బాబు, రాజన్నపాలనలో... ఐటీ | Babu, rajanna Governance ... IT | Sakshi
Sakshi News home page

బాబు, రాజన్నపాలనలో... ఐటీ

Published Sun, May 4 2014 1:50 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

బాబు, రాజన్నపాలనలో...    ఐటీ - Sakshi

బాబు, రాజన్నపాలనలో... ఐటీ

బాబు పాలన
 
 హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధికి తానే కారకుడినంటూ చెప్పుకునే చంద్రబాబు మాటల్లో నిజం ఎంతుందో ఓసారి చూద్దాం!
 వై2కే వల్ల  అమెరికాలో ఏర్పడిన డిమాండ్ కారణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఎగుమతులకు భారతదేశానికి గొప్ప అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తన ముందు పని చేసిన ముఖ్యమంత్రులంతటి సమర్థుడై ఉన్నా ఆ ఆవకాశాన్ని అందిపుచ్చుకుని సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా  నిలబెట్టి ఉండేవారు. ఎందుకంటే దేశంలోని ప్రప్రథమ ఎస్టీపీఐ (సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్) 1991లోనే ఆంధ్రప్రదేశ్‌లోనే స్థాపించడం జరిగింది. అలాగే ప్రభుత్వ రంగ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీఎంసీ) సైతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఎస్టీపీఐ, సీఎంసీ ఒక వైపు, సత్యం కంప్యూటర్స్ వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజం మరో వైపు ఉన్నప్పటికీ సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో రాష్ట్రం ఆయన హయాంలో అగ్రస్థానం సాధించలేకపోయింది.
 
 ఐటీ నిజాలు

 1995 సెప్టెంబర్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడానికి ముందుగా సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో దేశంలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2004 నాటికి 5వ స్థానానికి పడిపోయింది. 1995-96 మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో బెంగుళూరు, హైదరాబాద్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే 2003-04లో అంటే చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేనాటికి సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో ఈ రెండు నగరాల మధ్య ఉన్న వ్యత్యాసం 2,500 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది.2003-04లో భారతదేశం నుంచి జరిగిన సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో కర్నాటక వాటా 38 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 8 శాతం మాత్రమే. చాలా ఆలస్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ఆ తర్వాత కాలంలో అంటే... చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అధిగమించిపోయాయి. అలా... దక్షిణ భారతదేశంలో మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ‘భారతదేశానికే ఐటీ రాజధాని’ అంటూ, చంద్రబాబు మీడియాను మేనేజ్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం ప్రారంభించారు.
 
 ఐటీ రంగంలో ఎవరి పరిపాలన ఎలా జరిగింది?
 
 ఆంధ్ర ప్రదేశ్ అధికారిక           చంద్రబాబు                                వై.ఎస్.ఆర్.
 వృద్ధి గణాంకాలు               (1994-’04 సగటు)                      (2004-’09)
 
 దేశంలో ఐ.టి.లో రాష్ట్ర వాటా      8 శాతం                                  14 శాతం
 ఐ.టి. ఉద్యోగాలు                    81 వేలు                                  2.51 లక్షలు
 ఐ.టి. ఎగుమతులు              2004లో 5 వేల కోట్లు                 2009లో 33 వేల కోట్లు
 
జగన్ సంకల్పం

 కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం హైదరాబాద్‌ను కోల్పోయినందున రెవెన్యూలో వాటానే కాదు... మాన్యుఫాక్చరింగ్, ఐటీ రంగాలను కూడా కోల్పోయింది. అంతమాత్రాన నిరాశ చెందనక్కరలేదు. అభివృద్ధికి కేవలం నిధుల లేమి ఒక్కటే అవరోధం కాదని నిరూపిస్తా! ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఐటీఐఆర్ (ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)ను నెలకొల్పుతామని విభజన బిల్లులో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికోసం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తాం. రాయలసీమ, కోస్తా ఆంధ్రల్లో రెండుచోట్లా ఐటీఐఆర్‌లు ఏర్పాటు చేస్తాం. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక కారిడార్ నెలకొల్పడంతో పాటు కేంద్రం ఇచ్చిన పారిశ్రామిక, ఐటీఐఆర్ హామీలు నెరవేరేలా కృషిచేస్తాం. వీటివల్ల అన్ని ప్రాంతాల్లోనూ ఐటీ పరిశ్రమల వృద్ధికి వీలు ఏర్పడుతుంది. తద్వారా ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, టెక్నీషియన్లకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు వీలు కలుగుతుంది.
 
పరిశ్రమలు
 
బాబు పాలన

 ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి కార్మిక వర్గం నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. ఆయన ఏలుబడిలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డ గడ్డు పరిస్థితులే శ్రామిక లోకానికి గుర్తుకొస్తున్నాయి.  బాబు హయాంలో సంస్కరణల పేరుతో 87 ప్రభుత్వ రంగ సంస్థల నడ్డి విరిచారనేది కార్మిక సంఘాల ప్రధాన ఆరోపణ. 1994- 2004 మధ్యకాలంలో 22 సంస్థలను మూసివేశారు. మరో 12 సంస్థలను పునర్‌వ్యవస్థీకరించారు. 11 సంస్థలను ప్రైవేటీకరించారు. 9 సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 54 సంస్థల తలరాతనే చంద్రబాబు మార్చేయడం అప్పట్లో విమర్శలకు కారణమైంది. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనేది  ఆరోపణ.రాష్ట్ర స్థాయి సంస్థలు, కో-ఆపరేటివ్ సంస్థల మార్కెట్ విలువ రూ. 636 కోట్ల వరకూ ఉంటే కేవలం రూ.209 కోట్లకే అమ్మారనే దానికి బాబు వద్ద సరైన సమాధానం లేదు.  

 ఏమిటీ దారుణం?

 చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకూ సజావుగా లాభాలతో నడిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు దివాలా తీశాయో, ఆ తర్వాత  అవి టీడీపీ నాయకగణం చేతుల్లోకి వెళ్లాక ఎలా లాభాల బాట పట్టాయో విడ్డూరమే. ఈ క్రమంలో అనేక మంది కార్మికులు ఇంటిదారి పట్టినా చంద్రబాబు సర్కారుకు పట్టలేదు.2002లో హనుమాన్, ఏఎస్‌ఎం కో ఆప రేటివ్ షుగర్‌మిల్స్, డెల్టా పేపర్ మిల్స్‌ను కారు చౌకగా కట్టబెట్టడం, టీడీపీ ఎంపీ నామా నాగే శ్వరరావుకు పాలేరు షుగర్స్ ధారాదత్తం చేయడం, బాబుకు సన్నిహితుడు మండవ ప్రభాకర్ రావుకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్‌నకు షుగర్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లును రాసివ్వడం సభా సంఘాలనే విస్మయపరచింది.

 ఇదో పెద్ద దోపిడీ

 నిజాం షుగర్స్ బాబును ఇప్పటికీ వెంటాడే శాపమే. ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ పరిశ్రమ వెన్నులో కత్తి దూసిన వైనాన్ని కార్మిక లోకం నేటికీ జీర్ణించుకోలేకపోతోంది.  షక్కర్‌నగర్, మెట్‌పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులతో పాటు షక్కర్‌నగర్ డిస్టిలరీని విక్రయిం చిన వ్యవహారంలో ప్రభుత్వానికి 300 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని శాసనసభా సంఘం అంచనా వేసింది. నిజాం షుగర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 173 కోట్లు సాయం చేసిందంటూ 2000 సెప్టెంబర్‌లో చంద్రబాబు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని ఉటంకించింది. వివిధ కార్పొరేషన్స్ ద్వారా నిజాం షుగర్స్ రుణాలు తీసుకుందని వెల్లడించింది.నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత. తన హెరిటేజ్ కోసం వేలాది రైతులు, ఉద్యోగుల పొట్టగొట్టారనే ఆరోపణలకు చంద్రబాబు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు.
 
రాజన్న రాజ్యం

 హా    దేశంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది: రిజర్వ్‌బ్యాంకు నివేదిక 2007
 హా    దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో ఆంధ్రప్రదేశ్ మంచి ఫలితాలను సాధిస్తోంది: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)
 హా    దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది: ప్రపంచబ్యాంకు నివేదిక 2007
 హా    పేపరు, సిమెంట్, బల్క్ డ్రగ్స్ తయారీలో దేశంలో మొదటిస్థానం
 హా    2008-09 తొలి ఆరు నెలలకు రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకొచ్చాయి. వాటిని ఆకర్షించడంలో ఏపీయే నంబర్‌వన్: సీఐఐ సర్వే
 
 జగన్ సంకల్పం
 
పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 మూడవ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని  అంశాలను అమలుచేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.అలాగే, అందుబాటులో ఉన్న అన్ని సహజ వనరులు, ఖనిజాలను సద్వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికీకరణ అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించేలా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మరో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర పరిధిలోని అనంతపురం, కృష్ణపట్నం కారిడార్లను కూడా ఏర్పాటు చేస్తాం. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, పీసీపీఐఆర్, ఐటీఐఆర్, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజీ అన్నీ తోడైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొప్ప ప్రేరణ కలుగుతుంది.

 దేశంలోని మాన్యుఫాక్చరింగ్ రంగంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎస్‌ఎంఈ) అత్యంత ప్రధాన భూమిక పోషిస్తాయి.అత్యధికమందికి ఉపాధి కల్పించే రంగాలలో  మాన్యుఫాక్చరింగ్ రంగం ఒకటి. అలాంటి ఈ రంగం తీవ్రంగా పెరిగిపోయిన విద్యుత్ చార్జీలు, ప్రకటిత, అప్రకటిత విద్యుత్ కోతలతో దారుణంగా నష్టపోయింది. ఈ రంగం ఆర్థికంగా లాభసాటిగా మారేందుకు దీనికి ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీని అందించాలని మేము భావిస్తున్నాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement