బాబు, రాజన్నపాలనలో... ఆరోగ్యం | Babu, rajanna Governance ... Health | Sakshi
Sakshi News home page

బాబు, రాజన్నపాలనలో... ఆరోగ్యం

Published Sun, May 4 2014 1:24 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

బాబు, రాజన్నపాలనలో...   ఆరోగ్యం - Sakshi

బాబు, రాజన్నపాలనలో... ఆరోగ్యం

బాబు పాలన

 చంద్రబాబు తన పాలనలో వైద్య, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. {పభుత్వాసుపత్రుల్లో తగినంత మంది వైద్యులుండేవారు కాదు. ఇతర సిబ్బందీ అరకొరగానే ఉండేవారు. వైద్య పరికరాలు ఎప్పుడూ మరమ్మత్తులోనే ఉండేవి. 2002లో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద రోగులతోనూ యూజర్ చార్జీలు వసూలు చేశారు.మందులు బయటి నుంచి తెచ్చుకోవాల్సిందే. ఏవైనా సేవలు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే.పేద రోగుల పరిస్థితి దారుణంగా ఉండేది. చికిత్స సరిగా జరగదేమోనన్న భయంతో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లలేక, ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో చికిత్సకయ్యే ఖర్చు భరించలేక కొట్టుమిట్టాడేవారు.
 
ఆపదలో ఆస్పత్రికెళ్లాలంటే వందలాది రూపాయలు చెల్లించి ఏ ప్రైవేటు వాహనాన్ని మాట్లాడుకుని వెళ్లాల్సిన పరిస్థితి. రోడ్డు ప్రమాదం జరిగితే అంబులెన్సులు లేవు. పురిటినొప్పులకు ఎద్దుల బళ్లు లేదా వ్యక్తిగత వాహనాలే దిక్కు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే డోలీలోనే తీసుకుపోవాల్సిన పరిస్థితి. అంబులెన్సు అంటే ఏంటో ప్రజలకు తెలియని పరిస్థితి. వేళగాని వేళ ప్రమాదం జరిగితే ప్రాణంపై ఆశ వదులుకోవాల్సిన దుస్థితి. ఎలాగోలా ఆస్పత్రికి తీసుకెళ్లినా వైద్యం చేసేవారు కరువు. ఇక పల్లెటూరి రోగుల పరిస్థితిని ఊహించలేం. వృద్ధులు, బాలింతలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికెళ్లినా సరైన మందులు దొరికేవి కావు. పట్నంలో ఉన్న పెద్దాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. పల్లెటూళ్లలో దీర్ఘకాలిక జబ్బులతో పాటు సాధారణ జబ్బులతో బాధపడే కోట్లాది మంది పేద రోగులు దుర్భర పరిస్థితులు అనుభవించేవారు.
 
 బాబు పాలనలో సీఎంఆర్‌ఎఫ్

 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) కింద ఆర్థికసాయం కావాలంటే ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో బ్రతిమాలుకొని  వారి ద్వారా వినతిపత్రం సమర్పించినా కచ్చితంగా సాయం వస్తుందనే భరోసా ఉండేది కాదు.ఒకవేళ ఈ సిఫార్సుల వల్ల మంజూరైనా అది అరకొర మొత్తమే. అప్పోసప్పో చేసి ఖరీదైన జబ్బులకు  మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి పాతికవేలు మంజూరు చేస్తే  అదే గొప్ప అన్నట్లుండేది.కీలక భూమిక నిర్వహించే మంత్రులు, శాసనసభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలున్నవారికే ఎక్కువ మొత్తం మంజూరయ్యేది.దరఖాస్తు చేశాక అది మంజూరు కావడానికి కూడా రెండు3 నెలలకు పైగా పట్టేది. అత్యవసర వైద్యం కావాలంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) మాటే లేదు. అందువల్ల నిరుపేదలైనా అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సిందే. ఈ నిధి (ఎల్‌ఓసీ) కోసం ఎదురుచూస్తే రోగుల ప్రాణాలకే ముప్పుగా ఉండేది. సిఫార్సులు లేని అభాగ్యులు చంద్రబాబు పాలనా కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి మీద ఆశపెట్టుకోవడమన్నదే అత్యాశ అన్న పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చంద్రబాబు నాయుడు తన చివరి అయిదేళ్ల పదవీ కాలం (1999 - 2004)లో 15 వేల మందికి 36 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేశారు.
 
 రాజన్న రాజ్యం    108 - 104
 
 +    2006 సెప్టెంబర్‌లో తొలుత 8 జిల్లాల్లో 310 అంబులెన్సులతో పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు.
 +    2007 నవంబర్ నాటికి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి 802 వాహనాలు ఇచ్చారు.
 +    2009 నాటికే ఈ పథకం పై సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు.
 +    రోజుకు 6వేలకు పైగా ఎమర్జన్సీ కాల్స్ వస్తే అందులో నాలుగువేల కాల్స్‌ను అటెండ్ చేసేవారు.
 +    రోజూ రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న  3500 నుంచి 4వేల మందిని కాపాడి ఆస్పత్రులకు చేరుస్తున్నాయి ఈ అంబులెన్సులు.
 +    పథకానికి ఏటా రూ.100 కోట్లు తక్కువ కాకుండా కేటాయింపులు జరిపారు.
 +    70 శాతం మంది గర్భిణులు ప్రసవం కోసం 108 అంబులెన్సులకు ఫోన్ చేసి వినియోగించుకునేవారు.
 +    ఫోన్ చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఘటనా స్థలానికి 25 నిమిషాల్లోనే చేరుకునేవి.
 +    108 వాహనాల్లో అత్యవసర పరికరాలతో పాటు మందులకు, సిబ్బందికి లోటు లేకుండా ఉండేది
 
 వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు.  పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఖరీదైన చికిత్స అవసరమైన జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు.తొలి దశగా 2007 ఏప్రిల్ 1న మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 163 జబ్బులతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు.రెండవ దశలో భాగంగా 2007 డిసెంబర్ నాటికి ఈ పథకం కింద మరో ఐదు జిల్ల్లాలను (చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రంగారెడ్డి, నల్లగొండ) చేర్చారు. రెండో దశలో 163 జబ్బుల నుంచి 272 జబ్బులకు పెంచారు.మూడవ దశలో భాగంగా 2008 ఏప్రిల్‌లో ఆరోగ్యశ్రీ  పథకంలోకి  కడప, కరీంనగర్, మెదక్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను చేర్చి, చికిత్సల సంఖ్య 332కు పెంచారు.2008 జూలై నాటికి మిగిలిన పది జిల్లాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి, పథకం పరిధిలోకి ఏకంగా 942 జబ్బులను చేర్చారు. అంటే సరిగ్గా ఏడాదిన్నరలో పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన ఘనత దక్కించుకున్నారు.
     
ఆరోగ్యశ్రీ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకూ లబ్ధి పొందిన వారు 23 లక్షల మంది పైనే. ఇందులో ఆరు లక్షల మంది ప్రభుత్వాసుపత్రుల్లోనూ, 16 లక్షల మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు.గుండెజబ్బులు, కిడ్నీ (డయాలసిస్ రోగులు), నరాల జబ్బులు, కేన్సర్, కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి ఖరీదైన జబ్బులతో బాధపడే వారు ఎక్కువ శాతం మంది ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు. పుట్టుకతోనే గుండె జబ్బులొచ్చిన నిరుపేద చిన్నారులెందరో ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందారు.రోజూ రెండు వేల వరకూ శస్త్రచికిత్సలు జరిగేవి. రోజూ రూ.2 కోట్లుపనే వాటికి వెచ్చించేవారు.నిత్యం ఆరోగ్యశ్రీ హెల్త్ క్యాంపులు జరిగేవి. రోజూ పాతికవేల మంది ఔట్‌పేషెంట్లు సేవలు పొందేవారు.ఆరోగ్యశ్రీ పథకానికి ఏటా రూ. 925 కోట్లు కేటాయించేవారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.350 కోట్లు ఇచ్చేవారు.ఆరోగ్యశ్రీ పథకంలో అత్యంత ఖరీదైన చికిత్స కాక్లియర్ ఇంప్లాంట్. పుట్టుకతోనే చెవిటి, మూగతో పుట్టే వారిని శాశ్వత వైకల్యం నుంచి బయటపడేసేదే ఈ చికిత్స.
 
