సాక్షి, అమరావతి: చంద్రబాబు ఐటీ స్కాంపై ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మూలాలు ఒకే చోట ఉన్నాయన్న దానిపై విచారణకు సన్నద్ధమైంది. రెండు స్కాంలో ఒకే వ్యక్తులు ఉండటంపై విచారణకు సిద్ధమైంది. ఐటీ స్కాంలో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేశ్ పార్ధసాని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాకు ఏపీ సీఐడీ నోటీసులుజారీ చేసింది. వీరిద్దరిని సీఐడీ అధికారులు విచారించనున్నారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి.. కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ వ్యహహారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీశాఖ విచారణ జరుపుతోంది. స్కిల్ స్కామ్‌లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది. రెండు స్కాంలో భారీగా డబ్బు అందుకున్నట్లు చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై అభియోగాలు మోపింది.
రెండు స్కాంల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. దీంతో ఈ స్కాంలో ఉన్నవారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించింది. దుబాయిలోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్లుగా అభియోగాలు ఉండటంతో దీనిపై కూడా దృష్టి పెట్టనుంది. త్వరలో దుబాయికి విచారణ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ‘రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’
Comments
Please login to add a commentAdd a comment