ధి కూడా లాభించనుంది. బోడే ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చలసాని పండు అనుచరుడిగా మెలిగిన ఆయన అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్, చలసాని పండు సతీమణి పద్మావతి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. నేరెళ్ల శోభన్‌బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పామర్రు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన ఉన్నత విద్యావంతురాలు. లెక్చరర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని సమత స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. టీడీపీ తరఫున వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే డీవై దాసు, జేఎస్పీ తరఫున పాలడుగు డేవిడ్‌రాజు బరిలోకి దిగారు. అవనిగడ్డ వైఎస్సార్ సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు మొదట్నుంచీ అట్టడుగు వర్గాలకు అండగా ఉన్నారు. దివిసీమ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఉలిగడ్డ, పెనుమూరు వారధి, మత్స్యకారుల సంక్షేమం కోసం అనేకసార్లు పోరాడారు. టీడీపీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ బరిలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ వారు వెంట వెళ్లడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా మత్తి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. సమ్‌థింగ్ స్పెషల్ ఇక్కడ ఓడినా, గెలిచినా.. వేరే చోట ఓకే! బందరు లోక్‌సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పోటీ చేసి ఓడిన, గెలిచిన నేతలు మరోచోట మెరిశారు. అలాంటి వారిలో మండలి వెంకట కృష్ణారావు, అంబటి బ్రాహ్మణయ్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కేపీ రెడ్డియ్య, సనకా బుచ్చికోటయ్య, కావూరు సాంబశివరావు వంటి వారున్నారు. వీరు అటూ ఇటూ మారి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు చేపట్టారు. జనం మాట అమ్మఒడి అందరికీ వరం అమ్మఒడి పథకం అందరికీ వరం. ఈ పథకం వల్ల ప్రతి పేదింట్లో పిల్లలు ధీమాగా పెద్ద చదువులు చదువుతారు. జగన్మోహన్రెడ్డి మొదటి సంతకంతోనే మహిళల తలరాతలు మారతాయి. అందుకే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే సువర్ణయుగం సాధ్యపడుతుంది. - కాటి విశాలి, గుడివాడ పేదలకెంతో ప్రయోజనం జగన్మోహన్రెడ్డి ఐదు సంతకాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. అమ్మఒడి వల్ల పేదల పిల్లలు పనులు మాని బడికి వెళతారు. పింఛన్ల పెంపు వల్ల వృద్ధులకు, వికలాంగులకు ఆసరా లభిస్తుంది. డ్వాక్రా రుణాల మాఫీ వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. - దిరిశం బాలకోటయ్య, దిరిశంవాని దళితవాడ (ఘంటసాల) 24 గంటల్లో కార్డు.. చాలా గ్రేట్ ‘ఊరూరా జనసేవా కేంద్రాలు’ ఆలోచన అద్భుతం. వీటి ద్వారా 24 గంటల్లో రేషన్ కార్డు, పింఛన్లు లాంటివి మంజూరు చేయడం చాలా గొప్ప విషయం. పేదలు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామాల్లోనే ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తే ఈ బాధ తప్పుతుంది. - శీరం సురేష్, పెడన నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు వైఎస్ హయాం నాటి సువర్ణయుగాన్ని తెస్తానని జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన సీఎం అయితేనే నా లాంటి యువత జీవి తాల్లో వెలుగులు నిండుతాయి. యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమాలను వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరచటం ఆనందంగా ఉంది. - కొసనం రవితేజ, మచిలీపట్నం వైఎస్ పాలనలో ఈ కష్టాల్లేవ్! వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చాలా బాగుండేది. ప్రజలకు ఏ కష్టాలూ లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా అప్పట్లో ‘గ్యాస్’ కష్టాలను ఏ రోజూ చూడలేదు. సిలిండర్లు కచ్చితంగా ఇచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినప్పుడు కూడా ప్రజలపై భారం పడకుండా చూశారు. పెంచిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా చొరవ తీసుకున్నారు. ఇప్పుడు ఆ మహానుభావుడు లేడు. గ్యాస్ కష్టాలు మామూలై పోయాయి. ఆధార్‌కార్డు, బ్యాంకు లింకేజీ అంటూ లేనిపోని నిబంధనలు పెట్టారు. గ్యాస్ కొనలేకపోతున్నాం. మళ్లీ కట్టెల పొయ్యినే నమ్ముకోవాల్సి వస్తోంది. - శేషమ్మ,పెదయాదర, బందరు మండలం -
సుజలం.. సఫలమివ్వాలి
విజయనగరం జిల్లా వైఎస్ కృషితో నీటికళ... ఆయన మరణంతో పడకేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు న్యూస్‌లైన్, నెల్లిమర్ల, అన్నదాతలను రాచిరంపాన పెట్టిన చంద్రబాబు పాలనను గుర్తుచేస్తేనే రైతులు ఉలిక్కిపడుతున్నారు. ఆయన హయాంలో విజయనగరం జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు. రైతుల కష్టాలను దూరం చేసేందుకు వైఎస్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆయన మరణంతో వాటి నిర్మాణాలు నిలిచిపోయాయి. చంద్రబాబు హయాంలో.. నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఎక్కడికి వెళ్లినా ఎండిపోయిన పంటలే కన్పించేవి. నెర్రెలుబారిన నేలలే దర్శనమిచ్చేవి. డెంకాడ, కుమిని గ్రోయింగ్ ఆనకట్టలు మినహా సాగునీటికి ఒక్క అవకాశమూ ఉండేది కాదు. వరుణుడు కరుణిస్తే 9 వేల ఎకరాల్లో వరి పండేది. మిగతా 16 వేల ఎకరాల్లో సరుగుడు, నీలగిరి తోటలే దిక్కయ్యేవి. చంపావతిపై ప్రాజెక్టులు కడితే 25 వేల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని నిపుణులు నివేదికలు ఇస్తే, చంద్రబాబు సర్కారు కనీసం వాటిని తెరిచి చూసిన పాపానపోలేదు. ఎన్టీఆర్ హయాంలో తారకరామ ప్రాజెక్టు నిర్మించాలనే తలంపు వచ్చినా... చంద్రబాబు కాలంలో మాత్రం దాన్ని నిరర్థక ఆలోచనగానే భావించారు. ఫలితంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో అనేక పల్లెలు ఎడారిని తలపించాయి. వైఎస్ హయాంలో... - రైతన్న ఆవేదన చూసి కలత చెందిన వైఎస్ తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్‌కు రూపకల్పన చేశారు. జలయజ్ఞం కింద భారీగా నిధులు వెచ్చించారు. - పెద్దగడ్డ రిజర్వాయర్ కోసం చంద్రబాబు ఒక్కపైసా కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే... వైఎస్ ఏకంగా రూ.103.55 కోట్లు వెచ్చించారు. ఫలితంగా 12 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. - నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సాగునీరు, జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే ప్రాజెక్టుకు 2006లో వైఎస్ రూపకల్పన చేశారు. రూ.181 కోట్లు విడుదల చేశారు. 2008 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని భావించారు. కానీ టీడీపీ నేతలు భూ నిర్వాసితులను రాజకీయ లబ్ధికోసం వాడుకున్నారు. పరిహారం సాకుతో చట్టపరమైన చిక్కులు సృష్టించారు. వీటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా అధికారులతో సంప్రదింపులు జరిపారు. ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతుల కోసం ఆయనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. - చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.7.78 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్ నాలుగేళ్లలోనే రూ.64.56 కోట్లు వెచ్చించారు. ఎదురుచూపులే మిగిలాయి తారకరామ పూర్తికాకపోవడంతో ప్రతి ఖరీఫ్‌లోనూ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ఏటా సాగు మొదలు పెట్టేందుకు వర్షాలపైనే ఆధారపడుతున్నాం. మాకు ఈ కష్టాలు ఇంకెన్నాళ్లో? - వి.సూర్యనారాయణ, రైతు, పెదతాడివాడ గ్రామం వైఎస్ తర్వాత... జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారు. నిధుల్లో ఊహించని విధంగా కోత పెట్టారు. ఫలితంగా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. - పస్తుతం పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే మరో ఐదేళ్లయినా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే అవకాశమే లేదని రైతులు చెబుతున్నారు. మళ్లింపు కాలువ పనులకు గుర్ల గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్ వద్ద అనుమతులు వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి రైల్వేశాఖ అడిగిన నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. - కాలువ నిర్మాణానికి రామతీర్థం వద్ద కొండను తొలవాల్సి ఉంది. దీనికి అటవీ శాఖ నుంచి అనుమతులు లేవు. కుమిలి, సారిపల్లి, కుదిపి, జగ్గరాజుపేట గ్రామాల పరిధిలో సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రధాన బండింగ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. బండింగ్ నిర్మాణం విషయంలో పాత కాంట్రాక్టర్ వ్యయం పెంచాలని కోరుతూ 2009 నుంచి పనులు నిలిపివేశారు. - మారిన ధరల ప్రకారం టెండర్లు పిలవడంతో ప్రధాన బండింగ్ వ్యయం ఏకంగా రూ.56 కోట్లు అదనంగా పెరిగింది. - ముంపునకు గురవుతున్న కోరాడపేట, ఆత్మారాముని అగ్రహారం గ్రామాలకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు పునరావాస పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. కోరాడపేటకు పునరావాసానికి స్థలం కేయించినప్పటికీ అభివృద్ధి చేయలేదు. జగన్ మాట పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లో మురుగు కాల్వల వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తాం. రాజన్న లక్ష్యానికి తూట్లు దివంగత నేత రాజన్న లక్ష్యానికి జంజావతి అధికారులు, కాంగ్రెస్ పాలకులు తూట్లు పొడిచారు. జంజావతి నుంచి సుమారు 24వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరందివ్వాలన్న ఉద్దేశంతో మహానేత ఆస్ట్రియా పరిజ్ఞానంతో రబ్బర్‌డ్యామ్ నిర్మించి 12వేల ఎకరాలకు సాగునీరందించారు. వైఎస్ మరణా నంతరం పాలకులు, అధి కారులు ఆయన ఆశయానికి తూట్లు పొడిచారు. ప్రస్తుతం పూడుకుపోయిన కాలువలు, నిర్మాణం కాని కాలువలు, పిల్లకాలువలే కనిపిస్తున్నాయి. కనీసం 2వేల ఎకరాలకు కూడా సాగునీరందించలేని దుస్థితి ఏర్పడింది. దీంతో రాజన్న లక్ష్యం నీరుగారింది. - పడాల సత్యం నాయుడు, రైతు సోమినాయుడువలస, కొమరాడ మండలం వైఎస్ వల్లే బతుకుతున్నాం.. రైతులు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితితో అల్లాడు తున్నారు. కుటుంబ అవసరాల కోసం ఉన్న భూములను అమ్ముకుందామన్నా కొనేవారు లేని పరిస్థితి. బోర్లు తీసుకుని వ్యవసాయం చేద్దామన్నా కుదరట్లేదు. 200 అడుగుల లోతు కు వెళ్లినా చుక్కనీరు పడదు. వైఎస్ ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా మారుమూలన ఉన్న పెద్దగెడ్డ జలా శయ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంత రైతులకు మహర్దశ పట్టింది. ఆయన దయ వల్ల ఇప్పుడు రెండు పంటలు పండించుకుంటూ హాయిగా జీవిస్తున్నాం. కారణం వైఎస్ నిర్మించిన పెద్దగెడ్డ జలాశయమే. ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఆయనను ఎన్నటికీ మరిచిపోరు. - ఇజ్జాడ అప్పలనాయుడు పాచిపెంట మండలం, విజయనగరం జిల్లా -
కామన్ సెన్స్
రాజకీయాలంటే సంపన్నులు ఆడుకునే క్రీడ...అధికార పీఠాన్ని అందుకోవడానికి సమ ఉజ్జీల మధ్య జరిగే పోరు... ఇందులో సాధారణ ప్రజలకు చోటు లేదు...ఐదేళ్లకోమారు ఓటు వేసి పక్కకు తప్పుకోవడమే వారి పని...! అనేది జనసామాన్యంలో ఉండే అభిప్రాయం. కానీ అందరూ అలా అనుకోవడం లేదు...సామాన్యుడు ఈ రాజకీయ దిగ్గజాలను ఎదుర్కోగలడని ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయి. అదే స్ఫూర్తిగా ఇపుడు గల్లీగల్లీలోనూ సామాన్యులు ఎన్నికల వేదికపైకి వస్తున్నారు...తమ గొంతు వినిపించాలని తపిస్తున్నారు...అలాంటి అ‘సామాన్యులే’ ఈ అభ్యర్థులు. ఎన్నికల్లో పోటీ చేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని... ఎలుగెత్తి ఘోషిస్తున్నారు... ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలని కోరుతున్నారు. సామాన్యుడికి అధికార పీఠం దక్కాలని ఆశిస్తున్నారు... గెలుపోటములను పట్టించుకోకుండా ప్రజల్లో గుర్తింపు పొందడమే లక్ష్యంగా బరిలో నిలుస్తున్నారు... ఎన్నికల్లో సామాన్యులు... ఆశయమే ఊపిరి... మనోధైర్యమే పెట్టుబడి అవినీతిని రూపుమాపుతా... ఇతని పేరు సిరిశెట్టి మల్లేశం. రామగుండం అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తమలపాకులు విక్రయిస్తుంటారు. విజయవాడ నుంచి వచ్చే తమలపాకులను స్థానికగా ఉన్న పాన్ టేలాలకు విక్రయిస్తుంటాడు. ‘కౌన్సిలర్ నుంచి దేశ ప్రధాని వరకు అవినీతి, లంచగొండితనం పెరిగిపోయింది. ప్రజలకు మంచి పరిపాలనను అందించాలనే తపన నాలో కలిగింది. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను.’ అని మల్లేశం చెబుతున్నాడు. నీళ్లు అమ్ముకుంటూ ఎమ్మెల్యేగా పోటీ ఈయన పేరు నడిమింటి శ్రీనివాస్, జడ్చర్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంటింటికి ఓ వ్యాన్‌లో మినరల్ వాటర్‌ను విక్రయిస్తూ జీవిస్తున్నారు. కొంత కాలం టీడీపీ, ప్రజారాజ్యం, వైఎస్ఆర్సీపీలలో కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈయనకు ఆటో రిక్షా గుర్తును కేటాయిం చారు. ఇంటింటికి నీటిని సరఫరా చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకున్నా ప్రజాసేవ చేయాలనే తపన ఈయనది. ప్రజాసేవతో పాటు నియోజక వర్గాన్ని అబివృద్ధి పరచాలని ఆకాంక్ష. రాజకీయాల్లో మార్పు రావాలి ఈయన పేరు ములుకుంట్ల సుమన్. ఇతను కూడా సామాన్యుడే. గోదావరిఖని మార్కండేయకాలనీలో కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్‌ను నిర్వహిస్తుంటారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారిలో ఎవరు నచ్చకపోవడంతో తానే రామగుండంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. ‘ప్రస్తుతమున్న రాజకీయాలు అవినీతితో కంపుకొడుతున్నాయి. వాటిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. అందుకే మార్పు తీసుకురావాలనే కాంక్షతోనే ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నాను...’ అంటున్నారు. సామాన్యుడి సత్తా చాటాలని.. ఈయన పేరు కామర్స్ సత్యనారాయణ (48). లోక్‌సత్తా తరఫున బోధన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం ఆయనిది. సత్యనారా యణ నిరుపేద కుటుంబానికి చెందిన నిరక్షరాస్యుడు. ఎలాంటి స్థిరచరాస్తులు లేవు. వృత్తి రీత్యా చిరువ్యాపారి. ప్రస్తుత రాజకీయాల్లో మార్పురావాలంటున్నారు. ప్రజా సేవ చేయాలని, సుపరిపాలన లోక్‌సత్తా పార్టీతోనే సాధ్యమవుతుందనే ఎన్నికల్లో నిలిచానని చెబుతున్నారు. ఇంటి పనివాళ్ల ప్రతినిధిగా.. సాయల రేణుక.. హేమాహేమీలు పోటీపడుతున్న ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఏపీ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ నాయకురాలైన రేణుక.. నియోజకవర్గంలోని ఆరు లక్షల మంది ఇంటి పనివాళ్ల ప్రతినిధిగా వారి గొంతును అసెంబ్లీలో వినిపించాలనే లక్ష్యంతో పోటీకి దిగారు. తండ్రి రిక్షా కార్మికుడు కాగా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. చిన్నప్పటి నుంచి ఇళ్లలో పాచి పనిచేస్తూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఏపీ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ తరపున చాలా కాలంగా పోరాడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆటోవాలా ఆటోలో ప్రచారానికి బయలుదేరిన ఈయన పేరు ఆర్త సత్తిరెడ్డి. సీతాఫల్‌మండికి చెందిన సత్తిరెడ్డి.. ఆటోడ్రైవర్. సికింద్రాబాద్ నుంచి నాలుగోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఓటమిలో హ్యాట్రిక్ నమోదు చేసిన ఆయన గెలుపోటములను పక్కనపెట్టి మళ్లీ పోటీకి దిగారు. ఆటోలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమమే తన ధ్యేయమని చెబుతున్నారు. డబ్బులేని రాజకీయాల కోసం... ‘డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయాలు చేయాలనేది నా తపన. అందుకే నామినేషన్ వేశాను.’ అంటున్నారు సబ్బని హరీష్. ఈయన కూడా రాజకీయ నేపథ్యం లేని సామాన్య వ్యక్తే. గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో ఫొటో స్టూడియోతో పాటు జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తుంటారు. రామగుండం అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఖానాపూర్ బరిలో గోండు రైతు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు చెందిన మెస్రం ఆనంద్‌రావు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ (ఎస్టీ) నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆనంద్‌రావుకు 11 ఎకరాల భూమి ఉంది. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు గోండు, కొలాం, తోటి, పర్థాన్ వంటి వారికి అందడం లేదని అందుకే తన లాంటి ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సామాన్యులకూ అవకాశం ఉండాలి... ఈయన పేరు సుద్దాల రమేష్. రామగుండం అసెంబీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఎన్టీపీసీలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ‘బాగా డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాలాంటి డబ్బులేని వారు కూడా పోటీ చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది.. అందుకే నామినేషన్ వేసి పోటీ చేస్తున్నా.’ అంటూ తాను ఎందుకు పోటీ చేస్తున్నదీ తెలిపారు. గెలుపోటములు ప్రధానం కాదు.పోటీ చేయడం ద్వారా గుర్తింపు పొందడమే లక్ష్యమని అంటున్నారు. ‘దర్జీ’గా బరిలోకి... చార్మినార్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె. వెంకటేశ్ కుటుంబీకులు నిజాం కాలం నుంచి దర్జీ (టైలరింగ్) వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరానికి చెందిన వెంకటేశ్ సైతం వృత్తిరీత్యా దర్జీ. ఆయన కుటుంబం పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో మమేకమై ఉంది. స్వాతంత్య్ర సమరయోధుడు రాధయ్య, ఆయన కుమారుడు కె. ప్రకాశ్ దుస్తులను కుట్టడంలో నైపుణ్యం కలిగినవారే. తండ్రి ప్రకాశ్‌తో కలిసి వెంకటేశ్ 1987 నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. మరోవైపు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రాజీవ్ సేవా సమితిని ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందని ద్రాక్ష కాకూడదు ఈయన పేరు పవార్ మన్యానాయక్. వృత్తి తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. చదివింది ఏడో తరగతే అయినా ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష మెండు. గెలుపోటములు మాట పక్కన పెడితే ‘సామాన్యుల’కు రాజకీయాలు అందని ద్రాక్ష కాకూడదనేది ఆయన అభిలాష. అదే లక్ష్యంతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం రెండోసారి పోటీ చేస్తున్నారు. ‘డబ్బు’ రాజకీయాలను శాసించే సంస్కృతి మారాలన్నదే నా లక్ష ్యం...’ అంటున్నారు. పాలకుల పాపాలపై ‘పాకాల’స్త్రం ‘రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనల్లో 730 బాధిత కుటుంబాలు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే జిల్లా యంత్రాంగం 220 కుటుంబాలకు మాత్రమే పరిహారం మంజూరు చేసింది. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అందుకే ఎన్నికల తర్వాత కోర్టు ధిక్కరణ కేసు వేస్తున్నాను..’ అంటున్నారు పాకాల శ్రీహరిరావు. మెతుకుసీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారిని ఆదుకునే విషయంలో పాలక, విపక్షాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆయన మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. ‘వైఎస్ మరణాంతరం జీవో 421 అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంద ని, రైతులకు న్యాయం జరగలేదని అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పాకాల శ్రీహరిరావు తెలిపారు. ఎన్నికల తీరు మారాలి.. వినీత్ కుమార్‌గౌడ్ బాల్కొండ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీకాం చదిని ఈయన ప్రస్తుతం నిరుద్యోగి. మిత్రుల సహకారంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ‘ఎంతో మందికి నాయకత్వ లక్షణాలు ఉన్నా.. డబ్బు లేనిదే ఎన్నికల్లో గెలువలేం అనే ఉద్దేశంతో ఎన్నికల్లో భారీగా ఖర్చు పెడుతు ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. ఎవరికి వారు మాకెందుకులే అనుకునడం వల్లనే ఎన్నికల తీరు ఇలా మారింది. భవిష్యత్ తరాల వారైనా ఎన్నికల తీరును మార్చుతారని భావిస్తు పోటీలో ఉన్నాను...’ అని అంటున్నారు. అవినీతిని చూసి విసిగిపోయా ఈయన పేరు... రత్నావత్ రమేశ్ (35). మహబూబాబాద్ శివారు బాబూనాయక్ తండా. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగారు. చివరికి రూ 10,000 లంచం ఇస్తే బిల్లు మంజూరైందని, ఇదే సమయంలో పలు అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగే ఎంతో మందిని చూసి చలించిపోయానని, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి నిరసనగా గళమెత్తడానికే అసెంబ్లీ బరిలో నిలిచానని రమేశ్ తెలిపారు. అడవి బిడ్డల రక్షణకోసం.. ‘అడవిపై ఆధారపడి జీవిస్తూ రాజకీయంగా నోరులేని ఆదివాసీల జాతిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జల సమాధి చేసేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారు.. దీనికి రక్షించేందుకు చేపట్టే పోరాటాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరేందుకే ఎన్నికల బరిలో దిగాను..’ అంటున్నారు కాకి భాస్కర్. పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ తరపున తనతోపాటు మరో 13 మంది బరిలో దిగినట్టు ఆయన తెలిపారు. ఖమ్మంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులుగా, స్పర్శ సామాజిక చైతన్య అధ్యయన వేదిక నిర్వాహకులుగా ఆయన సుపరిచితుడు. ఎన్నికలంటే ఎత్తులు, పొత్తులు, గెలవడం, ఓడడం మాత్రమే కాదు. దానిని పోరాట వేదికగా మార్చాలన్నదే లక్ష్యమని చెప్పారు. కొత్త రాజకీయాలను కోరుకుంటున్నా ‘మందీమార్బలం, డీజే సౌండ్స్ ఏర్పాటు చేసుకునే శక్తి నాకు లేదు. ఈ పోటీలో గెలుస్తానని కూడా అనుకోవడం లేదు. ఎన్నికల్లో నిజాయితీపరులను ఎన్నుకోవాల్సిన అవసరం, డబ్బుకు ఓటును అమ్మడం వల్ల వచ్చే అనర్థాలను ప్రజలకు చెప్పడమే నా లక్ష్యం’ అంటున్నారు చార్‌మంజుదార్. కురవి మండలం బలుపాల శివారు లింగ్యాతండాకు చెందిన ఈయన డోర్నకల్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో మెడిసిన్ ఆంత్రోపాలజీపై పీహెచ్డీ చేస్తున్న మంజు దార్ అవినీతిరహిత సమాజాన్ని చూడాలన్నదే తన లక్ష్యమంటున్నారు. -
పార్టీలకు ముకుతాడేదీ?
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మామూలు సొసైటీని క్రమబద్ధీకరించడానికి ఒక చట్టం ఉంది. కంపెనీల పైన అదుపు కంపెనీ లా బోర్డుకు ఉంది. బ్యాంకుల నెత్తిన రిజర్వ్‌బ్యాంక్ అంకుశం మోపుతూ ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీలకు కూడా ఒక క్రమపద్ధతి ఉండే చట్టాలున్నాయి. రాజకీయ పార్టీలకే ఏ అదుపూ ఆజ్ఞలు లేవు. వారిని అడిగేవారు లేరు. ఇంతపెద్ద రాజ్యాంగం రాసిన పెద్దలు, ప్రజాప్రాతినిధ్య చట్టాలు రూపొందించిన మేధావులు రాజకీయ నాయకులని సక్రమంగా నడిపించే చట్టాలను రాయలేకపోయారు. స్వతంత్ర సమరం నడిపి రాజ్యాంగ రచన చేసిన ధీశాలురే కానీ తరువాత కాలంలో రాజకీయ పార్టీలను అదుపు చేసే ఒక శక్తి అవసరం అవుతుందని వారు ఊహించలేకపోయారు. ఎన్నికల సంఘం.. కాగితం పులి రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అన్న పదమే రాలేదు. రాయలేదు. ఎన్నిక కావలసిన వ్యక్తికి అర్హతలు రాశారు. ఎన్నికైన వ్యక్తి బాధ్యతలు రాశారు. కానీ వారిని ఎంపిక చేసే రాజకీయ పార్టీకి సంబంధించిన రీతి రివాజులు, నీతినియమాలు లేవు. ఎన్నికల కమిషన్ మన దేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ. దానికి విస్తృతమైన అధికారాలున్నమాట నిజమే. కానీ, ఆ అధికారాలు ఎన్నికల సమయంలో మాత్రమే పనిచేస్తాయి. తరువాత ఎన్నికైన ప్రభుత్వం కనుసన్నల్లో మెలగవలసిందే. ఎన్నికల సంస్కరణల విషయంలో సలహాలు చెప్పడం తప్ప రాజకీయ నాయకులను అదుపు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. కనీసం రాజకీయ పార్టీలు నిర్దేశించిన అర్హతలను పాటించే విధంగా ఆదేశాలు ఇచ్చే అధికారం కానీ, ఆ అర్హతను కోల్పోయిన పార్టీల గుర్తింపును, అసలు పార్టీని రద్దుచేసే అధికారాలు గానీ ఎన్నికల కమిషన్‌కు లేనేలేవు. కొత్త పార్టీ ఏర్పడగానే ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు. శాశ్వతంగా కొనసాగవచ్చు. రాజకీయ పార్టీకి రద్దు సమస్యే లేదు. గుర్తింపు లభించడానికి కొన్ని అర్హతలు నిర్దేశించారు. గుర్తింపు లేకపోయినా గుర్తు ఇస్తారు. ఇక ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా జనానికి గుర్తున్నా లేకపోయినా పాత గుర్తుతో మిగిలిపోతుంది. కొత్త పార్టీలకు గుర్తులే దొరకనన్ని పార్టీలు మన దేశంలో ఉన్నాయి. చివరకు గుర్తులు దొరకకపోవడం వల్ల చెప్పులను, చీపురుకట్టలను కూడా ఆశ్రయించవలసిన దుస్థితి ఏర్పడింది. జై సమక్యాంధ్ర పార్టీ నేతలు ఏ కారణం చేతనైనా ఇంకేపార్టీలో కలిసినా సరే కనీసం చెప్పుల గుర్తుకూడా మరొకరికి దక్కదన్న మాట. ఇదీ మన ఎన్నికల చట్టం. రిజిస్టర్ చేయవచ్చు కానీ డీరిజిస్టర్ చేసే అధికారం లేని కాగితం పులి ఎన్నికల సంఘం. రాజకీయ పార్టీ అంటే రాజ్యాంగం దృష్టిలో కొందరు వ్యక్తుల సమూహం మాత్రమే. ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా సరే కొందరు కలిసి పార్టీ పెట్టవచ్చు. అది ప్రాథమిక హక్కు. తానొక్కడే అయినా వెంట ఎవరూ లేకపోయినా సరే అది వ్యక్తుల సంఘం అయితే చాలు. ఇంతమంది సభ్యులు ఉండాలన్న నియమం కూడా లేదు. రాజకీయ పార్టీ పెట్టడం చాలా సులభం. కొన్ని షరతులు ఉన్నమాట వాస్తవమే. భారతదేశ సమగ్రతకు సమైక్యతకు కట్టుబడి ఉండాలి. అయితే ప్రతి పార్టీ తప్పనిసరిగా ఏర్పడిన నెలరోజుల్లోగా రిజిస్టర్ చేయడం కోసం దరఖాస్తు సమర్పించి తీరాలని ప్రజాప్రాతినిధ్య చట్టం ఆర్టికల్ 29ఎ(5) నిర్దేశిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండాలని కూడా ఈ సెక్షన్ షరతు విధిస్తోంది. రిజస్టర్ చేయాలంటే ఆ పార్టీ ఒక మెమొరాండం ఆఫ్రూల్స్ అండ్ రెగ్యలేషన్స్ ఇవ్వాలి. ఇదివరకు పార్టీల మెమొరాండం తీసుకుని పేరు మార్చి ఇచ్చేవారు. సొంతంగా ఆలోచించి సొంత నియమావళి రాసుకునే తీరిక, ఓపిక చాలా తక్కువ. ఈ మెమొరాండం ఇచ్చి రాజ్యాంగానికి విధేయత ప్రకటించిన తరువాత ఈసీ రిజిస్ట్రేషన్‌కు అంగీకరిచవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం. పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ అనే సంస్థ ఆర్టీఐ కింద రాజకీయ పార్టీలు ఎన్ని నియమాలను పాటించాయో తెలుసుకుందామని ప్రశ్నలు వేసింది. మనకు 1196 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలున్నాయి. వీటిలో కేవలం 98మాత్రం 20వేల రూపాయలకు మించిన విరాళాల వివరాలతో నివేదికలు ఇచ్చాయి. అంటే కేవలం 8శాతం పార్టీలు నియమం పాటించాయి. అందుకు వాటికి లభించే కితాబు ఏమీ ఉండదు. ఆ నివేదికలో లోపాలు, అవాస్తవాలపైన విచారణలు ఉండకపోవచ్చు. నివేదిక ఇవ్వని పార్టీలకు పన్ను రాయితీలు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ ఆదాయపు పన్ను శాఖకు చెప్పలేదని ఈ ఆర్టీఐ ప్రశ్నలకు సమాధానంలో తేలింది. మిగతా మార్గదర్శక సూత్రాల్లోని ఆర్టికల్ 8 రూల్ 3(1),(19) ప్రకారం ఆడిట్ జరిపించిన వార్షిక ఆర్థిక నివేదికలు ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరు నెలలలోగా ఇవ్వాలి. ఎన్ని పార్టీలు ఇచ్చాయని ఆర్టీఐ కింద పీఐఎఫ్ సంస్థ అడిగింది. 2011-12లో కేవలం 175 పార్టీలు నివేదికలు ఇచ్చాయి. అంటే 85శాతం పార్టీలు నివేదికలు ఇవ్వలేదు. డీ రిజిస్ట్రేషన్ అధికారాలు ఉన్నా... రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసే సందర్భంలో ఎన్నికల సంఘం అర్థ న్యాయసంస్థలా వ్యవహరిస్తోంది. కానీ ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత దానికి ఏ అధికారాలూ లేవు. డీరిజిస్టర్ చేయడానికి ఎన్నికల సంఘానికి అధికారం ఉంది. కానీ ఆర్టికల్ 29ఎ కింద నాలుగు సందర్భాల్లో మాత్రమే డీరిజిస్టర్ చేయవచ్చు. (1) మోసపు మార్గాల ద్వారా పార్టీ రిజిస్ట్రేషన్ సాధించిందని తెలిస్తే, (2) ప్రభుత్వం ఆ పార్టీని చట్ట వ్యతిరేకం అని ప్రకటిస్తే (3) పార్టీ స్వయంగా తమ పార్టీ రద్దయిందని ఇక పనిచేయలేదని లేదా పార్టీ నియమావళిని మార్చుకున్నదని ప్రకటించినా లేదా (4) చట్టం ప్రకారం పనిచేయడం లేదని తేలిన సందర్భాల్లో డీరిజిస్టర్ చేయవచ్చు. నిజానికి డీరిజిస్టర్ చేసే అధికారాన్ని ఈ సెక్షన్ విభజించింది. కొన్ని అధికారాలు ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి ఇచ్చి, మరికొంత అధికారాన్ని స్వయంగా రద్దు చేసుకునేందుకు పార్టీలకే ఇచ్చింది. నాలుగో నియమం పరిశీలిస్తే ఈసీ ఫలానా అంశంలో చట్టం ప్రకారం పనిచేయలేదని తేల్చి రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు. షరతుల ప్రకారం రాజ్యాంగం పట్ల అవిధేయత కనిపించినా, చట్టాలను ఉల్లంఘించినా, పార్టీ అభ్యర్థి కానీ కార్యవర్గ నాయకులు గానీ నేరాలకు పాల్పడినా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే భావించి వారి పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చు. దానికి దమ్మున్న నాయకుడు రావాలి. టీఎన్ శేషన్ వంటి ప్రధాన ఎన్నికల కమిషనర్లు వస్తే ఈ రద్దు అధికారాలు అంతర్లీనంగా ఉన్నాయనీ, వాటిని వినియోగించి చట్టవ్యతిరేక పార్టీలను రద్దుచేసే అధికారాలను ప్రయోగించవచ్చని తేలుతుంది. సెక్యులరిజం పాటించని పార్టీలు, మత కలహాలు సృష్టించేవారు, ఇతర మతాల వారిని చంపించిన వారు ఉన్న పార్టీలను ఎందుకు రద్దు చేయలేదు? సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీలు ఉల్లంఘించిన వారు, ప్రమాణాలు చేసి భంగం చేసినవారు, అబద్ధపు ప్రమాణ పత్రాలు రాసినవారు, వరకట్న నేరాలు చేసినవారు, ఫిరాయించిన వారు, రాజ్యాంగం ప్రతులు చింపేసేవారు, అసెంబ్లీ, లోక్‌సభల్లో చట్టాల ప్రతులను చింపి మైకులు విరిచి, కళ్లలో మిరియాల నీరు చల్లి, కత్తులు ఝళింపించే వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంటూ ఒక్కపార్టీ కైనా ఎన్నికల కమిషనర్ నోటీసు కూడా పంపే స్థితిలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రూల్ ఆఫ్ లా అంటే సమపాలన, ఇవే పనులు కంపెనీలు, బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? కేసులు పెట్టరా? మొక్కుబడిగా వార్షిక నివేదికలు ఆర్టికల్ 29సి కింద రాజకీయ పార్టీ ఏటేటా ఎన్నికల సంఘానికి తమకు 20వేల రూపాయలకు మించిన విరాళాలు ఎన్ని వచ్చాయో, ఎవరిచ్చారో వివరిస్తూ ఒక వార్షిక నివేదిక ఇస్తానని వాగ్దానం చేయాలి. ఒకవేళ వార్షిక నివేదిక ఇవ్వకపోతే ఆ రాజకీయ పార్టీకి విరాళాలు వసూలు చేసే అధికారం గానీ పన్ను రాయితీలుగానీ రావు. కనుక ఏదో ఒక నివేదిక ఇస్తారు. ఈ మొక్కుబడి నివేదికలో అబద్దాలున్నా రిజిస్ట్రేషన్ రద్దుచేసే అధికారం ఎన్నికల సంఘానికి లేకపోవడం మనదేశపు వింత. తరువాత 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 29ఎ ఆర్టికల్ కింద రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో ఆర్టికల్ 8 రూల్3(1) రూల్ 3(19) ప్రకారం తప్పనిసరిగా ప్రతి రాజకీయ పార్టీ ఆడిట్ చేసిన వార్షిక ఆర్థిక నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. 29ఎ(6) కింద ఎన్నికల సంఘం ఇంకే వివరాలైనా అడగవచ్చు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవచ్చు.