 రాజన్న రాజ్యంలో సీఎంఆర్‌ఎఫ్

 వైఎస్సార్ సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టిన స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి సహాయనిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.అప్పటి వరకూ పెద్దల సిఫార్సులున్న వారికే పరిమితమైన సీఎం సహాయనిధి ఒక్కసారిగా పేదల పాలిట పె‘న్నిధి’గా మారింది.దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిధులు మంజూరు చేయడం ప్రారంభించారు.రాష్ట్ర సచివాలయంలోనే కాకుండా తన అధికార నివాసంలో కూడా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని తెచ్చారు.వైఎస్ రాజశేఖరరెడ్డి తన అయిదేళ్ల పదవీకాలంలో సీఎంఆర్‌ఎఫ్ నుంచి లక్షా ముప్పై వేల మందికి పైగా రూ. 441.41  కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేశారు. చంద్రబాబు తన పాలనలోని చివరి అయిదేళ్ల కాలంలో మంజూరు చేసిన మొత్తంతో పోల్చితే ఇది  12 రెట్లు ఎక్కువ.   {పజాప్రతినిధులు (ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల) సిఫార్సుల ఆధారంగా వచ్చిన వినతులకు సంబంధించి 86,468 మందికి రూ. 279.50 కోట్ల రూపాయల ఆర్థికసాయం మంజూరు చేశారు.  ఎవరి సిఫార్సులూ లేకుండా నేరుగా తనను కలిసి ఆర్థికసాయం కోరిన 43,532 మందికి రూ. 156.50 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేశారు.పేదరికం  కారణంగా వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్న ఎందరికో  సీఎంఆర్‌ఎఫ్ కింద వైద్యసాయం లభించింది.హఠాత్తుగా కుటుంబ యజమానిని కోల్పోయి పూట గడవక కష్టాలు పడుతున్న ఎన్నో నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి సాయం అందించారు.   పేద రోగుల  కష్టాలు తెలిసిన వైద్యునిగా, డాక్టరు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణల వల్ల ఎందరో పేదలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొంది వైద్యం చేయించుకుని ఆరోగ్యవంతులయ్యారు. సీఎంఆర్‌ఎఫ్ నుంచి నిధుల మంజూరులో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఏ పార్టీ వారు సిఫారసు చేసినా వినతి అందిన వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేశారన్న ప్రశంసను వైఎస్ అందుకున్నారు.
 
 జగన్ సంకల్పం  ఆరోగ్యశ్రీ

 ఆరోగ్యశ్రీ నుంచి తొలంగించిన 133 వ్యాధులను మళ్ళీ ఆ పథకంలో చేర్చి, మరిన్ని ఆస్పత్రుల్లో పథకం అమలయ్యేలా చూస్తాం. బధిరులకు, మూగవారికి... ప్రత్యేకంగా కాక్లియర్ ఇంప్లాంట్ వంటి ఖరీదైన వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును రీయింబర్సు చేస్తాం. ఈ ఖర్చు ఒక్కోసారి రూ. 6 లక్షల వరకూ ఉంటుంది.
 
మరిన్ని 104, 108 వాహనాలు

108, 104 వాహనాల సంఖ్యను మరింతగా పెంచి ఆరోగ్య సేవల రంగాన్ని పటిష్ఠం చేస్తాం.  ప్రతి ఒక్క జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ, రాజధానిలో 20 ఫ్యాకల్టీ ఆసుపత్రులు{పతి జిల్లా కేంద్రంలోనూ వైద్య కళాశాలతో అనుబంధం ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం. వీటిని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసే 20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతో అనుసంధానం చేస్తాం. తద్వారా రొటేషన్ పద్ధతిలో స్పెషాలిటీ వైద్యుల్ని ప్రతి జిల్లా కేంద్రంలో అందుబాటులో  ఉండేలా చూస్తాం.  {పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ సరిపడినన్ని మందులు, వైద్యులు, సిబ్బంది ఉండేలా చూస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయటానికి మేం అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఆపరేషన్ లేదా తీవ్ర ఫ్రాక్చర్లకు వైద్యం పొంది ఆసుపత్రి నుంచి బయటపడినా పనిచేయలేని రోగికి ఉపాధి, మందుల కోసం నెలకు రూ. 3000 చొప్పున సహాయం చేస్తాం.
 
మెడికల్ పీజీ సీట్లు రెట్టింపు
     
ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసి, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల సంఖ్యను రెట్టింపు చేస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement